ధింపూలో ఏబిటీవో కార్యాలయాన్ని ప్రారంభించిన మల్లేపల్లి లక్ష్మయ్య

భూటాన్ రాజధాని ధింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిష్ట్ టూర్ ఆపరేటర్స్ కార్యాలయాన్ని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ప్రారంభించినట్టు ఏబీటీవో ప్రధాన కార్యదర్శి డాక్టర్ కౌలేష్ కుమార్ తెలిపారు.  ఆసియా హైవే అందుబాటులోకి రానున్న నేపథ్యంలో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, మయన్మార్ దేశాల్లో బౌద్ధ పర్యాటక స్థావరాలను  అధిక సంఖ్యలో సందర్శించేలా వ్యూహాలను సిద్ధం చేసి ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి తమ సంస్థ కృషి చేస్తుందని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.  ధింపూ నగరంలోని బబేసా ఎక్స్ప్రెస్ హైవే లోని ఐ- డిజైర్ సంస్థ ప్రాంగణంలో ప్రారంభించిన ఏబీటీవో కార్యాలయం భూటాన్ మరియు పొరుగు దేశాల మధ్య బౌద్ధ పర్యాటకం పుంజుకునేలా కృషి చేస్తుందని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.  సీనియర్ సంపాదకులు కే. రామచంద్రమూర్తి, ఎగ్జాటిక్ ఈవెంట్ అధినేత కేకే రాజా, బుద్ధవనం కన్సల్టెంట్ డా. ఈమని శివనాగిరెడ్డి, ఇంకా భూటాన్ పర్యాటక సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఐ- డిజైర్ అధినేత, పరశురాం బిస్వా,  మల్లేపల్లి లక్ష్మయ్యను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

భూటాన్ లో బుద్ధవనం బ్రోచర్ ఆవిష్కరణ

సందర్శనకు సిద్ధమంటున్న భూటాన్ పర్యాటక ప్రతినిధులు హైదరాబాదులో ఏబిటీవో కార్యాలయానికి సన్నాహాలు భూటాన్ లోని ధింపూ నగరంలో ఆదివారం (మే19) జరిగిన అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక సదస్సు ముగింపు సభలో నాగార్జునసాగర్ లో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన ఆసియాలోనే అరుదైన బౌద్ధ వారసత్వ బుద్ధవనం బ్రోచర్ ఆవిష్కరణ జరిగిందని బుద్ధవనం కన్సల్టెంట్, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్స్ మరియు భూటాన్ పర్యాటక సమాఖ్య సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన తెలంగాణ బౌద్ధ పర్యాటక స్థావరాలు మరియు బుద్దవనంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనేక ప్రత్యేకతలు ఉన్న బుద్ధవనాన్ని, తెలంగాణ బౌద్ధ పర్యాటక స్థావరాలను త్వరలో సందర్శిస్తామని భూటాన్ పర్యాటక సమాఖ్య ప్రతినిధి, ఐ-డిజైర్ అధినేత పరశురాం బిస్వా చెప్పారు. సదస్సు ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాయల్ భూటాన్ విశ్వవిద్యాలయ ఆచార్యులు, డా. సౌరవ్ బసు, ఏబిటీవో ప్రధాన కార్యదర్శి డా. కౌలేష్ కుమార్ బుద్దవనం బ్రోచర్ ను ఆవిష్కరించగా, శివనాగిరెడ్డి ప్రతినిధులకు బ్రోచర్ ను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ దేశాల స్థానిక ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరయ్యారని శివనాగిరెడ్డి చెప్పారు.

వైసీపీ సినిమా అయిపోయింది.. బెట్టింగ్ రాయుళ్లే తేల్చేశారు!

