రాష్ట్రానికి రూ.2,25,486 కోట్లు ఇవ్వండి: బాబు డిమాండ్

  ప్రధాని నరేంద్ర మోడీతో మొన్న సమావేశమయిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు చేప్పట్టేందుకు వీలుగా రాష్ట్రానికి మొత్తం రూ. 2,25,486 కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరారు. తానేమీ కొత్తగా నిధులు కోరడం లేదని రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల ప్రకారమే రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులను కోరుతున్నానని ఆయన స్పష్టం చేసారు. బీహార్ రాష్ట్రానికి ఇటీవల మోడీ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీని చూసి తను ఈ డిమాండ్లు ప్రధాని ముందు పెట్టడం లేదని, వీటి గురించి చాలా కాలంగా కేంద్రప్రభుత్వాన్ని తను అడుగుతున్నానని తెలిపారు. కనుక తను సమర్పిస్తున్న ఈ నివేదిక ఆధారంగానే నీతి ఆయోగ్ అధికారులు రాష్ట్రానికి అందించవలసిన ఆర్ధిక ప్యాకేజిపై రోడ్డు మ్యాప్ తయారు చేయాలని ఆయన కోరారు.   చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి సమర్పించిన నివేదికలో శాఖల వారిగా కోరిన నిధుల వివరాలు: సాగునీరు, వ్యవసాయాభివృద్ధికి: రూ. 24, 627 కోట్లు, గ్రామీణ త్రాగునీటి సరఫరా: రూ. 13,714 కోట్లు, విద్యుత్: రూ. 3,190 కోట్లు, అటవీ శాఖ: రూ.1,950 కోట్లు, రహదారులు, మౌలిక వసతులు: రూ. 27,985 కోట్లు, రైల్వేలు: రూ. 21,420 కోట్లు, పోర్టుల అభివృద్ధి: రూ. 4,800 కోట్లు, విమానాశ్రయాల అభివృద్ధి: రూ. 3,100 కోట్లు, పర్యాటక శాఖ: రూ. 4,750 కోట్లు, పట్టణాభివృద్ధి రూ. 14,106 కోట్లు, మొత్తం: రూ. 2,25,486 కోట్లు.

సానియాకు షాక్.. ఖేల్ రత్నపై స్టే

  భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జాకు ఖేల్‌రత్న ప్రకటించింన సంగతి తెలిసిందే. అయితే సానియా మిర్జాకు ఖేల్‌రత్న ఇవ్వడంపై పారాలింపిక్ అథ్లెట్ హెచ్ ఎన్ గిరీశ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సానియా మిర్జాకు ఖేల్‌రత్న ఇవ్వడంపై స్టే విధించింది. తాము స్టే ఎత్తివేసేవరకూ ఆమెకు ఖేల్ రత్న ఇవ్వరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్నకు సానియా మిర్జా పేరుని సెలక్షన్ ప్యానెల్ ప్రతిపాదించడం 'అన్యాయం' అని 2012 లండన్ పారాలింపిక్స్ పోటీల్లో రజత పతక విజేత గిరీశ హోసనగెరె నాగరాజె గౌడ కేంద్రం తీరుపై తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఖేల్ రత్న అవార్డు కోసం కేంద్రం అనుసరించే పాయింట్ల విధానం ప్రకారం తాను 90 పాయింట్లతో రేసులో ముందున్నానని, సానియా మిర్జా నా దరిదాపుల్లో కూడా లేదని తెలిపాడు.

కేసీఆర్ జాగీరా అది

  మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. తన ఇష్టమొచ్చినట్టు చేయడానికి తెలంగాణ ఏమన్నా కేసీఆర్ జాగీరా అని మండిపడ్డారు. తన ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటే సరిపోదు.. అందరూ నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఇది తన ఇల్లు కాదు ప్రజాస్వామ్యమని ఎద్దేవ చేశారు. ఎవరు అడ్డుపడ్డా ఇరిగేషన్ ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తానని కేసీఆర్ అంటున్నారు.. కేసీఆర్‌దేమైనా రాజరికమా..? లేక జమిందార్ పాలనా? అని నిలదీశారు. ప్రాజెక్టులపై అఖిలపక్షంతో మాట్లాడి.. చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అయినా ఇప్పుడు కేసీఆర్ ప్రాజెక్టులపై నిందిస్తున్నారు.. మరి కాంగ్రెస్, టీడీపీ పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎందుకు మాట్లాడ లేదని.. అప్పుడు గుర్తుకురానివి ఇప్పుడు గుర్తుకొచ్చాయా అని అన్నారు. రైతులపట్ల నిర్లక్షం వహిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. కేసీఆర్ రానున్న రోజుల్లో అందుకు తగినమూల్యం చెల్లించుకోక తప్పదని పొన్నం వ్యాఖ్యనించారు.

