అగాధంలో రూపాయి

      ......సాయి లక్ష్మీ మద్దాల   నేడు భారత దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. దీనికి కారణాలు అనేకం. అన్నీ ప్రభుత్వ విధానాలతో కూడుకున్న కారణాలు. నేటి యు.పి.ఎ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలే ప్రధాన కారణం. నేటి ప్రభుత్వానికి ఓట్ల మీదున్న శ్రద్ధ ప్రజా సంక్షేమం మీద లేదు. అందుకు ఉదాహరణగానే రోజుకొకటి పుట్టుకొస్తున్న ప్రజాకర్షక పధకాలు. నేటి రూపాయి పతనం డాలరుతో పోలిస్తే 68 రూపాయిలు దాటుతోంది. దీనితో భారత ఆర్ధిక పరిస్థితి 1990-91 నాటి పరిస్థితికి దిగజారిందా అన్నంత ఆందోళన కలిగిస్తుంది.   నేటి దేశ ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దటానికి అప్పటి ప్రధాని,ఆర్ధిక మంత్రి విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి ఎన్నో ఆర్ధిక సంస్కరణలను ప్రవేశ పెట్టారు. వాటిలో భాగంగా పారిశ్రామిక సరళీకరణ,సబ్సిడీలను తగ్గించటం,ఎన్నో పొదుపు చర్యలను చేపట్టటం లాంటి విధానాలను అనుసరించి దేశం ఆర్ధిక ప్రగతి వైపు పయనిస్తుందనే నమ్మకం పెట్టుబడిదారులలో కలిగించి,దేశ ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దటం జరిగింది. కాని అప్పటి ఆర్ధిక మంత్రిగా పనిచేసిన నేటి ప్రధాని హయాంలో,మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సరళీకృత ఆర్ధిక విధానాలను కొనసాగిస్తున్నప్పటికి అప్పటి భిన్నమైన పరిస్థితులను కలుగచేసి పెట్టుబదిదారులలో అపనమ్మకాన్ని కలిగించటంమే నేటి ఈ రూపాయి పతనానికి కారణమయ్యింది.                    పెట్టుబడిదారీ  వ్యవస్థలు వ్యతిరేకించే సబ్సిడీలని పెంచుతూ,సంక్షేమ పధకాలను మరింత పెంచుతూ పెట్టుబడులను వెనుకకు వెళ్ళే పరిస్థితిని సృష్టించారు. గ్యాస్ మీద సబ్సిడీ ఇంతకు ముందు నుండి ఇస్తున్నప్పటికీ దానిని నగదు బదిలీ పధకం కింద మార్చి అదొక కొత్త సంక్షేమ పదకంగా చూపించటం ఒక కారణం కాగా లక్ష కోట్లు దాటిన ఆహారభద్రత అనే మరొక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టటం ద్వారా ఈ యు.పి.ఎ ప్రభుత్వం సంక్షేమ రాజ్యంగా రాజ్యంగా మారుస్తున్నామనే సంకేతం పంపటం ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరిగి రూపాయి మరింత పతనం దిశగా పయనిచింది. ఇక పొదుపు చర్యలనేవి ఎక్కడా కానరావటం లేదు. ఓట్లు మరియు సీట్లు తప్ప దేశ ఆర్ధిక ప్రగతితో మాకు సంబంధం లేదు అనేటట్లు నేటి ప్రభుత్వం ప్రవర్తించటం పేద,ధనిక లేదా మధ్య తరగతి అనే భేదం లేకుండా ప్రజలంతా మూల్యం చేలిచుకోవలసి వస్తోంది.                      నేడు సామాన్య ప్రజలతో పాటు MLA,MP లు మరియు కేంద్ర,రాష్ట్ర మంత్రులకు కూడా ఈ రూపాయి పతనం వలన కలిగే నష్టాలను గుర్తిస్తున్నట్లు లేరు. ఎగుమతులు,దిగుమతుల వ్యత్యాసం కూడా బాగా పెరిగిపోవటం కూడా నేటి ఈ దుస్థితికి కారణం. ఈ ఎగుమతులు దిగుమతులు డాలరు కరెన్సీలో జరుగుతున్నపుడు దిగుమతుల విలువ ఎంత ఉంటుందో ఎగుమతుల విలువ కూడా అంతే ఉండాలి. కానీ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉండటంతో డాలరుకు డిమాండ్ పెరిగి రూపాయి పతనం అవుతుంది. ఎగుమతులను పెంచటానికి దిగుమతులను తగ్గించటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు నామ మాత్రంగా ఉన్నాయి.                     ఈ రూపాయి పతనం వలన ప్రజల పై ఉండే ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. 1. 70%పెట్రోల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవటం వలన పెట్రోల్,డీసెల్ ధరలు విపరీతంగా పెరిగి,దీని ద్వారా రవాణా చార్జీలు పెరిగి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి సామాన్యులకు బ్రతుకు భారంగా మారుతుంది.

