ముద్రగడ పద్మనాభరెడ్డి నామకరణ మహోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు!

జూన్ 4న 'ముద్రగడ పద్మనాభరెడ్డి' నామకరణ మహోత్సవానికి భారీగానే ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ముద్ర‌గ‌డ నూతన నామకరణ మహోత్సవానికి ఆహ్వానం అంటూ.. ఒక ఆహ్వాన పత్రికను సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.  పిఠాపురంలో పవన్ ను కచ్చితంగా ఓడిస్తానంటూ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళను తాను పవన్ కల్యాణ్ ను ఓడించలేకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ తనపై పోటీ చేసి గెలవాలని.. తాను ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసి పవన్ పై గెలిచి తీరుతానని కూడా సవాల్ చేసిన సందర్భం ఉంది.    పోలింగ్ స‌ర‌ళి చూస్తే, పవన్ గెలుపు పక్కా అని తేలడంతో జనసైనికులు ముద్రగడ సవాళ్లను తెరపైకి తీసుకొచ్చారు. పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకోవాలని,  వినూత్న రీతిలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.   ట్రోలింగ్స్ మొదలు పెట్టారు.  'ముద్రగడ పద్మనాభరెడ్డి గారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రికను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందరికీ నమస్కారం.. ముద్రగడ నామకరణ మహోత్సవానికి రావాలని కాపు సోదర సోదరీమణులందరినీ ఆహ్వానిస్తున్నాం. జూన్ 4వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఈ కార్యక్రమం జరుగుతుంది.  పవన్ విజయం సాధించిన తర్వాత తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని పెద్దాయన మాటిచ్చారు.  ఆ మాటపై ఆయన నిలబడతారనే నమ్మకం తమకుంది. కాపులంతా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని, దీన్ని విజయవంతం చేయాలని, కాకపోతే మీ ఉప్మా, కాఫీలు మీరే తెచ్చుకోవాలంటూ సెటైర్లు వేశారు. వాస్తవానికి ఒకానొక దశలో ముద్రగడ జనసేనలోకి వస్తారని ప్రచారం జరిగింది.  అయితే వైసీపీలోకి వెళ్లిన ఆయన.. పవన్ పై నిత్య విమర్శకుడిగా మారిపోయారు. వైసీపీలో చేరిన నాటి నుంచి పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ సైతం చేశారు. ఈ క్రమంలో జనసేన నేతలకు ముద్రగడ టార్గెట్ అయ్యారు. అటు సొంత కుటుంబ సభ్యులు సైతం ముద్రగడ వైఖరిని వ్యతిరేకించారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

వైైసీపీ స్వరం మారింది.. ధీమా పోయింది!

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ పూర్తి అయిన మరునాటి నుంచి వైసీపీ నేతల స్వరం మారిపోయింది. పరోక్షంగా ఓటమిని ఒప్పకుంటూ, వారికి మాత్రమే సాధ్యమైన విధంగా తమ ఓటమికి కారణం తెలుగుదేశం కారణమని చెప్పుకుంటున్నారు. నిన్న మొన్నటి దాకా తమ అడుగులకు మడుగులొత్తిన పోలీసులు, ఎన్నికల ఉల్లంఘనలను చూసీ చూడనట్ల వదిలేసిన ఎన్నికల సంఘం కూడా చంద్రబాబుతో కుమ్మక్కైపోయారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.  పోలింగ్ జరిగిన సోమవారం (మే 13) సాయంత్రం కూడా ప్రభుత్వ సలహాదారు, పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి గంభీరంగానే మాట్లాడారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారని ధీమాగా చెప్పారు. వెల్లువెత్తిన ఓటరు చైతన్యం జగన్ సంక్షేమ పాలనకు అనుకూలంగానే ఉందని చెప్పుకున్నారు. సాక్షాత్తూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ సైతం తనకు మద్దతుగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటేసిన అక్కచెల్లెమ్మలు, అవ్వాతాలకు కృతజ్ణతలు చెప్పారు. కానీ మంగళవారం (మే14) ఉదయానికల్లా వీళ్ల స్వరం మారిపోయింది. ధీమా మాయమైపోయింది. బేలతనం బయటపడిపోయింది. తమ కోసం ఐదేళ్లు ఉద్యోగ ధర్మాన్ని కూడా విస్మరించి సేవలు చేసిన పోలీసులు తెలుగుదేశం కూటమికి కొమ్ము కాశారనీ, తమ కాళ్లూ చేతులూ కట్టేశారంటూ ఆరోపణలు గుప్పించడం మొదలు పెట్టారు. ఇలా ఆరోపణలు గుప్పించి, తమ ఓటమికి సాకు వెతుక్కోవడంలో వైసీపీ నాయకులు, అభ్యర్థులు ఒకరితో ఒకరు పోటీలు పడ్డారు.  తెలుగుదేశం పెద్ద ఎత్తున రిగ్గింగుకు పాల్పడిందని ఆరోపణలు గుప్పించారు. అధికార పార్టీ ప్రతినిథులుగా తాము ఇచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం లెక్క చేయలేదనీ, పట్టించుకోలేదనీ విమర్శలు గుప్పించారు. మంత్రులు, మాజీ మంత్రులు, పార్టీ అభ్యర్థులు ఇలా వీళ్లూ వాళ్లూ అని లేదు వైసీపీ ముఖ్య నేతలంతా ఎన్నికల సంఘం, పోలీసులు, అధికారులపై విమర్శల పర్వానికి దిగి పరోక్షంగా తమ ఓటమిని అంగీకరించేశారు. అలా పరోక్షంగా ఓటమిని అంగీకరించిన ప్రముఖుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి, నరసరావు పేట లోక్ సభ అభ్యర్థి అనీల్ కుమార్ యాదవ్, గురజాల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి, గంగాధర నెల్లూరు వైసీపీ అభ్యర్థి కృపాలక్ష్మి ఉన్నారు. తెలుగుదేశం శ్రేణులు తమపై దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు తప్ప నియంత్రించడానికి, ఆపడానికీ వీసమెత్తు ప్రయత్నం చేయలేదని వీరు ఆరోపించారు.  ఇక అనీల్ కుమార్ యాదవ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి పోలీసులను, ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మేనేజ్ చేశారని ప్రజలను నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేశారు.   ఇక నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కూడా పోలీసులు తెలుగుదేశం పార్టీ తరఫున పని చేశారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సరిగ్గా  వారీ ఆరోపణలు చేస్తున్న సమయంలోనే గ్రామాలలో వైసీపీ మూకలు తెలుగుదేశం శ్రేణులు, సానుభూతి పరులపై దాడులు చేస్తున్నారు. మొత్తంగా వైసీపీ నేతలలలో గెలుపు ధీమా పోయి, ఉక్రోషంతో  ఆరోపణలు విమర్శలు గుప్పిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

