చెట్ల‌పెంప‌క‌మే  క‌రీముల్లా జీవితం

చెట్లు పెంచ‌డం స‌ర‌దాగా మారింది ఈ రోజుల్లో. చెట్లు పెంచ‌డం పిల్ల‌ల్ని పెంచ‌డంతో స‌మానంగా భావిం చేవారు పూర్వీకులు. క‌లీముల్లా తెల్లారుతూనే లేచి సుమారు మైలు దూరంలో వున్న పెద్ద మామిడి చెట్టు ద‌గ్గ‌రికి వెళుతూంటాడు. ఇది ఆయ‌న నిత్య‌కృత్యం. 82 ఏళ్ల పెద్దాయ‌న ఎందుకంతగా అవ‌స్త‌ప‌డుతున్నా డ‌ని అంద‌రూ అనుకుంటూంటారు. కానీ 120 ఏళ్ల‌నాటి ఆ మామిడి చెట్టంటే ఆయ‌న‌కు ప్రాణ స‌మానం. ప‌రుగున వెళ్లి మాను తాకి, ఆకుల‌తో మాట్లాడి, ఆ గాలిని పీలిస్తేగాని ఆయ‌న‌కు  తాను ఇంకా  బ‌తికే ఉన్నా న‌ని అనిపించ‌ద‌ట‌!  మామిడికాయ‌ల‌కు ఆయ‌న స‌చిన్ అని, ఐశ్వ‌ర్య అనీ పేర్లు పెట్టుకున్నారు! ఎవ‌ర‌న్నా అడిగితే ఇది మీకు కేవ‌లం చెట్టే కానీ ఏళ్ల‌త‌ర‌బ‌డి క‌ష్టానికి ఫ‌లం. దీన్ని కేవ‌లం చెట్టుగా చూస్తే అలానే క‌న‌ప‌డుతుంది. క‌ల్ప‌వృక్షంలా చూస్తే అనేక ర‌కాల మామిడిప‌ళ్ల నిల‌యంగా క‌న‌ప‌డుతుంది అంటారాయ‌న‌. బ‌డికి ఏనాడూ వెళ్ల‌ని క‌రీముల్లా బాల్యంలోనే చెట్లు నాట‌డం, పెంచ‌డం మీద మ‌క్కువ ఏర్ప‌డి అదే జీవితంగా మార్చుకున్నారంటే ఒక్కింత ఆశ్చ‌ర్య‌మే. ఇలాంటివారివ‌ల్ల‌నే ప‌ర్యావ‌ర‌ణ స్పృహ అంటూ జ‌నాల‌కి క‌లుగుతోంది. 1987 నుంచీ అనేక ర‌కాల మామిడి పండ్లు అందించ‌డంలో ప్ర‌సిద్ధుడ య్యారు. దీనికి తోడు వాటికి విచిత్ర‌మైన పేర్లూ పెడుతూ జ‌నాన్ని బాగా ఆక‌ట్టుకున్నారు క‌రీముల్లా.   30 అడుగుల ఎత్తు, విశాలమైన కొమ్మ‌ల‌తో ఎంతో చ‌ల్ల‌ని నీడ‌నిస్తూండే చెట్లు ఏవ‌యినా త‌ల్లిలాంటివే అన్న‌ది ఆయ‌న ప్ర‌గాఢ విశ్వాసం. అదే ఆయ‌న తెలిసినవారంద‌రికీ ప్ర‌చారం చేస్తున్న‌ది. ఆయ‌న‌కు కాస్తంత సినిమా, క్రికెట్ పిచ్చి కూడా ఉంద‌ని వాళ్ల‌బ్బాయి అంటూంటాడు. అందుక‌నే  అనేక ర‌కాల‌కు ఐశ్వర్యారాయ్, మోదీ, స‌చిన్ టెండూల్క‌ర్‌, అనార్క‌లీ వంటి పేర్లు పెట్టారు.  ఇప్ప‌టికీ అన్ని ప్రాంతాల వారినీ  అవి  ఆక‌ట్టుకుంటున్నాయి.  చేతి వేళ్ల‌లానే పండ్లు వేటిక‌వే ప్ర‌త్యేక రుచి అంటారాయ‌న‌. చెట్ల‌ను పెంచ‌డంలో ఆయ‌న ప్ర‌త్యేక‌ల‌కు చాలామంది ఫిదా అయ్యారు. చెట్లు పెంచ‌డం అంటే మొక్క‌లుగా ఉన్న‌పుడు నీళ్లు పోయ‌డం, కాస్తంత జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డ‌మే కాదు వాటిని క‌న్న‌బిడ్డ‌ల్లా చూసుకుంటూం డాలి అనే సిద్ధాంతానికి క‌రీముల్లా క‌ట్టుబ‌డి ఉన్నారు. అందుకే ఆయ‌న కృషిని లోకం గుర్తించింది.  యుఏ ఇ నుంచి కూడా ఆయ‌న‌కు ఆహ్వానం అందింది. 2008లో భార‌త దేశ అత్యంత ఉన్న‌త సౌర స‌త్కారం పొందారు. ఎడారిలో సైతం మామిడి చెట్ల‌ను పెంచ‌గ‌ల‌న‌న్న‌ది ఆయ‌న ధీమా.  పంట పాడ‌వుతోంది, వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పుల‌తో ఆశించినంత పంట అంద‌టం లేద‌నే రైతాంగం మాట‌ల్ని క‌రీముల్లా అస్స‌లు ప‌ట్టించుకోరు. పంట‌కు కావ‌ల‌సిన‌ది నాణ్య‌మైన ఎరువులు, గింజ  త‌ప్ప వాతావ‌ర‌ణ మార్పుల‌తో ఎలాంటి స‌మ‌స్యా వుండ‌ద‌న్న‌ది ఆయ‌న అభిప్రాయం. భారీ న‌ష్టాలు వ‌స్తున్నా య‌ని గోడుపెడుతూండే రైతులు చాలామంది త‌క్కువ‌లో వ‌స్తున్నాయ‌ని, నాణ్య‌త లేని ఎరువులు, గింజ లు వాడుతుండ‌డం వ‌ల్ల‌నే ఏ పంట‌యినా దెబ్బ‌తింటుంది. దానికి ప‌ర్యావ‌ర‌ణానికి అస్స‌లు సంబంధం లేద‌ని క‌రీముల్లా అంటున్నారు. 

వర‌ద‌ సాయంలోనూ అవ‌క‌త‌వ‌క‌లేనా..?

బాధితుల‌ను ఆదుకోమ‌ని బియ్యం మూట‌లు పంపిస్తే బావ‌మ‌రిది దారి మళ్లించి ఇంటికి చేర్చాడ‌నే మాట విన ప‌డుతూంటుంది. ముఖ్యంగా ఇలాంటి ప్రకృతి వైప‌రీత్యాల స‌మ‌యంలోనే. అస‌లే  గూడు, తిండి గింజ‌లు, దుస్తులూ పోయి, బ‌తుకు జీవుడా అని శిబిరాల్లో ఉండేవారి ప‌ట్ల ద‌య‌తో, ప్రేమ‌తో వారి అవ‌స‌రాల‌కు కావ‌ల‌సిన వ‌స్తువుల‌ను స‌ర్దుబాటు చేయాలి. ఇది ఏ ప్ర‌భుత్వ‌మ‌యినా చేస్తుంది. చేయాలి. కానీ ఇందులో కూడా అస్మ‌దీయులు, త‌స్మ‌దీయులు అని గీత గీసుకుంటే దానికంటే దారుణం మ‌రోటి ఉండ‌దు. అస‌లు బాధితుల‌కు అందాల్సిన‌వి వేరే వారికి చేరేస్తే అంత‌క‌న్నా దుర్మార్గం మ‌రోటి ఉండ‌దు.  గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌కు రాష్ట్ర స‌ర్కారు ప‌దివేల రూపాయ‌ల చొప్పున ప‌రిహారం ఇస్తామ‌ని  ప్ర‌క‌టిం చింది.  ఈ ప‌రిహారం అందు కునే అర్హులు ఎవ‌ర‌న్న‌  జాబితా త‌యారీలో అధికారులు నిమ‌గ్నమ‌య్యా రు.  అయితే పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన వారినే అర్హులుగా పరిగణిస్తున్నారని.. స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఉన్న బాధితులను పరిగణనలోకి తీసుకోవడం లేదని, పైగా వరద బాధితులు  కాని వారి పేర్లనూ జాబితాలో చేరుస్తున్నారంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  భద్రాచలంలోని ఆర్యవైశ్య సత్రంలో వరద బాధితుల పేర్లు నమోదు చేస్తున్నారని తెలిసి.. అక్కడికి బాధి తులు పెద్ద సంఖ్యలో వెళ్లారు. తమ పేర్లు రాయాలంటూ ఒత్తిడి తేవడంతో సిబ్బంది అక్కడి నుంచి వెళ్లి పోయారు. అనంతరం  పోలీసుల సాయంతో తహసీల్దార్‌ జాబితా సేకరణ ప్రక్రియను చేపట్టా రు. అలాగే భద్రాచలం నన్నపనేని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల పునరావాస కేంద్రం, మణుగూరులోని కేంద్రంలో కూడా బాధితులు ధర్నా చేపట్టారు. బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామంలో ఏర్పాటు చేసి న పునారావాస కేంద్రాన్ని ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సందర్శించారు.  ఈ క్రమంలో పరిహారం సర్వేలో అక్రమాలు జరుగుతున్నాయని, తమ లాంటి అసలైన బాధితులకు అన్యాయం జరుగుతోందంటూ భాదితులు ఆయనను చుట్టు ముట్టారు. సర్వే చేసే అధికారులు పేర్ల నమో దులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్‌కు వివరించారు.  భద్రాద్రి ముంపు ప్రాంతాల్లో రెండు రోజు లుగా  బియ్యంతో పాటు  నిత్యవసర సామగ్రిని పంపిణీ చేస్తుండగా కొందరికి సన్నబియ్యం, మరికొందరికి దొడ్డు బియ్యం వస్తున్నాయంటూ బాధితులు నిరసన తెలిపారు. బాధితులందరికి సన్నబియ్యమే ఇవ్వా లని డిమాండ్‌ చేశారు. అన్నారం గ్రామానికి  చెందిన కొందరు మహిళలు తమకు బియ్యం అందడం లేదని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

దండోపాయ‌మే వైసీపీ అస్త్రమా?.. అచ్చెంనాయుడు

యుద్ధానికి వ్యూహాలు ఉంటాయి, ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి ఎత్తుగ‌డ‌లూ ఉంటాయి. కానీ  అరాచ‌కాన్ని ఆయు ధంగా చేసుకుని గెలిస్తే అది విజ‌య‌మ‌ని ఎలా అంటారు. భ‌య‌పెట్టి, మ‌భ్య‌పెట్టి దండోపాయాన్నే అమ లు చేసి ఎలాంటి ఎన్నిక‌యినా గెలిచేయాల‌న్న త‌ప‌న మ‌హా ప్ర‌మాద‌కారి. ఇది వ్యూహం అనిపించు కోదు, కుట్రతో  కూడిన ఎత్తుగ‌డ మాత్ర‌మే. దీన్ని పూర్తిగా న‌మ్మి, అమ‌లు చేసి ఎలాంటి ఎన్నిక‌ల్లోనైనా గెల‌వ‌డా నికి సిద్ధ‌ప‌డ‌ట‌మే  వైసీపీకి తెలిసిన  విద్య అంటూ టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షులు  అచ్చెన్నాయుడు ఆరోపిం చారు.  తిరుప‌తి టౌన్ బ్యాంకు ఎన్నిక‌ల్లోనూ ఎక్క‌డ ఓడిపోతామోన‌న్న భ‌యంతో వైసీపీ అడ్డ‌దారులు తొక్కుతోం ద‌ని, గెల‌వ‌లేనేమోన‌న్న భీతి వారిని వెన్నాడుతోంద‌ని అచ్చెంనాయుడు ఘాటుగా విమ‌ర్శించారు. ఇలాంటి వ్యూహాల‌తో ఎన్నిక‌ల్లో పాల్గొన‌డం, ఏక‌ప‌క్షంగా ఓట్లు వేయించుకోవ‌డానికి ఇక ఎన్నిక‌ల‌తో ప‌నేమి ట‌ని ఆయన ఆగ్ర‌హించారు.  టీడీపీ నేతలను గృహ నిర్భంధం చేసి ఏకపక్షంగా ఓట్లు వేసుకోవడానికి ఇక ఎన్నిక లెందుకని ప్రశ్నించారు. వైసీపీ నేతలు పట్టపగలే  ప్రజాస్వామ్యాన్ని దారు ణంగా హత్య చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. పోలీసులున్నది అధికార పక్షానికి కొమ్ము కాయడానికా ? లేక ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కారణంతో టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశారు,  వైసీపీ నేతలను ఎందుకు అరెస్టులు చేయలేదని ప్ర‌శ్నించారు.   జగన్ రెడ్డి ఎన్నికల నియమాలను ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నా రని దుయ్యబట్టారు. దొంగ ఐడీ కార్డులు ముద్రించి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లను అడ్డుకుంటామనే టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారన్నారు. మూడేళ్లుగా దోచుకున్న డబ్బు ను అక్రమంగా గెలిచేందుకు వెదజల్లుతున్నారని  వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంబలంతో, ఈ ఎన్ని కల్లో గెలిచినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం జగన్ రెడ్డికి ఓటమి తప్పదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

జగన్ సర్కార్ కు ఇక చుక్కలే..!