గ‌తం కంటే ఎక్కువ స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామంటూ ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల ఐప్యాక్ బృందంతో స‌మావేశ‌మైన స‌మ‌యంలో  ధీమా వ్య‌క్తం చేశారు. వైసీపీ ముఖ్య నేత‌లు సైతం 150 నుంచి 160 స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామ‌ని చెప్పుకుంటూ వ‌స్తున్నారు. కానీ ఓటింగ్ జ‌రిగిన తీరు చూసిన సామాన్య ప్ర‌జ‌ల‌కు సైతం వైసీపీ అధినేత సహా ముఖ్య నేతలు అబద్ధం చెబుతున్నారన్న విషయం స్పష్టంగా అర్ధమైపోయింది.   వైసీపీ నేత‌లు   తామే అధికారంలోకి వస్తున్నామ‌ని చెబుతుండ‌టం  జనాలను విస్మయానికి గురి చేస్తోంది. జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు చెబుతున్న మాట‌ల‌ను ఆ పార్టీ శ్రేణులే విశ్వసించని పరిస్థితి కనిపిస్తోంది. సరే అవన్నీ పక్కన పెడితే..   బెట్టింగ్ రాయుళ్లు సైతం వైసీపీ ఓట‌మిపైనే   పందేలు కాస్తున్నారు. కూట‌మి విజ‌యం ఖాయ‌మ‌ని, 120 నుంచి 150 స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని జోరుగా బెట్టింగ్ లు కాస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యంపై జోరుగా బెట్టింగ్‌లు జ‌రిగాయి.. కానీ, ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోతుంద‌న్న దానిపైనే బెట్టింగులు విపరీతంగా ఉన్నాయి.  ఏపీలో ఈనెల 13న అసెంబ్లీ, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఫ‌లితాలు జూన్ 4న వెల్ల‌డికానున్నాయి.  ఏపీ వ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ న‌మోదైంది. గ‌తంలో ఎప్పుడూ ఈ స్థాయిలో పోలింగ్ న‌మోదు కాలేద‌ని అధికారులు చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన నాలుగు విడతలనూ తీసుకుంటే దేశంలోనే ఏపీలో అత్యధిక పోలింగ్ నమోదైంది. సాధారణంగా పోలింగ్ అత్యధికంగా జరగడమంటే అది కచ్చితంగా ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతనే సూచిస్తుందని రాజకీయపండితులు కచ్చితంగా చెబుతున్నారు. ప్రభుత్వ సానుకూలత ఉంటే పోలింగ్ శాతం ఈ స్థాయిలో ఉండదని అంటున్నారు.  గ‌త ఎన్నిక‌ల్లో దాదాపు 79శాతం ఓటింగ్ న‌మోదైంది. అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌తకు తోడు, వివేకానంద రెడ్డి హ‌త్య, జ‌గ‌న్ పై కోడిక‌త్తి దాడి ఘ‌ట‌న‌ల‌తో ఓటర్లు సానుభూతితో జ‌గ‌న్ పార్టీకి పెద్ద సంఖ్య‌లో ఓట్లు వేశారు. గ‌త ఎన్నిక‌ల్లో భారీ సంఖ్య‌లో న‌మోదైన ఓటింగ్ ప్ర‌తిప‌క్ష వైసీపీకి క‌లిసొచ్చింది.  ప్ర‌స్తుతం ఏపీలో భారీగా న‌మోదైన ఓటింగ్ ప్ర‌తిప‌క్ష పార్టీ తెలుగుదేశం కూట‌మికి క‌లిసొస్తుంద‌ని అందుకే వైసీపీ ఓటమి తథ్యమంటూ పెద్ద ఎత్తున బెట్టింగ్ సాగుతోందని అంటున్నారు. దీనికితోడు గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా కూట‌మిని గెలిపించేందుకు హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుతో, తమిళనాడు సహా పలు ఇతర రాష్ట్రాలు, విదేశాలలో ఉంటున్న ఏపీ ఓటర్లు కూడా స్వస్థలాలకు తరలి వచ్చి కసితో ఓటు వేశారు.  ఇది ప్రభుత్వ వ్యతిరేకతనే సూచిస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.    వైసీపీ ప్ర‌భుత్వం మ‌రోసారి అధికారంలోకి రాబోతోంది. జూన్ 9న విశాఖ‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. సంబ‌రాల‌కు అంతా సిద్ధంగా ఉండండి అంటూ తాజాగా వైసీపీ ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు దర్శనమిచ్చింది. అయితే  వైసీపీ గెలుపు ఖాయ‌మ‌ని స్వయంగా సీఎం సహా ఆ పార్టీ నేతలు ఎంతగా బాకా ఊదుకుంటున్నా.. కూటమిదే గెలుపు అంటూ భారీగా బెట్టింగులు జరుగుతుండటం.. ఇలా కూటమికి అనుకూలంగా బెట్టింగులు కాస్తున్న వారిలో వైసీపీ నేతలూ కార్యకర్తలూ కూడా ఉండటం  గ‌మ‌నార్హం.   అన్నిటికీ మించి  భారీ స్థాయిలో జరిగే ఈ ఆన్ లైన్ బెట్టింగ్ లో రోజు రోజుకూ వైసీపీకి వచ్చే సంఖ్య చిన్నదైపోతోంది. వైసీపీ అధినేత జగన్ భాషలో చెప్పాలంటే ఆయన చెప్పినట్లు టాల్ నంబర్లలో కాకుండా షార్ట్ నంబర్లలో వైసీపీ గెలుచుకునే స్థానాలు ఉంటాయన్న మాట.  పోలింగ్  రోజు వైసీపీకి 80 నుంచి 90 స్థానాలు రావ‌చ్చున‌ని ఆన్‌లైన్ సైట్‌లో అంచ‌నా వేశారు.  ఎన్నిక‌లు పూర్త‌యిన త‌రువాత ఆ స్థానాల సంఖ్య 70కి త‌గ్గింది. జ‌గ‌న్ ఐప్యాక్ సభ్యులతో సమావేశమై టాల్ నంబర్స్ లో విజయం సాధిస్తున్నామని చెప్పిన తరువాత ఆన్ లైన్ సైట్ బెట్టింగులలో వైసీపీ స్థానాల సంఖ్య    60 నుంచి 65కి తగ్గిపోయింది.  ఆన్‌లైన్ ద్వారా బెట్టింగ్ న‌డిపే సైట్ల‌లో ఒక్క తెలుగుదేశం పార్టీకే 91 నుంచి 94 సీట్లు వ‌స్తాయ‌ని, పెద్ద ఎత్తున పందాలు నడుస్తున్నాయి.  రోజులు గడిచే కొద్దీ ఆ సంఖ్య పెరుగుతోంది.   సత్తాబజార్ అనే ఆన్‌లైన్‌ బెట్టింగ్ వెబ్ సైట్‌లో వైసీపీకి 65 నుంచి 68 అని ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి  సొంతంగా 91 నుంచి 94 స్థానాలు వస్తాయని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో   వైసీపీకి 30 లోపు సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని ప‌లువురు   జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. మొత్తానికి బెట్టింగ్ న‌డిపే సంస్థ‌లు, పందేలు కాసేవారితోపాటు ప్ర‌తీఒక్క‌రూ కూట‌మి అధికారంలోకి రాబోతున్నద‌ని స్ప‌ష్టంగా చెబుతున్నారు. ఇక  వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆ పార్టీ ముఖ్య‌నేత‌లు మరోసారి మనదే అధికారం అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడానికి  కౌంటింగ్ రోజు నాటికి కనీసం ఏజెంట్లనైనా నిలుపుకోవాలన్న తాపత్రేయమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తానికి జగన్ ఐదేళ్ల అరాచక, దోపిడీ పాలనకు ఓటర్లు   చరమగీతం పాడినట్లు బెట్టింగుల సరళిని బట్టి స్పష్టమవుతోంది.  

కారు నేతల్లో చిన్న‌సారుకు సీన్ లేదా?!

రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడలు కావ‌డానికి పెద్ద  ఎక్కువ కాలం ప‌ట్ట‌దు. అధికారంలో ఉన్నంత సేపు ఈగ‌ల గుంపులా పార్టీ ముఖ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసే నేత‌లు.. అధికారంలో కోల్పోయిన త‌రువాత వారి వైపు కూడా చూడ‌రు. రాజ‌కీయాల్లో ఈ విష‌యం సాధార‌ణంగా జ‌రిగేదే. ప్ర‌స్తుతం ఆ అనుభ‌వం బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్ప‌ష్టంగా బోధప‌డుతోంది. కేటీఆర్ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న అపాయింట్ మెంట్ కోసం చాలా మంది నేత‌లు ఎదురు చూసేవారు. అవ‌కాశం దొరికితే కాబోయే సీఎం కేటీఆర్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు కూడా. ప‌రిస్థితులు తిర‌గబ‌డ‌టానికి ఎంతో కాలం ప‌ట్ట‌లేదు. గ‌తేడాది చివ‌రిలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌టంతో బీఆర్ఎస్ లోని ప‌లువురు కీల‌క నేత‌లు, ద్వితీయ స్థాయి నేత‌లు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. కేసీఆర్‌, కేటీఆర్ ల‌కు అత్యంత ద‌గ్గ‌ర వ్య‌క్తులు సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ లో ఉన్న‌ నేత‌లు సైతం అవ‌కాశాన్నిబ‌ట్టి ఎప్పుడైనా గోడదూకేస్తారన్న సంకేతాలే కనబడుతున్నాయి. ఈ నెల‌లో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు జూన్ 4న వెల్ల‌డి కానున్నాయి. ఈ ఫ‌లితాల్లో బీఆర్ఎస్ క‌నీసం 8 నుంచి తొమ్మిది స్థానాల్లో విజ‌యం సాధించ‌క‌పోతే ఆ పార్టీని వీడే నేత‌ల సంఖ్య భారీగానే ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా ఉన్న‌ప్ప‌టినుంచి ప్ర‌తిప‌క్ష పాత్ర  పోషించ‌లేదు. గ‌తంలో కేసీఆర్‌, హ‌రీశ్ రావులు తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో పార్టీని ముందుండి న‌డిపించారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు త‌రువాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతే కేటీఆర్ పార్టీలో కీల‌క భూమిక పోషిస్తూ వ‌చ్చారు. మంత్రిగా ప్ర‌భుత్వ పాల‌న‌లో, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాతో పార్టీలో నెంబ‌ర్ 2గా కేటీఆర్ కొన‌సాగారు. దీంతో బీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కేటీఆర్ ను సీఎం స్థాయిలో చూస్తూ వ‌చ్చారు. పార్టీలోని ముఖ్య‌నేత‌లు సైతం ప‌ద‌వులకోసం కేటీఆర్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు.  కేసీఆర్, కేటీఆర్ ఏం చెబితే అది పార్టీ నేత‌లు శాస‌నంగా భావిస్తూ వ‌చ్చారు. కానీ, ప్ర‌స్తుతం ప‌రిస్థితి మారిపోయింది. అధికారం కాల్పోవ‌డంతో కేటీఆర్ హ‌వా కూడా పార్టీ నేత‌ల్లో క్ర‌మంగా త‌గ్గుతూ వ‌చ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత నిర్వ‌హించిన అసెంబ్లీ స‌మావేశాల్లో పార్టీ శ్రేణులు ఆశించిన స్థాయిలో కేటీఆర్ రాణించ‌ లేక పోయారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కేటీఆర్ చేసిన‌ ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. అధికారంలోఉన్న స‌మ‌యంలో అసెంబ్లీ స‌మావేశాల్లో విప‌క్షాల‌పై విరుచుకుప‌డుతూ బెంబేలెత్తించిన కేటీఆర్‌.. ప్ర‌తిప‌క్ష హోదాలో పార్టీ శ్రేణులు ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ స‌భ్యుల దూకుడును ఎదుర్కోలేక పోయారు. దీంతో, హ‌రీశ్ రావు ఫ్రంట్ రోల్ లోకి వ‌చ్చి కాంగ్రెస్ స‌భ్యులకు దీటైన స‌మాధానం చెప్పారు.  బీఆర్ ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన త‌రువాత కేటీఆర్ హ‌వా పార్టీలో తగ్గుతూ వ‌స్తోందన్న విష‌యం తాజాగా మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది.  ఖ‌మ్మం - వ‌రంగ‌ల్ - న‌ల్గొండ ఉమ్మ‌డి జిల్లాల నియోజ‌క‌వ‌ర్గ  గ్రాడ్యుయేష‌న్ ఎమ్మెల్సీ ఎన్నికకు  ఈనెల 27న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. జూన్ 5న ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి.  ఈ ఎన్నిక‌ల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్య‌ర్థులు పోటీ ప‌డుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి,  బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు.  బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా రాకేశ్ రెడ్డి ఎంపిక‌పై మూడు ఉమ్మ‌డి జిల్లాల్లోని బీఆర్ఎస్ కీల‌క‌ నేత‌లు అసంతృప్తిగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. త‌మ‌ను సంప్ర‌దించ‌కుండానే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి మ‌నిషి అయిన రాకేశ్ రెడ్డికి ఏక‌ప‌క్ష నిర్ణ‌యంతో కేసీఆర్, కేటీఆర్ టికెట్ ఇచ్చార‌ని స‌ద‌రు నేత‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ ప్ర‌చారం నిజ‌మేన‌ని  రెండు రోజుల క్రితం స్ప‌ష్ట‌మైంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాకేశ్ రెడ్డి విజ‌యానికి అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై స‌మీక్ష నిర్వ‌హించేందుకు రావాల‌ని మూడు ఉమ్మ‌డి జిల్లాల పార్టీ ముఖ్య‌ నేత‌ల‌కు  కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ  ఆ స‌మావేశానికి ప‌లువురు నేత‌లు గైర్హాజరయ్యారు. కేవ‌లం కొద్ది మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. దీంతో పార్టీలో ఈ విష‌యం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేటీఆర్ పిలిచినా నేత‌లు స‌మావేశంకు హాజ‌రుకాక‌పోవ‌టం  పార్టీలో కేటీఆర్ హ‌వా త‌గ్గిపోయింద‌నడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బ‌ల‌ప‌డేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆపార్టీ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపించింది. కేంద్రంలో మ‌రోసారి బీజేపీ అధికారంలోకి వ‌స్తే  బీఆర్ఎస్ లోని ముఖ్య‌నేత‌లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోకి క్యూక‌ట్ట‌డం ఖాయ‌ంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ నేత‌లు మీడియా స‌మావేశాల్లో లోక్ స‌భ ఫ‌లితాల త‌రువాత బీఆర్ ఎస్ నుంచి పెద్ద సంఖ్య‌లో కాంగ్రెస్ లోకి వలసలు ఉంటాయని చెప్పారు. అదే జ‌రిగితే రానున్న కాలంలో బీఆర్ ఎస్ పార్టీకి మ‌రింత గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర‌వ‌డం ఖాయం. అలాంటి ప‌రిస్థితుల‌ను కేటీఆర్ స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటారని కానీ, ఎదుర్కోగలుగుతారని కానీ  పార్టీ శ్రేణులు బావించ‌డం లేదు. కేసీఆర్‌, హ‌రీశ్ రావులు యాక్టివ్ పాత్ర పోషిస్తేనే పార్టీ మ‌నుగ‌డ సాధ్య‌మ‌వుతుంద‌నీ, కేటీఆర్ చేతిలోకి పార్టీ ప‌గ్గాలు వెడితే పార్టీ మనుగడే ప్రశ్నార్ధకమౌతుందనీ బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి. 