తిరుపతిలో చిరుత కలకలం 

తిరుమల నడక మార్గంలో చిరుత పులులు సంచరిస్తుండటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఏడు కొండల్లోని అడవుల్లో ఉండే చిరుతలు కొంత కాలంగా నడక మార్గం వద్దకు వచ్చేస్తున్నాయి. గత ఏడాది భక్తులపై చిరుతలు దాడి చేసిన ఘటనలు భక్తులను భయభ్రాంతులకు గురి చేశాయి. తాజాగా మరోసారి చిరుత కలకలం చెలరేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. చిరుతను వెంటనే పట్టుకోవాలని అధికారులను భక్తులు కోరుతున్నారు. తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలంరేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌ రోడ్డులో చిరుత ప్రత్యక్షమైంది. తెల్లవారుజామున భక్తుల కారులో ఘాట్ రోడ్డులో వెళుతుండగా.. చిరుత అడ్డుగా వచ్చింది. చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గతంలో అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతులు కనిపించాయి.. ఈసారి ఘాట్ రోడ్డులో ప్రత్యక్షం కావడం కలకలంరేపింది. గతేడాది అలిపిరి నడకమార్గంలో చిరుతల సంచారం కలకలంరేపింది. ముందుగా ఓ బాలుడిపై దాడి చేయగా తీవ్ర గాయాలు అయ్యాయి.. ఆ తర్వాత కొంతకాలానికి మరో చిన్నారి లక్షితను చిరుత దాడి చేసి చంపేసింది. దీంతో టీటీడీ, అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.. బోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతల్ని బంధించారు. ఏకంగా ఆరు చిరుతల్ని పట్టుకుని తిరుపతిలో జూకు తరలించారు. తిరుమల నడక మార్గంలో చిరుత పులులు సంచరిస్తుండటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఏడు కొండల్లోని అడవుల్లో ఉండే చిరుతలు కొంత కాలంగా నడక మార్గం వద్దకు వచ్చేస్తున్నాయి. గత ఏడాది భక్తులపై చిరుతలు దాడి చేసిన ఘటనలు భక్తులను భయభ్రాంతులకు గురి చేశాయి. తాజాగా మరోసారి చిరుత కలకలం చెలరేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. చిరుతను వెంటనే పట్టుకోవాలని అధికారులను భక్తులు కోరుతున్నారు.    

జమ్మలమడుగులో రాజకీయ ఉత్కంఠ

జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం సాయంత్రం వెంకటేశ్వర కాలనీలో 116, 117 పోలింగ్‌ బూత్‌ వద్ద వైసిపి, కూటమి అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఎంపీ అభ్యర్థి భూపేష్‌ సుబ్బరామిరెడ్డి కింద పడిపోవడంతో కూటమి శ్రేణులు ఇటుక రాళ్లతో దాడికి దిగారు. ఈ సంఘటనలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మూలే సుధీర్‌రెడ్డి తలకు రాయి తగిలింది. అక్కడే ఉన్న డిఎస్‌పి యస్వంత్‌ జోక్యం చేసుకొని ఇరు గ్రూపుల వారిని సర్ధిజెప్పి అక్కడి నుంచి పంపించారు. దాడిలో ఆది నారాj ుణరెడ్డిరెడ్డి, వైసిపికి చెందిన వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. టిడిపి కార్యాలయం నుంచి సోమవారం రాత్రి 9 గంటలకు ఆదినా రాయణరెడ్డిని, భూపేష్‌ సుబ్బరామిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని దేవగుడికి సెక్యూ రిటీతో పంపారు. సుధీర్‌రెడ్డిని నిడిజువ్వికి పంపారు. మంగళవారం మళ్ళీ జమ్మలమడుగుకు రావడానికి ఇరువురు పార్టీల అభ్యర్థులు ప్రయత్నం చేయగా సుధీర్‌ రెడ్డిని ముద్దనూరులో అదుపులోకి తీసుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అలాగే ఇటు వైపు ఆది, భూపేష్‌లను కూడా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. వారికి 2ం2 గన్‌ మెన్‌లను నియమించారు. మొత్తంపై జమ్మలమడుగులో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతుంది. అందులో భాగంగానే 144 సెక్షన్‌ కొనసాగుతుందని, అవసరమైతే ఫైరింగ్‌ చేయడానికి కూడా వెనకాడబోమని డిఎస్‌పి హెచ్చ రించారు. టిడిపి, బిజెపి, వైసిపి కార్యాలయాల వద్ద పోలీస్‌ బలగాలు మోహరించాయి. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు : డిఎస్‌పి జమ్మలమడుగులో 144 సెక్షన్‌ కొనసాగుతోందని డిఎస్‌పి టిడి యశ్వంత్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌ రోజు సోమవారం తలెత్తిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జమ్మలమడుగులో 144 సెక్షన్‌ కొనసాగుతుందన్నారు. టీ బంకులు, దుకాణాల్లో నలుగురు కంటే ఎక్కువ ఉంటే కేసు నమోదు చేస్తామన్నారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, అల్లలు సృష్టించేందుకు ప్రయత్నించినా, కవ్వింపు చర్యలకు పాల్పడినా లాఠీఛార్జి చేయాల్సి వస్తుందన్నారు. అవసరమైతే ఫైరింగ్‌ చేసేందుకైనా వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. అల్లర్లకు ప్రయత్నిస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెడతామని పేర్కొన్నారు. శాంతిభద్రత దృష్ట్యా పట్టణ ప్రజలు పోలీసు వారికి సహకరించాలని డిఎస్‌పి కోరారు. జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం సాయంత్రం వెంకటేశ్వర కాలనీలో 116, 117 పోలింగ్‌ బూత్‌ వద్ద వైసిపి, కూటమి అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఎంపీ అభ్యర్థి భూపేష్‌ సుబ్బరామిరెడ్డి కింద పడిపోవడంతో కూటమి శ్రేణులు ఇటుక రాళ్లతో దాడికి దిగారు. ఈ సంఘటనలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మూలే సుధీర్‌రెడ్డి తలకు రాయి తగిలింది. అక్కడే ఉన్న డిఎస్‌పి యస్వంత్‌ జోక్యం చేసుకొని ఇరు గ్రూపుల వారిని సర్ధిజెప్పి అక్కడి నుంచి పంపించారు. దాడిలో ఆది నారాయణరెడ్డిరెడ్డి, వైసిపికి చెందిన వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. టిడిపి కార్యాలయం నుంచి సోమవారం రాత్రి 9 గంటలకు ఆదినా రాయణరెడ్డిని, భూపేష్‌ సుబ్బరామిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని దేవగుడికి సెక్యూ రిటీతో పంపారు. సుధీర్‌రెడ్డిని నిడిజువ్వికి పంపారు. మంగళవారం మళ్ళీ జమ్మలమడుగుకు రావడానికి ఇరువురు పార్టీల అభ్యర్థులు ప్రయత్నం చేయగా సుధీర్‌ రెడ్డిని ముద్దనూరులో అదుపులోకి తీసుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అలాగే ఇటు వైపు ఆది, భూపేష్‌లను కూడా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. మొత్తంపై జమ్మలమడుగులో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతుంది. అందులో భాగంగానే 144 సెక్షన్‌ కొనసాగుతుందని, అవసరమైతే ఫైరింగ్‌ చేయడానికి కూడా వెనకాడబోమని డిఎస్‌పి హెచ్చ రించారు. టిడిపి, బిజెపి, వైసిపి కార్యాలయాల వద్ద పోలీస్‌ బలగాలు మోహరించాయి. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు : డిఎస్‌పి జమ్మలమడుగులో 144 సెక్షన్‌ కొనసాగుతోందని డిఎస్‌పి టిడి యశ్వంత్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌ రోజు సోమవారం తలెత్తిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జమ్మలమడుగులో 144 సెక్షన్‌ కొనసాగుతుందన్నారు. టీ బంకులు, దుకాణాల్లో నలుగురు కంటే ఎక్కువ ఉంటే కేసు నమోదు చేస్తామన్నారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, అల్లలు సృష్టించేందుకు ప్రయత్నించినా, కవ్వింపు చర్యలకు పాల్పడినా లాఠీఛార్జి చేయాల్సి వస్తుందన్నారు. అవసరమైతే ఫైరింగ్‌ చేసేందుకైనా వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. అల్లర్లకు ప్రయత్నిస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెడతామని పేర్కొన్నారు. శాంతిభద్రత దృష్ట్యా పట్టణ ప్రజలు పోలీసు వారికి సహకరించాలని డిఎస్‌పి కోరారు.