ఇక ఏపీలో జగన్ సర్కార్ కు కేంద్రంలోని మోడీ సర్కార్ చుక్కులు చూపించనుందా? జగన్ కు గతంలోలా పీఎంతో భేటీలకు అప్పాయింట్ మెంట్ అంత సులువుగా దొరకదా? అన్న ప్రశ్నలకు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం రాక మానదు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో వైసీపీ అవసరం ఎంతో ఉందని భావించిన కేంద్రంలోని మోడీ సర్కార్ ఆ పబ్బం గడుపుకునేందుకు జగన్ ను ఆ ఒక్కటి దక్క (ప్రత్యేక హోదా) ఏ వరం కోరుకున్నా ఇచ్చేస్తానని హామీ ఇచ్చింది. పాపం జగన్ గారికి ప్రత్యేక హోదా అడుగుదామన్న యోచనే లేదు. అసలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఏం కోరడానికి ఆయన ఈ మూడేళ్లలో ఎన్నడూ కనీసం ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఎంత సేపూ నవరత్నాలకు డబ్బులెలా? అప్పులెలా? అన్న యోచనతోనే కాలం గడిపే పరిస్థితాయె. సరే తీరా రాష్ట్ర పతి ఎన్నిక సమయం దగ్గర పడే సరికి మహారాష్ట్ర పరిణామాలూ, అనూహ్యంగా విపక్షాల నుంచి ముర్ము అభ్యర్థిత్వానికి వచ్చిన సానుకూల స్పందనతో బీజేపీకి వైసీపీ అవసరం అంతాగా అవసరంలేని పరిస్థితి వచ్చింది. అందుకే ముర్ము అభ్యర్థిత్వానికి తాము వైసీపీ మద్దతు కోరలేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కుండబద్దలు కొట్టేశారు. ఏ రకంగా చూసినా వైసీపీ తమకు అంటరాని పార్టీయేనని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు రాష్ట్రపతి ఎన్నికకు ముందు సంచలనం సృష్టించాయి. అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్రపతి ఎన్నికకు ముందు అనవసర రాద్ధాంతం ఎందుకు అనుకున్న బీజేపీ అగ్రనాయకత్వం వైసీపీ మద్దతు కోరామనీ, సత్యకుమార్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమనీ ఓ ప్రకటన చేసి ఊరుకుంది. అయితే అక్కడితో కథ ముగియలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీ తన అసలు ఉద్దేశమేమిటో ఎటువంటి భేషజాలూ లేకుండా వెల్లడించేసింది. ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థికి జగన్ మద్దతు ప్రకటించారు. బీజేపీ ఆయనను మద్దతు ఇవ్వాల్సిందిగా కోరిందా లేదా అన్నది పక్కన పెడితే ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి వైసీపీకి ఆహ్వానం అందలేదు.  దీనిని బట్టే ముందు ముందు వైసీపీ విషయంలో బీజేపీ తీరు ఎలా ఉండబోతున్నదన్నది అవగతమైపోతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ వైసీపీని ఇక లెక్కలోకి తీసుకునే అవకాశమే లేదంటున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో వైసీపీకి జరిగిన మర్యాదే ఈ విషయాన్ని తేటతెల్లం చేసిందని చెబుతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కడ్‌ నామినేషన్‌లో ప్రధాని, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు పాల్గొన్నాయి. కానీ వైసీపీ ఎంపీల జాడ మాత్రం కనిపించలేదు.   ఎందుకంటే వారికి ఆహ్వానం రాలేదు. మద్దతు ప్రకటించినా ఎందుకు ఆహ్వానం అందలేదన్న ప్రశ్నకు సమాధానం దొరకడం పెద్ద కష్టమేమీ కాదు.   ఏది ఏమైనా ఇంత కాలం కేంద్రాన్ని వైసీపీ  కోరినవన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధం లేని వ్యక్తిగత విషయాలేననీ, అందుకే ఇక ఆ పార్టీని సాధ్యమైనంత దూరం పెట్టాలనీ బీజేపీ అధిష్ఠానం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసిందంటున్నారు. వాస్తవానికి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ బీజేపీకి వైసీపీ అంటరాని పార్టీ అన్న వ్యాఖ్య  చేయడానికి బీజేపీ అధిష్ఠానం నిర్ణయమే కారణమని కూడా పరిశీలకులు అంటున్నారు. ఇందుకు నిదర్శనంగా మంగళవారం హస్తినలో జరిగిన అఖిలపక్ష భేటీని వారు ఉదాహరణగా చెబుతున్నారు. శ్రీలంక సంక్షోభంపై చర్చించడానికి నిర్వహించిన ఆ భేటీలో రాష్ట్రాల అడ్డగోలు అప్పులపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం తీరును టీఆర్ఎస్ ఖండించగలిగింది కానీ.. వైసీపీ కిమ్మనలేని పరిస్థితిలో పడింది. వాస్తవానికి మంగళవారం నాటి అఖిల పక్ష భేటీలో అప్పులపై కేంద్రం చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లక్ష్యం రెండు తెలుగు రాష్ట్రాలే అనడంలో సందేహం లేదు. పేరుకు పది రాష్ట్రాలలో అప్పులు ప్రమాదకర స్థాయికి చేరాయని కేంద్రం పేర్కొన్నా.. కేంద్రం దృష్టి మాత్రం ఏపీ, తెలంగాణపైనే ఉందన్నది సుస్పష్టం. తెలంగాణ పేరును ప్రస్తావించడంపై తెరాస ఎంపీలు మండి పడ్డారు. కేంద్రం అప్పుల మాటేమిటని నిలదీశారు. అదే సమయంలో వైసీపీ మాత్రం ఆమోదయోగ్యం కాని మౌనం పాటించింది. కేంద్రం టార్గెట్ చేసిందని స్పష్టమౌతున్నా కనీస స్పందన కూడా కరవైంది. అడ్డగోలు అప్పులకు ఇంత కాలం అంతే అడ్డగోలుగా అనుమతులిస్తూ వైసీపీకి ఫేవర్ చేసిన కేంద్రం ఇప్పుడు ఒక్క సారిగా జగన్ పార్టీని కార్నర్ చేయడంలోనే ఆ పార్టీ పట్ల ముందు ముందు కేంద్రం వైఖరి ఎలా ఉండబోతోందో అవగతమైందని పరిశీలకులు విశ్లేషిన్తున్నారు. ఇక ముందు వైసీపీకి అప్పలు పుట్టడం గతంలోలా కేక్ వాక్ గా ఉండదని అంటున్నారు. బటన్ నొక్కాలంటే జగన్ ఇక వంద సార్లు ఆలోచించాల్సిందేనంటున్నారు. ఇప్పటికే సంక్షేమంలో కోతపై జనంలో తీవ్ర నిరసన వ్యక్తమౌతున్న నేపథ్యంలో ఇక వైసీపీ సర్కార్ కు ప్రతి రోజూ గండంగానే గడుస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

లీ.. బ్రూస్ లీ! 

మ‌నిషి శ‌క్తిసామ‌ర్ధ్యాల‌కు అంతే ఉండ‌దు. ప్ర‌తీవారిలో ఆ శ‌క్తి ఉంటుంద‌ని అంటారు. కానీ చాలాత‌క్కువ మందే దాన్ని గ్ర‌హించుకోగ‌ల్లుతారు. ఊహాతీతంగా ఆ శ‌క్తియుక్తులే ఇత‌రుల‌కు అతీతంగా త‌యారు చేస్తాయి. ఇది క‌ళాకారుడిని చేయ‌వ‌చ్చు, కుంగ్ ఫూ పైట‌ర్‌గానూ చేయ‌వ‌చ్చు. రెప్ప‌పాటులో శ‌ర‌వేగంగా శ‌రీరావ‌య‌వాల‌ను క‌దిపి ఎదుటివారిని నిశ్చేష్టుల‌ను చేయ‌గ‌ల అపార సామ‌ర్ధ్యం పొంద‌డం బ్రూస్ లీకి మాత్ర‌మే సాధ్య‌ప‌డింది. అత‌నికి ముందు, ఆ త‌ర్వాత మ‌రెవ్వ‌రూ లేర‌న్న‌ది యావ‌త్ ప్ర‌పంచ ఫైట‌ర్లూ, యువ‌తా అంగీక‌రిస్తున్నారు. బ‌హు శాంతంగా క‌నిపించే బ్రూస్‌లీ లో ఇంత‌టి అత్యంత వేగంతో కూడిన కుంగ్ ఫూ క‌ద‌లిక‌లు కేవ‌లం భ‌గ‌వ‌త్ కృప‌తోనే సాధ్య‌ప‌డింద‌నే వాద‌నా ఉంది. ఏమైన‌ప్ప‌టికీ కుంగ్ ఫూ అంటే లీ, లీ అంటే ఎంట‌ర్ ద డ్రాగ‌న్‌! లీ అస‌లు పేరు లి జున్ ప్యాన్‌. 1940 న‌వంబ‌ర్ 27న శాన్‌ఫ్రాన్సిస్కోలో జ‌న్మించాడు. అతని తండ్రి ఒపెరా సింగర్ , పార్ట్ టైమ్ యాక్టర్ కావడం తో అతను చిన్న వయస్సులోనే సినిమా రంగానికి పరిచయం అయ్యాడు. చిన్నవాడైన లీ చిన్నతనంలోనే సినిమాల్లో కనిపించడం ప్రారంభించాడు, తరచూ బాల్య నేరస్థుడుగా నటించాడు. యుక్తవయసులో, అతను స్థానిక గ్యాంగ్‌లతో కలిసి తనను తాను రక్షించుకోవడానికి కుంగ్ ఫూ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతను నృత్య పాఠాలను కూడా ప్రారంభించాడు, ఇది అతని ఫుట్‌వర్క్, సమతుల్యతను మరింత మెరుగుపరిచింది; 1958లో లీ హాంకాంగ్ చా-చా ఛాంపి యన్ షిప్‌ గెలుచుకున్నాడు. హాంగ్‌కాంగ్‌లో పెరిగిన లీ అతను యుద్ధ కళల నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాడు. అత‌నిలో ఏదో అతీత శ‌క్తి ఉంద‌న్న ప్ర‌చారం కూడా బాగానే ఉండేది. ఊహించ‌ని అతివేగ‌వంత క‌ద‌లిక‌ల్లోనే అత‌నికి తెలీని శ‌క్తి దాగింద‌నే వాద‌న పెద్ద చ‌ర్చ‌గా ఉంది.  మ‌నిషి త‌న శ‌క్తిసామ‌ర్ధ్యాల‌ను అనుస‌రించి జీవించ‌డంలోనే అత్యంత ఆనందాన్ని పొందుతాడ‌నేవాడు లీ. అంత‌ర్జాతీయ త‌త్వ‌వేత్త జిడ్డు కృష్ణ‌మూర్తి ప‌రిచ‌యం అత‌న్ని ఎంతో మార్చింద‌న్న వాద‌నా ఉంది. అత‌నిలో లోకాన్ని చూసే దృష్టిలో ఎంతో మార్ప వ‌చ్చిందంటారు. అత‌నిలో సౌమ్యుడు ఉన్నాడు అని చాలామంది గ్ర‌హించారు. కేవ‌లం ఆత్మ‌ర‌క్ష‌ణ‌కే యుద్ధ‌క‌ళ‌ల‌ను నేర్చ‌కు న్నాడే గాని ఇత‌రుల‌ను ఇబ్బందిపెట్ట‌డానికి కాద‌ని, అత‌ని జీవితాన్ని గ‌మ‌నిస్తే తెలుస్తుంద‌ని తోటి న‌టీ న‌టులు అంటూండే వారు. గొప్ప వ్య‌క్తిని, మంచి మిత్రుడిని కోల్పోయాన‌ని అంటూంటారు. బ్రూస్ లీ 1973 జులై 20 వ తేదీన హాంగ్‌కాంగ్‌లో మృతి చెందాడు. చిత్ర‌మేమంటే అత‌నికి ప్ర‌పంచ‌ఖ్యాతి ఆర్జించిపెట్టిన ఎంట‌ర్ ద డ్రాగ‌న్ సినిమా రిలీజ్ కాకుండానే మృత్యువు తీసికెళ్లింద‌ని బంధువులు, యావ‌త్ ప్ర‌పంచ వీరాభిమానులు ఇప్ప‌టికీ ఎంతో బాధ‌ప‌డుతూంటారు. లీ లాంటి వ్య‌క్తులు మ‌ళ్లీ జ‌న్మిస్తారా అనే ప్ర‌శ్నకు స‌మాధానం చెప్ప‌డం క‌ష్ట‌మ‌నే అంటున్నారు హాంగ్ కాంగ్ వాసులు.