జగన్ కల నెరవేరదు

  ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడానికి చంద్రబాబు చాలా కృషిచేస్తున్నారని చినరాజప్ప అన్నారు. కానీ జగన్ టీడీపీ ప్రభుత్వం పడిపోతుందని పగటి కలలు కంటున్నారని.. అది ఎప్పటికీ జరగదని విమర్శించారు. అంతేకాదు ప్రత్యేక హోదాని అడ్డుపట్టుకొని రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ రైతు ప్రయోజనాల కోసం మాట్లాడితే.. జగన్ రైతులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు మంత్రి దేవినేని ఉమ కూడా జగన్ పై విమర్శలు చేశారు. జగన్ ఏపీకి ముఖ్యమంత్రినవుతానని పిట్టల దొరలా పగటి కలలు కంటున్నారని ఎద్దేవ చేశారు. రాజధాని నిర్మాణానికి ప్రజలు స్వచ్చందంగా భూములు ఇస్తుంటే జగన్ ఇప్పుడు వచ్చి రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు. కొన్ని లక్షల ఎకరాలు కొట్టేసిన జగన్ ఇప్పుడు రైతుల భూములు లాక్కుంటున్నారంటూ ఆరోపించడం విచిత్రంగా ఉందని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత జగన్‌కు లేదు’ అని ఆయన విమర్శించారు. భూసేకరణను వ్యతిరేకిస్తూ జగన్ విజయవాడలో ఈ రోజు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే.

పవన్ చెబితే ఒప్పు.. జగన్ చెబితే రాజకీయమా?

ఏపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రైతుల దగ్గర నుండి భూములు సేకరిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో సీఆర్ డీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులకు మద్దతునిస్తూ.. ఆపార్టీ నేతలు వారితో పాటు భూసేకరణ కింద ఇప్పటికే భూములు కోల్పోయిన.. భూ సేకరణ పేరుతో భూములు కోల్పోనున్న రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ భూసేకరణ విషయంలో రైతులు భయపడొద్దని.. మీకు అండగా మేము ఉన్నామని అన్నారు. అంతేకాక భూసేకరణపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రైతుల దగ్గరనుండి భూములు లాక్కోవద్దని చెప్పారు.. ఇప్పుడు జగన్ కూడా అదే చెపుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ చెపితే నిజమని అంటున్న నాయకులు జగన్ చెబితే రాజకీయ మంటున్నారని విమర్సించారు. ఇద్దురు చెప్పింది ఒకటే అయినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది ఒప్పు ఇప్పుడు జగన్ చెప్పింది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు.

అనుష్కకి అదేషాక్ తగులుతుందా..?

సినీ పరిశ్రమలో  హీరోలూ తమ సినిమాల్లో వచ్చిన లాభాల్లో వాటా కావాలని అడగటం పరిపాటి. ఇప్పుడు హీరోయిన్ లు కూడా కాస్త తెలివిమీరి పోయారు. వాళ్లకు కూడా సినిమాకి వచ్చిన లాభాల్లో వాటా అడుగుతున్నారు. టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న అనుష్క కూడా ఇదే దారిపట్టింది. తను ఆర్య జంటగా నటిస్తున్న సైజ్ జీరో సినిమా పై ఇప్పటికే అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఈ సినిమాకి గాను అనుష్క పారితోషికానికి బదులు సినిమాకి వచ్చిన ప్రాఫిట్ లో వాటా కావాలని అడుగుతుందట. గతంలో ఛార్మి కూడా జ్యోతి లక్ష్మీ సినిమాకి ఇలాగే చేసి చేతులు కాల్చుకుంది. మరి సినిమా హిట్ అయితే పర్లేదు కానీ ఏదైనా అటూ ఇటూ జరిగితే అనుష్క పరిస్థితి కూడా అలాగే అవుతుందా చెవులు కొరుక్కుంటున్నారు.  