చంద్రబాబు రేపు మహరాష్ట్ర పర్యటన.. కొల్హాపూర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు

ఎపిలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి  రిలీఫ్ అయ్యింది. మళ్లీ అధికారంలో వచ్చే సంకేతాలు వెలువడటంతో ఆపార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు పుణ్యక్షేత్రాల బాట పట్టారు.  రేపు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్లనున్నారు. అక్కడి శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం షిర్డీ చేరుకుని సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుంటారు.ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్న చంద్రబాబు ఆ తర్వాత మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి వెళ్లారు. రేపు మహారాష్ట్ర వెళ్తున్నారు. కాగా, ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తమదేనని చంద్రబాబు ధీమాగా ఉన్నారు.  ఆలయాల సందర్శనలో బిజీబిజీగా గడుపుతున్నారు.

పెద్దారెడ్డి ఇంటి మీద టీడీపీ జెండా!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరో స్వతంత్ర పోరాటాన్ని తలపిస్తున్నాయి. స్వతంత్ర పోరాటం జరిగిన సమయంలో బ్రిటీష్ వాళ్ళ భవంతుల మీద మన పతాకాన్ని ఎగరేయడానికి స్వతంత్ర  సమరయోధులు ఎంత రిస్క్ అయినా చేసేవారు. అదే తరహాలో ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం కార్యకర్తలు పనిచేస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో దారుణాలకు పాల్పడుతున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎదిరించి నిలబడుతున్నారు. ఈ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి పోటీలో నిలిచారు. తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా పెద్దారెడ్డి, ఆయన అనుచరులు రెచ్చిపోయారు. పలువురు టీడీపీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడ్డారు. భారీ స్థాయిలో అల్లర్లు సృష్టించారు. టీడీపీ నాయకుడు మునిరెడ్డి ఇంటి మీదకి పెద్దారెడ్డి తన అనుచరులతో కలసి వెళ్ళి రాళ్ళ దాడి చేశారు. ఈ దాడిలో పో్లీసులకు కూడా తీవ్ర గాయాలు అయ్యేలా పరిస్థితి తయారయింది. ఈ నేపథంలో జేసీ దివాకర్‌రెడ్డి అనుచరులు పెద్దారెడ్డి ఇంటి మీదకి వెళ్ళారు. దాంతో భయపడిపోయిన పెద్దారెడ్డి ఇంటి నుంచి పరారయ్యారు. జేసీ  దివాకర్ రెడ్డి అనుచరులు పెద్దారెడ్డి ఇంటి మీద తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. తాడిపత్రిలో టీడీపీ జెండా ఎగరబోతోందనేదానికి దీన్ని సింబాలిక్‌గా చెప్పుకోవచ్చు.

కుప్పంలో 85.87%, పులివెందులలో 81.3% పోలింగ్.. భారీ పోలింగ్ చెబుతున్నదేంటంటే..?

ఏపీలో పోలింగ్ భారీగా జరిగింది. ఎన్నికల సంఘం కూడా దీనిని అధికారికంగా ధృవీకరించింది.  రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటరు ఓటెత్తారు. అనూహ్యమైన ప్రజాస్వామిక స్ఫూర్తి కనబరిచారు.  రాష్ట్ర వ్యాప్తంగా 82 శాతానికి పైగానే పోలింగ్ జరిగినట్లు అంచనా.   అయితే రాష్ట్రంలో అత్యంత కీలకమైన, కీలక నేతలు పోటీలో ఉన్న  ఆరు నియోజకవర్గాలలో మరింత ఎక్కువ శాతం పోలింగ్ జరిగింది.  ఆ నియోజకవర్గాలు ఏమిటంటే తెలుగుదేశం అధినేత పోటీ చేసిన కుప్పం. కుప్పంలో 85.87 శాతం ఓటింగ్ నమోదైంది. అలాగే వైసీపీ అధినేత జగన్ పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గంలో 81.34 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో  85. 74శాతం, జనసేనాని పవన్ కల్యాణ్ రంగంలోకి దిగిన పిఠాపురంలో 86.63 శాతం పోలింగ్ నమోదైంది. ఇక నందమూరి బాలకృష్ణ పోటీ చేసిన హిందూపురం నియోజకవర్గంలో 77.82, కాంగ్రెస్ ఏపీ అధినేత్రి షర్మిల పోటీ చేసిన కడప లోక్ సభ నియోజకవర్గంలో 78.73 శాతం పోలింగ్ నమోదైంది.  ఎగ్జిట్ పోల్స్ పై ఈ నెల 1వ తేదీ సాయంత్రం వరకూ నిషేధం అమలులో ఉన్నా భారీగా పోలైన ఓట్లు, ఓటరు చైతన్యం, ఓటేసి తీరాలన్న  పట్టుదల గమనిస్తే ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. రాజకీయ పరిశీలకులు కూడా భారీ పోలింగ్ ప్రజలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతనే సూచిస్తున్నదని చెబుతున్నారు. పరిస్థితులు ఇంత స్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తున్నా వైసీపీ నేతలు మాత్రం విజయంపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు బంద్ 