బోగ్గు ఫైళ్లకు నేను కాపాలా కాదు : ప్రదాని

  కోల్‌ స్కాం విషయంలో ప్రతిపక్షాలతో పాటు సుప్రిం కోర్టు కూడా ఫైళ్ల మాయంపై మండి పడటంతో ఎట్టకేలకు ప్రదాని మన్మోహన్‌ సింగ్‌ విషయం పై నోరు విప్పారు. బొగ్గు బ్లాకుల కేటాయింపుల విషయంలో బిజెపి సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రదాని సమాధానమిచ్చారు. దేశంలో అవినీతి ఎప్పటినుంచో ఉందన్న ప్రదాని సమాచార హక్కు లాంటి చట్టాల వల్ల ఇటీవల అది బాగా వెలుగులోకి స్తుందన్నారు. సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో బొగ్గు శాఖ ఫైళ్లు ఎలా మాయం అయ్యాయని విపక్షాలు ప్రశ్నించగా వాటికి నేను కాపాలా కాదు. ఎలా పోయాయో విచారణ అనంతరం తెలుస్తుందని ఘాటుగా స్పందించారు. అయితే ఆర్థిక వ్యవస్థ ప్రదాని చేసిన వ్యాఖ్యలతో పాటు బొగ్గు ఫైళ్ల మిస్సింగ్‌ విషయంలో కూడా ప్రదాని సంతృప్తి కరమైన సమాధానం ఇవ్వటంలో విఫలమయ్యారన్ని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

రాజీనామాల పై రాజీ

  సీమాంద్రలో జ‌రుగుతున్న ఉద్యమాల‌కు మ‌ద్దతుగా తాము కూడా రాజీనామాలు చేస్తామంటు ప్రక‌టించిన సీమాంద్ర నాయ‌కులు ఇప్పుడ మాట మారుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉద్యొగ సంఘాల వ‌త్తిడితో అప్పుడు రాజీనామాల‌కు ఒకే అన్నా ఇప్పుడు మాత్రం రాజీనామ చేయ‌డానికి చాలామంది నేత‌లు సుముఖంగా లేర‌ట‌. ఉద్యోగ‌సంఘాల‌తో జ‌రిగిన స‌మావేశంలో నేత‌లు త‌ల ఒక రకంగా మాట్లాడు, కొంత మంది మేం ఇప్పటికే రాజీనామ చేశాం అని చెప్పగా మ‌రి కొంత మంది మాత్రం, రాజీనామాల‌తో ఒరిగేదేమి లేద‌న్నారు. మ‌రికొంత మంది ఉద్యోగ సంఘాల వ‌త్తిడితో రాజీనామ చేయ‌డానికి అంగీకరించారు. అయితే అప్పుడు రాజీనామ చేస్తా అన్నవారు. గ‌తంలోనే రాజీనామ చేసిన నాయ‌కులు కూడా త‌మ రాజీనామాల‌ను ఆమోదింప చేసుకోవ‌టానికి సుముఖంగా లేర‌ట‌. తాము స‌భ‌లోనే ఉండి తెలంగాణ బిల్లు పై త‌మ వ్యతిరేఖ‌త‌ను తెలియ‌జేస్తాం అంటూ మాట మారుస్తున్నార‌ట‌. మ‌రి ఈ నాయ‌కుల నిర్ణయంపై ప్రజా సంఘాల వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