కేంద్రానికి సుప్రీం ప్రశ్న... మీ వైఖరేంటీ

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు జరుగుతున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని కృష్ణా జలాల వివాదంపై మీ వైఖరి చెప్పాలని సూటిగా ప్రశ్నించింది. గతంలో రాష్ట్ర ఒకటిగా ఉన్నప్పుడు బ్రిజేష్‌కుమార్‌ తుది, మధ్యంతర తీర్పు అమలు నిలిపివేయాలని పిటిషన్ వేశారు దీనిపై సుప్రీంకోర్టులో ఈ రోజు వాదనలు జరుగగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున వైద్యనాథన్‌ హాజరై వాదనలు వినిపించారు. అయితే వాదనలు విన్న సుప్రీంకోర్టు కృష్ణా జలాల వివాదంపై కేంద్రం వైఖరి చెప్పాలని అదేసమయంలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటి వాటాలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.

నాందేడ్ రైలు ప్రమాదం.. గ్రానైట్ రాయికి పూజలు

  బెంగుళూరు నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు అనంతపురలంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో ఓ గ్రానైట్ లారీ అదుపు తప్పి రైలును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురి ప్రాణాలు బలిగొన్న. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రాణాలను బలిగొన్న గ్రానైట్ రాయికి ఎవరో పూజలు చేశారు. రైల్వే ట్రాక్ పక్కనే పడి ఉన్న 20 టన్నుల గ్రానైట్ రాయికి గుర్తు తెలియని వ్యక్తులు పసుపు కుంకుమ జల్లి కొబ్బరికాయ కొట్టారు పూజలు చేయడంతో కలకలం రేపింది. అయితే గ్రానైట్ రాయికి సంబంధించిన యజమానులే ఈ పూజలు నిర్వహించి ఉంటారని అంటున్నారు. మరోవైపు ఇంకోసారి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలనే పూజలు నిర్వహించారని మరికొందరు అంటున్నారు. అంతేకాదు ఈ ప్రమాదంలో తక్కువ ప్రాణ నష్టం జరిగినందుకు రైల్వే అధికారుల సూచన మేరకు కొందరు కాంట్రాక్టర్లు పూజలు నిర్వహించారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పూజలు ఎవరు చేశారో.. ఎందుకు చేశారో తెలియదు కాని ఇప్పుడు అక్కడ అది పెద్ద హాట్ టాపిక్ అయింది.

ఆవిషయం మీరే చెప్పండి.. చంద్రబాబు

ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు మరియు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా తదితరులు పాల్గొన్నారు. ముందు 45 నిమిషాలు మాత్రమే అపాయింట్ మెంట్ ఉండగా ఈ చర్చ మాత్రం దాదాపు గంటన్నర పైగా సాగింది. ఏపీ ప్రత్యేక హోదాపైన సమస్యలపైన సుదీర్ఘ జరిగింది. సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన వల్ల ఏపీ ఆర్ధికంగా చాలా నష్టపోయిందని.. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని వదులుకోవడం వల్ల చాలా నష్టపోయామని.. అంతేకాక తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్రులపై వ్యవహరిస్తున్న తీరు తదితర విషయాలు మాట్లాడారు. మాకు ఇష్టం లేకుండా రాష్ట్ర విభజన చేశారు.. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లా ఏపీ అభివృద్ధి చెందాలని దానికి కేంద్రమే సహాయం చేయాలని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందేనని.. ఒకవేళ ప్రత్యేక హోదా ఇవ్వని నేపథ్యంలో ఎందుకు ఇవ్వలేక పోతున్నారో కూడా మీరే చెప్పాలని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అయితే చంద్రబాబు చెప్పిన అంశాలన్నింటిని విన్న మోదీ స్పందించి ‘‘ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే. ఏపీ రాష్ట్రానికి సంబంధించి విభజన చట్టంలో ఉన్న అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీలకు మేం కట్టుబడి ఉన్నాం.. వాటి నుంచి వైదొలగే ఆలోచన లేదు’’ అని తేల్చి చెప్పారు. అయితే చంద్రబాబు ఏపీ సమస్యలను మోదీకి వివరిస్తున్నప్పుడు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా ఒకటి రెండుసార్లు అడ్డుపడగా చంద్రబాబు కూడా గట్టిగానే సమాధానమిచ్చారు. రుణ మాఫీ పేరుతో ఎక్కువ ఖర్చు చేశారని ఇప్పుడు లోటు బడ్జెట్‌ అని మా వద్దకు వస్తే ఎలా?’’ అని ప్రశ్నించగా..  రైతులకు రుణ మాఫీ మా ఎన్నికల వాగ్దానం. అభివృద్ధితోపాటు సంక్షేమం కూడా సమతుల్యం చేసుకోవాలి. ఆర్థిక సిద్ధాంతాలు వినడానికి బాగానే ఉంటాయి కానీ రాజకీయంగా మా మనుగడ కూడా చూసుకోవాలి. రైతులు బాగా చితికిపోయినందువల్లే ఆ హామీ ఇచ్చాం. అమలు చేశాం’’ అని కాస్త ఘాటుగానే చెప్పారు.