వైసీపీ, తెరాస గోదావరి వరద రాజకీయం

అన్ని దారులూ మూసుకుపోయి చివరకు గోదారే దిక్కు అయినట్లుంది తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలకు. గోదావరి వరద సాక్షిగా సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపాయి వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు. ఇరు రాష్ట్రాలలోని ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిర్లిప్తత, యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో విఫలం కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాలలో వరదలు అపార నష్టానికి కారణమయ్యాయి. ముఖ్యంగా రెండు రాష్ట్రాలూ కూడా వరద ప్రవాహాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యయి. అందుకే ముంపు ప్రాంతాల ప్రజలను తరలించడంలోనూ, ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంలోనూ సకాలంలో స్పందించలేకపోయాయి. దీంతో జనం రోజుల తరబడి వరద ముంపులో నానా ఇబ్బందులూ పడ్డారు. ఇప్పుడు, అసలే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటున్న సమయంలో జనంలో వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి వారు వరద రాజకీయాలకు తెరతీశారు. దాంట్లోనూ సెంటిమెంటును రంగరించి మరీ కలుపుతున్నారు. ఎప్పుడో ఎనిమిదేళ్ల నాటి అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చి సెంటిమెంట్ పండించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.. చుట్ట కాల్చుకోవడానికి నిప్పడిగాడట మరొకడు. అలాగుంది తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీల పరిస్థితి. జనం వరదల్లో భారీగా నష్టపోయి నిలువ నీడ లేక అల్లాడుతుంటే.. వారిని ఆదుకోవడం పక్కన పెట్టి ముంపునకు కారణాలను రాష్ట్ర విభజనతో ముడిపెడుతున్నారు. ముందుగా ఈ క్రీడను తెరాస ఆరంభిస్తే.. క్షణం ఆలస్యం చేయకుండా వైకాపా వచ్చి చేరిపోయింది. పోలవరం కారణంగానే భద్రాచలం మునిగిపోయిందంటూ పువ్వాడ విమర్శల పర్వానికి తెరతీసి విలీన మండలాల అంశం లేవనెత్తారు. ముంపు గ్రామాలను తెలంగాణలో కలిపేస్తే కరకట్ట ఎత్తు పెంచుకుని ముంపు ముప్పును శాశ్వతంగా పరిష్కరించుకుంటామన్నది పువ్వాడ వ్యాఖ్య. అయితే మేమేం తక్కువ తినలేదంటూ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు తెలుగు రాష్ట్రాలు రెంటినీ విలీనం చేసి సమైక్య ఆంధ్ర కావాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఆగిపోలేదు. హస్తినలో ఇరు పార్టీల ఎంపీలూ పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఇక మళ్లీ పువ్వాడ వ్యాఖ్యల వద్దకు వస్తే..పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం మునిగిపోతుందని భద్రాచలంలోకి వరద నీరు ప్రవేశించకుండా, భద్రాచలం రామాలయం మునిగిపోకుండా కరకట్టలు నిర్మిస్తామని.. ఇందుకు దాని చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతే బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు వెంటనే   వరదలు వచ్చినప్పుడు ముంపు సహజమేనని.. ఇందుకోసమే ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారని అంబటి అన్నారు. ఐదు గ్రామాలు కావాలంటే తామూ భద్రాచలం కావాలంటామన్నారు. ఇక బొత్స అయితే  రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ ఆదాయాన్ని తాము కోల్పోయామని.. మరి ఆ నగరాన్ని ఏపీలో విలీనం చేయాలంటే చేసేస్తారా అని ప్రశ్నించారు. ఇలా ఇరు రాష్ట్రాలలోని అధికార పార్టీలూ ప్రజల కష్టాలను, వరదల్లో వారు పడుతున్న ఇబ్బందులనూ వదిలేసి.. రాజకీయ లబ్ధి కోసం విభజన నాటి అంశాలను తెరమీదకు తీసుకురావడం వెనుక మరో సారి అధికారం చేపట్టాలంటే ప్రజలలో సెంటిమెంట్ రగల్చడమొక్కటే మార్గమన్న నిర్ణయానికి వచ్చేశారని అర్ధమౌతున్నది. అందుకే కూడబలుక్కునే ఈ విమర్శలు, ప్రతి విమర్శలు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఏడు మండలాలు ముంపునకు గురవుతాయి కనుకనే వాటిని అప్పట్లో ఏపీలో విలీనం చేశారన్నది జగద్వితం. ఆ మండలాల విలీనం తరువాతే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు అప్పట్లో విస్ఫష్టంగా కేంద్రానికి చెప్పి సాధించుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ విలీన మండలాలు తెలంగాణలో కలపాలంటూ టీఆర్ఎస్ చేస్తున్న డిమాండ్ సమస్యను పక్కదారి పట్టించి సెంటిమెంటును రగల్చడానికేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ మంత్రులు భద్రాచంల, హైదరాబాద్, సమైక్యాంధ్ర అంటూ చేస్తున్న వాదనలు కూడా ఇక్కడి సమస్యలను పక్కదారి పట్టించి మళ్లీ ఇరు రాష్ట్రాల ప్రజల మధ్యా విభజన నాటి సెగలు రేపే ప్రయత్నం తప్ప మరొకటి కాదని అంటున్నారు. ఇక ఏపీ జల వనరుల శాఖ మంత్రి ఎగువ కాపర్ డ్యాం ను ఆఘమేఘాల మీద మీటర్ ఎత్తును పెంచేశామనీ, దాని వల్లే పెనుముప్పు తప్పిందనీ చెప్పడం నేల విడిచి సాము చేశాం అని చెప్పుకోవడమే తప్ప ఒక్క రోజులో ఒక మీటర్ ఎత్తు పెంచామనడం ఏ విధంగానూ నమ్మశక్యంగా లేదని చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో స్వయంగా తెలంగాణ అసెంబ్లీ వేదికగా పోలవరం ఎత్తు తగ్గించేందుకు జగన్ అంగీకరించారని ప్రకటించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. పార్లమెంటు వేదికగా పోలవరం నిర్మాణంలో జాప్యానికి ఏపీలోని జగన్ సర్కార్ నిర్వాకమే కారణమని కేంద్ర జలశక్తి మంత్రి ప్రకటించిన రోజునే ఏపీ సర్కార్ పోలవరం పనులు జెట్ స్పీడ్ లో సాగుతున్నాయని ఏపీ చెప్పుకోవడానికి ప్రయత్నించడం రాజకీయ లబ్ధి కోసం తప్ప మరొకందుకు కాదని, అలాగే పోలవరం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందనీ, భద్రాచలం రామాలయం ఉనికే ప్రశ్నార్థకమౌతోందని తెలంగాణ గుండెలు బాదుకోవడం కూడా జనంలో సెంటిమెంట్ రగిల్చి రాజకీయ పబ్బం గడుపుకోవడానికేననీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తినప్పుడల్లా ఏపీ సర్కార్ హైదరాబాద్ ఆదాయం కోల్పోయామనీ, కేసీఆర్ సర్కార్ ఆంధ్రాపాలకుల దోపిడీ ఇంకా ఆగడం లేదనీ సెంటిమెంట్ ను ఆశ్రయించడం పరిపాటిగా మారిపోయిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు జనానికి కావలసింది సెంటిమెంట్ డ్రామాలు కాదనీ, బాధల్లో  ఉన్న వారికి తక్షణ సాయం అందించడమనీ అంటున్నాయి. మొత్తంగా గోదావరి వరదను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న రెండు పార్టీల డ్రామాపై సామాజిక మాధ్యమంలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.

ఉక్రెయిన్ పిల్ల‌ల‌కు 12 ఏళ్ల అన్న దొరికాడు.. గాబ్రియేల్‌

క‌ష్టాల్లో ఉన్న‌వారికి స‌హాయం చేయాల‌ని అంద‌రికీ ఉంటుంది. కానీ కొంద‌రే నిజంగా ముంద‌డుగు వేస్తారు. ఆలోచించ‌డం, అనుకోవ‌డం కంటే అనుకున్న‌ది వెంట‌నే కార్యాచ‌ర‌ణ‌లో పెట్ట‌డం చాలా గొప్ప‌ది. అందులోను గాబ్రియెల్ వంటి మ‌న‌సున్న‌వారు ఉ్ర‌కెయిన్ పిల్ల‌ల‌కు స‌హాయం చేయాల‌నుకోవ‌డం మ‌రీ అరుదు. గాబ్రియెల్ 12 ఏళ్ల‌వాడు. ఉక్రెయిన్ పిల్ల‌ల‌కు త‌న వంతు స‌హా యంగా 109,400 డాల‌ర్ల‌కు పైగా వసూలు చేసింది ఉక్రేనియన్ పిల్లల కోసం పంపించాడు. గాబ్రియెల్ క్లార్క్ అనే పిల్ల‌వాడు చెక్క‌ప‌నులు చేస్తుంటాడు. ప్లేట్లు, మంచి డిజైన్‌లో వ‌స్తువుల్ని చేయ‌డంలో నైపుణ్యం సాధిం చాడు. ఇంగ్లాండ్ కుంబ్రియాకు చెందిన గాబ్రియెల్‌ ఎనిమిదో ఏట‌నే అంద‌మైన వ‌స్తువుల త‌యారీ ప‌ట్ల దృష్టి మ‌ళ్లింది. అతని తల్లి తన తాత  ఉప‌యోగించే సుత్తిని అత‌నికి అందించింది. చెక్క‌తో చిన్న చిన్న వ‌స్తువులు చేయ‌డం నేర్చుకున్న గాబ్రియెల్ ఇపుడు ఎంతో చ‌క్క‌టి వ‌స్తు వుల‌ను త‌యారు చేసే ఒక సంస్థ‌లో ప‌నిచేస్తున్నాడు.  ఈమ‌ధ్య ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడి గురించి అంద‌రికీ తెలిసిన‌ట్లే ఈ కుర్రాడికి తెలిసింది. వార్త‌లు చూస్తూ, వింటూండ‌టంతో మ‌న‌సు బ‌రువెక్కింది. అయ్యో త‌న వ‌య‌సు పిల్ల‌ల‌కు ఇన్ని క‌ష్టాలు వ‌చ్చాయా అనుకున్నాడు. త‌న వంతు ఏద‌యినా స‌హాయం చేయాల‌ని నిశ్చ‌యించుకున్నాడు.  జీవితంలో ఏదైనా  చేయడం ద్వారా నేను ఇతర పిల్లల జీవితాలను మెరుగు పరచగలనని నేను తెలుసుకోవా లనుకుంటున్నా నని  గాబ్రియేల్ త‌న స్నేహితులు, తోటి ప‌నివారితో అంటూండే వాడు.  చిన్న వ‌య‌సులోనే ఇంత‌టి పెద్ద ఆలోచ‌న చేయ‌డం నిజంగా ఎంతో హ‌ర్ష‌ణీయం. నాకు తెలిసిన ప్రతిదాన్ని నేను స్వ‌యంగానే నేర్చుకున్నాను. కుంబ్రియా పాఠశాల విద్యార్థికి కూడా మంచి చేయాలనే సహజమైన కోరిక ఉంది, దానిని అతను ఈ వసంత కాలంలో అమలులోకి తెచ్చాడు. మార్చి 25న, గాబ్రియేల్ తండ్రి, రిచర్డ్ క్లార్క్, తన కుమారుడి నైపుణ్యం గురించి, తన చేతితో తయారు చేసిన చెక్క గిన్నెలు కటింగ్ బోర్డుల అమ్మకాల నుండి డబ్బును ఎలా ఆదా చేస్తున్నాడో ట్వీట్ చేశాడు. పోస్ట్ వైరల్ అయ్యింది గాబ్రియెల్ కుటుంబం కస్టమ్ బౌల్స్ కోసం వేలకొద్దీ ఆర్డర్‌లను అందుకుంది 48 గంటల్లో ఆరుగురు అనుచరుల నుండి రెండు ల‌క్ష‌ల‌కు పైగా చేరుకుంది. గాబ్రియేల్ తనకు కొత్తగా వచ్చిన ప్రజాదరణను ఇతరులకు సహాయం చేసే అవకాశంగా మార్చుకోవాలని నిర్ణయించుకు న్నాడు. ప్రతిభావంతులైన, యువ హస్తకళాకారుడు ఇటీవల తన చేతితో తయారు చేసిన గిన్నెలలో ఒకదాని కోసం ఒక లాటరీని ప్రారం భించాడు - నీలంపసుపు ఉంగరం, ఉక్రెయిన్ జెండా రంగులతో చెక్కబడి - ఉక్రేనియన్ పిల్లల కోసం డబ్బును సేకరించ డానికి. గాబ్రియేల్ సేవ్ ది చిల్డ్రన్స్ ఉక్రెయిన్ సహాయ చర్య కోసం 109,450 డాల‌ర్లకు మించి సేకరించాడు.

