ఏబీవీ కొత్త పార్టీ?!

దేశంలో ఇప్పటికే స‌వాల‌క్ష పార్టీలు ఉన్నాయి. వీటిలో యాక్టివ్ గా ఉన్న‌వి కొన్నే. వాటిలో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల‌తో పాటు ఆమ్ ఆద్మీపార్టీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, తృణ‌మూల్, ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు వీటికి అద‌నం. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే తెలుగుదేశం, వైసీపీ,  జ‌న‌సేన‌,  డీఎంకే, అన్నాడీఎంకే, బీఆర్ఎస్ వంటి పార్టీలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలనూ కలిపితే దాదాపు ఓ పాతిక పార్టీలు యాక్టివ్ గా ఉన్నాయని చెప్పవచ్చు.  అలాంటి యాక్టీవ్ పార్టీల‌న్నిటినీ  ప‌క్క‌న పెడితే..   దేశంలో ఉన్న పార్టీల సంఖ్య సుమారు రెండున్న‌వేల వ‌ర‌కూ ఉంటాయి. రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న  తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ  కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.   ఆ పార్టీ పేరు ఇంకా  ఖరారు కాలేదు కానీ, పార్టీ ఏర్పాటైతే పక్కా అంటున్నారు. ఇంతకీ ఆ పార్టీని ఏర్పాటు చేస్తున్నది ఎవరయ్యా అని చూస్తే.. ఆయన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు. ఈయ‌న జ‌గ‌న్ జ‌మానాలో ఎన్నేసి అష్ట‌క‌ష్టాలు ప‌డ్డారో  తెలిసిందే. ఇటీవ‌ల ప్ర‌వీణ్ ప్ర‌కాష్ చెప్పిన అపాల‌జీ వీడియోనే ప్ర‌త్య‌క్ష  సాక్షి. అదలా ఉంచితే..  ఏబీవీకి ఇంకా ప్ర‌భుత్వ ప‌రంగా రావ‌ల్సిన బ‌కాయిలు ఇప్పటికీ  రాలేదు. వాస్తవానికి ఏబీవీ   జ‌గ‌న్ పై పోరాడిన విధానికి కూట‌మి ప్ర‌భుత్వాధినేత చంద్ర‌బాబు నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించాల్సి ఉంది. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నుంచి ఏబీవీకి ఎటువంటి మద్దతూ లభించలేదు.  అప్ర‌ధాన్య‌మైన పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని అప్పగించి మమ అనేశారు. అయితే ఆయనా పోస్టు తీసుకోలేదనుకోండి అది వేరే సంగతి. అయితే   ఏబీవీ ప్ర‌స్తుతం చంద్ర‌బాబు మీద ఆయ‌న ప్ర‌భుత్వ విధానాల‌పైనా విమర్శలు గుప్పిస్తున్నారు.   అంతే కాదు వైసీపీ వారికి య‌ధేచ్చ‌గా దోచి పెడుతున్నార‌న్న సంచ‌ల‌న కామెంట్లు కూడా చేశారు. ఆమాట‌కొస్తే మొన్న‌టికి మొన్న కందుకూరు క‌మ్మ  కాపు ఘ‌ట‌న‌లో ప్ర‌భుత్వం  ఇచ్చిన న‌ష్ట‌ప‌రిహారంపై కూడా రియాక్టయ్యారు ఏబీవీ. ఇలా తెలుగుదేశం కూటమి ప్ర‌భుత్వ నిర్ణయాలను ఖండిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఏబీ వెంకటేశ్వరరావు.   ఇలా ఖండనలు, ప్రకటనలతో కాదని తానే స్వయంగా ఒక కొత్త  పార్టీ  పెట్టి  సత్తా చాటాలన్న నిర్ణయానికి ఏబీవీ వచ్చినట్లు కనిపిస్తోంది.   దేశంలోనే అత్యంత అవినీతి ప‌రుడిగా  వేల కోట్ల‌ను సంపాదించిన పేరు సాధించిన  జ‌గ‌నే పార్టీ న‌డ‌ప‌డానికి  డ‌బ్బుల్లేవు కాబ‌ట్టి తాను  కార్యాల‌యాన్ని తీసేశాన‌ని బాహ‌టంగా చెప్పుకున్నారు. అలాంటిది ఏబీవీ లాంటి ఒక రిటైర్డ్ ప్ర‌భుత్వోద్యోగి వ‌ల్ల సాధ్య‌మ‌వుతుందా? అని సందేహాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. అయితే  జ‌య ప్ర‌కాశ్ నారాయ‌ణ‌ లోక్ స‌త్తా  అరవింద్ కేజ్రీవాల్  ఆమ్ ఆద్మీ పార్టీ,  సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ కూడా సేమ్ టు సేమ్  ఈయ‌న‌లాగానే ఐఏఎస్ ఐపీఎస్ కేడ‌ర్ కి సంబంధించిన వారే. వారిలో అర‌వింద్ కేజ్రీవాల్ పార్టీ క్లిక్ అయిన‌ట్టు మిగిలిన వారు పెట్టిన పార్టీలు రాణించ‌లేదు.  ఆ  కోవ‌లోకి వ‌చ్చే ఏబీవీ అంత‌గా మాస్ జ‌నాల్లోకి దూసుకెళ్ల‌గ‌ల‌రా? అన్న‌దే ఇక్క‌డ ప్ర‌శ్నార్ధ‌కంగా  మారింది.  ఇక పార్టీ పేరు ఏమిటని చూస్తూ.. ఈయన ఏపీకి పరిమితమై రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు కనుక ఆంధ్ర శ‌బ్ధం వ‌చ్చేలా ఆయన పార్టీ పేరు ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా ఏబీవీ పెట్టబోయే పార్టీ ఏమిటి? ఎప్పుడు ఆరంభం కానుంది? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.  

తమిళనాడులో రోడ్డు ప్రమాదం… ఐదుగురు ఏపీ వాసులు మృతి

తమిళనాడులో శనివారం (డిసెంబర్ 6) తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  మృతులు, క్షతగాత్రులూ కూడా ఏపీ వాసులే.  శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు తిరుచిరా పల్లి–సేలం జాతీయ రహదారిప్రమాదానికి గురైంది. ఈ ఏడుగురు యువకులూ ప్రయాణిస్తున్న కారును ఆపి రోడ్డు పక్కన విశ్రాంతి తీసుకుంటుండగా, లారీ అతి వేగంగా వచ్చి ఢీ కొంది.  ఈ సంఘటనలో కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. సంఘటనా స్థలంలోనే ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మిగిలిన ఇద్దరూ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను విజయనగరం జిల్లా కొరప కొత్తవలస, మరుపల్లి గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు.  మృతులలో కొరప కొత్తవలస వాసులు వంగర రామకృష్ణ), మార్పిన అప్పల నాయుడు, మరాడ రాము, గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన బండారు చంద్రరావు ఉన్నారు. 