ధ‌ర్మాన‌కు స‌మైక్య సెగ‌

  సీమాంద్రలో రోజు రోజుకు స‌మైక్య సెగ‌లు మ‌రింత ఎక్కువ అవుతున్నాయి. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అన్న తేడా లేకుండా అంద‌రు నాయ‌కుల‌కు స‌మైక్య సెగ‌లు త‌ప్పటం లేదు. తాజాగా మాజీ మంత్రి ధ‌ర్మాన ప్రసాద‌రావుకు నిర‌స‌న‌లు ఎదుర‌య్యాయి. జిల్లాలోని శుక్రవారం నిర్వహించిన స‌మైక్య స‌మ‌ర‌నాధం స‌భ‌లో ధ‌ర్మాన ప్రసంగాన్ని స‌మైక్య వాదులు అడ్డుకున్నారు. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామ చేయాల‌ని నినాదాలు చేస్తూ ధ‌ర్మాన ప్రసంగానికి అడ్డుత‌గిలారు.అయితే ముందు ఆందోళ‌న కారుల‌కి స‌ర్ధి చెప్పాల‌ని ప్రయ‌త్నించిన ధ‌ర్మాన ఒక ద‌శ‌లో స‌హ‌నం కొల్పోయి రాజీనామ చేయ‌న‌ని తెగేసి చెప్పారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్పాడ్డాయి. ధ‌ర్మాన మాత్రం త‌మ వాయిస్ చ‌ట్ట స‌భ‌లో వినిపించ‌డానికి మేం ప‌ద‌వుల్లో కొన‌సాగాల‌ని అందుకే రాజీనామా చేసే ప్రస‌క్తే లేద‌ని తెగేసి చెప్పారు. దీంతో ధ‌ర్మానపై అన్ని వ‌ర్గాల నుంచి తీవ్ర విమ‌ర్శలు వెళ్లువెత్తాయి.

విభ‌జ‌న ఆగ‌కుంటే కొత్తపార్టీ వ‌స్తుంది

  రాష్ట్ర విభ‌జ‌న అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ఎంపి రాయ‌పాటి సాంబ‌శివ‌రావు స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న కాంగ్రెస్ అధిష్టానం పై మండిప‌డ్డారు. అంతేకాదు సెప్టెంబ‌ర్ 7న ఏపిఎన్జీవోలు త‌ల‌పెట్టిన స‌భ‌కు త‌న పూర్తి మ‌ద్దతు ఉంటుంద‌ని కూడా ప్రక‌టించారు రాయ‌పాటి. ఎక్కువ రోజులు సీమాంద్రలో ఉద్యమాలు జ‌ర‌గ‌వ‌న్న ఆలోచ‌న‌తోనే అధిష్టానం విభ‌జ‌న దిశ‌గా అడుగులు వేస్తుంద‌ని, కాని ఇక్కడ ప‌రిస్థితులు అలా లేవ‌ని విభ‌జ‌న ఆగే వ‌ర‌కు కేంద్రం త‌న నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకునే వ‌ర‌కు సీమాంద్రలో ఉద్యమాలు ఆగ‌వ‌ని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయ‌కులు రాజీనామ‌లు చేసి ఉద్యమంలోకి వ‌స్తే మ‌రింత త్వర‌గా త‌మ ల‌క్ష్యం నెర‌వేరుతుంది అన్నారు. అంతేకాదు విభ‌జ‌న విష‌యంలో కేంద్ర పున‌రాలోచించ కుంటే సీమాంద్రలో కాంగ్రెస్ పార్టీ ఉండ‌ద‌ని ఇక్కడి నాయ‌కులు కొత్త పార్టీని చూసుకోక త‌ప్పద‌ని కూడా అన్నారు.