ఇది ముమ్మాటికి అవ‌మానించ‌డ‌మే

తాత‌గారి ఆరోగ్యం బాగోలేదు రమ్మ‌ని పిలిచి వ‌చ్చిన‌వారితో మ‌న‌వ‌రాలి పెళ్లి గురించి మాట్లాడాడ‌ట పూర్వం ఓ పెద్దాయ‌న‌. అదుగో అలా ఏడిచింది కేంద్రం అఖిల‌ప‌క్ష భేటీ. శ్రీ‌లంక సంక్షోభం గురించి చ‌ర్చించ‌డానికి పిలిచిన కేంద్రం రాష్ట్రాల ఆర్ధిక ప‌రిస్థితిపై  కేంద్ర ప్ర‌జంటేష‌న్ ఇవ్వ‌డం కంటే విడ్డూరం ఏమ‌న్నా ఉంటుందా అని వెళ్లిన‌వారంతా మండిప‌డ్డారు. ఇంత అనాలోచితంగా కేంద్రం వ్య‌వ‌హ‌రించ‌డం పై  టీఆర్ ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నాయ‌కుడు కే.కేశ‌వ‌రావు, లోక్‌సభాప‌క్ష నేత నామా నాగేశ్వ‌ర‌రావు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.  కేంద్రం  చేసిన అప్పుల‎పై నిలదీశారు. తలసరి ఆదాయంలో దేశంలోనే రెండవ స్థానంలో తెలంగాణ ఉందని సమావేశంలో తెలిపారు. కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అప్పులు గురించే మాట్లాడడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని  కే కే, నామా   మండిపడ్డారు. శ్రీలంక సంక్షోభంపై చర్చకు పిలిచి దానిని వదిలేసి మ‌రొక అంశాన్ని  చ‌ర్చించ‌డం అసంద‌ర్భంగా ఉంద‌న్నారు.  ఇక కేంద్ర ప్రభుత్వ వైఖరిని టీఆర్ఎస్‌తో పాటు విపక్ష పార్టీలు ఖండించాయి. సందర్భం లేకుండా రాష్ట్రాల అప్పులపై ప్రజెంటేషన్ ఏంటి అని నిలదీశాయి. తెలంగాణ జీఏస్డీపీలో 23శాతం కంటే ఎక్కువ అప్పులు తీసుకుంటున్నారన్న వాదనను టీఆర్ఎస్ తోసి పుచింది. ఇదే కేంద్ర ప్రభుత్వం 59శాతం పైగా అప్పులు తీసుకుందని దీనికి జవాబు ఎవరు ఇస్తారని ఎంపీ కేశవరావు ప్రశ్నించారు.  తెలంగాణ రాష్ట్ర అప్పులు కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన ఎఫ్‌ఆర్‌బీఎం  పరిధిలోనే ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం అప్పులు ఏకంగా 6.2% శాతాన్ని అధికమని ఎత్తి చూపారు. తీసుకున్న అప్పులను చెల్లించడంలో తెలంగాణ నిర్లక్ష్యం చేసిందా?. కేంద్రం చేసిన అప్పులకు సమాధానం ఎవరు ఇస్తారు?. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చ జరగాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేకే డిమాండ్ చేశారు.  కేంద్రం ఇలాంటి అర్ధంలేని స‌మావేశాల‌తో ఉన్న ప‌రువు పోగొట్టుకోవ‌డం త‌ప్ప ప్ర‌యోజ‌న‌మేమీ ఉండ‌దు. రాష్ట్రాల ఆర్ధిక ప‌రిస్థితి మీద చ‌ర్చించ‌డానికి ప్ర‌త్యేక వేదిక ఏర్పాటు చేసి నిపుణులతోనూ చ‌ర్చ చేయాలి. కానీ ఈ విధంగా పిల‌వ‌డంలో ఆంత‌ర్య‌మేమి ట‌న్న‌ది కేంద్రంలోని బిజెపి వ‌ర్గాలే చెప్పాలి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల ప‌రిస్థితిని శ్రీ‌లంక‌తో పోల్చ‌డం ఈమ‌ధ్య బిజెపీ హేమా హేమీల‌కు ప‌రిపాటిగా మారింది. నిజంగానే అలా మారి త‌మ పాదాల‌మీద ప‌డ‌తే ఆనందించి తృణ‌మో ప‌ణ‌మో ప‌డేద్దామ‌న్న ఆలోచ‌న‌లో బిజెపీ పెద్ద‌లు ఉన్నార‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. కేంద్ర ప్ర‌భుత్వం అంటే పెద్ద‌మనిషి పాత్ర పోషించాల‌నే భావ‌న  బిజెపి వారి రాక‌తో  పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. త‌మ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఏదో ఒక స‌మ‌స్య‌కు బీజం నాటి ఆన‌క వ‌చ్చి త‌గాదాను లేవ‌నెత్తి, స‌మ‌స్య‌ను జ‌టిలం చేసి ఎందుకు ప‌నికిరార‌ని అన‌డం, అవ‌మానించ‌డం, ప్ర‌చారం చేయించుకోవ డంలో బిజెపీ నాయ‌కులు చాలా నైపుణ్యం సాధించారు.  అన్ని రాష్ట్రాల‌ను స‌మానంగా చూసుకోవాల్సిన కేంద్రం బిజెపీయేత‌ర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల‌ల్లో చిన్న‌పిల్ల‌ల్లా గిల్లిక‌జ్జాలు పెట్టుకోవ‌డం అల‌వాటుగా చేసుకున్నారు. మ‌న‌సులో కుట్ర ఉన్న‌వారు మ‌న్ కీ బాత్ లో ఇక ఏమి చెప్పి ప్ర‌జ‌ల  మెప్పు పొందుతారు? 

వంద గ్రాముల కందిపప్పు.. నాలుగు టమాటాలు.. నాలుగు ఆలుగడ్డలు.. వరద బాధితులకు జగన్ సాయం

ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించి ప్ర‌జ‌ల‌కు, పంట‌ల‌కు తీవ్ర నష్టం వాటిల్లినప్పుడు ప్ర‌భుత్వాలు ముంపు బాధితులకు తక్షణం నిత్యావసరాలు అందించి ఆదుకోవడం కనీస ధర్మం, బాధ్యత.   కానీ జగన్ ప్రభుత్వం ఈ విషయంలో ఘోరంగా విఫలమైంది. వ‌ర‌ద బాధితుల‌కు వంద గ్రాముల కందిప‌ప్పు, నాలుగే నాలుగు ట‌మాటాలు,ఆలూ ఇవ్వ‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు విమర్శించారు.    ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇటీవ‌లి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో భారీ వరదలు తీవ్ర‌ న‌ష్టం కలిగించాయి గోదావ‌రి ప‌రీవాహ‌క ప్రాంతాల్లోకి వ‌ర‌ద నీరు చేరి ప‌లు చోట్ల లోత‌ట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వ‌ర్షాలు తెరిపివ్వ‌గానే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి ఏరియ‌ల్ స‌ర్వే చేప‌ట్టి ప‌రిస్థితులు తెలుసుకున్నారు. ప్ర‌జ‌లను వెంట‌నే ఆదుకోవ‌డానికి బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు.. ఒక్కోకుటుంబానికి  2 వేల రూపాయల నగదు తాగునీరు, రేషన్, పశుగ్రాసం అందించాలని  అధికారులను ఆదేశించారు.  లంక గ్రామాల్లో బాధితులకు అధికారులు చేసిన వరద సాయం  ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆవేదన కలిగిస్తుంది.  జగన్ ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా  ముంపునకు గురై సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన లంక గ్రామాల ప్ర‌జ‌ల‌కు ప్రభుత్వం తరఫున వంద‌ గ్రాముల కంది పప్పు.. నాలుగంటే నాలుగు టమాటాలు, నాలుగు ఉల్లిపాయలు, నాలుగు బంగాళాదుంపలు అందిస్తున్నారు. అస‌లీ లెక్క‌లేమిటో, ఎవ‌రు చెప్పారో తెలీదు. కానీ   ఖ‌చ్చితంగా అంతే ఇస్తున్నారు. ఈ మాత్రం దానికే ఎంతో గొప్పగా బాధితులను ఆదుకుంటున్నామంటూ ప్రచారం చేయంచుకుంటున్న ప్రభుత్వం విమర్శల పాలౌతోంది.  వరద బాధితులకు ఇదేనా సాయం అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇక వరద బాధితులకు ప్రభుత్వ సాయంపై ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్ర బాబు నాయుడు ట్విట్టర్ ద్వారా విమర్శనాస్త్రాలు సంధించారు.  అల్లూరి జిల్లా చింతూరు మండలం చట్టిలో గోదావరి వరద సాయంపై మీడియాలో వచ్చిన కథనంపై చంద్రబాబు ట్వీట్ చేశారు.   నాలుగు ఉల్లి పాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళా దుంపలు!.ఇదీ గోదావరి వరద బాధితులకు మీ ప్రభుత్వం ఇచ్చిన సాయం....లెక్క చూసుకో జగన్ రెడ్డి... నాలుగంటే నాలుగే!. అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.   మరోవైపు చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాల్లో పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈనెల 21న కోనసీమ జిల్లా పి.గన్నవరం, రాజోలులో చంద్రబాబు పర్యటిస్తారు. 22వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంటలో వరద బాధితులను పరామర్శించ నున్నారు.