ఐదు వేల మంది పోలీసులతో ఆపరేషన్ కవచ్

నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసే దిశగా హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్‌ కవచ్‌  పేరిట భారీ నాకాబందీ  నిర్వహించారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ నేతృత్వంలో శుక్రవారం (డిసెంబర్ 5) రాత్రి ఈ ఆపరేషన్ జరిగింది. ఏకకాలంలో ఐదువేల మంది పోలీసులతో ఈ ఆపరేషన్‌ చేపట్టారు. ఇంత మంది పోలీసు సిబ్బందితో నాకాబందీ చేపట్టడం కమిషనరేట్‌ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఏకకాలంలో నగరంలోని 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌, టాస్క్‌ ఫోర్స్‌ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్‌ రిజర్వ్ , బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు  పాల్గొన్నాయి.   ఆపరేషన్‌ కవచ్ నేపథ్యంలో సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్‌ సజ్జనార్  ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ తనిఖీలకు నగర పౌరులందరూ పూర్తి సహకారం అందించాలని కోరుతూ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్‌ 100కు సమాచారం అందించాలని కోరారు. ఆపరేషన్  కవచ్ అనంతరం కూడా  మీ భద్రత – మా బాధ్యత అంటూ సజ్జనార్ మరో పోస్టు చేశారు. 

పరకామణి చోరీపై జగన్ కామెంట్స్...ముప్పేట దాడి షురూ

  పరకామణి చోరీపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.  తిరుమల పరకామణి చోరీని..చిన్న చోరీ అనడం చర్చనీయాంశమయ్యాయి. జగన్ వ్యాఖ్యలు దొంగలను సమర్థిస్తున్నాయంటూ కూటమి పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. తిరుమల పరకామణి చోరీ కేసుపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకుతిరుమల పరకామణి చోరీ కేసుపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.  తిరుమల పరకామణి చోరీని చిన్న చోరీ అన్న జగన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయట. పరమ పవిత్రమైన శ్రీవారి ఆలయంలో దొంగతనం జరిగిందని చెబుతూనే...దేశంలో చాలా ఆలయాల్లో దొంగతనాలు జరుగుతుంటాయని...అలానే తిరుమలలో జరిగిందనే విధంగా జగన్‌ మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కలియుగ దైవంగా కొలిచే తిరుమల శ్రీవారి పరకామణిలో జరిగిన చోరీని.... చిన్న చోరీగా జగన్ అభివర్ణించడం రాజకీయ నేతలు, శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.    పరకామణి చోరీ కేసు రాజీపై కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. వైసీపీ హయాంలో చోరీ జరగగా...నిందితుడితో టీటీడీ పెద్దలు రాజీ చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆ వివాదం సర్దుమణిగింది. కానీ  కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పరకామణి కేసు రాజీ చేసుకోవడాన్ని తప్పుబడుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.  రాజీ కుదర్చుకోవడం చట్ట బద్దం కాదని, నిబంధలకు విరుద్ధంగా నడుచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.  ఈ విషయంపై హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చోరీ కేసును రాజీ చేసుకోవడం తప్పంటూ వ్యాఖ్యానించడమే కాకుండా, సీఐడీ విచారణకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది.  ఓవైపు సీఐడీ విచారణ జరుగుతున్న క్రమం...మరోవైపు హైకోర్టులో విచారణ దశలో ఉన్న కేసుపై జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదో చిన్న కేసు అంటూ కేవలం  9 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తుండగా... తమ హయాంలోనే పట్టుకున్నామని...చోరీని తేలిగ్గా చూపే ప్రయత్నం చేయడంపై భక్తులు,సోషల్ మీడియాలో దుమెత్తిపోస్తున్నారు.  అంతేకాకుండా 72 వేల రూపాయల విలువైన డబ్బు చోరీ జరిగితే...దొంగ ప్రాయశ్చిత్తంగా 14 కోట్లు విలువైన ఆస్తులను స్వామి వారికి రాసిచ్చారని జగన్ చెప్పడాన్ని భక్తులు తప్పుబడుతున్నారట.  72 వేలు విలువైన డాలర్లను దొంగతనం చేసిన వాడు 14 కోట్ల ఆస్తులను తిరిగి ఇచ్చాడంటే అతడికి అంత ఆస్తి ఎక్కడ నుంచి వచ్చిందనే విషయంపై విచారణ జరపాలి కదా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయట.  చోరీని తక్కువ చేసి చూపడం దొంగలను సమర్థించడమే అవుతుందని భక్తులు మండిపడుతున్నారట. పరమ పవిత్రంగా భావించి శ్రీవారికి సమర్పించుకున్న మొక్కులు, కానుకలు చోరీకి గురైతే చిన్న చోరీ అంటూ దొంగలకు వత్తాసు పలుకుతూ మరో మహా పాపానికి ఒడిగడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయట.వాయిస్-జగన్ చేసిన కామెంట్స్‌పై రాజకీయంగానూ విమర్శల వేడి పెరిగింది.  దేవదేవుని పరకామణిలో దొంగతనం చేస్తే అదేదో చిన్న దొంగతనమే కదా అని వ్యంగ్యంగా మాట్లాడం చూస్తుంటే బాధకలుగుతుందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దేవుడి దగ్గర దొంగతనం చేస్తే చిన్న దోంగ తనం అంటూ మాట్లాడిన జగన్‌ సంగతి దేవుడే చూసుకుంటాడని లోకేష్ అన్నారు. పరకామణి చోరీని చిన్న తప్పు అనడంపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.  కలియువ వెంకటేశ్వరుడి ఆలయంలో చోరీ చేయడమే మహాపాపం అని అన్నారు. వెంకన్న ఖజానాలో చోరి జరిగితే చిన్న చోరీ అంటావా...బుద్దుందా జగన్ అంటూ బీజేపీ నేతలు ఘాటుగానే విమర్శించారు. 72వేల చోరీ చేసిన వ్యక్తికి 14 కోట్లు ఎలా వచ్చాయో తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. కూటమి నేతలు జగన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తుంటే...వైసీపీ నేతలు మాత్రం సమర్ధించే విధంగా మాట్లాడుతుండటం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుంది. దొంగ ఇచ్చిన 14 కోట్ల రూపాయలను టీటీడీ మాజీ ఛైరెమన్ భూమన కరుణాకర్‌ రెడ్డి దానంగా చెప్పుకురావడం మరింత సంచలనంగా మారింది.  టీడీడీకి ఎవరు దానం ఇచ్చినా...దానంగానే పరిగణిస్తారని చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది.  దొంగ ఇచ్చారా...మరొకరిచ్చారా అనేది కాదని...ఎవరిచ్చినా తీసుకునే పరిస్ధితి టీటీడీలో ఉందంటూ భూమన కరుణా రెడ్డి మరో వివాదానికి తెరలేపారు జగన్‌ వ్యాఖ్యలతో మరోసారి రాజకీయానికి కేంద్రబిందువుగా తిరుమల పరకామణి ఇష్యూ మారింది. జగన్‌ వ్యాఖ్యలు దొంగను సమర్థించే విధంగా ఉన్నాయంటూ కూటమి పార్టీలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే...వైసీపీ నేతలు మాత్రం..జగన్‌ను వెనకేసుకొస్తుండటం..అగ్నికి ఆజ్యం పోసినట్లవుతోందట.  