చంద్రబాబు యాత్రకి బ్రేకులే బ్రేకులు

  చంద్రబాబు క్రిందటి ఆదివారం విజయనగరం జిల్లా నుండి చేప్పట్టాలనుకొన్నఆత్మగౌరవ యాత్రను తెదేపా నేతల సూచన మేరకు వాయిదా వేసుకొన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేనెల 1న గుంటూరు జిల్లా నుండి యాత్రకు సిద్దమవుతుంటే తెదేపా నేత పయ్యావుల కేశవ్ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన యాత్ర చెప్పటడం అంత మంచిదికాదని సూచించారు.   ఏపి.ఎన్.జి.ఓ సంఘ అద్యక్షుడు అశోక్ బాబు కూడా ఆయనకు అదేవిధంగా సలహా ఇచ్చారు. రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ ఆయన ఏవిధంగా లేఖ ఇచ్చారో, అదేవిధంగా ఇప్పుడు సమైక్యాంధ్ర కోరుతూ ఒక లేఖ ఇచ్చి యాత్ర మొదలుపెడితే ఆయనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని సలహా ఇచ్చారు. విభజనకు అనుమతించిన చంద్రబాబు ఇప్పుడు ఆత్మగౌరవం గురించి మాట్లాడటం అనుచితమని అశోక్ బాబు అన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ఈ సమయంలో ఆయన యాత్ర చేప్పటడం అంత మంచిది కాదని, అందువల్ల యాత్ర విరమించుకోవడం మేలని చంద్రబాబుకి సలహా ఇచ్చారు. ఈ పరిస్థితులు అన్నితెలిసి యాత్రకు బయలుదేరదలిస్తే, అందుకు సిద్దపడే రావడం మేలని సలహా ఇచ్చారు. ఆయన ఇప్పటికీ రాష్ట్ర విభజనకే మొగ్గు చూపుతునట్లయితే, రానున్న ఎన్నికలలో ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని అశోక్ బాబు అన్నారు.   ఈవిధంగా ఒకరి తరువాత మరొకరు చంద్రబాబు యాత్రను వ్యతిరేఖిస్తుండటంతో అసలు ఆయన యాత్ర మొదలుపెడతారా లేదా అనే విషయంపై పార్టీ శ్రేణులలో కూడా సందిగ్ధం నెలకొంది.   దీనిని బట్టి గతంలో ఆయన పాదయాత్ర చేసిప్పటి పరిస్థితులకి నేటికీ చాలా తేడా వచ్చినట్లు అర్ధం అవుతోంది. అప్పుడు ఆయన తెలంగాణకు అనూకలంగా లేఖ ఇచ్చినప్పటికీ, ఈవిధంగా పార్టీలో కానీ, ప్రజల నుండి కానీ వ్యతిరేఖత కానరాలేదు. బహుశః ఆయన లేఖ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేస్తుందని ఎవరూ విశ్వసించక పోవడం వలననే అప్పుడు ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోకపోయి ఉండవచ్చును. కానీ, రాష్ట్ర విభజన అనివార్యంగా కనబడుతున్నఈ తరుణంలో  అందుకు అనుకూలంగా లేఖ ఇచ్చారనే కాంగ్రెస్, వైకాపాల ప్రచారం వలన చంద్రబాబు యాత్రకి అభ్యంతరాలు ఎదురవుతున్నాయి.      