చంద్రబాబు పని మొదలెట్టేశారు!

ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వాటిని అరికట్టి సాధారణ స్థితి పునరుద్ధరించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం. అయితే ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించేశారు. రాష్ట్రంలో పల్నాడు ప్రాంతం సహా కొన్ని ప్రాంతాలు ఎన్నికల అనంతరం కూడా హింసాకాండతో అట్టుడుకుతుంటే, తీవ్ర ఉద్రిక్తలు నెలకొని ఉంటే వాటి గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోర్టు అనుమతి తీసుకుని మరీ విదేశాలకు చెక్కేశారు. అలా చెక్కేసే ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తాను చేయకూడని పని కూడా చేశారు. అస్మదీయ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిందిగా సీఎస్ ను ఆదేశించేశారు. సీఎస్ పరమ వీర విధేయత ప్రదర్శించి ఆ పని చేయడానికి రెడీ అయిపోయారు. ఆ ఆదేశాల అమలు కోసం డీబీటీ నిధులను మళ్లించేయడానికీ సిద్ధమైపోయారు.  అయితే ఆపద్ధర్మ  ముఖ్యమంత్రిగా జగన్ తన బాధ్యతను విస్మరించారు. కానీ విపక్ష నేత అయిన చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో నెలకొన్నఉద్రిక్త పరిస్థితులు, పల్నాడులో దాడులపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ  రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. చంద్రబాబు డిమాండ్ మేరకు  ఈసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు వారాలపాటు కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే ఉంచాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులను  కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు సర్కార్ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటూ  చంద్రబాబు గవర్నర్ కు రాసిన లేఖతో  అదే విధంగా  ఈ-ఆఫీస్‌ అప్‌గ్రేడేషన్‌  కూడా చంద్రబాబు ఫిర్యాదుతోనే ఆగింది. వైసీపీ తీసుకొచ్చిన తప్పుడు జీవోలను మాయం చేసేందుకు వైసీపీ సర్కార్ చేసిన ప్రయత్నానికి అడ్డుకట్ట పడింది. రాష్ట్ర బాగోగుల విషయంలో చంద్రబాబు రాజీప డరనడానికి వీటిని ఉదాహరణలుగా పరిశీలకులు చూపుతున్నారు.    ఇక  అమిత్ షా చెప్పిన జోస్యం నిజమై చంద్రబాబు జూన్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన తాను చేస్తానన్న తొలి సంతకం, రెండో సంతకం విషయాలను పక్కన పెడితే.. గత ఐదేళ్ల పాలనలో అస్తవ్యవస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి మహాయజ్ణం లాంటిదే చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాడు రాష్ట్రం పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి అంతకంటే అధ్వానంగా ఉంది.  నాడు రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం జీరో నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఐదేళ్ల జగన్ పాలన తరువాత జీరోకన్నా దిగువ నుంచి అంటే మైనస్ నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి ఉంది. చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు ప్రభుత్వ ఖజానా ఖాళీ, రాష్ట్రానికి రాజధాని లేదు. ఇప్పుడూ అదే పరిస్థితి.  అప్పట్లో ఐదేళ్లలో చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిన పెట్టారు. రెవెన్యూలోటుతో  ఆరంభమైన విభజిత రాష్ట్రాన్ని తన విజనరీతో సర్ ప్లస్ స్టేట్ గా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ స్టేట్ గా మార్చారు చంద్రబాబు. అంతేనా ఐదేళ్లలో ఒక్క సారి కూడా విద్యుత్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశారు. అయితే 2019లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలు కావడంతో రాష్ట్ర ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. జగన్ హయంలో అమరావతి నిర్వీర్యమైంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు రోడ్డున పడ్డారు.  ఇప్పుడు రాష్ట్రం కరెంటు కొరతతో దాదాపు అంధకారబంధురంగా మారింది. ఎప్పుడు వస్తుందో తెలియని విద్యుత్ సరఫరా చేస్తూ జగన్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను భారీగా పెంచింది.  పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం కుదేలయ్యాయి. నిర్మాణ రంగం పడకేసింది. విద్యా వ్యవస్థ కుప్పకూలింది.   అమిత్ షా జోస్యం నిజమై చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 9న ప్రమాణస్వీకారం చేపడితే ఆయన ముందున్న సమస్యలివి. మళ్లీ తొలి అడుగు నుంచీ రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. జన సంక్షేమ శ్రామికుడిగా, సంపద సృష్టికర్తగా చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఆ ఆశతోనే, ఆ నమ్మకంతోనే జనం చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం కూటమికి అధికారం కట్టబెట్టారని భావించాల్సి ఉంటుంది. 

బుజ్జగింపులు.. బెదిరింపులు.. ఇదీ మోడీ స్టైల్!