వేసవి సెలవుల్లో సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలవుతుంటాయి.. సెలవుల కారణంగా థియేటర్లకు జనం ఎక్కువగా వస్తారనే ఉద్దేశమే దీనికి కారణం. మూడు గంటలు ఏసీలో సినిమా ఎంజాయ్ చేయడానికి జనం ఆసక్తి చూపిస్తుంటారు. దీనికి అనుగుణంగా పెద్ద సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే, ఈ సమ్మర్ లో మాత్రం పరిస్థితి రివర్స్ అయింది. పెద్ద సినిమా నిర్మాతలు తమ సినిమాల విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. ఓవైపు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండడం, మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ ల కారణంగా జనం థియేటర్ల వంక చూడడంలేదు. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులకు నష్టాలు తప్పట్లేదు. తెలంగాణలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని థియేటర్ యజమానులు చెబుతున్నారు.  ఎన్నికలు, ఐపీఎల్ కారణంగా సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిందని చెప్పారు. సమ్మర్ మొదలైనప్పటి నుంచి నష్టాలేనని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు చెప్పారు. ఒక్కో షోకు పది, పదిహేను మంది మాత్రమే వస్తున్నారని, టికెట్ల ద్వారా వచ్చిన సొమ్ము కరెంట్ బిల్లుకే సరిపోవడంలేదని వాపోతున్నారు. పదిమంది ప్రేక్షకుల కోసం షో వేయలేమని చెబుతూ రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ థియేటర్లను పది రోజుల పాటు బంద్ పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం చిన్న సినిమాల నిర్మాతలకు భారంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వారంలో పలు చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. తాజాగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల బంద్ నేపథ్యంలో ఆ సినిమాలు విడుదలవుతాయా? లేక వాయిదా పడతాయా అనేది చూడాలి

పిఠాపురం హీరో ఎస్వీఎస్ఎన్ వర్మ!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో హాట్ సీట్ గా అందరి దృష్టినీ ఆకర్షించిన నియోజకర్గం ఏదైనా ఉందంటే అది పిఠాపురం మాత్రమేనని చెప్పవచ్చు. అటువంటి పిఠాపురంలో పోలింగ్ ముగిసిన తరువాత కూటమి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ శ్రేణుల్లో నిరాశా నిస్ఫృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశ్లేషకులు కూడా ఇక్కడ జనసేనాని పవన్ కల్యాణ్ భారీ మెజారిటీ సాధించడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. పోలింగ్ జరుగుతుండగానే వైసీపీ చేతులెత్తేసినట్లు కనిపించింది. వైసీపీ అభ్యర్థి వంగా గీత పోలింగ్ బూత్ ల సందర్శన సందర్భంగా ఓటర్లతో పంచాయతీ పెట్టుకోవడం, అసహనం వ్యక్తం చేయడం ద్వారా పరిస్థితి తనకు, తన పార్టీకి ఏమాత్రం సానుకూలంగా లేదన్న సంకేతాలు ఇచ్చారు. సరే ఇప్పుడిక పోలింగ్ ముగిసిపోయింది. ఫలితం కూడా దాదాపు అందరికీ తెలిసిపోయింది. మెజారిటీ ఎంత అన్నదానిపైనే ఆసక్తి వ్యక్తం అవుతోంది. గెలుపు ఓటములపై కాకుండా మెజారిటీపైనే నియోజకవర్గంలో బెట్టింగులు జరుగుతున్నాయి.  దీంతో జనసైనికులు ఇప్పుడు పిఠాపురంలో కొత్త హీరో అవతరించారంటూ ఆయనపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.  పవన్ కల్యాణ్ లాంటి హీరోను మించి కొత్త హీరో ఎవరంటూ ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే జనసైనికులుస్వయంగా తమ అధినేతను మించి ఆ కొత్త హీరోనే ప్రశంసలతో ముంచె త్తుతున్నారు. ఆ కొత్త హీరో ఎవరంటే స్థానిక  తెలుగుదేశం నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మ. ఔను కూటమి శ్రేణులంతా ఆయననే హీరోగా అభివర్ణిస్తున్నారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పోటీ చేయనున్నట్లు ప్రకటించిన వెంటనే తెలుగుదేశంలో ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు ఎగసి పడ్డాయి. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో కష్టపడి పని చేసి పార్టీని పటిష్టం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మను కాదని పిఠాపురం సీటును జనసేనకు ఎలా కేటాయిస్తారంటూ తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక దశలో ఎస్పీఎస్ఎన్ వర్మ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఎస్పీఎస్ఎన్ వర్మను చంద్రబాబు పిలిపించి మాట్లాడారో.. ఆ క్షణం నుంచీ నియోజకవర్గంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పిఠాపురంలో జనసేనానిని గెలిపించే బాధ్యతను వర్మ భుజానికి ఎత్తుకున్నారు. పిఠాపురం నుంచి జనసేనాని విజయం ఖాయమనీ, అందుకు పూర్తి బాధ్యత తనదేననీ వర్మ చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కూ హామీ ఇచ్చారు. ఆ సందర్భంగా తాను చంద్రబాబు శిష్యుడినననీ, ఆయన మాటే తనకు శిరోధార్యమనీ ప్రకటించారు. తెలుగుదేశం క్యాడర్లో అసంతృప్తిని మటుమాయం చేశారు. కూటమి అభ్యర్థి విజయానికి అందరినీ ఎకతాటిపైకి తీసుకువచ్చారు.   పవన్ కళ్యాణ్‌ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు వేసిన ఎత్తుగడలు, వ్యూహాలను దీటుగా తిప్పికొట్టడంలో వర్మ ప్రధాన పాత్ర పోషించారు.  వర్మ పవన్ కల్యాణ్ ఉద్రేకంతో, ఉద్వేగంతో పొరపాట్లు చేయకుండా ఎక్కడికక్కడ నియంత్రించారు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద సినీ హీరో పక్కన ఉన్నారన్న మొహమాటం లేకుండా సూటిగా, నిక్కచ్చిగా వ్యవహరించారు. పవన్ కల్యాణ్ ప్రచారంలో భాగంగా ఓ సందర్భంలో పవన్ కల్యాణ్ డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించినపుడు కళ్లతోనే వారించారు. అందుకు సంబంధించిన వీడియో ను జనసైనికులే ఇప్పుడు వైరల్ చేస్తూ వర్మకు కృతజ్ణతలు చెబుతున్నారు.  పిఠాపురంలో నిజమైన హీరో వర్మే అంటూ ప్రస్తుతిస్తున్నారు.  

ఎపిలో రికార్డు స్థాయిలో పోలింగ్ 

ఏపీలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. పల్లెలు, పట్టణాలనే పట్టింపులు లేకుండా ఓటు వేసేందుకు ప్రజలు క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఏపీలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని గమనిస్తే గత మూడు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల సోమవారం అర్ధరాత్రి 2 గంటలవరకూ పోలింగ్ కొనసాగింది. సోమవారం రాత్రి 12 గంటల సమయానికి ఏపీవ్యాప్తంగా 78.25 శాతం పోలింగ్ నమోదైనట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు.1.2శాతం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో కలిపి మొత్తం 79.4 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు చెప్పారు. రెండు గంటల వరకూ పోలింగ్ కొనసాగిన నేపథ్యంలో  81 శాతం పోలింగ్‌ నమోదైనట్లు  తెలిపారు. జిల్లాలవారీగా చూస్తే సాయంత్రం ఐదుగంటల వరకూ.. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 74.06 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 55.17 శాతం పోలింగ్ నమోదైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా 73.55 శాతం, కృష్ణా జిల్లా 73.53 శాతం, బాపట్ల జిల్లాలో 72.14 శాతం, వైఎస్ఆర్ కడప జిల్లాలో 72.85 శాతం, నంద్యాలలో 71.43 శాతం, ప్రకాశం 71 శాతం, నెల్లూరు జిల్లాలో 69.95 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.  