ఏపీకి కేంద్రం మరో ఝలక్

కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరోషాక్ ఇచ్చింది. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా?రాదా అనే సందేహాలే ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ప్రత్యేక హోదా విషయంపై నిన్న చర్చించిన విషయం తెలిసిందే. అయితే విభజన చట్టంలో ఉన్నహామీలన్ని నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఏపీ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తామని చెప్పింది కానీ ప్రత్యేక హోదాపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కానీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాత్రం ప్రత్యేక హోదాపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి.. ప్రత్యేక హోదా విషయంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. హోదాకు బదులు రాష్ట్రానికి కావాల్సిన, దక్కాల్సిన సాయం అంతటిని కేంద్రం చేస్తుందని చెప్పారు. దీని బట్టి ప్రత్యేక హోదా చాలా వరకూ రానట్టే అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదాపై షాకిచ్చిన కేంద్రం విజయవాడ నగరానికి మెట్రో రైలు లేదని  చెప్పి మరో షాకిచ్చింది. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావించిన మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి చుక్కెదురైంది. ఏ నగరంలోనైనా మెట్రోరైలు రావాలంటే ఆనగర జనాభా కనీసం 20 లక్షలకు పైగా ఉండాలని కానీ విజయవాడలో 15 లక్షల కంటే తక్కువ జనాభా ఉందని కాబట్టి విజయవాడకు మెట్రో అవసరం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. దీనికి సంబంధించిన లేఖను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నెల రోజుల ముందే లేఖ రాసింది.

"చిరుదోశ".. రాంచరణ్ గిఫ్ట్

  చిరంజీవి 60వ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి తనయుడు రాంచరణ్ దోశను గిఫ్ట్ గా ఇచ్చాడు. రాంచరణ్ ఏంటి దోశ గిఫ్ట్ ఇవ్వడమేంటి అనుకుంటున్నారా.. అక్కడే ఉంది ట్విస్ట్.. చిరంజీవి పుట్టిన రోజుకు వినూత్న పద్దతిలో రాంచరణ్ చిరంజీవికి.. చిరుదోశ పేరిట బహుమతి ఇచ్చాడు. చిరుదోశ ఏంటని అనుకుంటున్నారా అదే చిరంజీవి పేరుతో చిరుదోశ. దీని సంబంధించిన రాంచరణ్ తేజ్ పేటెంట్ రైట్స్ కు దరఖాస్తు చేశారు. అంతేకాదు చిరుదోశకు పేటెంట్‌ వచ్చిన వెంటనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్టాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా చిరుదోశ లభిస్తుందని రామ్ చరణ్ తెలియచేసారు. దోశలో పల్లీల పచ్చడితో పాటు శాకాహార, మాంసాహార కూరలను కూడా అందివ్వనున్నట్టు.. అంతేగాక తక్కువ ధరకే నాణ్యమైన వంటకాలను కూడా వినియోగదారులకు అందించనున్నట్లు తెలియచేసారు. ఇప్పటి వరకూ దోశల్లో ఎన్నో వైరైటీలు తిని ఉంటాం అయితే ఇక నుండి చిరుదోశ కూడా తినచ్చు.

23ఎకరాల్లో తాత్కాలిక రాజధాని ఏర్పాటు?