జ‌గ‌న్ సర్కార్ నిర్ల‌క్ష్య‌మే పోల‌వ‌రానికి శాపం

ఏపీలోని జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యూహాత్మక ప్రణాళికా లోపం, తగిన రీతిలో నిధులను విడుదల చేసే సామర్థ్యం లేకపోవడమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి కారణమని  కేంద్రం స్పష్టం చేసింది. సభలో తెలుగుదేశం రాజ్యసభలో ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి బదులిచ్చారు. పోలవరం పూర్తికి గడువు పెంచినట్లు పేర్కొన్నారు.  ఎవ‌రన్నా ఇబ్బందిలో ఉంటే స‌హాయం కావాలంటే చేస్తాన‌నేవారు చాలా అరుదుగా దొరుకుతారు. కానీ త‌ప్ప‌కుండా స‌హాయం చేస్తామ‌న్న‌వారికి కావ‌ల‌సిన స‌మాచారం అందించ‌డంలో నిర్ల‌క్ష్యం క్షంత‌వ్యం కాదు. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి అస్స‌లు క్షంత‌వ్యుడు కారు.   పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో   అడిగిన స‌మాచారం స‌మ‌యానికి అందించ‌డంలో  జగన్ సర్కార్ నిర్లక్ష్యమే పోలవరం నిర్మాణంలో జాప్యానికి కారణమని పార్లమెంటు సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టేసింది. పోల‌వ‌రం ప్రాజెక్టును రాష్ట్రం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. కానీ ముఖ్య‌మంత్రి నిర్ల‌క్ష్య ధోర‌ణితో రాష్ట్రం కేంద్రంతో మొట్టికాయ‌లు వేయించుకుంటూ అప్ర‌తిష్ట‌పాల‌వ‌డం గ‌మ‌నిస్తున్నాం. ఉభ‌య‌ స‌భ‌ల్లోనూ దీన్ని గురించి ఎప్పుడు చ‌ర్చ త‌లెత్తినా ఎంపీల‌కు అక్షంత‌లు త‌ప్ప‌డం లేదు. ఇపుడు తాజాగా క‌న‌క‌మేడ‌ల పోలవరంపై వేసిన ప్రశ్రకి సమాధానమిస్తూ కేంద్ర జ‌ల‌శ‌క్తిశాఖ మంత్రి  జగన్ సర్కార్ వైఫల్యమే పోలవరం జాప్యానికి కారణమని స్పష్టం చేశారు. ఏపీ సీఎం  నిర్వాకంతోనే అన్నీ వెన‌క్కి పోతున్నాయ‌న్న‌ది కేంద్ర మంత్రిగారి స‌మాధాన సారాంశం.  పోల‌వ‌రం ప్రాజెక్టు గురించి మంగళవారం రాజ్య‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఎంపీ క‌న‌క‌మేడ‌ల కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి బిశ్వేశ్వ‌ర తుడూను   పోల‌వ‌రం ప్రాజ‌క్టు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌ను నిర్ధారించ‌డానికి ప్ర‌భుత్వం ఏద‌యినా అంచ‌నా లేదా త‌నిఖీ చేసిందా అని ప్ర‌శ్నించారు. ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం 2014లోని నిబంధ‌న‌ల ప్ర‌కారం జాతీయ ప్రాజెక్టు హోదా పొందిన పోల‌వ‌రం నీటిపారుద‌ల ప్రాజెక్టును పూర్తి చేయ‌డంలో తీవ్ర జాప్యం జ‌రిగింది. అయితే ప్ర‌భుత్వ స‌లహా రూపంలో ఏద‌యినా స‌మాచారం ఇచ్చిందా, ఏపీ ప్ర‌భుత్వాన్ని మంద‌లించారా అని అడిగారు. అంతే కాకుండా పిఐపి(పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు) అమ‌లు చేసే ప్ర‌క్రియ‌లో దాని మిన‌హాయింపు లేదా క‌మిష‌న్ చేప‌ట్టిన చ‌ర్య‌లేమిట‌ని రాజ్య‌స‌భ‌లో క‌న‌క‌మేడ‌ల ప్ర‌శ్నించారు. అందుకు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడు లిఖిత పూర్వ‌క స‌మాధానం ఇస్తూ,ముందుగా  నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్టును ఏప్రిల్ 2022 నాటికి పూర్తి చేయాలనీ అయితే అయితే ప్ర‌స్తుతం హెడ్‌వ‌ర్క్స్, కుడి ప్ర‌ధాన కాలువ, ఎడ‌మ ప్ర‌ధాన కాలువ‌ల పురోగ‌తి వ‌రుస‌గా 77 శాతం, 93 మరియు 72 శాతం  మాత్రమే పూర్తయ్యాయన్నారు. అందువలన ప్రాజెక్ట్  ఏప్రిల్, 2022 నాటికి పూర్తి చేయాలన్న గడువు దాటిపోయిందన్నారు.  ఏప్రిల్ 2022 తర్వాత పైప్‌ల అమలుకు సంబంధించి ప్ర‌భుత్వ సమాచారం మేరకు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పిపిఏ, ప్రస్తుత నిర్మాణ షెడ్యూల్‌ను సమగ్రంగా పరిశీలించడానికి , విశ్లేషించడానికి 2021 నవంబర్‌లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తన నివేదికను ఏప్రిల్, 2022లో సమర్పించింది, జూన్, 2024 నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి సవరించిన లక్ష్యాన్ని సూచించిందని కేంద్రం మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అవసరమైన రీతిలో వ్యయసామర్ధ్యం లేకపోవడం, సరైన వ్యూహాత్మక ప్రణాళికా లోపం, ప్రణాళిక లేకపోవడమే పోలవరం జాప్యానికి కారణమని స్పష్టం చేశారు. అలాగే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ సమన్వయ లోపం, కోవిడ్ సమస్యలు కూడా ప్రాజెక్టు జాప్యం అవడానికి కారణమని మంత్రి స్పష్టం చేశారు.

హోదా హుళ‌క్కే.. తేట‌తెల్లం చేసిన కేంద్రం

ఊరించి ఊరించి ఊర‌గాయ‌ బెట్టి ఆఖ‌రికి ముక్క‌లేదు త‌ర్వాత చూద్దాం అని నూనె జాడీ చూపించింది వెన‌క‌టికి ఓ బామ్మ‌గారు. అదుగో అలా మారింది ఆంధ్ర‌ప్ర‌ధేశ్ ప్ర‌త్యేక హోదా తంతు. 2014లో ప్ర‌త్యేక హోదా త‌ప్ప‌కుండా ఇస్తామ‌న్న హామీ ఇచ్చార‌నే ఆంధ్ర ప్ర‌దేశ్, తెలంగాణా విడిపోవ‌డానికి  అప్ప‌టి నాయ‌కులు అంగీక‌రించారు. ప్ర‌భుత్వం ఏర్పాట‌యింది. అప్ప‌టి నుంచి హోదా గురించి ఎప్పుడు చ‌ర్చ లేదా ప్ర‌శ్న‌లు త‌లెత్తినా ఏదో మాయ‌మాట‌లు చెప్పి తెలుగు ప్ర‌జ‌ల, ప్ర‌భుత్వ ఆవేశాన్ని చ‌ల్లా ర్చ‌డం కేంద్రం పెద్ద ప‌నిగా పెట్టుకుంది. కాలం గ‌డిచిపోయింది రాష్ట్రానికి వీల‌యినంత ఆర్ధిక సాయం చేస్తామ‌ని ఊరించి అస‌లు హోదా మాట‌నే మ‌ర్చిపోయేలా చేశారు కేంద్రంలోని బిజెపీ పెద్ద‌లు.  జ‌గ‌న్ రెడ్డి అధికారంలోకి రాగానే ముందుగా ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల్లో ప్ర‌త్యేక హోదా సాధించుదామ‌నే అన్నారు. కానీ క్ర‌మేపీ కేంద్రానికి దాసోహం అన‌డంతో ఆ  మాట‌ను మార్చి ఏవేవో క‌బుర్లు చెబుతూ, జ‌గ‌న్‌ని అస‌లా అంశాన్ని ఎత్త‌కుండా చేశారు. జ‌గ‌న్ కేవ‌లం కేంద్రంలో నాయ‌కుల చుట్టూ ప్ర‌ద‌క్షిణాలు చేయ‌డం త‌ప్ప ప్ర‌త్యేక హోదా గురించి ఇత‌ర అంశాల గురించి ప‌ల్లెత్తు ఏమీ మాట్లాడ‌టం లేదు. జ‌నం పూర్తిగా దాని సంగ‌తే మ‌ర్చిపోయార‌న్న భ్ర‌మ‌లో కేంద్రం, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు ఉన్నాయి.  ఈ ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ ప్ర‌త్యేక హోదా అంశం చ‌ర్చ‌కు తెర‌లేపింది. లోక్‌స‌భ‌లో టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు హోదాపై అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్రప్రభుత్వంమళ్లీ పాత పాటే పాడింది. లోక్‌స‌భ‌లో కేంద్ర‌మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతానికి ఆర్థిక సంఘం పెంచిందన్నారు. రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులను ఆర్థిక సంఘం కేటాయించిందని, 15వ ఆర్థిక సంఘం కూడా ఈ సిఫార్సులను కొనసాగించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఏపీకి  ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా పేర్కొన్నారు.  విభజన చట్టంలోని హామీలను చాలా వరకు కేంద్రం నెరవేర్చిందని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. కొన్ని అంశాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా పదేళ్ల కాలంలో పరిష్కరిస్తామని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి..ఇప్పటికే కేంద్ర హోంశాఖ 28 సమావేశాలను ఏర్పాటు చేసిందని నిత్యానందరాయ్ పేర్కొన్నారు. ... హోదా సాధ‌న‌కు ఒక  సుధీర్ఘ పోరాటాన్ని  వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీలతో సహా అన్ని పార్టీలు తమ విభేదాలను వీడి ఎస్సీ ఎస్‌ఎస్‌ సాధనకు ఐక్య పోరాటానికి సిద్ధ‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తమకు అత్యధికంగా ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రానికి ఎస్సీ ఎస్టీ కోసం పాటుపడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ఇప్పుడు మౌనంగా ఉండ‌టం ప‌ట్ల రాష్ట్రంలో విప‌క్షాల‌తో పాటు ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ఈ విష‌యంలో బిజెపీని దీటుగా ఎద‌ర్కోవ‌డంలో వైసీపీ ని పూర్తిగా న‌మ్మి మోస‌పోయామ‌న్న అభిప్రాయాలే అంత‌టా విన‌వ‌స్తున్నాయి.  కేంద్రంతో కొంత స‌హ‌చ‌ర్యం వున్న జ‌గ‌న్ హోదా విష‌యంలో మాత్రం వారిని ఒప్పించ‌డంలో దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. పైగా కేంద్రం మ‌న‌సులో మాట జ‌గ‌న్‌కు తెలిసి కావాల‌నే అస‌లు ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్ట‌క కాల‌క్షేపం క‌బుర్ల‌తో ప్ర‌జ‌ల్ని మోసం చేశార‌న్న‌ది తేట‌తెల్ల‌మ‌యింది. 

ఆ  త‌ల్లి  ప్రేమ ఆకాశ‌మంత‌!