అఖిలప్రియ బాడీగార్డ్ మీద హత్యాయత్నం

ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు వైసీపీ గూండాలు ఎంతమందిని చంపాలని టార్గెట్‌గా పెట్టుకున్నారోగానీ, వరసబెట్టి హత్యా ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుపతిలో పులివర్తి నానిని చంపడానికి 150 మంది గొడ్డళ్ళతో దాడి చేసిన ఘటన ఏపీ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. జనం ఇంకా ఈ భయంలో వుండగానే వైసీపీ గూండాలు మరో హత్యాయత్నం చేశారు. ఆళ్ళగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్ మీద హత్యాయత్నం చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దారుణం చేశారు. అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్ నిల్చుని వుండగా, కారులో వేగంగా వచ్చిన దుండగులు ఆయన్ని ఢీకొట్టారు. వెంటనే మారణాయుధాలతో నిఖిల్ మీద దాడి చేశారు. తీవ్రంగా గాయపడినప్పటికీ నిఖిల్ వారి నుంచి తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్ళి తలదాచుకున్నాడు. తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ని నంద్యాల ఆస్పత్రికి తరలించారు.

ఇదీ అల్లు అర్జున్ మిత్రుడి నిర్వాకం!

సరిగ్గా ఎన్నికల వేళ ఐకాన్ స్టార్, మెగా హీరోలలో ఒకడు అయిన అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి మరీ వైసీపీ అభ్యర్థి శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడం సంచలనం సృష్టించింది. తాను నంద్యాల వెళ్లి మిత్రుడికి మద్దతు తెలపడాన్ని అల్లు అర్జున్ సమర్ధించుకున్నాడు. తనకు పార్టీలతో సంబంధం లేదనీ, మిత్రుడి కోసం మాత్రమే నంద్యాల వచ్చాననీ, ఆయనకు మద్దతు ప్రకటించాననీ చెప్పుకున్నారు. అంతే కాకుండా తాను నంద్యాల వెళ్లడానికి ముందే పిఠాపురం నుంచి పోటీలో ఉన్న జనసేనానికి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశానని చెబుతున్నారు. అయితే అల్లు అర్జున్ సరిగ్గా పోలింగ్ కు ముందు వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ ర్యాలీ చేయడంపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నాగబూబు కూడా సీరియస్ గా స్పందించారు. మాతో ఉంటూ మా ప్రత్యర్థుల కోసం పని చేస్తూ వెన్ను పోటు పొడిచే వారిని పరాయివారిగానే భావిస్తామని ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ టార్గెట్ గానే నాగబాబు ఆ ట్వీట్ చేశారని అంతా భావిస్తున్నారు. కాగా ఇప్పుడు అల్లు అర్జున్ మిత్రుడి నిర్వాకం ఇదీ అంటూ మెగాభిమానులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి చెందిన పాత వీడియోలను  సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సరిగ్గా ఎన్నికల వేళ పనిగట్టుకుని మరీ నంద్యాల వెళ్లి మద్దతు తెలిపిన మిత్రుడు, వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గతంలో   పవన్ కల్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, దూషణలూ, అలాగే ప్రజారాజ్యం సమయంలో చిరంజీవిపై చేసిన విమర్శల వీడియోలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పవన్ కల్యాణ్ ను చంద్రబాబు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ చేసిన ద్రోహం ఇదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  

చిలకలూరి పేటలో యాక్సిడెంట్, ఆరుగురు సజీవదహనం 

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రిలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్‌ లారీ ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనమయ్యారు.ఒకే కుటుంబానికి ముగ్గురు మంటల్లో కాలి బూడిదయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.  పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు. బాపట్ల జిల్లాలోని చిన్నగంజాం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలంలో అదుపుతప్పి లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో వాహనాలు రెండూ నుజ్జునుజ్జయింది. ఆ వెంటనే మంటలు అంటుకోవడంతో ఆరుగురు మంటలకు ఆహుతయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. మృతుల్లో లారీ డ్రైవర్, మరో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మొత్తంగా ఆరుగురు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతులను అంజి (35), ఉప్పుగుండూరు కాశీ(65), ఉప్పుగుండూరు లక్ష్మి (55), ముప్పరాజు ఖ్యాతిసాయిశ్రీ (8)గా గుర్తించారు. వీరందరూ బాపట్ల జిల్లాకు చెందినవారే. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ప్రమాదంపై చంద్రబాబు, పురందేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి బాధాకరంమని, క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని వారు కోరారు.

బుద్ధవనంలో అనేక పర్యాటక ప్రత్యేక ఆకర్షణలు

అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో ఈమని శివనాగిరెడ్డి నాగార్జునసాగర్ వద్ద తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని బుద్ధవనం-వారసత్వ ఉద్యానవనం అనేక పర్యాటక ప్రత్యేకతలతో, మన దేశంలోనే కాక, ఆసియా దేశాలో కూడా విలక్షణ బౌద్ధ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిందని, బుద్ధవనం బుద్ధిస్ట్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్స్ , బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, మయన్మార్ దేశాల పర్యాటక నిర్వాహక సమాఖ్య సంయుక్తంగా మంగళవారం( మే 14) హోటల్ హై ల్యాండ్ లో నిర్వహించిన 'ప్రమోషన్ ఆఫ్ బుద్ధిష్ట్ సెక్టార్స్ త్రూ ఆసియా హైవే' అన్న అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక సదస్సులో ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరై ప్రసంగించారు.  పశ్చిమ బెంగాల్  సహా వివిధ ఆసియా దేశాల పర్యాటక ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో  ప్రసంగించిన ఆయన తెలంగాణ పర్యాటక శాఖ, 274 ఎకరాల్లో బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్థూప వనం, మహా స్థూపం, ఇంకా ప్రవేశ ప్రాంతంలోని బౌద్ధ పర్యాటక ఆకర్షణలతో సుందర తరంగా తీర్చిదిద్దిన బుద్ధవనం ఇప్పటికే అధిక సంఖ్యలో అంతర్జాతీయ, జాతీయ బౌద్ధ పర్యాటకులను ఆకర్షిస్తున్నదన్నారు.  ఆసియా హైవేకి బుద్ధవనాన్ని అనుసందించాలని సదస్సు నిర్వహకులకు విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కౌలేష్ కుమార్ సదస్సు ఉద్దేశాలను వివరించగా, అసోసియేషన్ గౌరవ కార్యదర్శి, పూర్వ బుద్ధవనం ప్రత్యేక అధికారి  మల్లేపల్లి లక్ష్మయ్య ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ హ్యాపీ ఇండెక్ యాత్రను భూటాన్ వరకు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంపాదకుడు, కే రామచంద్ర మూర్తి, బౌద్ధ అభిమాని కేకే రాజా, ఆల్ ఇండియా పురాతన దేవాలయాల జీర్ణోదరణ సమితి అధ్యక్షుడు ఆర్కే జైన్, ఇంకా సిలిగురి పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

వైసీపీ ఓటమి ఖాయం.. వీళ్ల మాటలే సాక్ష్యం!