వయసు దగ్గర దగ్గర 75 సంవత్సరాలకు చేరువ అవుతోంది. అంతేకాకుండా ప్రధానమంత్రి హోదాలో కూడా వున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారిని మిగతా రాజకీయ నాయకులను విమర్శించినట్టు ఘాటుగా విమర్శించాలంటే కొంత ఇబ్బందిగానే వుంటుంది. అందుకే పెద్దమనిషి వయసుకి, హోదాకి గౌరవం ఇస్తూ చాలా వినయంగా అసలు విషయాన్ని తెలియజేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికలలో 4 వందల పార్లమెంటు స్థానాలు గెలిచి ప్రధానమంత్రి పీఠం మీద మూడోసారి కూర్చోవాలని ఆశిస్తున్నారు. ఆయన అలా ఆశించడంలో తప్పులేదు.. జనం ఆశీస్సులతో అనుకున్నట్టు జరిగినా బాధ లేదు. కానీ, ఆయన ఎన్నికలలో విజయం సాధించడం కోసం అనుసరిస్తున్న విధానాలు, మాట్లాడుతున్న మాటలే కొంత కాదు.. చాలా బాధను కలిగిస్తున్నాయి.  నరేంద్ర మోడీ నాయకత్వంలో వున్న బీజేపీ నాయకులు ముస్లింల విషయంలో ఎలా వ్యవహరిస్తారో మళ్ళీ ఇక్కడ ఉదహరించాల్సిన అవసరం లేదు. ముస్లిం ఓట్లు బీజేపీకి ఎంతమాత్రం పడవన్న విషయం కూడా ఎవరూ విస్మరించలేనిది. కొన్ని రాష్ట్రాల్లో పేద ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. దాని విషయంలో మోడీ గారి సహచరుడు అమిత్ షా తన పార్టీ వైఖరిని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. ఈసారి అధికారంలోకి రాగానే ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని చెబుతున్నారు. సరే, అధికారం మళ్ళీ వస్తే వీళ్ళకు ఎలా చేయాలని అనిపిస్తే అలా చేస్తారు. దేశం ఆ నిర్ణయాన్ని ఇష్టం లేకపోయినా భరించక తప్పదు. ముస్లింల విషయంలో అలా వ్యవహరిస్తూనే ఇప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా శుక్రవారం నాడు మోడీ గారు అద్భుతమైన కొన్ని మాటలు జనం మీదకి వదిలారు. ‘‘హిందు, ముస్లిం అని నేను విడదీయను. చిన్నప్పుడు ఈద్ కూడా జరుపుకునేవాడిని. పక్కింటి ముస్లింలు మాకు ఆహారం పెట్టేవారు’’ అని ప్రేమతో కూడిన మాటలు చెబుతున్నారు. గోధ్రా దుర్ఘటన సందర్భంగా గానీ, కేంద్రంలో అధికారంలోకి రావడానికి గానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గానీ, ఆయన పార్టీ వారుగానీ ముస్లింల విషయంలో చేసిన వ్యాఖ్యానాలు వారికి గుర్తుండక పోవచ్చుగానీ ముస్లింలు మరచిపోరు కదా. సరే, ఉత్తర ప్రదేశ్‌లో ప్రచారం చేస్తూ మోడీ గారు ఒక దారుణమైన మాట అన్నారు. కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామమందిరాన్ని వాళ్ళు కూల్చేస్తారట. ఇంతకంటే దారుణమైన స్టేట్‌మెంట్ మరొకటి వుంటుందా? ఇది మతం పేరుతో రాజకీయాలు చేయడం కాదా? ‘మోడీ’ అనే పేరును తిట్టినందుకు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్నే రద్దు చేయించారు. మరి మతం పేరుతో రాజకీయ విమర్శలు చేసినందుకు ఏం చేయాలి? 

పల్నాడు కలెక్టర్ గా శ్రీ బాలాజీ లట్కర్ 

పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో, పల్నాడు జిల్లాకు కొత్త కలెక్టర్ ను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లాకు శ్రీకేశ్ బాలాజీ లట్కర్ ను కలెక్టర్ గా నియమిస్తున్నట్టు పేర్కొంది. ఈసీ ఈ సాయంత్రం లోగా తిరుపతి, పల్నాడు, అనంతరం జిల్లాలకు కొత్త ఎస్పీలను కూడా ప్రకటించనుంది. సీఎస్ పంపిన పేర్లను పరిశీలిస్తున్న ఈసీ కాసేపట్లో ఉత్తర్వులు వెలువరించనుంది.ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం పల్నాడులో జరిగిన హింసపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎస్‌, డీజీపీలకు కమీషన్‌ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు భవిష్యత్తులో అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీలందరినీ ఆదేశించింది. ఈ క్రమంలోనే కమిషన్ వారి స్థాయిలో కేసులను సమీక్షించింది. చట్ట ప్రకారం, మోడల్ ప్రవర్తనా నియమావళి వ్యవధిలో, దోషులపై ఛార్జిషీట్‌ను సకాలంలో దాఖలు చేయడంపై తగిన నిర్ణయం తీసుకునేలా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతోపాటు ఆ ఘటనల నేపథ్యంలో ఇటివల పల్నాడు జిల్లా కలెక్టర్ సహా పలువురిపై చర్యలు తీసుకుంది.

జూన్ 9న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం.. అమిత్ షా

సర్వేలు, ఫలితాలు కాదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పేశారు. ఏపీలో రాబోయే ప్రభుత్వం ఏదో. ఆయన అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుంది. కూటమి 145 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధిస్తుంది. అలాగే 23 లోక్ సభ స్థానాలలో విజయకేతనం ఎగుర వేస్తుంది. ఈ మేరకు ఆయన శనివారం చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. వచ్చే నెల 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితరిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారంటూ ఆయన పేర్కొన్నారు. పోలింగ్ సరళిని బట్టి తెలుగుదేశం విజయం ఖాయమని పరిశీలకుల విశ్లేషణలూ,  షెడ్యూల్ విడుదలకు ముందు వెలువడిన దాదాపు డజనుకు పైగా సర్వేలూ ఇదే విషయాన్ని చెప్పినా.. అమిత్ షా ఇప్పుడు స్వయంగా ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టించబోతున్నదంటూ చేసిన ప్రకటన ఎక్కడో ఏ మూలో మిణుక్కుమిణుక్కు మంటూ ఉన్న వైసీపీ గెలుపు ఆశలను ఆవిరి చేసేసిందనే చెప్పాలి. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలు ఎన్నికలలో అక్రమాలు జరిగాయనీ, ఎన్నికల సంఘం తెలుగుదేశం ఆదేశాల మేరకు పని చేసిందన్న ప్రకటనల ద్వారా పరోక్షంగానైనా వైసీపీ పరాజయాన్ని అంగీకరించేశారు. ఇప్పుడిక ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనతో తెలుగుదేశం కూటమి విజయంపై ఎవరికీ ఎటువంటి అనుమానాలూ మిగలలేదని చెప్పవచ్చు. కేంద్రానికి అందునా కేంద్ర హోంమంత్రికి ఎప్పటికప్పుడు ఏ రాష్ట్రంలో రాజకీయ గాలి ఎటువైపు ఉంది, ఆయా రాష్ట్రాలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్న సమాచారం ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా అందుతూ ఉంటుంది. అందుకే  అమిత్ షా ప్రకటనతో ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టడం ఖాయమన్న భావన అందరిలోనూ వ్యక్తం అవుతోంది. 