జగన్ మోహన్ రెడ్డికి కొత్త సమస్యలు

  ఉస్మానియా ఆసుపత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంటే, అతనికి మరికొన్ని కొత్త కష్టాలుకూడా ఎదురవుతున్నాయి. తన భార్య భారతిని, తల్లి విజయమ్మను ఆసుపత్రిలో తనకు సహాయంగా ఉంచాలని కోరుతూ అతను సీబీఐ కోర్టుకి పెట్టుకొన్న విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. అతనిని కలవాలని వచ్చిన అతని భార్య భారతిని పోలీసులు లోనకి అనుమతించక పోవడంతో, ఆమె చాలా ఆందోళనకు గురయ్యారు. ఇక, జగన్ ఆరోగ్యం క్షీణిస్తోందని వస్తున్న వార్తలతో ఆసుపత్రి వద్దకు చేరిన వైకాపా కార్యకర్తలు, నేతలు కూడా చాల ఆందోళనతో, ఆవేశంతో ఉన్నారు.   వీటికి తోడు, జగన్ మోహన్ రెడ్డి తెలంగాణాను వ్యతిరేఖిస్తూ నిరాహార దీక్ష చేస్తున్నాడనే ఆగ్రహంతో ఉన్న తెలంగాణావాదులు అతనికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స చేయడానికి తాము అంగీకరించమని, అతనిని వెంటనే వేరే ఆసుపత్రికి తరలించాలని కోరుతూ ఆసుపత్రి ముందు ధర్నాలకు సిద్దపడుతుండటంతో, ఆసుపత్రి వద్ద పరిస్థితి మరింత ఉద్రిక్తతగా మారింది.   బహుశః వైద్యులు కూడా వారి ఒత్తిళ్లకు లొంగినందునో ఏమో తమ ఆసుపత్రిలో అతనికి వైద్యం చేసేందుకు తగిన వైద్య పరికరాలు లేని కారణంగా అతనిని నీమ్స్ ఆసుపత్రికి తరలించడం మేలని వైద్యులు సూచించడంతో, పోలీసులు అతనిని మరికొంత సేపటిలో నీమ్స్ తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. కానీ నీమ్స్ ఆసుపత్రి వద్ద కూడా అతనికి అదే పరిస్థితి ఎదురయితే అప్పుడు పోలీసులు ఏమి చేస్తారనేది మరో ప్రశ్న.

కలకత్తాలో బాంబ్ బ్లాస్ట్

  ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ను అరెస్ట్ చేసి 48 గంటలు కూడా గడవక ముందే దేశం ఉలిక్కి పడింది. దేశంలో ప్రదాన నగరాల్లో ఒకటైన అత్యంత రద్దీగా ఉండే కలకత్తాలో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. కలకత్తాలోని చాందినీ చౌక్ ఎదుట శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. పేలుడు విషయం తెలుసుకున్న రాష్ట్ర యంత్రాంగం వెంటనే తనిఖీలు చెపట్టింది. మరో రెండు బాంబులను కనిపెట్టి నిర్వీర్యం చేసింది. ఈ ఘటన దేశ హోం శాఖ అప్రమత్తమయ్యింది. దేశంలోని ప్రదాన నగరాలతో పాటు సున్నిత ప్రాంతాలు అత్యంత రధ్దీగా ఉండే ప్రదేశాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

హిట్ ఫార్ములా తెలిసిన రైటర్ జగన్

  ఏది ఏమైనా జగన్ ని మెచ్చుకుని తీరాలి సుమా! జనం నోళ్ళలో నానటానికి... ఏం చేయచ్చో ఆయనకి తెలిసినంత గా మన టాలీవుడ్, బాలీవుడ్ తారలకి కూడా తెలియదు. ఎక్కడ నుంచి వస్తాయో, ఎలా వస్తాయో తెలియదు కాని భలే ఐడియాలు వస్తుంటాయి జగన్ కి. What an Idea Sirji అని మెచ్చుకు తీరాలి. ఓదార్పు యాత్రలు, బస్సు యాత్రలు, పాద యాత్రలు ఇప్పటి వరకు రుచి చూసాం. జగన్ పుణ్యమా అని మరింకెన్ని యాత్రలు చూడబోతున్నామో...   ఇక వినతి పత్రాలకి, సభలకి, స్టేట్ మెంట్ లకి, రాజకీయ డ్రామాలకి, నిరాహార దీక్షలకు కొదవే లేదు. కారణాలు వెదికి మరి వాటిని ఎడా, పెడా వాడేసుకోవటంలో జగన్ దిట్ట. కాస్త జనాలు మర్చిపోతున్నారేమో అన్న అనుమానం వస్తే చాలు పక్కా స్క్రీన్ ప్లే డ్రామాతో రెడీ అయిపోతాడు.       హిట్ సినిమా ఫార్ములా జగన్ సినిమా ఫార్ములా ఒక్కటే ఈజీగా అర్దమైపోతుంటుంది. క్లైమాక్స్ ఏంటో. అయినా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెసెంట్ చేయడానికి కుటుంబమంతా కలిసి తెగ కష్టపడుతున్నారు. ఆదర్శ కుటుంబ అవార్డు ఎవన్నా వుంటే అది వైస్సార్ కుటుంబానికే దక్కుతుంది అని గట్టిగా చెప్పొచ్చు.   ఒకళ్ళు ప్రారంభిస్తే మరొకరు కొనసాగిస్తారు. మరొకరు క్లైమాక్స్ దాకా తెస్తే ఇంకొకరు ముగింపునిస్తారు. ఏది ఏమైనా ప్రతీ డ్రామాలో మీడియాని, జనాన్ని వీలైనంత వాడేసుకుని కావలిసినంత పబ్లిసిటీ తెచ్చుకుని ....వాపుని చూసి బలం అనుకుని సంబరపడుతున్నారు. ఫలితంతో పనిలేదు... ప్రయత్నించడమే ముఖ్యమనుకునే యోధుడు జగన్.