అమెరికాలో అగ్నిప్రమాదం .. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

  అమెరికా అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్ నగరంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన  అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందడంతో ఆయా ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బర్మింగ్‌హామ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ కంప్లెక్స్‌లో అలబామా యూనివర్శిటీలో చదువుకుంటున్న సుమారు 10 తెలుగు విద్యార్థులు నివాసముం టున్నారు.  ఈరోజు ఉదయం బర్మింగ్‌ హామ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ కంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు మొదలైన కొద్ది క్షణాల్లోనే దట్టమైన పొగలు ఆ అపార్ట్మెంట్ మొత్తాన్ని కమ్మేశాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ త్వరగా వ్యాపిస్తూ ఉండడంతో కాసేపటికే అపార్ట్‌మెంట్‌ను దట్టమైన పొగతో కమ్మేయడంతో అందులో నివాసం ఉంటున్న విద్యార్థులు శ్వాస తీసుకో లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు భయంతో గట్టి గట్టిగా అరుస్తూ బయట పడేందుకు ప్రయత్నించారు.  కానీ అప్పటికే అపార్ట్మెంట్ చుట్టూ దట్టమైన పొగ వ్యాపించ డంతో వారు లోపలే చిక్కుకుపోయారు. సమా చారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘ టనా స్థలానికి చేరుకుని లోపల చిక్కుకొని పోయిన వారందరినీ బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేపట్టింది. మొత్తం 13 మంది విద్యార్థులను రెస్క్యూ చేసి బయటకు తీసుకువచ్చిన అనంతరం ఫైర్ సిబ్బంది వారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. అందులో తీవ్ర గాయాలైన ఇద్దరు విద్యార్థులు హాస్పి టల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.  మృతుల్లో ఒకరు హైదరాబాద్‌కు చెందిన ఉడుముల సహజ రెడ్డి, మరో విద్యార్థి కూకట్‌పల్లి ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరూ అల బామా యూనివర్శిటీలో ఉన్నత విద్య అభ్యసిస్తు న్నారు.ఈ ఘటనతో అమెరికాలో ఉన్న తెలుగు  విద్యార్థుల వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్‌పై డీజీపీ శివధర్ రెడ్డి సమీక్ష

  రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌ కోసం చేపట్టిన భద్రతా ఏర్పాట్లను తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈరోజు శుక్రవారం ఆయన అడిషనల్ డీజీపీలు మహేష్ భగవత్, డీఎస్‌ ఛౌహాన్, ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్, టీజీఐఐసీ ఎండీ శశాంక్, ఐజీ రమేష్ రెడ్డిలతో కలిసి బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి దాదాపు 3,000 మంది ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. డెలిగేట్లకు డిసెంబర్ 8, 9 తేదీల్లో మాత్రమే ప్రవేశం ఉండగా, తర్వాత నాలుగు రోజులు సాధారణ ప్రజలకు ప్రాంగణం అనుమతించబడుతుందని ఆయన వెల్లడించారు. భద్రతా చర్యల భాగంగా సమ్మిట్ ప్రాంగణంలో మూడు అంచెల భద్రతను అమలు చేయనున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. ప్రాంతం అంతటా నిఘా కోసం వెయ్యికిపైగా సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేస్తుండగా, ఇవన్నీ సెంట్రల్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానమవుతాయని తెలిపారు. రేపు సాయంత్రం లోపు అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు. బందోబస్తు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం అనుమతించబోమని, అన్ని విభాగాల అధికారులు సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలని డీజీపీ సూచించారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ సమ్మిట్‌కు తగినట్టుగా భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు. అదనంగా, సమ్మిట్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు, బేరక్స్, మెస్, కిచెన్, మరుగుదొడ్ల ఏర్పాటు వంటి అంశాలపై అధికారులు సమీక్షించారు.  ట్రాఫిక్ నియంత్రణ కోసం సుమారు వెయ్యి మంది ట్రాఫిక్ పోలీసులను నియమించనుండగా, రహదారి మళ్లింపులు, బారికేడ్లు, పార్కింగ్ నిర్వహణ కోసం ట్రాఫిక్ మార్షల్స్ పనిచేయనున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు సాధారణ ప్రజలకు కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు అమల్లోకి రానున్నాయి.గ్లోబల్ సమ్మిట్‌ నేపథ్యంలో ఎటువంటి అంతరాయం లేకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు అందుబాటులో ఉంటుందని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు...  

మహిళల్లో పెరుగుతున్న సంతానలేమి సమస్యలు

  రోజులు మారుతున్నాయ్. జనం లైఫ్ స్టైల్ కూడా మారుతోంది. అందుకు తగ్గట్లుగానే.. సమస్యలు కూడా వస్తున్నాయ్. మోడ్రన్ లైఫ్ స్టైల్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, పబ్బులు, క్లబ్బుల్లో హ్యాంగ్ అవుట్‌లు, లేట్ నైట్ పార్టీలు, స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్ అడిక్షన్‌ల లాంటివి.. యువతరం భవిష్యత్తుని దెబ్బకొడుతున్నాయ్. దాంతో.. సరైన సమయంలో, సంతానం విషయంలో.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. చెడు వ్యసనాల కారణంగా.. అమ్మాయిలకు అమ్మతనం దూరమవుతోంది. ఇప్పుడు కంట్రోల్‌లో లేకపోతే.. ఫ్యూచర్‌లో ఇన్‌ఫెర్టిలిటీ సమస్యతో బాధపడాల్సి వస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.  అనవసరపు అలవాట్లే.. ఆడవాళ్లలో ఇన్‍‌ఫెర్టిలిటీ ఇష్యూస్ పెరగడానికి కారణమవుతున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయ్. అమ్మ అవ్వాలనే ఆశ ఉంటే.. లైఫ్ స్టైల్ మార్పులు తప్పనిసరి అని చెబుతున్నారు గైనకాలజిస్ట్‌లు. అబ్బాయిలు సిగరెట్ తాగడం, మందుకొట్టడం.. ఈ జనరేషన్‌లో కామనైపోయింది. సిగరెట్, మద్యం అలవాటున్న అమ్మాయిలు కూడా కొన్నేళ్ల కిందటి వరకు అక్కడక్కడా అరుదుగా కనిపించేవారు. కానీ.. ఇప్పుడు అమ్మాయిల్లోనూ.. ఈ అలవాట్లు కామనైపోయాయ్.  సాధారణంగా.. సౌత్ ఇండియా సిటీస్‌లో.. నార్త్ నుంచి వచ్చి కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే మహిళలు ఎక్కువగా స్మోక్ చేసేవారు. అది కూడా ఎవరూ చూడని, లేని ప్రదేశాల్లోనే సిగరెట్లు తాగేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్. రోడ్డు పక్కన ఛాయ్, పాన్ షాప్‌ల దగ్గర అబ్బాయిలతో కలిసి.. వారితో పోటీగా దమ్ముకొడుతున్నారు. ఎవరేమనుకున్నా.. తమకు అవసరం లేదనే రీతిలో అమ్మాయిల ఆలోచనవిధానంలో మార్పులొచ్చాయ్. ఫ్రెండ్స్ బలవంతం మీదే అలవాటు చేసుకున్నామని చెప్పేవాళ్లు కొందరైతే.. స్టైల్‌గా ఉంటుందని స్మోక్ చేసే వాళ్లు ఇంకొందరు.  డిప్రెషన్ నుంచి బయటపడేందుకే.. పొగ తాగడం అలవాటు చేసుకున్నామని మరికొందరు చెబుతున్నారు. అయితే.. అలవాటు ఏదైనా.. ఓ లిమిట్ దాటనంత వరకే బాగుంటుంది. మితిమీరితే.. ఆరోగ్య సమస్యల ముప్పు తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు డాక్టర్లు హైదరాబాద్ లాంటి మెట్రో సిటీకి.. తెలంగాణ నలుమూలల నుంచే కాదు.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఉద్యోగాల కోసం అనేకమంది అమ్మాయిలు వస్తుంటారు. పీజీల్లో, హాస్టళ్లలో ఉంటూ ఉద్యోగాలు చేస్తుంటారు. అలా.. చాలామంది కార్పొరేట్ కల్చర్‌కి అట్రాక్ట్ అవుతున్నారు. సాఫ్ట్ ‌వేర్ కంపెనీల్లో జాబ్ చేస్తూ.. సోషల్‌గా ఇతరులతో మింగిల్ అయ్యేందుకు చెడు అని నిపుణులు సూచిస్తున్నారు.  