అంతా కేసీఆర్ ఆత్రమే తప్ప, అటు నుంచి ఏమీ లేదు!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలవాలని, ఏపీ ఇంకా సర్వనాశనం అయిపోవాలని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లస్ ఆయన కుటుంబం కోరుకుంటూ వుంటారు. ఆ దిక్కుమాలిన కోరికేదో తమ మనసులోనే ఉంచుకోకుండా, ఎవరు అడిగినా ఏపీలో జగన్ గెలుస్తాడు అని సంబరపడిపోతూ చెబుతూ వుంటారు. జగన్ గెలవాలని వీళ్ళు మురిసిపోతూ కోరుకోవడమే తప్ప జగన్ గానీ, ఆయన పార్టీ వర్గీయులు గానీ, జగన్ మీడియా గానీ కేసీఆర్ విషయంలో ఎలాంటి ప్రేమాభిమానాలూ ప్రదర్శించడంలేదు. సాధారణంగా ఎక్కడైనా జరిగేది ఏమిటంటే... నేను నిన్ను పొగుడుతా.. నువ్వు నన్ను పొగుడు అనే స్కీమ్. ఈ స్కీమ్ ప్రకారం ఏపీలో జగన్ గెలుస్తాడు అని కేసీఆర్ కుటుంబం పదేపదే చెబుతున్నప్పడు, తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు అని వైసీపీ వాళ్ళు ఒక్కరైనా చెప్పి చెల్లుకు చెల్లు చేసుకోవాలి కదా. అలాంటిదేమీ వైసీపీ వాళ్ళవైపు నుంచి లేదు. నువ్వు మా చెక్క భజన చేసుకుంటే చేసుకో.. మేం నీ ముఖం కూడా చూడం నువ్వు ఎలా చస్తే మాకేంటి అన్నట్టుగానే వాళ్ళ ధోరణి వుంది. మొన్నామధ్య ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వన్ టైమ్ బెన్‌ఫిట్ లాగా జగన్ ప్రభుత్వం నాగార్జున సాగర్ మీదకి ఏపీ పోలీసులను పంపి, తెలంగాణ ప్రజలను కేసీఆర్‌కి అనుకూలంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కానీ, అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ అదరగొట్టేస్తాడు అని వైపీపీ వాళ్ళెవరూ చెప్పిన పాపన పోలేదు. అలా చెప్పకపోతే పోయారు.. కనీసం నెగటివ్‌గా అయినా చెప్పకుండా వుండొచ్చు కదా.. కానీ, ఆ దారుణం జరిగిపోయింది. వైసీపీ ఆస్థాన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి టీవీలో కొంతసేపు తన సుత్తి కొడుతూ వుంటారు. ‘జగన్ సాక్షాత్తూ దేవుడు’ అనే మాట అనరు తప్ప, ఆయన చేసే జగన్ భజన ఆ రేంజ్‌లోనే వుంటుంది. అలాంటి ఆయన శనివారం నాడు తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి మీద సుదీర్ఘ సుత్తి కొట్టారు. అటు తిప్పీ ఇటు తిప్పీ ఆయన తేల్చింది ఏమిటంటే, పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్‌కి అంత సీన్ లేదు. అసలు పోటీ అంతా కాంగ్రెస్, బీజేపీ మధ్యలో వుంది. కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ ఆటలో అరటిపండ్ల మాదిరిగా మిగిలిపోయారు. ఈ ఐదేళ్ళూ కేసీఆర్ జనంలో వుండి, జనం నమ్మకాన్ని గెలుచుకుంటే తప్ప వచ్చే ఎన్నికలకు మిగులతారు. లేకపోతే అడ్రస్ లేకుండా పోతారు. సర్వనాశనం అయిపోతారు... అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఖర్మరా బాబూ.... పాపం ఈయనేమో జగన్ పేరు చెబితే ఆనందంతో గుడ్డలు చించుకుంటూ వుంటాడు. వాళ్ళేమో ఈయన్ని కూరలో కరేపాకుని తీసేసినట్టుగా తీసి అవతల పారేస్తూ వుంటారు. కేసీఆర్‌కి ఇలాగే అవ్వాలిలే!!

ఫలితాల వరకూ ఆగక్కర్లేదు.. పల్నాడు గెలుపు ఎవరిదో తెలిసిపోయింది!

