నిర్మలా సీతారామన్ నామినేషన్ దాఖలు
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆంద్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆమె రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాజ్యసభ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి మరణంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఆ ఖాళీ నిర్మలా సీతారామన్‌లో భర్తీ అవుతుతుంది. టిడిపి, బిజెపిల మధ్య పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి నిర్మలా సీతారామన్ రాజ్యసభకుఎన్నిక కావడానికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చారు. కేంద్రమంత్రి పదవి చేపట్టిన నిర్మలా సీతారామన్ అటు లోక్ సభ, ఇటు రాజ్యసభలో సభ్యురాలు కాకపోవడంతో ఇక్కడ నుంచి ఎన్నిక అవ్వవలసిన అవసరం ఏర్పడింది. నిర్మలా సీతారామన్ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు హరిబాబు, కిషన్ రెడ్డి హాజరయ్యారు.