టెస్టుల్లోకి కోహ్లీ రీఎంట్రీ ఇస్తాడా?

  టెస్టు ఫార్మాట్‌ నుంచి విరాట్‌ కోహ్లీ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌  కోరే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని ‘క్రిక్‌బజ్‌’ పేర్కొంది. టెస్టు ఫార్మాట్‌లో జట్టును బ్యాలెన్స్‌ చేయడానికి చేపట్టిన యత్నాల్లో భాగంగా విరాట్‌ సహా ఇటీవల రిటైర్మెంట్‌ తీసుకొన్న ఆటగాళ్లు తమ నిర్ణయాల్ని పునః పరిశీలించాలని కోరే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. బీసీసీఐ కోరితే..  తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఓ ఆటగాడు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.  ఇటీవల దక్షిణాఫ్రికా చేతిలో 2-0తో భారత్‌ వైట్‌ వాష్‌ కావడంతో జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో కోచ్‌ గంభీర్‌ నేతృత్వంలో జట్టులో మార్పులు సజావుగా జరగడంలేదని.. మితిమీరిన ప్రయోగాలు చేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కోహ్లీ, రోహిత్‌, అశ్విన్‌ రిటైర్మెంట్‌ తర్వాత జట్టు పూర్తిగా లయ తప్పినట్లు అర్థమవుతోంది. ఇక దీనికి తోడు టెస్టు స్పెషలిస్టులైన పుజారా విశ్రాంతి ప్రకటించగా.. రహానే కూడా జట్టుకు దూరంగానే ఉంటున్న విషయం తెలిసిందే.  

మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది... అధైర్య పడొద్దు : కేసీఆర్

  బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లలు కేసీఆర్‌ను  ఫాం హౌస్‌ కలిశారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ అన్ని కాలాలు మనకు అనుకులంగా ఉండవు కొన్ని కష్టాలు వస్తాయి. వాటికి కుంగి పోవద్దని తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయిని అప్పటి వరకు ప్రజలు అధైర్యపడొద్దని వచ్చేది మన బీఆర్‌ఎస్ ప్రభుత్వమని తెలిపారు.  కాంగ్రెస్ పాలనలో ఎవరో ఏదో చేస్తారని ఆగం కావొద్దని సూచించారు. గ్రామస్థుల మద్దతుతో ఎన్నికైన సర్పంచులను శాలువాలతో సత్కరించి వారికి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన గ్రామస్థులను గుర్తుపట్టి పేరు పేరునా పలకరించి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ పాలనలో గొప్పగా వర్ధిల్లిన గ్రామాల పరిస్థితిని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రకాలుగా దిగజారిన పరిస్థితిని, గ్రామస్తులు కేసీఆర్ దృష్టికి తెచ్చి ఆవేదన వ్యక్తం చేశారు

పుతిన్‌కు రాష్ట్రపతి విందు...రాహుల్, ఖర్గేలకు అందని ఆహ్వానం

  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘన స్వాగతం పలికారు. పుతిన్ గౌరవార్థం అక్కడ విందు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు మాత్రం ఈ విందుకు ఆహ్వానం అందలేదు. అయితే ఇందుకు భిన్నంగా ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్‌కు మాత్రం ఆహ్వానం లభించింది.  కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం లేకపోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.  దీనిపై శశిథరూర్ స్పందిస్తూ, తనకు అందిన ఆహ్వానాన్ని గౌరవిస్తానని, ఏ ప్రాతిపదికపై విపక్ష నేతను ఆహ్వానించలేదో తనకు తెలియదని అన్నారు. శశిథరూర్‌కు దౌత్య వవహరాల్లో అనుభవం ఉన్నందున ఆయనను ఆహ్వానితుల జాబితాలో చేర్చి ఉండొచ్చని చెబుతున్నారు. అయితే శశిథరూర్ గతంలో ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించడం, రష్యా అధికారులతో అనుబంధం కారణంగా ఆయనను విందుకు ఆహ్వానించి ఉండొచ్చని తెలుస్తోంది.  విదేశీ అధినేతలు ఇండియాకు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతలతో సమావేశమయ్యే ఎన్డీయే ప్రభుత్వం పక్కన పెడుతోందని రాహుల్ గాంధీ నిన్ననే విమర్శలు చేశారు. గతంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో కూడా విపక్ష నేతలను కలిసే సంప్రదాయం ఉండేదని రాహుల్ గుర్తు చేశారు. ఈ ఆరోపణలు చేసిన మరుసటి రోజే ఖర్గే, రాహుల్ గాంధీలకు ఆహ్వానం అందలేదు.

ఏసీబీకి చిక్కిన హన్మకొండ అడిషనల్ కలెక్టర్

  హన్మకొండ కలెక్టరేట్లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి.  అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ ప్రైవేటు స్కూల్ రెన్యూవల్ కోసం రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు.   హనుమకొండ జిల్లా ఇన్‌ఛార్జి డీఈవోగానూ వెంకట్‌రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. పాఠశాల అనుమతులకు సంబంధించి రూ.1,00,000 డిమాండ్ చేయగా విద్యాశాఖ సెక్షన్ అసిస్టెంట్లు గౌస్, మనోజ్ రూ.60,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.  ఏసీబీ వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.  

హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

  గత పదేళ్ల పరిపాలనలో బీఆర్‌ఎస్ నాయకులు తమ ఆస్తులు పెంచుకున్నారు తప్ప నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి  వరంగల్‌ జిల్లా నర్సంపేటలో  పర్యటించారు. రూ.532 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎప్పుడు వచ్చినా.. కాకతీయులు, సమ్మక్క- సారక్క, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి కనిపిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.   వరి వేసుకుంటే ఉరి అని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించిన పరిస్థితి.. కానీ ఈనాడు సన్న వడ్లు పండిస్తే గిట్టుబాటు ధరతో పాటు రూ. 500 బోనస్ అందిస్తున్నామని సీఎం తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని రేవంత్ స్ఫష్టం చేశారు. తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతు భరోసా అందించామని.. 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ. 20 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వామని ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణమని తెలిపారు.  2004 నుంచి 2014 వరకు వైఎస్ హయాంలో పదేళ్లలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాదని రూ. 22,500 కోట్లతో ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని తెలిపారు. నర్సంపేటకు మరో 3500 ఇండ్లు మంజూరు చేసే బాధ్యత మంత్రి పొంగులేటికి అప్పగిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 1.10 కోట్ల రేషన్‌ కార్డుల ద్వారా.. 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తున్నామని. రేషన్‌ కార్డుల్లో కొత్తవారికి చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించామని తెలిపారు.హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. మార్చి 31 లోగా వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభిస్తామని, ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ డ్రైనేజీ వ్యవస్థను కూడా నిర్మిస్తామని ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికల్లో డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వ వద్దు. పనితనం ఉన్న వాడు నాయకుడు కావాలి తప్ప… పైసలతో పదవులు కొనుక్కునే పరిస్థితి రావద్దు. అది  గ్రామాల భవిష్యత్ కు మంచిది కాదని సీఎం తెలిపారు. రెండేళ్ల ప్రజా పాలనకు కొనసాగింపుగా గ్రామాల్లో ప్రజా పాలన తెచ్చుకోవాల్సిన తరుణం వచ్చింది. మంచి వ్యక్తులను, సమర్థులను, గ్రామ సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి ఉన్నవాళ్లను సర్పంచ్ లుగా ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధి గురించి జిమ్మేదార్ తీసుకుని మంత్రులను కలిసి, సమస్యలను వివరించి, ఒప్పించి, మెప్పించి, పరిష్కరించే ఓపిక ఉన్న నాయకుడు గ్రామ సర్పంచ్ గా ఉండాలని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ప్రలోభాలకు, లొంగకుండా ప్రజలు తీర్పు ఇవ్వాలని రేవంత్ తెలిపారు.    

పుతిన్, జిన్ పింగ్, మోడీ...వీరి మ‌ధ్య పోలికేంటి!?

  ప్ర‌పంచంలోనే ప్ర‌స్తుతం సుదీర్ఘ  కాలంగా  ఒక దేశాన్ని ఏలుతున్న ప‌వ‌ర్ఫుల్ లీడ‌ర్స్ లో పుతిన్ అగ్ర స్థానంలో నిలుస్తారు. ఆయ‌న గ‌త పాతికేళ్లుగా ర‌ష్యాను అధ్యక్ష హోదాలో ప‌రిపాలిస్తున్నారు.1999 చివరలో తాత్కాలిక అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన పుతిన్, 2000 నుండి 2008 వరకు, 2012 నుంచి ఇప్పటి వరకు ఆయ‌నే ఆ దేశాధ్య‌క్షుడిగా కొనసాగుతున్నారు, 2020 రాజ్యాంగ సవరణలతో 2036 వరకు పదవిలో ఉండేందుకు వీలు కల్పించారు. దీంతో సుమారు 36, 37 ఏళ్ల పాటు పుతిన్ ర‌ష్యాను పాలించిన రికార్డు క్రియేట్ చేయ‌నున్నారు. ఇక అత్య‌ధిక కాలం అతి పెద్ద దేశాన్ని పాలించిన వారెవ‌ర‌ని  చూస్తే వారిలో జిన్ పింగ్ త‌ర్వాతి స్థానంలో నిలుస్తారు. జిన్‌పింగ్ 2012 నుండి చైనాకు అధ్య‌క్షుడిగా ప‌ని చేస్తున్నారు, 2013లో ఆయ‌న‌ అధ్యక్షుడయ్యారు. 