పల్నాడులో ఎన్నికల హింస పోలింగ్ ముగిసిపోయినా కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 2019 ఎన్నికలలో పల్నాడులో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.  నరసరావు పార్లమెంటు స్థానంతో పాటు మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, చిలకలూరి పేట అసెంబ్లీ స్థానాలలో విజయం కేతనం ఎగురవేసింది. ఆ ఎన్నికలలో కోడెల శివప్రసాదరావు వంటి సీనియర్ మోస్ట్ నేతలు సైతం పరాజయం పాలయ్యారు. ఆ తరువాత వైసీపీ వేధింపులు తట్టుకోలేక కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అదలా ఉంచితే 2019 ఎన్నికలలో విజయం తరువాత పల్నాడు పూర్తిగా వైసీపీ కోటగా మారిపోయింది. అక్కడ వైసీపీ ఆడిందే ఆట, పాడిందే పాట చందంగా తయారైంది. 2019 లగాయతు.. ఇప్పటి వరకూ పల్నాడులో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు వైసీపీ మూకలు నరకం అంటే ఏమిటో చూపాయి. నిత్యం వేధింపులు, దాడులతో చెలరేగిపోయాయి. పల్నాడులో స్థానిక ఎన్నికలన్నీ ఏకపక్షంగానే మారిపోయాయి. దౌర్జన్యాలు, దాడులు, గృహదహనాలే కాకుండా హత్యలతో కూడా వైసీపీ మూకలు చెలరేగిపోయాయి. అయితే తలుపులు మూసి ఉంచితే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందన్నట్లుగా ఈ ఎన్నికలలో తెలుగుదేశం క్యాడర్ ధైర్యంగా నిలబడింది. వైసీపీ దాడులు, దౌర్జన్యాలను ప్రతిఘటించింది. ఎన్నికలలో బూత్ ఆక్రమణలు, రిగ్గింగును గట్టిగా నిలువరించింది. తెలుగుదేశం ప్రతిఘటనతో వైసీపీ మూకలు వెనుకంజ వేయాల్సి వచ్చింది. ఐదేళ్ల దారుణ అణచివేత తరువాత కూడా వైసీపీ శ్రేణులు పుంజుకుని ధైర్యంగా నిలబడగలగడం విస్మయపరిచింది. చావో రేవో అన్నట్లుగా వారు తెగించి పార్టీ కోసం నిలబడ్డారు. ఎక్కడా వెనుకడుగు వేయలేదు. దీంతో వైసీపీ మూకలు ఎంతగా దౌర్జన్యాలకు పాల్పడినా పోలింగ్ మాత్రం భారీగా జరిగింది. పోలింగ్ తరువాత పల్నాడు వైసీపీ నేతలు మీడియా మైకుల ముందుకు వచ్చి ఎన్నికలలో అక్రమాలు జరిగాయి. అధికారులు, పోలీసులు తెలుగుదేశం కూటమికి పూర్తిగా సహకరించారు అంటూ ఏడుపు ముఖాలతో ఆరోపణలు గుప్పించడంతోనే ఇక్కడ పోలింగ్ సరళి, ప్రజల మద్దతు ఎవరివైపు ఉందో అందరికీ అర్ధమైపోయింది. దీంతో కనీసం కౌంటింగ్ అయినా సజావుగా జరగకుండా చేయాలన్న వ్యూహంతో వైసీపీ మూకలు ఎన్నికల అనంతరం కూడా హింసాకాండను కొనసాగించారు. తెలుగుదేశం శ్రేణులు దానినీ ధైర్యంగా ఎదుర్కొన్నాయి. వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి,  ఆయన సోదరుడు పరారై అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారంటే పల్నాడులో వైసీపీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందో అవగతం చేసుకోవచ్చు. సర్వేలతో,  జూన్ 4న వెలువడే ఫలితాలతో సంబంధం లేకుండానే పల్నాడులో ఫలితమేమిటన్నది వైసీపీ నేతల భాష, బాడీ లాంగ్వేజ్ రాష్ట్రం మొత్తానికీ అర్ధమయ్యేలా చేసింది.  

బంగాళాఖాతంలో వాయుగుండం..కోస్తాంధ్రకు వర్ష సూచన 

బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని, విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.  ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది.  ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.  ఈ నేపథ్యంలో, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్రతో పాటు, తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.  మరోవైపు, నైరుతి రుతుపవనాల విషయంలో వాతావరణ శాఖ తియ్యని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించాయని, ప్రస్తుతం ఇవి చురుగ్గా కదులుతున్నాయని వివరించింది. రేపటికి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. కాగా, ఈ వాయుగుండం ప్రభావం కారణంగా కోస్తా జిల్లాలతో పాటు.. తమిళనాడులోని సముద్రతీర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే, చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం జిల్లాల్లో ఆకాశం దట్టమైన మేఘాలు ఉన్నాయి. 

వైసీపీకి పోయేకాలం ఆలోచనలు!

ఏపీలో అల్లర్లపై ఈసీ ఆదేశాలతో 13 మంది సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం వహిస్తారు. ‘సిట్’ సభ్యులుగా 13 మంది సీనియర్ పోలీస్ అధికారులను నియమించారు. అయితే, వైసీపీ నాయకులకు మాత్రం ‘సిట్’ ఏర్పాటు కంటగింపుగా మారింది. ఈ సన్నాసులు చేసిన చెత్త పనులన్నీ సిట్ బయటపెడుతుందని భయపడుతున్నారు. ఎన్నికల కోడ్ లేకుండా వుంటే తాము ‘సిట్’ అటే కూర్చుని, ‘స్టాండ్’ అంటే నిల్చునే వాళ్ళతో ‘చాలా పద్ధతి’గా విచారణ జరిపించి వుండేవారు. ఈ ‘సిట్’ ఈసీ ఆదేశాలతో ఏర్పడింది కాబట్టి ఇక్కడ వీళ్ళ పప్పులు ఉడకవు. అందుకే వంక దొరకనమ్మ డొంక పట్టుకుని ఏడ్చిందన్నట్టు ‘సిట్’ ఏర్పాటులో రంధ్రాన్వేషణ్ మొదలుపెట్టారు. సిట్ చీఫ్‌గా నియమితులైన వినీత్ బ్రిజ్‌లాల్‌ని అర్జెంటుగా తప్పించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఎందుకయ్యా అంటే, ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఎవరిదో పెళ్ళి జరిగితే, దానికి వినీత్ బ్రిజ్‌లాల్, చంద్రబాబు హాజరయ్యారట. ఇద్దరూ కలసి పెళ్ళికి వెళ్ళికపోయినా, ఇద్దరూ ఒకేసారి పెళ్ళికి వెళ్ళారు కాబట్టి, వీళ్ళిద్దరి మధ్య స్నేహసంబంధాలు ఉండే అవకాశం వుందట. అందువల్ల ఆయన్ని సిట్ బాధ్యత నుంచి తప్పించాలట. పోయేకాలం వచ్చినవాళ్ళకి పనికిమాలిన ఆలోచనలన్నీ వస్తాయంటారు చూశారా.. ఇదీ అలాంటిదే!

నాగబాబు.. అల్లు అర్జున్ వివాదానికి తెరపడినట్లేనా?