త్వరలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా, కొత్త పార్టీ

  పార్టీకి, పదవికి రాజీనామ చేసిన కాంగ్రెస్ శాసన సభ్యుడు వీరశివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకొంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గనుక రాష్ట్ర విభజనపై తన నిర్ణయాన్ని పునరాలోచించక పోయినట్లయితే త్వరలో సీమంధ్రలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుందని తెలిపారు. అంటే, కాంగ్రెస్ గనుక విభజనకే మొగ్గు చూపితే బహుశః ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెడతారని ఆయన సూచిస్తున్నట్లు భావించవచ్చును. నిన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రవీంద్ర భారతిలో చేసిన ప్రసంగం కూడా అదే సూచిస్తోంది.

సెప్టెంబర్ 2న కేంద్ర మంత్రులు రాజీనామాలు

  సీమంధ్రకు చెందిన కేంద్రమంత్రులను వెంటనే పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో చేరకపోయినట్లయితే వచ్చే ఎన్నికలలో వారందరికీ తగిన గుణపాఠం చెపుతామని నిన్నఏపీ.ఎన్జీఓలు గట్టిగా హెచ్చరించిన తరువాత, సదరు నేతలలో కంగారు మొదలయింది. ఈరోజు వారందరూ పార్లమెంటు సెంట్రల్ హాలులో సమావేశమయ్యి తమ రాజీనామాల విషయమై చర్చించారు. మళ్ళీ సెప్టెంబర్ 2న మరో మారు సమావేశమయ్యి తమ రాజీనామాలపై ప్రకటన చేయాలని నిర్ణయించుకొన్నారు. ఒకవేళ వారందరూ తమ పదవులకు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు సమర్పించి, దానిని ఆమోదింపజేసుకొనగలిగితే కేంద్ర ప్రభుత్వం పడిపోవడం ఖాయం. ఆవిధంగా జరగాలని కేంద్రం కోరుకోదు గనుక వారి రాజీనామాలను వెంటనే ఆమోదించకుండా పక్కన బెట్టి కాంగ్రెస్ అధిష్టానం వారిని శాంతింపజేసే ప్రయత్నాలు చేయవచ్చును.

తొలి సైనిక ఉపగ్రహ ప్రయోగం సక్సెస్‌

  భారతీయ తొలి సైనిక ఉపగ్రహం GSAT-7 శుక్రవారం ఉదయం విజయవంతంగా ప్రయోగించారు. యూరొపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన భారీ రాకెట్‌ ద్వారా ఈ ఉపగ్రహాన్నినిర్ణీత కక్షలో ప్రవేశ పెట్టారు. ఫసిఫిక్‌ కోస్ట్‌లోని ఫ్రెంచ్‌గయానాలోని కౌరవ్‌ అంతరిక్ష కేంద్రం నుండి ఈ ప్రయోగం జరిగింది. ఎరియన్‌ 5 రాకెట్‌ ద్వారా ప్రయోగించిన ఈ ఉపగ్రహం భూమికి 3600 కిలీమీటరల్ దూరం నుంచి తన తన పనిని చేయనుంది. ఈ ప్రయోగానికి దాదాపు 470 కోట్లు ఖర్చయినట్టుగా ప్రకటించారు. యుధ్ద నౌకల సమాచారం కమ్యూనికేషన్‌తో పాటు, రక్షణ చర్యలకు కావాల్సిన ఎన్నో వివరాలను తెలుసుకోవడానికి ఈ ఉపగ్రహం సహాయపడనుంది. ఇప్పటికే ఈ ఉపగ్రహానికి సంభందించిన అన్ని టెస్ట్‌లు నిర్వహించిన శాస్త్ర వేత్తలు శనివారం నుంచి ఉపగ్రహం తన పని మొదలుపెడుతుందన్నారు. గ్రహణ సమయంలో కూడా పని చేయటం ఈ ఉపగ్రహం ప్రత్యేకత.