2018లో రాజ్యాంగ సవరణల ద్వారా అధ్యక్ష పదవీకాల పరిమితిని తొలగించారు, దీంతో ఆయన జీవితకాలం పాటు పాలించే అవకాశం ఉంది, ఆయన ప్ర‌స్తుతం పదవిలో కొనసాగుతున్నారు. ఇటీవ‌ల జిన్ పింగ్ కొంత కాలం క‌నిపించ‌క పోయే స‌రికి ఆ  త‌ర్వాతి  అధ్య‌క్షుడెవ‌ర‌న్న చ‌ర్చ న‌డిచింది. ఇక మోడీ సంగ‌తి చూస్తే  వీరిక‌న్నా కాస్త  లేటుగా భార‌త‌దేశ ప్ర‌ధాని బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌గా.. ప్ర‌స్తుతం మూడో మారు ప్ర‌ధాన‌మంత్రిగా  ఎన్నికై.. నాన్ స్టాప్ గా భార‌త‌దేశాన్ని ఏలుతున్నారు.  పుతిన్, జిన్ పింగ్, మోడీకి ద‌గ్గ‌ర పోలిక ఏంటంటే అప్ర‌తిహ‌తంగా ఎక్క‌డా త‌మ పాల‌నాకాలాన్ని   బ్రేక్ చేసుకోకుండా ప‌ని చేస్తూ రావ‌డం. అయితే పుతిన్, జిన్ పింగ్ కి ఉన్న వెస‌లుబాటు మోడీకి  లేక పోవ‌డం మైన‌స్. ఇక్క‌డ సుదీర్ఘ అధ్య‌క్ష పాల‌న అంటూ ఉండ‌దు. అప్ప‌టికే మోడీ  ప్రాతినిథ్యం వ‌హించే బీజేపీకి.. 75 ఏళ్ల వ‌యో ప‌రిమితి కూడా  ఉంది. అయితే మోడీ విష‌యంలో ఈ నిబంధ‌న‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది సంఘ్ ప‌రివార్.  భార‌త్ కి మ‌ల్లే ర‌ష్యా చైనాల్లో ఎన్నిక‌ల  వ్య‌వ‌స్థ‌లున్నా.. అవి అధ్య‌క్ష  పీఠాన్ని క‌దిల్చే ప‌రిస్థితి ఉండ‌దు. ఒక్క‌సారి రాజ్యాంగ  ప‌ర‌మైన  మార్పు చేస్తే ఇక ఆయా అధ్య‌క్షులు లైఫ్ లాంగ్ ఉండ‌గ‌ల‌రు. అదే భార‌త్ అమెరికాల‌లో అలాక్కాదు.. ఇక్క‌డ ప్ర‌తి నాలుగైదేళ్ల‌కు ఎన్నిక‌లుంటాయి. దీంతో ఈ రెండు దేశాల్లో గెలుపోట‌ములు ప్ర‌భావితం చేస్తుంటాయి వీరి వీరి పాల‌నా కాలాల‌ను.  ట్రంప్ కి కూడా నాన్ స్టాప్ గా అమెరికా అధ్య‌క్షుడిగా ఉండాల‌న్న కోరిక ఉంటుంది కానీ, అక్క‌డి రాజ్యాంగం అందుకు అనుమ‌తించ‌దు. ఇక మోడీ ఇక్క‌డ కూడా స‌రిగ్గా జ‌మిలీ ఎన్నిక‌లు, అధ్య‌క్ష పాల‌న వంటివి తీసుకురావాల‌ని చూస్తున్నారు.  కానీ భిన్న‌త్వంలో ఏక‌త్వంతో కూడుకున్న భార‌త దేశంలో అలాంటి మార్పుల‌కు అవ‌కాశ‌ముందా? అంటే చాలా చాలా  క‌ష్ట‌త‌రంగా చెప్పాల్సి ఉంటుంది. అప్ప‌టికీ మోడీ మూడోమారు కూడా  ప్ర‌ధానికావడం  ప‌ట్ల ప్ర‌తిప‌క్ష పార్టీలో ఈసీని  మేనేజ్ చేస్తున్నార‌న్న కామెంట్లు చేస్తుంటారు.  ఇక ఫైన‌ల్ గా ఒక మాట ఏంటంటే సుదీర్ఘంగా అధ్యక్ష స్థానంలో ఉండే పుతిన్, జిన్ పింగ్, మోడీ వంటి  వారికి ఒక ర‌క‌మైన  ప్రైవేట్ లైఫ్ ఉండ‌క పోవ‌చ్చు. ఎప్పుడూ అధికార ప్ర‌భావంలో ఉండ‌టం.. ఎంతైనా వారికి ఇబ్బంది  క‌ర‌మైన ప‌రిణామ‌మే. అను నిత్యం నిఘా క‌ళ్ల మ‌ధ్య జీవించాల్సి ఉంటుంది. ఇటీవ‌ల చిన్న‌పాటి  రెస్ట్  తీసుకోడానికో ఏమో జిన్ పింగ్ కొన్నాళ్ల పాటు క‌నిపించ‌క పోవ‌డంతో ప్ర‌పంచ వ్యాప్తంగా  పెద్ద అల‌జ‌డికి కార‌ణ‌మైంది. మోడీకంటే వ్య‌క్తిగ‌త జీవితంలో భాగంగా పెళ్లాం పిల్ల‌లే  లేరు. దీంతో ఆయ‌న ప్రత్యేకించి ప్రైవేట్ లైఫ్ కోరుకోక పోవ‌చ్చ‌ని అంటారు విశ్లేష‌కులు. ఇక ఆహార‌పు అల‌వాట్లు శారీర‌క ధారుడ్యం వంటివి కూడా వీరికి స‌మ‌స్యాత్మ‌క‌మే. పుతిన్ ఎక్క‌డికి వెళ్లినా ఆ యా ప్రాంతాల‌కు చెందిన ఆహారాన్ని స్వీక‌రించ లేరు. అది ప్రొటోకాల్. ఆయ‌న వెంట ఆయ‌న ఆహారం  స‌మ‌కూర్చి పెట్టే చెఫ్ లు సైతం వ‌స్తారు. ఎందుకంటే ఎక్క‌డ ఏ ఫుడ్ పాయిజ‌న్ క‌లుస్తుందో అన్న ఆందోళ‌న కొద్దీ ఆయ‌న్ను బ‌య‌ట ఆహారం ఏదీ తిన‌నివ్వ‌రు. అంటే, పిచ్చాపాటిగా తిర‌గ‌డం గానీ ఇష్ట‌మొచ్చిన ఆహారాన్ని  ఆస్వాదించ‌డంగానీ వీరికి వీలు కాద‌న్న మాట‌. ఇక ఈ స్థాయిలో ఉండే  వారికి వ‌య‌సు ఎలాగూ మీద ప‌డే ఉంటుంది  కాబ‌ట్టి జిహ్వ‌చాప‌ల్యం పెద్ద‌గా ఉండ‌క పోవ‌చ్చు. కానీ ఏది ఏమైనా కొన్ని కొన్ని చిన్న చిన్న కోరిక‌లు వారికి సాధ్యం కాద‌నే చెప్పాల్సి ఉంటుంది. మ‌రి మీరేమంటారు.  