ఏపీలో పోలింగ్ ముగిసింది. వైసీపీ మూకల అరాచకం, హింసాకాండ, బెదరింపులు, దాడులు ఇవేమీ పట్టించుకోకుండా జనం అపూర్వమనదగ్గ పట్టుదలతో ఓటు వేశారు. భారీ పోలింగ్ నమోదైంది. 81 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది. ఈ భారీ పోలింగ్ ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పుడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే వైసీపీ ఓటమి దాదాపుగా ఖాయమైందని వారు చెబుతున్నారు.  అయితే వాళ్లూ వీళ్లూ చెప్పడం కాదు, పరిశీలకులు విశ్లేషించడం కాదు.. స్వయంగా వైసీపీయే తన తీరు ద్వారా, వ్యాఖ్యల ద్వారా, ప్రదర్శిస్తున్న అసహనం ద్వారా ఓటమిని పోలింగ్ ముగియక ముందే అంగీకరించేసింది. ఇక ఆ పార్టీ అధినేత జగన్ అయితే  పోలింగ్ తేదీకి చాలా ముందుగానే బేలగా ఈ సారి ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా అంటూ తన ఆందోళనను, ఓటమి భయాన్నీ వెళ్లగక్కేశారు. ఏదో పార్టీ సమావేశంలోనే, కీలక నేతలతో మంతనాల సమయంలోనే కాదు.. ఏకంగా బహిరంగ వేదికపై జగన్ ఈ మాటలు చెప్పి పార్టీ పరాజయం తథ్యమన్న సంకేతాలను జనానికే కాదు, సొంత పార్టీ క్యాడర్ కు కూడా ఇచ్చేశారు.  ఇక ఆ పార్టీ కీలక నేత, మంత్రి రోజా అయితే పోలింగ్ జరుగుతుండగనే.. తాను ఓడిపోబోతున్నానని ప్రకటించేశారు. నగరి నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే పని చేశారని చెప్పారు. ఏకంగా మీడియా ముఖంగానే ఆమె ఈ మాటలు చెబుతూ వైసీపీ పరువు గంగలో కలిపేశారు. ఇక పోలింగ్ పూర్తయిన తరువాత మాజీ మంత్రి, నెల్లూరు నుంచి నరసరావుపేటకు వలస వచ్చి మీసం తిప్పి తొడకొట్టి కూటమికి సవాలు చేసిన వైసీపి ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్‌ యాదవ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వైసీపీ ఓటమి ఖాయమని ఖరారు చేసేశారు. సరిగ్గా ఇవే మాటలు చెప్పకపోయినా   టిడిపికి బలం ఉన్న చోట అసలు పోలీసులే లేరు. వాళ్ళను ఇష్టం వచ్చిన్నట్లు ఓట్లు వేసుకోమని వదిలేశారు. కానీ వైసీపికి బలం ఉన్న చోట వందలాది మంది పోలీసులను మోహరించి అడుగడుగునా నియంత్రించారు అంటూ ఆవేదన వ్యక్తం చేసి అనిల్ కుమార్ వైసీపీ ఓటమి తప్పదన్న సంకేతాలు ఇచ్చారు.   ఇక మంత్రి అంబటి రాంబాబు అయితే.. మీడియా సమావేశంలో భోరున ఏడ్చినంత పని చేశారు. వైసీపీ అక్రమాలకు, దౌర్జన్యాలకూ పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారనీ, మంత్రినైన తాను చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సత్తెనపల్లిలో రీపోలింగ్ కు డిమాండ్ చేశారు. సాధారణంగా ఓటమి ఖరారైన తరువాతే నేతల నోటి వెంట ఇటువంటి మాటలు వస్తాయి. పల్నాడు సహా పలు ప్రాంతాలలో వైసీపీ మూకలు రెచ్చిపోయి హింసాకాండకు, దౌర్జన్యాలకు తెగబడినా తెలుగుదేశం దీటుగా ప్రతిఘటించింది. పోలింగ్ సజావుగా సాగడానికి తన వంతు ప్రయత్నాలు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది కానీ ఎక్కడా ఇలా వైసీపీ నేతలు, మంత్రులు, మాజీ మంత్రుల్లా బేల మాటలు మాట్లాడలేదు. రీపోలింగ్ కు డిమాండ్ చేయలేదు. కానీ అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం చేతులెత్తేసింది. పోలింగ్ ఏకపక్షంగా జరిగిందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది.  ఇవన్నీ ఒకెత్తైతే ఇలా పోలింగ్ ముగిసిందో లేదో అలా విదేశాలకు చెక్కేయడానికి జగన్ వేసుకున్న ప్లాన్, ఆయన విదేశాలకు వెడితే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ అంటూ సీబీఐ కోర్టులో వేసిన కౌంటర్ తో జనానికి వైసీపీ ఓటమికి సాకులు, పలాయనానికి దారులు వేతుక్కుంటోందన్న సంకేతాలు ఇచ్చినట్లైంది.  

ఏపీలో భారీ పోలింగ్.. దెబ్బపడిందెవరికో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గతంలో ఎన్నడూ లేనంద ఆసక్తి చూపారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఏదైనా జనజాతర జరుగుతోందా అన్నట్లుగా జనం పోటెత్తారు. రాష్ట్రం నుంచి  వెళ్లి తెలంగాణ, తమిళనాడు, కర్నాటక.. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాలలో పొట్టకూటి కోసం పనులు చేసుకుంటున్నవారూ, ఉద్యోగాలు చేసుకుంటున్నవారూ.. రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అంటూ తండోపతండాలుగా తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్క హైదరాబాద్ నుంచే దాదాపు పది లక్షల మంది ఏపీకి వచ్చి తమతమ స్వగ్రామాలలో  ఓటు హక్కు వినియోగించుకున్నారంటే రాష్ట్రం పట్ల వారెంత అక్కరతో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇతర ప్రాంతాల నుంచి పని గట్టుకు మరీ వచ్చి ఓటు వేసిన వారిలో 98 శాతం మంది కూటమికే ఓటు వేశారని మీడియా పేర్కొంది. పరిశీలకులు విశ్లేషించారు.  అసలు అన్ని లక్షలమంది  ఓటు వేయడానికి గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తితో, పట్టుదలతో తమ స్వరాష్ట్రం ఆంధ్రకు ఎందుకు తరలివచ్చారు. జరుగుతున్నది సార్వత్రిక ఎన్నికలు. ఏపీలో అసెంబ్లీకి కూడా జరిగాయనుకోండి అది వేరే విషయం. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులకు అక్కడ కూడా ఓటు హక్కు ఉంది. రెండు చోట్ల ఓటు ఉండటం కరెక్ట్ కాదు. అయినా అలా ఓటు ఉన్న వారు ఉభయ తెలుగు రాష్ట్రాలలో కోకొల్లలు.  ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం ఏమిటంటే.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ స్థిరపడిన ఆంధ్రులు అక్కడే ఓటు వేయచ్చు. కానీ హైదరాబాద్‌లో, లేదో తెలంగాణలో మరో చోట ఓటు ఉన్న వాళ్లు  అక్కడ ఓటు వేయకుండా.. ఎండను, రద్దీని లెకక్క చేయకుండా  వ్యయప్రయాసలకోర్చి  ఏపీ వచ్చి మరీ ఓటు వేశారంటే ఏమనుకోవాలి.   జగన్ ఐదేళ్ల పాలనలో  సంక్షేమం పేరిట పప్పు బెల్లాలకు సరిపోయేలా సొమ్ముల పందేరం తప్ప జరిగిన అభివృద్ధి శూన్యం. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు. ఉద్యోగాలు లేవు. వ్యవసాయం పడకేసింది.   నిర్మాణరంగం నిర్వీర్యమైపోయింది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. దీంతో రాష్ట్రం నుంచి వలసలు పెరిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. ఇంకా  దేశం విడిచి పొట్ట చేత పట్టుకుని ఉన్న ఊరుకు, కన్నవారికీ దూరమై ఎవరి స్థాయిలో వారు ఉద్యోగాలో, ఉపాధో  వెతుక్కుంటూ వెళ్లిపోయారు.   దీంతో  రాష్ట్రంలో ప్రభుత్వం మారితే పరిశ్రమలు వస్తాయి, పారిశ్రామికాబివృద్ధి జరుగుతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న ఆశతో కష్టమైనా, భరించలేని వ్యయం అయినా రాష్ట్రంలో ప్రభుత్వం మారాలి అన్న ఒకే ఒక్క ఆశయంతో, ఆకాంక్షతో, సంకల్పంతో  ఇన్ని లక్షల మంది   ఆంధ్రాకు తరలి వచ్చి మరీ ఓటు వేశారు.  ఇంత చెప్పుకున్న తరువాత కూడా ఏపీలో ఓట్ల వెల్లువతో ఎవరికి దెబ్బపడిందన్నది ప్రత్యేకంగా చెప్పాలా?

