వెంకయ్యనాయుడు కూడా అదే రూట్లో
posted on Nov 2, 2015 @ 4:46PM
రాజకీయాల్లో రాజకీయ వారసత్వానికి ఎప్పటినుండో పునాది పడిందన్న సంగతి తెలిసిందే. ప్రతి రాజకీయ నాయకుడు తమ వారసత్వానికి పగ్గాలు కట్టబెట్టడం పారిపాటి అయిపోయింది. ప్రజలకు కూడా ఈ సంప్రదాయానికి బాగానే అలవాటు పడిపోయారు. అయితే ఇప్పుడు ఆ జాబితాలో వెంకయ్యనాయుడు కూడా చేరిపోయారు. వెంకయ్యనాయుడు కూడా తన కూతురు దీపా వెంకట్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్పుడే ఢిల్లీలో ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే దీపా వెంకట్ స్వర్ణభారతి ట్రస్టు ద్వారా సేవా కార్యాక్రమాలను నిర్వహిస్తున్నారు.. అయితే ఇప్పటి వరకూ నెల్లూరికే పరిమితమైన దీనికి ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ప్రారంభించాలని చూడడం.. దీనికి సంబంధించి శంషాబాద్ సమీపంలో ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అంతేకాదు ఢిల్లీలో జరిగిన వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలకు సంబంధించిన ఏర్పట్లను ఆమెనే స్వయంగా చూడటం.. అన్నీ తానై వ్యవహరించడం చూసి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక నియోజక వర్గం నుండి ఆమె బరిలోకి దిగుతుందని అనుకుంటున్నారు.