భార‌త్ అంటే...పుతిన్‌కి ఎలాంటి అభిప్రాయ‌ముందంటే!

  పుతిన్ భార‌త్ వ‌చ్చినపుడు ఒక ప్రయివేటు ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో.. కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు చెప్పారు. ఆ ప్ర‌శ్న‌లేంటి  స‌మాధానాలు ఎలాంటివ‌ని చూస్తే..మీరు 25 ఏళ్లుగా రష్యాకు నాయకత్వం వహిస్తున్నారు. ఇది చాలా అరుదైన రికార్డు. ఈ దీర్ఘకాల పాలనా  రహస్యమేంట‌ని అడ‌గ్గా..  అందుకు స‌మాధానం చెప్పిన  పుతిన్.. రహస్యం ఏమీ లేదు. ప్రజలు మ‌న ప‌ట్ల‌ నమ్మకంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. 1990లలో రష్యా పతనమైంది – ఆర్థికంగా, రాజకీయంగా, సైనికంగా. ప్రజలు దేశాన్ని మళ్లీ గౌరవించే స్థితికి తీసుకురావాలని కోరుకున్నారు. నేను ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాను. అంతే అంటూ ఎంతో క్లిష్ట‌మైన ప్ర‌శ్న‌కు సింపుల్ గా తేల్చేశారు పుతిన్. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మీరు ఆయనతో రెండు సార్లు క‌ల‌సి పనిచేశారు. ఈసారి రష్యా-అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయని అనుకుంటున్నారు? అని అడిగిన ప్ర‌శ్న‌కు.. పుతిన్ ఇచ్చిన ఆన్స‌రేంంటే.. ట్రంప్ ఒక వ్యాపారవేత్త. ఆయనకు లాభనష్టాలు అర్థమవుతాయత‌ప్ప ఈ పోరాటాలు యుద్ధాల ప‌ట్ల ఆయ‌న‌కేమంత ముక్కువ లేదు.. ఉక్రెయిన్ యుద్ధం అమెరికాకు ఏం లాభం ఇస్తోంది? ఏమీ లేదు – డబ్బు వృథా అవుతోంది. యూరప్‌లో అస్థిరత పెరుగుతోంది. ట్రంప్ దీన్ని అర్థం చేసుకుంటార‌నే అనుకుంటున్నా అన్నారు పుతిన్.. రష్యాతో ఒప్పందం చేసుకోవడం అమెరికాకు మేలు చేస్తుందని ఆయన భావిస్తే, ఆ దిశలో అడుగులు వేస్తారు. ఇందుకు మేము సిద్ధంగా ఉన్నామ‌ని కుండ బ‌ద్ధ‌లు కొట్టేశారు పుతిన్.  ఇక‌ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎప్పుడు ముగిస్తారు? అన‌డిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా పుతిన్.. యుద్ధం మా చాయిస్ కాదన్నారు. 2014లో కీవ్‌లో పశ్చిమ దేశాల ఆధారిత రాజకీయ తిరుగుబాటు చేశాయి. మిన్స్క్ ఒప్పందాలను జర్మనీ మాజీ ఛాన్సలర్ ఒప్పుకున్నట్టుగా – ఉక్రెయిన్‌ను మోసం చేయడానికే ఆ ఒప్పందాలు చేశామని చెప్పారు. మేము రష్యా మాటును నమ్మమని కోరుకోవడం లేదు – వాళ్లే ఆ మాట చెప్పారు కదా! అని ప్ర‌శ్నించారు. పుతిన్. ఇప్పుడు మా షరతులు స్పష్టం: ఉక్రెయిన్ నిరాయుధీకరణ, నాటోలో చేరకపోవడం, రష్యన్ భాషా హక్కులు, క్రిమియా మ‌రియు నాలుగు ప్రాంతాలు రష్యాలో భాగమే అనే గుర్తింపు. ఇవి నెరవేరితే రేపే యుద్ధం ఆగిపోతుందని తేల్చి చెప్పేశారు పుతిన్.. భారత్-రష్యా సంబంధాలు ఎప్పటికీ మారవని మీరు చెబుతుంటారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. భారత్ మాత్రం కొనసాగిస్తోంది. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందా? అని అడగ్గా.. అందుకు పుతిన్ ఏమ‌న్నారంటే.. ఎంత మాత్ర‌మూ ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేద‌న్నారు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ – ఇది భారత దేశ స్వభావం. భారత్ ఎప్పుడూ ఎవరి బెదిరింపులకు లొంగలేదు. 1971లో అమెరికా ఏడో నౌకాదళాన్ని బంగాళాఖాతంలోకి పంపినప్పుడు కూడా భారత్ తన మార్గంలోనే నడిచింది. ఇప్పుడు కూడా అదే. మీరు మా నుంచి చవకగా చమురు కొంటున్నారు, మేము మీ నుంచి ఔషధాలు, టెక్నాలజీ కొంటున్నాం – ఇది పరస్పర లాభం. ఇది దోస్తీ కాదు, వ్యాపారం స‌రిగ్గా అదే స‌మ‌యంలో వ్యూహాత్మక సహకారంగా చెప్పుకొచ్చారు పుతిన్. చైనాతో మీ సంబంధాలు చాలా దగ్గరయ్యాయి. ఇది భారత్‌ను ఆందోళన క‌లిగించే అంశం కదా? అని ప్ర‌శ్నించిన‌పుడు పుతిన్ ఇందుకెలాంటి ఆన్స‌రిచ్చారో చూస్తే..  చైనాతో మా సంబంధాలు భారత్‌కు వ్యతిరేకం కాదు. భారత్-చైనా మధ్య సరిహద్దు సమస్యలు మా వల్ల రాలేదు – అది బ్రిటిష్ వలస పాలన నుంచి వచ్చిన సమస్యలు. మేము ఎప్పుడూ భారత్-చైనా మధ్య యుద్ధం కోరుకోలేదు. రష్యా భారత్‌కు S-400 ఇస్తుంది, చైనాకు SU-35 ఇస్తుంది – ఇది వ్యాపారం. రెండు దేశాలతోనూ మా సంబంధాలు స్వతంత్రంగా ఉంటాయన్నారాయ‌న‌. భారత్ క్వాడ్‌లో ఉంది, అమెరికాతో దగ్గరవుతోంది. ఇది రష్యాకు సమస్య కాదా? అన్న‌ది  స్ట్రైట్ క్వ‌శ్చిన్. కాగా.. పుతిన్ ఇందుకు చెప్పిన ఆన్స‌రేంటంటే.. భారత్ ఎప్పుడూ తన స్వతంత్ర విదేశాంగ విధానం కలిగి ఉంటుంది. 1950-60లలో నెహ్రూ నాన్-అలైన్డ్ మూవ్‌మెంట్ ప్రారంభించినప్పుడు మేము మద్దతు ఇచ్చాం. ఇప్పుడు క్వాడ్‌లో ఉన్నా, భారత్ తన అవసరాలను కాపాడుకుంటుంది. మేము దాన్ని గౌరవిస్తామ‌ని అన్నారే త‌ప్ప భార‌త వైఖ‌రిని వ్య‌తిరేఖించ‌లేదాయ‌న‌.  మీరు ఇండియాలో బ్రహ్మోస్, AK-203 తయారీ, అణు రియాక్టర్లు, ఇప్పుడు రష్యన్ ఆయిల్ రిఫైనరీలు కూడా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారు. ఇదంతా ఆంక్షలను దాటవేయడానికా? అన్న‌ది ఒక ప్ర‌శ్న కాగా..  పుతిన్  నవ్వుతూ..  ఆంక్షలు మమ్మల్ని బలహీనపరుస్తాయని వాళ్లు అనుకున్నారు. కానీ మేము బలోపేతమయ్యాం. భారత్‌లో రిఫైనరీ పెట్టడం అంటే మీకు చవకైన ఇంధనం, మాకు స్థిరమైన మార్కెట్. ఇది విన్- విన్ సిట్యువేషన్. ఆంక్షలు లేకపోయినా మేము ఇదే చేసేవాళ్లమ‌ని క్లారిటీ ఇచ్చారు పుతిన్.. మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు? 2036 వరకు కొనసాగుతారా? అని ప్ర‌శ్నించ‌గా.. అందుకు పుతిన్  చిరుద‌ర‌హాసంతో నేను రిటైర్ అయినప్పుడు మీడియాలో మొదట తెలుసుకుంటారు. ఇప్పుడు రష్యా స్థిరత్వం అవసరం. ఒకవేళ నేను వెళ్లిపోతే ఎవరూ దేశాన్ని విడదీయకుండా చూడాలి. అది జరిగే వరకు నేను ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.. ఇదీ పుతిన్ సింపుల్ అండ్ స్ట్రైట్ ఆన్స‌ర్స్ ఇచ్చిన విధానం. అప్పుడ‌ప్పుడూ అక్క‌డ‌క్క‌డా చిరున‌వ్వులే త‌ప్ప‌.. ఎలాంటి హావ‌భావ విన్యాసాల‌ను చేయ‌లేదాయ‌న‌. భార‌త్ ప‌ట్ల త‌న వైఖ‌రి చెప్పేట‌ప్పుడు మాత్రం ఒకింత న‌మ్మ‌కంగా స్థిర‌చిత్తంతో చెప్పిన‌ట్టు క‌నిపించింది.  