చంద్ర‌గిరిలో వైసీపీ నేత‌ల అరాచ‌కం.. ఇంత‌కు ఈవీఎంలు భ‌ద్ర‌మేనా! ?

వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. ఓట‌మి భ‌యంతో ప్ర‌త్య‌ర్థుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నాయి. ఏకంగా తెలుగుదేశం అభ్య‌ర్థుల‌పైనే హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డుతున్నాయి. సాధార‌ణంగా ఎక్క‌డైనా పోలింగ్ ముందు, పోలింగ్ రోజున ఘ‌ర్ష‌ణ‌లు జ‌ర‌గ‌డం చూస్తుంటాం. కానీ, చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంతో పాటు ప‌లు నియోక‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌లు పోలింగ్ త‌రువాత రోజుకూడా దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. ఏపీలో రికార్డు స్థాయిలో 81శాతానికిపైగా పోలింగ్ న‌మోదైంది. దీంతో ప‌లు నియోజ‌కవ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఓట‌మి భ‌యం వెంటాడుతున్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అభ్య‌ర్థిగా పులివ‌ర్తి నాని పోటీ చేయ‌గా.. వైసీపీ అభ్య‌ర్థిగా చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పోటీ చేశారు.పోలింగ్ రోజు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ శ్రేణులు పెద్దెత్తున ఓట‌ర్ల‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డంతోపాటు, ప‌లు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద దాడులు చేశారు. అయినా, వారిని ఓట‌మి భ‌యం వెంటాడుతుండ‌టంతో ఏకంగా తెలుగుదేశం అభ్య‌ర్థిపై హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. ఒక‌ ప‌క్క ప‌లు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూంల‌కు త‌ర‌లించే క్ర‌మంలో అధికారులు తెలుగుదేశం నేత‌ల‌కు స‌మాచారం ఇవ్వ‌లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో స్ట్రాంగ్ రూంల‌ వ‌ద్ద అధికారుల స‌హ‌కారంతో ఈవీఎంల‌లో ఏమైనా మ‌త‌ల‌బు జ‌రిగిందా అనే అనుమానాన్ని తెలుగుదేశం నేత‌లు వ్య‌క్తం చేస్తుండ‌గా.. పులివ‌ర్తి నానిపైనే హ‌త్యాయ‌త్నం చేయ‌డం, ఆయన గ‌న్ మెన్ ను తీవ్రంగా గాయ‌ప‌ర్చ‌డం ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. నాని వాహ‌నంపై దాడికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి రావ‌డంతో చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ఏమైనా ఆఫ్గ‌నిస్థాన్ దేశంలో ఉందా అనే అనుమానం కలగక మాన‌దు.  చంద్ర‌గిరి తెలుగుదేశం అభ్య‌ర్థి పులివ‌ర్తి నానిపై చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి పెంచి పోషించిన గూండాలు ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని ఈవీఎంల‌ను తిరుప‌తిలోని ప‌ద్మావ‌తి మ‌హిళా యూనివ‌ర్శిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంల‌లో భ‌ద్ర‌ప‌ర్చారు. మంగ‌ళ‌వారం(మే5) సాయంత్రం స్ట్రాంగ్ రూంలో ఈవీఎంల‌ ప‌రిశీల‌న‌కు పులివ‌ర్తి నాని, ఆయ‌న స‌తీమ‌ణి సుధారెడ్డితో పాటు ప‌లువురు తెలుగుదేశం నేత‌లు యూనివ‌ర్శిటీకి వెళ్తున్నారు. యూనివ‌ర్శిటీ లోప‌లికి ఎంట‌ర్ కాగానే నాని కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడుతుండ‌గా.. ఆయ‌న వెనుకాలేఉన్న‌ సుధారెడ్డి వాహ‌నం సైడ్ తీసుకొని యూనివ‌ర్శిటీ లోప‌లికి వెళ్లిపోయింది. ఈ క్ర‌మంలోనే అప్ప‌టికే అక్క‌డ‌ కాపు కాసి ఉన్న‌   వైసీపీ గూండాలు రాడ్లు, పెద్ద సుత్తి, బీరు సీసాల‌తో నాని కారుపై దాడికి తెగ‌బ‌డ్డారు. ఊహించ‌ని ప‌రిణామంతో కొద్దిసేపు నాని, ఆయ‌న గ‌న్ మెన్‌, టీడీపీ నేత‌లు కారులో ఉండిపోయారు. దీంతో వైసీపీ గూండాలు రాడ్డులు, బీర్ బాటిల్స్ తో దాడిని ఉధృతం చేశారు. నాని ఉన్న కారు అద్దాల‌ను రాడ్‌ల‌తో ప‌గ‌ల‌గొట్టి హ‌త్యాయ‌త్నం చేశారు. గ‌న్‌మెన్స్ అప్ర‌మ‌త్త‌మై నాని ని కారుదింపి అక్క‌డి నుంచి పంపించి వేశారు. నాని వెళ్తుండ‌టంతో అత‌నిపై కొంత‌మంది వైసీపీ నేత‌లు దాడికి య‌త్నించ‌గా.. గ‌న్‌మెన్ అడ్డుకున్నాడు.  