చంద‌మామ రావే.. జాబిల్లి రావే.. వెన్న‌ముద్ద తేవే.. అంటూ చంటిపిల్ల‌ల‌కు ప్ర‌తీ త‌ల్లి పాల‌బువ్వ పెడుతుంది. అదో ఆనందం, అదో అనిర్వ‌చ‌నీయ అనుభూతి. పిల్ల‌ల‌కు చంద్రుడిని చూపించ‌డం అందులో పిల్లి ఉంద‌ని క‌థ‌లు చెప్ప‌డం మాత్రం త‌రాలు మారినా ఆ క‌థ‌లు మాత్రం మార‌వు. అదుగో అలా క‌థ‌లు వినే ఉంటాడు మాథ్యూ గాల‌గ‌ర్‌. అత‌నికి చంద‌మామ అంటే మ‌హా యిష్టం. పెద్ద‌య్యాక చంద్రుడి మీద‌కి వెళ్లి నిజంగానే పిల్లితో ఆడాల‌ని మ‌హాకోరిక‌. కానీ అనుకున్న‌వేవీ జీవితంలో జ‌ర‌గ‌వు. జ‌ర‌గాల్సిన‌వే జ‌రుగుతాయి. మాథ్యూకీ అంతే. అత‌ని ప‌ద‌కండో ఏట జ‌బ్బు చేసి చ‌నిపోయాడు. అత‌ని త‌ల్లి కోరీ మాత్రం ఆకాశం వేపు చూసిన‌పుడ‌ల్లా పోనీ అక్క‌డ‌కి వెళ్లాల‌నే వెళ్లాడ‌నే అనుకుంటోంది.. దుఖాన్ని మింగుతూ. పిల్లాడి చితాభ‌స్మాన్ని చంద్రుడి మీద‌కి పంప‌డానికి సిద్ధ‌ప‌డింది కోరి. వ‌చ్చే ఏడాది ఆమె కోరిక ఫ‌లించ‌వ‌చ్చు. ఫ్లారిడాకి చెందిన స్కాట్‌, కోరి ల పిల్ల‌వాడు మాథ్యూ. పిల్లాడు ఊహించ‌నివిధంగా ప‌ద‌కండేళ్ల‌కే క‌నుమూశాడు. వారి దుఖానికి అంతే లేదు. వాడికి అంత‌రిక్షం, చంద‌మామ గురించి తెలుసుకోవ‌డం మ‌హా స‌ర‌దాట‌. వాడు మ‌మ్మ‌ల్ని విడిచి చంద‌మామ‌తో ఉండ‌డానికే ముందుగా వెళిపోయాడు.. అంటున్నారు మాథ్యూ బంధుగ‌ణం. అయితే వాడి చితాభ‌స్మం పంపితే మేము వాడిని పంపిన‌ట్ట‌వుతుంద‌ని ఆ త‌ల్లిదండ్రులు భావిస్తున్నారు.  అయితే అలా మ‌నిషి అయినా, చితాభ‌స్మం పంపించాల‌న్నా చాలా క‌ష్టం. దానికి భ‌రించ‌లేని ఖ‌ర్చ‌వుతుంది. కానీ మాథ్యూ ప‌ట్ల ఆ త‌ల్లిదండ్రుల ప్రేమ కంటే అదేమంత పెద్ద ఖ‌ర్చుకాదు. కోరీ మాత్రం ఆమె బంధువులు, స్నేహితులు చెప్పిన‌ట్లు  ఆర్దిక స‌హాయం చేసేవారిని తిర‌స్క‌రించ‌వ‌ద్ద‌నే అనుకుంది. నాసా వారి స్పేస్ ఎక్స్‌లో పంప‌డానికి ఏర్పాట్ల గురించి నెట్‌లో స‌మాచా రాన్ని సేక‌రించింది. సంబంధిత అధికారుల‌ను క‌లిసింది. లూనా ప్ల‌యిట్‌లో పంపాల‌ని నిశ్చ‌యించుకున్నారు. కానీ దానికి 12,500 డాల‌ర్లు అవుతుంది. ఆ సంగ‌తి తెలుసుకుని మాథ్యూ బంధువులు, స్నేహితులు, కోరి దంప‌తుల  స్నేహితులు అంద‌రూ తోచినంత ఎక్కువగానే స‌హాయం చేశారు.  ఇప్ప‌టికి 14వేల డాల‌ర్లు స‌మ‌కూరాయి. ఫ్ల‌యిట్ వ‌చ్చే ఏడాది వెళుతుంది. మా పిల్ల‌వాడి బంగారు క‌ల వ‌చ్చే ఏడాది ఫ‌లించ‌నుంది అని స్కాట్ అంద‌రితో చెబుతున్నాడు.  అన్ని స‌న్న‌ద్ధం చేశారు. చితాభ‌స్మాన్ని పంప‌డ‌మంటే పిల్లాడి ఆశ‌లు ఫ‌లించిన‌ట్టేన‌ని కోరీ అన్న‌ది. ఇంత‌కంటే ఏ త‌ల్లీ ప్రేమ‌ను ప్ర‌క‌టించ‌లేదేమో!

కేటీఆర్ కోరికలకు కేసీఆర్ కళ్ళెం ?

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసుడు, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్  అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. నిజానికి, 2018 ఎన్నికలకు ముందు నుంచి కూడా త్వరలోనే కేటీఆర్ పట్టాభిషేకం తద్యమనే వార్తలొచ్చాయి. ముహూర్తాలు ఖరారయ్యాయి. బహిరంగ వేదికల నుంచి మంత్రులు, తెరాస ముఖ్య నేతలు, అయన సమక్షంలోనే  కేటీఆర్ ను కాబోయే ముఖ్యమంత్రిగా సంభోదించారు. అయితే, అక్కడక్కడా వినిపిస్తున్నట్లుగా  కుటుంబ కలహాలు కారణమా,ఇంకేదైనా కారణమా, ఏమో కానీ, విఘ్నేశ్వరుని పెళ్లి ముహూర్తం లాగా, కేటీఆర్ పట్టాభిషేక ముహూర్తానికి బ్రేకులు పడుతూనే ఉన్నాయి,  రామన్న పట్టాభిషేక ముహుర్తం ఇంతవరకు ముడిపడలేదు.   అదలా ఉంటే, తాజా సమాచారం ప్రకారం, ఇక ఈసారికి కేటీఆర్ కి ముఖ్యమంత్రి యోగం లేనట్లేనని అంటున్నారు. అదే విషయాన్ని వాళ్ళు వీళ్ళూ కాకుండా మంత్రి కేటీఆరే స్వయంగా వెల్లడించారు. మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆరే అని స్వయంగా ప్రకటించారు.ఇటీవల మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేటీఆర్  వచ్చే ఎన్నికల్లోనూ తెరాస 90 ప్లస్ సీట్లు తెచ్చుకుని. అధికారంలోకి వస్తుందని చెప్పు కొచ్చారు. అది ఎంత నిజమో  ఏమో కానీ కేటీఆర్ అక్కడితో ఆగకుండా, దక్షిణాదిలో తొలి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డ్ సృష్టిస్తారని ఇంకో మాట జోడించారు. సరే మళ్ళీ తెరాస అధికారంలోకి వస్తుందా, రాదా అనే విషయాన్ని పక్కన పెడితే, వస్తే మాత్రం మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని, కేటీఆర్  స్పష్టంగానే చెప్పారు. ఇదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. నిజానికి కేటీఆర్ ఒక్కరే కాదు, గతంలో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని పబ్లిక్ గా చెప్పిన నాయకులతో సహా తెరాస నాయకులు గత కొంత కాలంగా ఇదే విషయం చెపుతూ వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారు  కొత్త సచివాలయంలోకి ముఖ్యమంత్రిగా ఆయనే కాలు పెడతారని తెరాస నేతలు టీవీ చర్చలలో ఇతరత్రా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కేటీఆర్ స్వయంగా అదే విషయాన్ని శంఖంలో పోశారు.  సో .. అప్పటి సంగతి ఎలా ఉన్నా ఇప్పటికైతే కేటీఆర్ ముఖ్యమంత్రి ‘కుర్చీ’ కోరికకు కళ్ళెం వేసినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.పార్టీలోనూ అదే చర్చ జరుగుతోందని అంటున్నారు.  అయితే ఇంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చింది? కొద్ది రోజుల క్రితం వరకూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళతారని ఫ్రంట్ కాదంటే జాతీయ పార్టీ పెట్టేసి, ఢిల్లీ వెళ్లి పోతారని, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్ కి అప్పగిస్తారని, అదనీ, ఇదనీ చాలా చర్చ జరిగింది. చాలా చాలా  ఉహాగానాలు వినిపించాయి. ఉహాగానాలు కూడా కాదు స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు జాతీయ ఆలోచనలను బహిరింగంగానే వినిపించారు.  మరోవంక  ఎక్కడా పెద్దగా ఖండనలు రాలేదు. తెరాస నాయకులు  ఎవరూ ఉహాగానాలను  కాదనలేదు. ఖండించలేదు. మరోవంక, అవును అది నిజమే అనే సంకేతాలు ఇస్తున్నారా అన్నట్లుగా కేటీఆర్ కూడా దూకుడు పెంచారు. వేషం కాకపోయినా భాష మార్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవలసిన కీలక నిర్ణయాలు స్వయంగా అయనే తీసుకున్నారని, తీసుకుంటున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి.   కానీ, ఇప్పుడు కేటీఆర్ ఎందుకు  ‘యు’ టర్న్ తీసుకున్నారు? అంటే  అందుకు సర్వేలే కారణమని అంటున్నారు. ముఖ్యంగా  ప్రశాంత్  కిశోర్ బృందం పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతకు కారణం ఏమిటి? అనే విషయంగా నిర్వహించిన ‘ప్రత్యేక’ సర్వేలలో, తెరాసను వ్యతిరేకిస్తున్న వారిలో అత్యధిక శాతం ప్రజలు, కుటుంబ పాలనకు వారసత్వ రాజకీయాలకు పెద్ద పీట వేశారు.  పీకే సర్వేతో పాటుగా ఇతర  సర్వేలలోనూ, తెరాసను వ్యతిరే కిస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది, ప్రదానంగా కుటుంబ వారసత్వ రాజకీయాలను. కుటుంబ అవినీతిని  వ్యతిరేకిస్తున్నట్లు తేలిందని అంటున్నారు. అలాగే, కేంద్ర సంస్థలు నిర్వహించిన సర్వేలలోనూ కుటుంబ పాలన, కుటుంబ అవినీతిని తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున విషయం తేట తెల్లమైందని  తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే ప్రధాన మంత్రి నరెంద్ర మోడీ కూడా, కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలపై దృష్టి పెట్టాలని, రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు, రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా వినవస్తోంది.  ఈ నేపధ్యంలోనే, కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు, కుటుంబ అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు,ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకే కేటీఆర్ ముఖ్యమత్రి  రేసు నుంచి తప్పుకున్నారని అంటున్నారు. అంతే కాకుండా, మహారాష్ట్ర పరిణామాల అనంతరం, బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనే మాట బహిరంగంగా వినిపిస్తున్న నేపధ్యంలో  ఇప్పడు నాయకత్వ మార్పు జరిగితే,  బీజేపీ సహకారంతో  తెరాసలో షిండేలు పుట్టుకు రావచ్చనే అనుమానాల చేతనూ  ప్రస్తుతానికి, యథాతథ స్థితి కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఈ మేరకు  కేసీఆర్, కేటీఆర్ ఒక అంగీకారానికి వచ్చారని అంటున్నారు. అదొకటి అలా ఉంటే, నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కాలంగా కుటుంబంలో ఎంతగా వత్తిడి వచ్చినా, కేటీఆర్ కి పగ్గాలు అప్పగించక పోవడానికి కూడా ఇదే కారణంగా అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ కోరుకున్నదే ప్రశాంత్  కిశోర్  సర్వేలు చెప్పాయి. మరో వంక, మహారాష్ట్ర పరిణామాలు కూడా కలిసొచ్చాయి. అలా కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదిపి, కేటీఆర్ నోటి నుంచే ‘హ్యాట్రిక్’ పలుకులు పలికించారనే మరో వాదన కూడా వినిపిస్తోంది. అవును  కేసీఆర్  రాజకీయ చతురత గురించి, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవలసిన  అవసరం లేదు. కానీ, చెప్పుకోక తప్పడం లేదు. ముఖ్యమంత్రి కేసీఅర్  చాలా కాలంగా కుటుంబంలో చాలా చాలా సమస్యలు ఎదుర్కున్నా, చివరాఖరుకు కుటుంబ రాజకీయాల్లోనూ పై చేయి సాధించారని, కేటీఆర్  కోరికలకు కళ్ళెం వేయడంలోనూ అయన సక్సెస్ అయ్యారని అంటున్నారు.