జగన్ దీక్షతో వైకాపాకు మీడియా కవరేజ్

  వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గత ఐదు రోజులుగా చంచల్ గూడా జైలులో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను నిన్న రాత్రి పోలీసులు భగ్నం చేసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే, అతను ఆసుపత్రిలో కూడా తన దీక్షను కొనసాగిస్తున్నారని అతని తల్లి విజయమ్మ మీడియాకు తెలిపారు. అతని బీపీ, షుగర్ స్థాయి పడిపోవడం, కీటోన్స్ కూడా తగ్గడంతో ఇంకా దీక్ష కొనసాగించడం ప్రమాదమని చెప్పినప్పటికీ ఆయన దీక్ష విరమించేందుకు అంగీకరించట్లేదని ఆమె తెలిపారు.   అందువల్ల బలవంతంగానయినా వైద్యులు అతనికి గ్లూకోజ్ ఎక్కేంచే అవకాశముంది. జగన్ మోహన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించబోతున్నారనే వార్తలు వినగానే షరా మామూలుగానే రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా శ్రేణుల, నేతల హడావుడి మొదలయిపోయింది. నిన్నటి నుండి పార్టీ నేతలు, కార్యకర్తలు చంచల్ గూడా జైలు, ఉస్మానియా ఆసుపత్రి వద్దకు భారీ ఎత్తున చేరుకొంటున్నారు. తమ నేత దీక్ష భగ్నం చేసినందుకు తీవ్ర ఆగ్రహం ప్రకటిస్తూ పోలీసులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న తమ నేతను చూసేందుకు పోలీసులు అనుమతించనందుకు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేసారని మండిపడుతున్న సదరు నేతలు, కార్యకర్తలు మళ్ళీ అతని ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందడం విడ్డూరం. అతని ఆరోగ్యపరిస్థితి రోజురోజుకి దిగజారుతున్నందున, అతని ఆరోగ్యం మరింత దెబ్బతినకూదడనే ఆలోచనతోనే పోలీసులు అతని దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. అటువంటప్పుడు వైకాపా పోలీసులను నిందించడం అనుచితం. ఒకవేళ పోలీసులు అతనిని దీక్ష కొనసాగించనిచ్చినా రేపు అతని ఆరోగ్యం మరింత దెబ్బ తింటే, అప్పుడు కూడా వారు పోలీసులనే నిందిస్తారు.   నేడు  రాజకీయ నేతలుఏదో ఒక కారణంతో నిరాహార దీక్షలకు కూర్చోవడం, వారి దీక్షలను పోలీసులు భగ్నం చేస్తే, చేసారని నిందించడం, ఒకవేళ చేయకపోతే సదరు నేతల ఆరోగ్యం విషమిస్తున్నాకూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించడం పరిపాటయిపోయింది. దీక్షకు కూర్చొన్నప్రతీ ఒక్కరి డిమాండు ఏ ప్రభుత్వమయినా తీర్చగలదా? అనే ఆలోచన లేకుండా మీడియా కవరేజ్ కోసం, పార్టీకి ప్రజలలో గుర్తింపు తీసుకు రావడం కోసం ఈవిధంగా నిరాహార దీక్షల పేరుతో ప్రభుత్వాన్నిబ్లాక్ మెయిల్ చేయడం రాజకీయ నేతలకు పరిపాటయిపోయింది.   ఇంతకాలంగా జగన్ మోహన్ రెడ్డిని అతని పార్టీని వెలివేసిన మీడియా, అతను దీక్షకు దిగడంతో నేడు మళ్ళీ మంచి కవరేజ్ ఇస్తోంది. బహుశః జగన్ మోహన్ రెడ్డి అదే కోరుకొని దీక్షకు దిగి ఉండవచ్చును.   మొన్న విజయమ్మ నిరవధిక నిరాహార దీక్షకు దిగినప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని తెలియగానే జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి ఆమెకు ఫోన్ చేసి ఆమెను దీక్ష విరమించుకోమని కోరడం, మళ్ళీ నేడు అతని ఆరోగ్యం క్షీణిస్తోందని తెలియగానే విజయమ్మ అతనిని దీక్ష విరమించుకోమని కోరడం, అందుకు అతను నిరాకరించాడని ఆమె బయటకి వచ్చి మీడియాకు చెప్పడం అంతా నాటకీయంగా ఉంది.   అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్ మోహన్ రెడ్డిని ప్రజల దృష్టిలో పెద్ద హీరోగా నిలబెట్టేందుకే వైకాపా ఈ డ్రామా నడిపిస్తోంది. సమైక్యాంధ్ర నినాదంతో సీమంధ్రలో పట్టు సాధించాలని తిప్పలు పడుతున్న వైకాపా, ప్రజలను ఆకట్టుకొనేందుకు వరుసపెట్టి ఇటువంటి తాత్కాలిక ఉపాయాలతో కధ నడిపిస్తోంది. పార్టీ పెట్టిన నాటి నుండి నేటి వరకు కూడా ఆ పార్టీ ఇదే వ్యూహంతో ముందుకు సాగుతోంది తప్ప పార్టీని బలపరచుకొని ఎదిగే ప్రయత్నం చేయడం లేదు.