  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో హైదరాబాద్ నుండి ఉద్యోగులను, ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడకి తరలించబోతున్నందున అందుకు అవసరమయిన ఏర్పాట్లను చురుకుగా చేస్తోంది. విజయవాడ, గుంటూరు పట్టణాలలో ఉన్న ప్రభుత్వ భవనాలను అన్నిటినీ ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించుకొని, ఉన్నతాధికారుల కార్యాలయాలన్నిటినీ ఒకేచోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం విజయవాడ-గుంటూరు మధ్య హైవేని ఆనుకొని ఉన్న హరిహాంత్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన 23ఎకరాలను స్వాధీనం చేసుకొని అందులో తాత్కాలిక కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సిద్దం అవుతోంది. అందుకోసం ఆ సంస్థ నుండి భూమిని స్వాధీనం చేసుకొంటూ ఒక జి.ఓ.జారీ చేసింది. అందుకు బదులుగా ఆ సంస్థకు నవులూరు వద్ద అంతే మొత్తం స్థలం కేటాయించబోతోంది.   ఉన్నతాధికారులు, మంత్రుల కార్యాలయాలన్నీ ఇక్కడే ఏర్పాటు చేయడం ద్వారా రాజధాని నిర్మాణ పనుల పర్యవేక్షణ, రాష్ట్ర పరిపాలన వ్యవహారాలు అన్నీ ఇక్కడి నుండే చక్కబెట్టడం సులువవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయం కూడా అక్కడే నిర్మిస్తారో లేక వేరే చోట ఏర్పాటు చేస్తారో ఇంకా తెలియదు. ఒకవేళ సచివాలయం కూడా అక్కడే ఏర్పాటు చేస్తే మంత్రులు, ఉన్నతాధికారులు అందరూ ఇక్కడ నుండే పనిచేస్తారు కనుక అదే రాష్ట్రానికి ప్రధాన పరిపాలనా కేంద్రంగా ఉంటుంది. త్వరలోనే అక్కడ తాత్కాలిక కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు. అక్కడ శాశ్విత భవనాలు కాకుండా ప్రీ-ఫ్యాబ్రికేటడ్ భవనాలను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా శాశ్విత రాజధానిలో భవనాలు సిద్దం కాగానే, ఈ తాత్కాలిక భవనాలను ఎటువంటి నష్టమూ లేకుండా తొలగించవచ్చును.

ఫిర్యాదు పై బెదిరింపు.. మళ్లీ రేప్ చేస్తా..

  కంప్లైట్ వెనక్కి తీసుకో లేదంటే మరోసారి రేప్ చేస్తా.. ఇది ఒక నిందితుడు బాధితురాలని బెదిరించిన విధానం. ఈ ఘటన ఎక్కడ జరగిందనుకుంటున్నారా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ జిల్లా కుర్వారాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుర్వార గ్రామానికి చెందిన  అంకుర్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతి పై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడికోసం దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలో నిందితుడు యువతిపై బెదిరింపులు మొదలుపెట్టాడు. ఇంట్లో తాను ఒంటరిగా ఉన్న సమయంలో బాధితురాలని కలిసి తనపై పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని లేకపోతే మరోసారి రేప్ చేస్తానని బెదరించాడట. దీంతో బాధితురాలు మళ్లీ నిందితుడి వైఖరిపై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో ప్రత్యేక బృందంతో నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

పవన్ కళ్యాణ్ కు అవగాహన లేదు.. మురళీమోహన్

భూసేకరణ వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత మురళీ మోహన్ పై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మురళీ మోహన్ స్పందించారు. రాజధాని ప్రాంతంలో తాను భూమిని  కొనుగోలు చేశానన్న వార్తలు అవాస్తవమని.. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. అవసరమైతే తాను కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి భూసేకరణ విషయంలో రాజధానిలో పర్యటిస్తానని.. రాజధాని ప్రాంతంలో తనకు అంగుళం భూమి కూడా లేదన్నారు. కాంగ్రెస్ పార్టీనే రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు ఔటర్ రింగు రోడ్డు కోసం తన 18 ఎకరాల భూమిని లాక్కుందని.. ఈ నేపథ్యంలోనే తను సుప్రీంకోర్టును ఆశ్రయించానని అన్నారు. ఇదిలా ఉండగా తానే పవన్ కళ్యాణ్ ను ప్రశంసించారు. భూసేకరణ విషయంలో రైతుల దగ్గర నుండి భూములు లాక్కోవద్దని పవన్ కళ్యాణ్ చెప్పేది కరెక్ట్ అని అన్నారు. అయితే, రాజధాని కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం రైతులు భూమిని ఇవ్వాలన్నారు.