 ధిక్క‌ర‌ణ‌ కేసుల‌కు ప్ర‌భుత్వ న్యాయ‌వాదులా.. కోర్టు ఆగ్ర‌హం

అధికారంలో వున్నామ‌ని కుర్చీలు, బ‌ల్లలూ, ప‌రిక‌రాలు వాడిన‌ట్టు ప్ర‌భుత్వ లాయ‌ర్ల‌ను వాడేయ‌చ్చ‌ని తెలంగాణా ప్ర‌భుత్వం అనుకుంది. కానీ అదంతా న‌డ‌వ‌దు.. ప్ర‌భుత్వాధికారులైనంత మాత్రాన ప్ర‌భుత్వ లాయ‌ర్ల‌ను వినియోగించుకోరాద‌ని హైకోర్టు తెలంగాణా ప్ర‌భుత్వాన్ని మంద‌లించింది. అధికారుల కోర్టు ధిక్కారం కేసుల్లో సొంత ఖ‌ర్చుల‌తో న్యాయ‌వాదుల‌ను నియ‌మించుకోవాల్సిందేన‌ని మంద‌లించింది. ప్ర‌భుత్వాధి కారుల త‌ర‌ఫున అడ్వ‌కెట్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యానికి చెందిన ప్ర‌భ‌త్వ న్యాయ‌వాదులు హాజ‌రు కావ‌డంపై హైకోర్టు ఆగ్ర‌హించింది.   ఒక  కోర్టు ధిక్కరణ కేసులో అధికారుల తరఫున ప్రభుత్వ న్యాయవాదులు హాజరుకావడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.  అధికారుల ధిక్కరణ కేసులకు ప్రజల సొమ్మును ఖర్చు చేస్తారా? అని ప్రశ్నించింది. రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ చట్టం-2013 ప్రకారం భూమిని సేకరించి.. నాలుగేళ్లుగా పరిహారం చెల్లించడం లేదంటూ రంగా రెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం నాగాహిల్స్‌లోని సర్వే నంబర్‌ 66లో ఉన్న 276 చద రపు గజాల ప్లాట్‌ విషయంలో ఆ భూమి యజమాని మహమ్మద్‌ ఖాజం అలీ  కోర్టులో ధిక్కరణ  పిటిషన్‌ వేశారు. జీహెచ్ ఎంసీ అధికారులు ఆ భూమి వివాదాస్పదమైనదని చెప్పడంపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భూసే కరణ చేసి.. రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక.. ఇప్పుడు అది ప్రభుత్వ భూమి అని చెప్ప డాన్ని తప్పు బట్టింది. ఈ అంశంపై జీహెచ్‌ఎంసీ వెస్ట్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. సోమవారం ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సూరేపల్లి నందా నేతృత్వం లోని ధర్మాసనం విచారించింది.  జీహెచ్‌ఎంసీ వెస్ట్‌జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ వెంకన్న కొవిడ్‌ కారణంగా విచారణకు హాజరుకాలేక పోయారు. కోర్టు ధిక్కరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల తరఫున ఏజీ కార్యాలయం ప్రాతినిధ్యం వహించ డంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాదంలో ఉన్న భూమి గవర్నమెంట్‌ స్థలమని ప్రభు త్వం తరఫు న్యాయవాది పేర్కొనగా.. అయితే భూసేకరణ ఎందుకు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ కేసులో భూమి టైటిల్‌ను తేల్చడం తమ పనికాదని.. పరిహారం అందిందా? లేదా? అన్న అంశాన్ని మాత్రమే పరిశీలిస్తామని స్పష్టంచేసింది. 

 ఇంటింటికీ రేష‌న్‌.. జ‌గ‌న్ స‌ర్కార్‌కు కోర్టు మ‌రో మొట్టికాయ‌

భ‌గవంతుని లీల‌లు ఎవ్వ‌రికీ అర్ధంగావంటారు మ‌త‌ప్ర‌చార‌కులు. ఎప్పుడు ఏది జ‌రుగుతుంద‌న్న‌ది ప‌ర‌మాత్మున‌కే ఎరుక అని బోధ‌చేస్తుంటారు. అందువ‌ల్ల సామాన్య‌మాన‌వులం పెద్ద‌గా దాన్ని గురించి ఆలోచించ‌వ‌ద్ద‌ని, నీతిగా బ‌త‌క‌మ‌నీ బోధిస్తుంటారు గురువులు. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి  ప‌రిపాల‌నా లీల‌లు ఆయ‌నంత‌ట ఆయ‌నే ప్ర‌జ‌ల‌కు అర్ధమ‌య్యేలా చేస్తుంటారు. వ్య‌ర్ధానికి అస‌లు అర్ధం ఆయ‌నే ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డం మ‌రెవ్వ‌రివ‌ల్లా ఏ ప్ర‌భుత్వం వ‌ల్లా కాలేదు. రాష్ట్రంలో పాఠ‌శాల‌ల విలీనం పేరుతో విద్యార్ధుల‌ను పక్క వీధికి కాకుండా ప‌ది కిలోమీట‌ర్ల ప్ర‌యాణానికి సిద్ధ‌ప‌డేలా చేశారు. అందుకు పూర్తి విరుద్ధంగా గ్రామాల్లో ప్ర‌జ‌లు ప‌క్క‌నే వున్న ప‌చారీ కొట్టుకు వెళ్ల‌లేర‌ని రేష‌న్ స‌రుకునంతా బండ్ల మీద ఇళ్ల వ‌ద్ద‌కే తోలుతున్నారు. ఇది వింత విడ్డూరమా.. జ‌గ‌న్ మ‌తి భ్ర‌మించిందా.. అన్న అనుమానాలు యావ‌త్  ఆంధ్రా చ‌ర్చించుకుంటోంది. ఒక్క ఆలోచ‌న జీవితాన్నే మారుస్తుందంటారు.. జ‌గ‌న్  ఒక్కో ఆలో చనా ఒక్కోర‌కం ఇబ్బందికి గురిచేస్తోంది.  జ‌గ‌న్ ఆలోచ‌న‌తో రాష్ట్రంలో ప్ర‌జ‌లు ప‌చారీకొట్టుకు వెళ్ల‌లేని బ‌ద్ధ‌క‌స్తులా అనే అనుమానం త‌లెత్తుతోంది. వాహ‌నాలుపెట్టి రేష‌న్ సామాన్లు అందించే వ్యాపారంతో ఎవ‌రికి ల‌బ్ధి క‌లుగుతుందో గానీ, ఆ వాహ‌నాలేవో పిల్ల‌ల్ని బ‌డికి తీసికెళ్లేందుకు క్యాబ్‌లుగా పెడితే త‌ల్లిదండ్రులు వేనోళ్ల కీర్తించేవారు క‌దా జ‌గ‌న‌న్నా!  ఈ స‌ల‌హాదారులెవ‌రూ ఇటువంటివి చెప్ప‌రేమో! జ‌గ‌న్ ఈ విధంగా ప్ర‌జ‌ల ధ‌నం వృధా చేస్తున్నార‌ని హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దానిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌మ‌ని కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌  ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. పక్కనే ఉన్న చౌకధరల దుకాణాలకు వెళ్లకుండానే ఇంటి వద్దే సరకులు ఇస్తామనడంలో హేతుబద్ధత ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. సరకులు పంపిణీ చేసినందుకు వాహనాల ద్వారా ప్రజాధనాన్ని భారీగా వినియోగిస్తున్నారని కోర్టు పేర్కొంది. వీలు చూసుకుని ప్రజలు అరగంట కేటాయిస్తే రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చని, ఆ స్థితిలో కూడా పేదలు లేరా అని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రేషన్ సరుకుల పంపిణీకి డీలర్ కు ఇచ్చే కమీషన్ కంటే డోర్ డెలివరీ ద్వారా ప్రజాధనం భారీగా దుర్వి నియోగం అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. రేషన్ షాపులకు రాకుండా డోర్ డెలివరీ చేయడానికి చేసే ఖర్చుతో పేదలకు మరిన్ని రేషన్ సరుకులు అందించ‌వ‌చ్చని కోర్టు సూచించింది. సరకుల సరఫరా, చౌకదుకాణాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్నదని.. మరి కేంద్రం నుంచి రేషన్ డోర్ డెలివరీకి అనుమతి తీసుకున్నారా, ఏ  నిబంధన లను అనుసరించి వాహనాల ద్వారా ఇంటింటికీ సరకుల పంపిణీకి సిబ్బందిని నియమించారు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తమ ప్రశ్నలకు వివరణ ఇస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.  వాహనాల ద్వారా ఇంటివద్దకే సరకుల సరఫరా పథకాన్ని, అందుకు సంబంధించిన జీవోలను సవాలు చేస్తూ ‘ఏపీ చౌకధరల దుకాణదారుల సంక్షేమ సంఘం’ హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ పథకం కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ఉద్దేశం సక్రమంగా నెరవేరుతున్నట్లు కనిపించడం లేదన్నారు. మొబైల్‌ వాహనం ఎప్పుడొస్తుందో తెలీక నిరుపేదలు, రోజుకూలీలు పనులు మానుకొని ఇంటి వద్దే ఎదురుచూడాల్సి వస్తుం దన్నారు.  ఇంటింటికీ రేషన్ పథకం అమలు కోసం ఏపీ ప్రభుత్వం దాదాపు 92 వేల మందిని నియమించగా, వాహన దారుకు ఒక్కొక్కరికి నెలకు రూ.21 వేలు చెల్లిస్తున్నారని కోర్టుకు తెలిపారు. రేషన్ డెలివరీ వాహనాల కోసం సైతం రూ.600 కోట్లు ఖర్చు చేశారని కోర్టుకు తెలిపారు. కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో కొండలు, గుట్టలు దాటి గిరిజనులు సరకులు తెచ్చుకోవాల్సి ఉంటుందని, అలాంటి చోట రేషన్ డోర్ డెలివరీ చేస్తే అర్థం ఉంటుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వివరాలు సమర్పించాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వాలు పలు విధానాలు అమలు చేస్తాయని అందులో భాగంగా రేషన్ సరుకులని పేద ప్రజలకు ఇంటింటికీ సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు ఏజీ శ్రీరామ్‌. ఇలాంటి ప్రభుత్వ విధాన నిర్ణయాలలో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదన్నారు. అయితే న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు పూర్తి వివరణతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు.

ఇది ప్రకృతి విపత్తు మేమేం చేయలేం.. అంబటి

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏ ప్రభుత్వమైనా, ప్రభుత్వ పెద్దలైనా ఏం చేయాలి? కాలికి బలపం కట్టుకుని మరీ బాధిత ప్రాంతాల్లో తిరగాలి. బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు సరిగా జరిగేలా చూడాలి. గతంలో విశాఖపట్నంలో హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు అలాగే చేశారు. ప్రత్యేక బస్సులో విశాఖ వెళ్లి, సహాయ కార్యక్రమాలు సజావుగా జరిగేలా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. బస్సులోనే  బస చేసి మరీ రేయంబవళ్లు   బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా చూశారు. తుపాను ధాటికి ధ్వంసమైపోయిన సుందర విశాఖ నగరాన్ని కొద్ది రోజుల వ్యవధిలోనే యథా పూర్వస్థితికి వచ్చేలా చేశారు. అంతకు ముందు కూడా పలు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ఈ విధంగానే స్పందించాయి. అయితే.. తాజాగా ఏపీలో     గోదావరికి  భారీ వరదలు వచ్చాయి. ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసి  జనం సురక్షిత ప్రాంతాలకు, సహాయక శిబిరాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. ఇంతలా గోదావరి నది విరుచుకు పడితే.. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు మాత్రం  ‘ఇది ప్రకృతి విలయం. మనమేం చేయలేం’ అంటూ చేతులెత్తేశారు. ఈ విషయాన్ని ఆయన మీడియా సమావేశంలోనే చెప్పి తన చాతకాని తనాన్ని చాటుకున్నారు. జులై నెలలో గోదావరి నదికి భారీ వరదలు రావడం అరుదన్నారు. సాధారణంగా జులై నెలాఖరులోనో, ఆగస్టులోనో వరదలు వస్తాయి. కానీ ఇంత భారీ స్థాయిలో వరదలు జులై నెల మధ్యలోనే రావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇంతలా వరదలు విరుచుకుపడతాయని అస్సలు ఊహించలేదని ఆయన చెప్పారు. జనం దీనినే తప్పుపుడుతున్నారు.  వరదలు ముంచుకొస్తాయని ముందే హెచ్చరించాల్సిన వాతావరణ విభాగం పనిచేయలేదా? ముసుగుదన్ని పడుకుందా? అని నిలదీస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని వందలాది లంక గ్రామాలు వరదనీటిలో మునిగిపోయి బాధితులు అల్లాడిపోతుంటే.. స్పందించి సహాయం అందించాల్సిన ప్రభుత్వం  మొద్దు నిద్రపోతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.  బాధితులను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో, సహాయక శిబిరాల్లో ఆహారం, పాలు, తాగునీరు లాంటి సౌకర్యాల కల్పించడంలో వైసీపీ సర్కార్ విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకొల్లు తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పలు లంక గ్రామాల్లో గుండె లోతు నీటిలో నడిచి వెళ్లి మరీ బాధితులకు సహాయం అందించారు. లంక గ్రామాల్లోనే రాత్రిళ్లు బస చేసి మరీ వారికి అండగా నిలిచారు. అయితే అధికార వైసీపీ నేతలు  ఎవరూ వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను పలకరించిన వైనం, పరామర్శించిన దాఖలాలు లేవంటున్నారు. పైగా అంబటి తీరిగ్గా విజయవాడలో మీడియా సమావేశం పెట్టి మరీ ‘మనమే చేయలేం’ అనడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఒక పక్కన వరద విలయ తాండవం చేస్తుంటే.. బాధితులను ఆదుకోకపోగా.. ఈ సందర్భాన్ని కూడా రాజకీయం చేయడానికి మంత్రి అంబటి ప్రయత్నించడాన్ని తప్పుపడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు ఏకమై వచ్చినా ఒంటరిగానే ఎదుర్కొనగల ప్రజాదరణ గల నేత జగన్ అని చెప్పుకున్నారు. వరదలు, జనం బాధలు, నష్టం గురించి పట్టించుకోని మంత్రి పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి ప్రధాన కారణం టీడీపీ ప్రభుత్వమే అని నింద వేస్తుండడం ఏంటని అంటున్నారు. కాఫర్ డ్యామ్ కట్టకపోయినా ఫర్వాలేదని ఇంజనీర్లు చెబుతున్నారంటూనే.. అనుకున్న సమయానికి దిగువ కాఫర్ డ్యామ్ ను పూర్తిచేయలేకపోయామని తప్పు ఒప్పుకోవడం గమనార్హం. వర్షాలు, వరదలతో అల్లాడిపోతున్న బాధితులను స్వయంగా పరామర్శించకుండా గాల్లోనే తిరిగి గాల్లోనే తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిపోయిన జగన్ ఎక్కడ? హుద్ హుద్ తుపాను బీభత్సం సమయంలో విశాఖలోనే మకాం వేసి సహాయ కార్యక్రమాలను పరుగులు పెట్టించిన చంద్రబాబు ఎక్కడ? అంటూ జనం చెప్పుకుంటున్నారు.