వైసీపీ జ‌డ్పీటీసీ పెద్ద సుత్తి (స‌మ్మెట‌) తో గ‌న్ మెన్ పై  దాడి చేశాడు. ఈ దాడిలో నానితోపాటు గ‌న్ మెన్‌కు, ప‌లువురు టీడీపీ నేత‌ల‌కు గాయాల‌య్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కారు డాష్ బోర్డుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు కావ‌డం, ఆ దృశ్యాలు మీడియాలో ప్ర‌సారం కావ‌డంతో ఆ దృశ్యాల‌ను చూసిన‌ ఏపీ ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా ఉలిక్కిపాటుకు గుర‌య్యారు. చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ గూండాల‌ దాడుల వెన‌క పెద్ద‌ప్లాన్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. కొన్ని ఈవీఎంలను స్ట్రాంగ్ త‌ర‌లించేట‌ప్పుడు త‌మ‌కు స‌మాచారం లేద‌ని, సీల్ కూడా వేయ‌లేద‌ని పులివ‌ర్తి సుధారెడ్డి ఆరోపించారు. స్టాంగ్ రూంల ప‌రిశీల‌న‌కు వైసీపీ అభ్య‌ర్థి తెలుగుదేశం నేత‌ల కంటే ముందే వెళ్లిన‌ట్లు తెలిసింది. దీన్నిబ‌ట్టిచూస్తే ప్లాన్ లో భాగంగానే వైసీపీ నేత‌లు పులివ‌ర్తి నాని వాహ‌నాల‌పై దాడుల‌కు దిగిన‌ట్లు తెలుస్తోంది. తెలుగుదేశం అభ్య‌ర్థి వ‌స్తున్న‌ట్లు ముందుగానే స‌మాచారం అందుకున్న వైసీపీ గూండాలు దాడికి చేసేందుకు కాపుకాసుకొని ఉన్నారు. వీరిని స్టాంగ్ రూంల వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని ముందుగానే అనుకున్న ప్లాన్ ప్ర‌కారం దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. అయితే, వైసీపీ గూండాల దాడికంటే ముందే సుధారెడ్డి స్ట్రాంగ్ రూంల వ‌ద్ద‌కు చేరుకున్నారు. పులివ‌ర్తి నానిపై దాడి అనంత‌రం సుధారెడ్డి మాట్లాడుతూ.. కొన్ని ఈవీఎంల‌కు సీల్ వేయ‌కుండానే, త‌మ‌కు స‌మాచారం లేకుండానే స్ట్రాంగ్ రూంల‌కు త‌ర‌లించిన‌ట్లు ఆరోపించారు. పోలింగ్ స‌మ‌యం నుంచే కొన్ని పోలింగ్ కేంద్రాల‌కు చెందిన ఈవీఎంల‌లో మ‌త‌ల‌బు జ‌రిగిన‌ట్లు తెలుగుదేశం నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు ముందుగావేసుకున్న ప్లాన్ ప్ర‌కార‌మే యూనివ‌ర్శిటీ ఎంట్ర‌న్స్ లో వైసీపీ గూండాలు దాడికి పాల్ప‌డిన‌ట్లు అనుమానిస్తున్నారు. అయితే, కార్ డాష్ బోర్డుల‌కు ముందుగానే తెలుగుదేశం అభ్య‌ర్థి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయ‌డంతో వైసీపీ గుండాల అరాచ‌కం వెలుగులోకి వ‌చ్చింది.  చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి పెంచిపోషించిన వైసీపీ గూండాలు పోలీసుల‌పైనా దాడుల‌కు తెబ‌డ్డారు. పోలింగ్ రోజు ఓ సీఐను గాయ‌ప‌ర్చారు. అయినా పోలీసుల్లో చ‌ల‌నం లేక‌పోవ‌టం ఏపీ ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. వైసీపీ నేత‌లు కాకుండా ఇత‌ర పార్టీల నేత‌లు పోలీసుల‌పై చేయి ఎత్తితేనే పెద్ద‌రాద్దాంతం చేసే ఏపీ పోలీసులు  వైసీపీ గూండాలు ఏకంగా  దాడులు చేసినా కిక్కురుమ‌న‌కుండా ప‌డిఉండ‌టం విస్మయం కలిగిస్తోంది. స్ట్రాంగ్ రూంలు భ‌ద్ర‌ప‌ర్చిన యూనివ‌ర్శిటీ లోప‌ల టీడీపీ అభ్య‌ర్థిపై వైసీపీ గూండాలు దాడుల‌కు పాల్ప‌డిన విష‌యంపై జిల్లా ఎస్పీ స్పందించారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వారిని ప‌రామ‌ర్శించామ‌ని, తెలుగుదేశం నేతలు ఇచ్చిన ఫిర్యాదు ప్ర‌కారం నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు స్పెష‌ల్ టీంల‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే, ఈవీఎంలు భ‌ద్ర‌ప‌ర్చిన ప‌ద్మావ‌తి మ‌హిళా యూనివ‌ర్శిటీ ఎంట్రెన్స్ లోనే టీడీపీ అభ్య‌ర్థిపై బీరు బాటిళ్లు, పెద్ద సుత్తి, రాడ్లతో దాడి జ‌రుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్న‌కు ఎస్పీ నుంచి స‌మాధానం రాలేదు. అస‌లు గేటు ఎంట్రీ వ‌ద్ద భ‌ద్ర‌త ఉండ‌దా అని విలేక‌రుల ప్ర‌శ్నించ‌గా.. ఎస్పీ స‌మాధానం చెప్పేందుకు ఇబ్బంది ప‌డ్డారు. స్ట్రాంగ్ రూంలు సేఫ్‌.. అక్క‌డ భ‌ద్ర‌త ఏర్పాటు చేశాం అంటూ విలేక‌రుల ప్ర‌శ్న‌ల నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు.  చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ నేత‌లు, పోలీసుల వ్య‌వ‌హారం చూస్తుంటే.. దాడుల పేరుతో టీడీపీ నేత‌లు, ప్ర‌జ‌ల‌ను డ్రైవర్ట్ చేసి.. ఈవీఎంల‌లో మ‌త‌ల‌బు విష‌యాన్ని వెలుగులోకి రాకుండా చేసేందుకు చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి గూండా బ్యాచ్ ప్లాన్ చేసిందన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  ప్ర‌స్తుతం తెలుగుదేశం నేత‌లు, ప్ర‌జ‌ల నుంచి  వ‌స్తున్న ప్ర‌శ్న‌.. ఈవీఎంలు సేఫేనా అని. ఈవీఎంలు త‌ర‌లించే స‌మ‌యంలో, స్ట్రాంగ్ రూంలో భ‌ద్ర‌ప‌ర్చే స‌మ‌యంలో ఏం జ‌రిగింద‌నే విష‌యం అధికారుల‌కు, వైసీపీ నేత‌ల‌కు, ఆ దేవుడికే తెలియాలి మ‌రి. మొత్తానికి ఎలాగోలా మోహిత్ రెడ్డిని గెలిపించుకోవాల‌ని చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి గూండా బ్యాచ్ చేస్తున్న అరాచ‌కం చూస్తుంటే చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం భార‌త‌దేశంలోనే ఉందా? అన్న అనుమానం క‌ల‌గ‌క మానదు.