తీపి గురుతులు.. గురువుల బెత్తం దెబ్బలు.. మంత్రి ఆనం

చిన్ననాడు గురువులు కొట్టిన బెత్తం దెబ్బలు ఎప్పటికీ తీపి గురుతులుగామిగిలిపోతాయని ఏపీ దేవా దాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నాడు గురువుల చేతిలో బెత్తం దెబ్బలే ఇప్పుడు తాము ఉన్నత  స్థాయికి ఎదగడానికి కారణమని పలువురు ఉన్నత స్థాయి వ్యక్తులు చెప్పడాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.   నెల్లూరు జిల్లా, చేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం (డిసెంబర్ 5)న జరిగిన విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్ల సమావేశం (పేరెంట్ టీచర్ మీటింగ్) లో మంత్రి ఆనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమంలో వచ్చిన ఓ వీడియోను ఆయన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు చూపారు.  ఆ వీడియోలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత రంగాల్లో మంచి గుర్తింపు పొందిన వారందరూ, తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయురాలి వద్దకు వచ్చి, ఆమెతో వారి అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం, తాము ఆనాడు తిన్న బెత్తం దెబ్బలను అరచేతులను చూపించి మళ్లీ  కొట్టమని అడగడం వంటి మధురమైన దృశ్యాలను విద్యార్థులకు మంత్రి చూపించి, బెత్తం దెబ్బల మాధుర్యాన్ని, గురువులకు, విద్యార్థులకు ఉన్న అవినావభావ అనుబంధాన్ని నేటితరం విద్యార్థులకు వివరించారు. విద్యార్థులందరూ గురువులను, తల్లిదండ్రులను గౌరవిస్తూ సత్ప్రవర్తనతో ముందుకు సాగితే విజ యాలను అందిపుచ్చుకోవాలని  దిశా నిర్దేశం చేశారు. సోషల్ మీడియా వీడియోను మంత్రి ఆనం  వివరించిన తీరు విద్యార్థుల్లో స్ఫూర్తి నింపింది. 

గ్లోబల్ సమ్మిట్‌కు హైదరాబాద్‌లో భారీ బందోబస్తు

  హైదరాబాద్‌లో జరగనున్న రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్‌ను దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో నగరంలో మొత్తం 6,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. సమ్మిట్ ప్రధాన వేదిక పరిసరాల్లో భద్రతను కఠినం చేస్తూ, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి వేదిక వరకు ప్రత్యేక బందోబస్తు అమలు చేస్తున్నారు.  ఇప్పటికే ప్రధాన వేదికను పోలీసు ఆధీనంలోకి తీసుకుని, ప్రతి మూలా మూలా పై నిఘా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. సమ్మిట్‌కు దేశ–విదేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు పోలీసులు తెలిపారు.  వేదికకు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే అనుమతిస్తామని సీపీ స్పష్టం చేశారు. సమ్మిట్ రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్ నుంచి శ్రీశైలం హైవే వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. రెండు రోజులపాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బృందాలు పనిచేయను న్నాయి. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారుల రవాణా సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు.ప్రధాన వేదికతో పాటు పరిసర ప్రాంతాలన్నింటిని ఒకే చోట నుండి పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.  

మరో మూడు రోజుల పోలీసు కస్టడీకి ఐబొమ్మ రవి

ఐబొమ్మ రవిని మరో మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో పోలీసుల దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై విచారించిన కోర్టు.. మూడు కేసులలో కేసుకు ఒక రోజు చొప్పున ఐబొమ్మ రవిని పోలీసుల కస్టడీకి అనుమతించింది. పోలీసులు మొత్తం నాలుగు కేసులలో ఐబోమ్మ రవి కస్టడీని కోరగా, కోర్టు మాత్రం మూడు కేసులలోనే కస్టడీకి అనుమతించింది. మరో కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో సైబర్ క్రైం పోలీసులు శనివారం (డిసెంబర్ 6) నుంచి మూడు రోజుల పాటు రవిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రవిని సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం (డిసెంబర్ 6) కస్టడీలోకి తీసుకోనున్నారు.  అదలా ఉంటే ఐబొమ్మ రవి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు సోమవారం విచారించనుంది.  

మావోయిస్టుల సాయుధ పోరాటం ఒక విఫల ప్రయోగం.. మల్లోజుల

మావోయిస్టుల సాయుధ పోరాటాన్ని ఒక విఫల ప్రయోగంగా అభివర్ణించారు ఇటీవల పోలీసులకు సరెండర్ అయిన మావోయిస్టు పార్టీ సిద్ధాంత కర్త, పార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు. తాజాగా ఒక జాతీయ వార్తా సంస్ధకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మల్లోజుల సంచలన విషయాలు వెల్లడించారు. గత అర్ధ శతాబ్దంలో పార్టీ చేసిన తప్పుల వల్లే ఉద్యమం నీరుగారిపోయిందనీ, మావోయిస్టు సాయుధ పోరాట పంధా ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోయిందనీ చెప్పారు.  ఇక ఇప్పుడు ఇంకా ఉద్యమంలో ఉన్న మావోయిస్టలకు మిగిలిన ఏకైక మార్గం ఆయుధాలు వీడి, లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవడమేనని మల్లోజుల అన్నారు.   గత మేలో జరిగిన  ఎన్‌కౌంటర్‌లో మరణించిన పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చారన్న మల్లోజుల, ఆ నిర్ణయాన్ని అమలు చేసే ప్రక్రియలోనే ఆయన ఎన్ కౌంటర్ లో హతమయ్యారని చెప్పారు.  ఆ తరువాత తాము సామూహికంగా లొంగుబాటు నిర్ణయం తీసుకున్నామన్నారు.  మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాన్ని, ఆచరణను మార్చుకోవడంలో  మావోయిస్టు పార్టీ విఫలమైందన్నారు.  ఇప్పటికైనా మావోయిస్టులు  తప్పుడు విధానాలు పక్కన పెట్టి ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకు రావాలని అన్నారు. తన అర్ధశతాబ్దపు అజ్ఞాత జీవితాన్ని స్వర్ణ అధ్యాయంగా అభివర్ణించిన మల్లోజుల.. అడవి బిడ్డలతో మమేకమై వారి హక్కుల కోసం పోరాడటం సంతృప్తినిచ్చిందన్నారు. తనను ఉద్యమ ద్రోహిగా అభివర్ణిస్తూ విమర్శలు చేస్తున్న వారిని తాను పట్టించుకోనన్నారు. 

విమానాల రద్దు.. కొత్త జంట ఏం చేసిందంటే?

  ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎఫెక్ట్ కొత్త జంటపైనా కూడా పడింది. బెంగళూరులో పని చేసే టెకీలు క్షీరసాగర్, సంగమ దాస్ నవంబర్ 23న పెళ్లి చేసుకున్నారు. భువనేశ్వర్ నుంచి హుబ్లీ వెళ్లాల్సిన ఫ్లైట్ రద్దు కావడంతో తమ సొంత రిసెప్షన్‌కు వర్చువల్‌గా పాల్గొనాల్సి వచ్చింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోటలు నెట్టింట వైరల్‌గా మారాయి. విమానాల రద్దు కారణంగా తాము రిసెప్షన్ కి రాలేకపోయా మంటూ వివరణ ఇచ్చారు...మరోవైపు పని కోసం కువైట్ వెళ్లాల్సిన లక్ష్మి (తిరుపతి) హైదరాబాద్ ఎయిర్పోర్టులో రాత్రంతా తీవ్ర అవస్థలు పట్టుతు ఉండి పోయారు.