కొత్త పార్టీ ఆలోచనలో కిరణ్ ?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యల వల్ల రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి. లోకవిరుద్ధంగా వెళ్తే ప్రజలు ఇంటికి పంపిస్తారని, సరైన సమనయం వచ్చినప్పుడు ముందుకు వస్తామని కిరణ్ చెప్పడంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో రకరకాల ఊహాగానాలకు రేకెత్తుతున్నాయి. అసలు ఎందుకు ఆయన అలా మాట్లాడారు, ఏం చేయబోతున్నారు అనే ప్రశ్న అందరికి కలుగుతుంది.   గురువారం రవీంద్ర భారతిలో జరిగిన 'తెలుగు భాషా దినోత్సవం'లో సందర్భంగా ప్రసంగించిన కిరణ్ కుమార్ రెడ్డి.. ప్రసంగం చివరలో సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజనపై సరైన నిర్ణయాలు తీసుకోకుంటే ప్రజలు సెలవు ప్రకటిస్తారని.... సమయం, సందర్భం వచ్చినప్పుడు కచ్చితంగా ముందుకు వస్తామని, తెలుగు ప్రజల పురోగతికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అదే తీసుకుంటామని, ఎంత కష్టమైన నిర్ణయమైనా తీసుకునే ధైర్యం ఇవ్వాలని తెలుగు తల్లిని వేడుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ విధంగా విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని, సొంత పార్టీ పెడతారని రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

రూపాయి పాపం ప్రభుత్వానిదే

  మరో 15 రోజుల్లో పదవి విరమణ చేయనున్న రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రూపాయి పతనంతో పాటు ప్రస్థుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోబానికి ప్రభుత్వం ఆర్ధిక మంత్రి చిదంబరమే కారణం అన్నారు. దేశం ప్రగతిని తాకట్టు పెట్టినమరి తమ స్వలాభాల కోసం కేంద్రం పాకులాడుతుందని ఘూటుగా స్పందించారు. ప్రస్తుత ఆర్థిక కష్టాలకు ప్రభుత్వం అసంబద్ధ ఆర్థిక విధానాలే కారణమని విమర్శించారు.   అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రకటన వల్ల రూపాయి కుప్పకూలిందనడం సరికాదన్నారు. దేశీయంగా సరైన చర్యలు లేఖపోవటం, ప్రణాలికా బద్దంగా ఆర్ధిక శాక వ్యవహరించకపోవటం అందుకు కారణం అన్నారు.