 ఎంత అంద‌మో.. అంత భయానకం

జాబిల్లీ రావే పాల బువ్వ తేవే  అంటూ త‌ల్లి బిడ్డ‌కి అన్నం త‌నిపిస్తుంది. అచ్చం చంద‌మామే అంటూంది పెద్దామె త‌న మ‌న‌వ‌రాల్ని.. వెన్నెల్లో ఆడుతూ పాడుతూ.. అంటూ హీరోగారు. హీరోయిన్‌తో అనేక నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లిస్తుంటాడు.. అదంతా కాదు అస‌లు ఆకాశంలో చూడాల్సిన‌వి న‌క్ష‌త్రాల వింత‌లు, సూప‌ర్ మూన్ వంటి అపుడ‌పుడూ సంభ‌వించే వింత‌లు అని ఖ‌గోల‌శాస్త్ర‌వేత్త‌లు అంటూంటారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే వుంది. కానీ ఇటీవ‌లి తుపానులు, భారీ వ‌ర్షాలు.. ఇవ‌న్నీ సూప‌ర్ మూన్ ప్ర‌భావ‌మే అని శాస్త్ర‌వేత్త‌లే అంటున్నారు. మ‌రి అంద‌ర‌మ‌యిన సూప‌ర్‌మూన్ మాన‌వాళికి ఇంత‌టి దారుణాన్ని ఎలా ఒడిగ‌ట్టింది?  గులాబీని చూసి ఆవేశ‌ప‌డితే ముళ్లు గుచ్చుకుంటాయి బ్రో!  ఆకాశంలో అద్భుతాల‌న్నీ భీక‌ర ప‌రిస్థితుల‌నూ సృష్టిస్తాయన్న నిజం ఇటీవ‌ల అనుభ‌వంలోకి వ‌స్తేగాని పూర్తిగా అర్ధం కాలేదు. ఎందుకంటే ఇలాంటివి సంఘ‌ట‌న‌ల మ‌ధ్య శ‌తాబ్దాల అంత‌రం ఉండ‌ట‌మే. అపు డపుడూ ఆస్ట్రాయిడ్స్ కూడా భ‌య‌పెడుతూంటాయి. ఆమ‌ధ్య ఒక‌టి భూమికి స‌మీపంలోకి వ‌చ్చి వెళిపో యింద‌న్న‌ది శాస్త్ర‌వేత్త‌ల‌కు శాస్త్ర‌ప‌ర‌మైన అంశ‌మే కావ‌చ్చుగానీ, మామూలు మ‌న‌లాటి వాళ్ల‌కి ప్రాణ భీతి క‌ల్పించింది. ఒక్క‌సారి ఉల్కాపాతం జ‌రిగితే భూమి ఏం కావాల‌న్న భ‌యం వెన్నులో ఒణుకు పుట్టిస్తుంది.  చిత్ర‌మేమిటంటే.. ఈ అందాలు, భ‌యోత్పాతాల విష‌యాల‌న్నీ నాసా వారే క‌నుగొని భ‌యాన్ని బాగా ప్ర‌చా రం చేయ‌డం. వారి వ‌ద్ద వున్న అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం మ‌రెవ్వ‌రికీ అంత‌గా అందుబాటు లో లేక పోవ‌డం, నిత్యం అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతూండ‌డంతో అమెరికా శాస్త్ర‌వేత్త‌లే ప్ర‌పంచ మాన‌వాళిని ఆనంద‌ప‌రుస్తున్నారు, చిన్న‌పాటి హెచ్చ‌రిక‌తో మ‌రింత నిద్ర‌లేకుండానూ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఎంతో శ‌క్తివంత‌మైన సౌర తుపాను భూమిని తాక‌బోతోంద‌ని నాసా ప్ర‌క‌టించింది. ఓర్నాయ‌నో.. అంటూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని తారాజువ్వ‌నో, గాలిప‌టాన్నో చూస్తున్న‌ట్టు చాలామంది ఆకాశం వంకే చూస్తున్నారు. అదేమ‌న్నా విజ‌యా స్టుడియోవారి చంద‌మామా.. చ‌క్క‌గా ఆనంద‌ప‌ర‌చ‌డానికి! అయితే ఈ  సౌర తుపాను  ప్రభావంతో సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు, జీపీఎస్‌ వంటి సేవలకు అంతరాయం కలిగే అవకాశముందని పేర్కొంది. సూర్యుడి వాతావరణంలో ఉద్భవించిన ఈ తుపాను గంటకు 16 లక్షల కిలో మీటర్ల వేగంతో భూమి దిశగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాని వేగం మరింత పెరిగే అవ కాశముందని, ఎప్పుడైనా భూ గ్రహాన్ని తాకవచ్చని హెచ్చరించారు.   అయితే, అది భూవాతావ‌ర‌ణంలోకి ఎప్పుడు స‌రిగ్గా ప్ర‌వేశిస్తుంద‌న్న‌ది ఖ‌చ్చితంగా ఇంకా ప్ర‌క‌టించ‌ లేదు. దీనివల్ల ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాల్లోని ప్రజలు అందమైన ఖగోళ కాంతిని చూడగలరని తెలిపారు. సౌర తుపాను ప్రభావంతో భూగోళపు  బాహ్య వాతావరణం వేడెక్కే  అవకాశముందని  శాస్త్రవేత్తలు వివ రించారు. ఈ ప్రభావం ఉపగ్రహాలపై పడి.. నేవిగేషన్‌, మొబైల్‌ ఫోన్‌ సిగ్నళ్లు, శాటిలైట్‌ టీవీ వంటి సేవల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్తు తీగల్లో ప్రవాహ తీవ్రత పెరిగి ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయే ముప్పుందని హెచ్చరించారు. మానవ ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం ఉంటుందని తెలిపారు.  మాన‌వాళికి మ‌రింత ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా ఉండాల‌ని కోరుకుందాం. 

చావు అంచుకెళ్లి తిరిగి వచ్చిన మృత్యుంజయులు!

మధ్యప్రదేశ్‌లో కుండపోత వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలోని నదలు, వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కొందరు ప్రమాదవశాత్తున వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి పలు సంఘటనల్లో కొందరు అదృష్ట వశాత్తూ మృత్యు ముఖం నుంచి బయట పడ్డారు. అటువంటి సంఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిని జిల్లా మహిద్‌పూర్‌లో ఓ బొలెరో వాహనం వరదల్లో కొట్టుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లకు భయంతో రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.   బొలెరో వాహనం బ్రిడ్జి పైకి రాగానే నీటి ప్రవాహ తీవ్రతను అంచనావేయడంలో విఫలమైన డ్రైవర్ మొండిగా వాహనాన్ని ముందుకు కదిలించాడు. కొంత దూరం వెళ్లగానే వాహనం ఆగిపోయింది.  వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో  వాహనం కొట్టుకపోయింది. వాహనంలోని ముగ్గురు వ్యక్తులు చివరి క్షణంలో బయట పడి ప్రాణాలు దక్కించుకున్నారు.  క్షణాల వ్యవధిలోనే ఉధృతంగా ప్రవహిస్తున్న వరదలో కారు కొట్టుకుపోయింది.  క్షణాల్లో జరిగిపోయిన ఈ ఘటనను మరో గట్టుపై ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశాడు. 

 జుడా గ్రేస్ జ‌న‌నం.. యాదృచ్ఛికం!

అద్భుతాల‌న్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయి. వాటిలో కొన్ని యాదృచ్ఛికం. ఊహకే అంద‌ని విధంగా జ‌రిగిపోతుం టాయి. అలాంటిదే అమెరికా అల్మాన్స్ రీజియ‌న‌ల్ మెడ‌క‌ల్ సెంట‌ర్‌లో. ఇక్క‌డ అబెర్లీ అనే మ‌హిళ‌కు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 2వ తేదీన మ‌ధ్యాన్నం స‌రిగ్గా 2.22 నిమిషాల‌కు బిడ్డ పుట్టింది. అదీ చాలా విచిత్రంగా ఆస్ప‌త్రి రెండ‌వ వార్డులో! ఉత్త‌ర క‌రోలినా కుటుంబం ఆనందానికి అంతేలేదు. అక్క‌డి వారంతా ఇంకా గ్రేస్ జ‌న‌నం గురించి చెప్పుకుంటున్నారు.. క‌థ‌లు క‌థ‌లుగా.  ఉత్త‌ర క‌రోలినా వాసులు, ముఖ్యంగా జూడా ఇంటి ప‌రిస‌రాల‌వారంతా ఆశ్చ‌ర్య‌ప‌డుతున్న‌ది ఆ బిడ్డ త‌ల్లి అబెర్లీకి కేన్స‌ర్‌. ఆమె చికిత్స పొందుతోంది. అయినా గ‌ర్భందాల్చ‌డం బిడ్డ పుట్ట‌డం వారెవ‌రూ ఊహిం చ‌నే లేద‌ని అంటున్నారు.  ఆ ఆస్ప‌త్రి వ‌ర్గాలు త‌ల్లీ బిడ్డ‌లు క్షేమంగానే ఉన్నందుకు ఎంతో ఆనందిస్తున్నారు. ఎందుకంటే, ఇన్ఫె క్షన్ తో పోరాడే శరీర సామర్థ్యాన్ని నిరోధించే శోషరస వ్యవస్థ అబెర్లీలో ఉండ‌టం విశేషమ‌ట‌. పైగా ఇలా చిత్రంగా అన్నీ రెండు అంకెలు క‌లిసే రోజున జ‌న్మించ‌డం పూర్వ‌జ‌న్మ సుకృతం అంటున్నారు ఆస్ప‌త్రి సీనియ‌ర్ డాక్ట‌ర్లు.  వారేకాదు అబెర్లీ ప‌క్కింటి బామ్మ‌గారూ అదే మాట అంటున్నారు. ఆ అమ్మాయి ప్రార్ధన‌లు భ‌గ వంతుడు విన్నాడు. అందుకే చ‌రిత్ర సృష్టించింది ఆ బంగారు త‌ల్లి అని న‌వ్వుతూ అంద‌రికీ చెబుతోం దామె.  ఇలా జ‌రగ‌డం చాలా అరుదు అని వారి సంబంధిత చ‌ర్చ్ ఫాద‌ర్ కూడా ఆశీర్వ‌దించి వెళ్లారుట‌.  మ‌రి ఇలాంటి జ‌న‌నాలు మీ ప‌రిస‌రాల్లో జ‌రిగాయేమో గుర్తు తెచ్చుకోండి.