రెండు మూడు రోజుల కిందట జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీ  సీనియర్ నాయకుడు  నాగబాబు చేసిన ఓ ట్వీట్ సంచలనం సృష్టించింది. అక్కడితో ఆగకుండా ఆ ట్వీట్ నాగబాబు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య అగాధాన్ని సృష్టించింది. ఆ ట్వీట్ చూసిన వెంటనే అంతా అల్లు అర్జున్ టార్గెట్ గానే నాగబాబు ఆ ట్వీట్ చేశారని భావించారు.  ఇంతకే నాగబాబు ట్వీట్ అల్లు అర్జున్ ను ఉద్దేశించే చేసిందని అంతా భావించడానికి కారణమేమిటంటే.. ఐకాన్ స్టార్, మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ సరిగ్గా ప్రచారం ముగిసే ముందు రోజు నంద్యాల వైసీపీ అభ్యర్థి రవిచంద్రారెడ్డి నివాసానికి వెళ్లి మరీ ఆయనకు మద్దతు ప్రకటించారు. ఇది  రాజకీయవర్గాలతో సహా మెగా అభిమానుల్లోనూ పెద్ద చర్చకు తెరలేపింది. ఎంత మిత్రుడైనా నంద్యాల వెళ్లి మరీ మద్దతు తెలపడానికి ఇదా సమయం అంటూ విస్తృత చర్చ జరిగింది. సరే దానికి అల్లు అర్జున్ పార్టీలతో సంబంధం లేదు.. ఫ్రెండ్ అయితే చాలు ఎంత దూరం వెళ్లైనా మద్దతు తెలుపుతా అని చెప్పాడనుకోండి అది వేరే సంగతి.  అంతకు ముందు పవన్ కల్యాణ్ కు మద్దతుగా కూడా అల్లు అర్జున్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా అల్లు అర్జున్ తీరు మెగా ఫ్యామిలీతో ఆయనకు విభేదాలున్నాయన్న భావన కలిగించింది.   సరిగ్గా ఈ నేపథ్యంలో నాగబాబు  మాతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పని చేసేవాడు మావాడైనా పరాయివాడేనంటూ  ట్వీట్ చేశారు. ఇది కచ్చితంగా అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేసిన ట్వీటేనంటూ అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. నాగబాబు టార్గెట్ గా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. ఆ దెబ్బకు నాగబాబు తన ఎక్స్ ఖాతాను డీయాక్టివేట్ చేశారు. తాజాగా ఆయన మళ్లీ తన ఎక్స్ ఖాతాను యాక్టివేట్ చేసి అల్లు అభిమానుల మనోభావాలను గాయపరిచిన ఆ ట్వీట్ ను తొలగించేశానని పేర్కొన్నారు. సొంత వాళ్లయినా పరాయివాళ్లే అన్న ట్వీట్ అల్లు అర్జున్ అభిమానులకు అంతటి  ఆగ్రహం కలిగిస్తుందని నాగబాబు ఊహించి ఉండరు. వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకే ఆయన ఆ ట్వీట్ ను తొలగించాను అని పేర్కొన్నారు. మొత్తం మీద నాగబాబు వెనక్కు తగ్గడంతో ఈ వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పడినట్లేనని పరిశీలకులు అంటున్నారు.  

జగన్ తాడేపల్లి ప్యాలెస్ ఫర్ సేల్!?

ఆంధ్రప్రదేశ్ ఊడిపోయిన, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలో కొంత తన సొమ్ముతో, చాలా జనం సొమ్ముతో కట్టించుకున్న ‘తాడేపల్లి ప్యాలెస్’ని అమ్మకానికి పెట్టే ఆలోచనలు జరుగుతున్నాయని అభిజ్ఞవర్గాల భోగట్టా. నేను ముఖ్యమంత్రిని అయ్యాక అమరావతి రాజధానిగా అద్భుతంగా పరిపాలించేస్తాను అని చెప్పి తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు జగన్. ఆ ఇంటి గృహప్రవేశం సందర్భంగా వైసీపీ వాగుడుకాయలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి అయితే రాజధానిని మార్చేస్తారని చంద్రబాబు చెబుతున్నారు. రాజధాని మార్చేపనయితే ఇక్కడ ఇల్లు ఎందుకు కట్టుకుంటారు? అని పిచ్చి లాజిక్ ఒకటి చెప్పి జనాన్ని నమ్మించారు. చివరికి ఏమైంది. జగన్‌ ఇల్లయితే కట్టుకున్నారుగానీ, అమరావతిని ధ్వంసం చేసిపారేశారు. తాడేపల్లిలో తన ఇల్లు కళకళలాడుతూ వుందిగానీ, అమరావతే ఘోస్ట్ సిటీగా మారిపోయింది. అందరికీ ఓ టైమ్ వస్తుంది. ఇప్పుడు జగన్‌కీ ఓడిపోయే టైమ్ వచ్చింది. ఈ ఎన్నికలలో వైసీపీ ఓటమి కన్ఫమ్ అయిపోయింది. ఓడిపోయిన తర్వాత జగన్‌కి తాడేపల్లిలో పనేం లేదు.  ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తన ఒక్కడి రాజధాని వైజాగ్‌లోనే వుండొచ్చు. లేదా హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లోనే, బెంగళూరు ప్యాలెస్‌లోనే వుండొచ్చు. అంతే తప్ప తాడేపల్లిలో వుండటానికి ముఖం చెల్లదు కదా.. తాడేపల్లి ప్యాలెస్ కట్టే సమయంలో జగన్ నిబంధనలు సక్రమంగా పాటించలేదు. తవ్వి తీయాలేగానీ, ఎన్నో లొసుగులు బయటపడే అవకాశం వుంది. జగన్ అధికారం చేపట్టిన వెంటనే నిక్షేపం లాంటి ప్రజావేదికని కూల్చి విధ్వంసానికి అంకురార్పణ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా జగన్ ప్రభుత్వంలాగా ఆలోచించి జగన్ తరహా విధ్వంసాన్ని జగన్ ప్యాలెస్ నుంచే ప్రారంభిస్తే పరిస్థితి ఎలా వుంటుందోన్న భయం వైసీపీ వర్గాల్లో వున్నట్టు సమాచారం. చంద్రబాబు మనలాంటి విధ్వంసకారి కాదు అనే ధైర్యం వున్నప్పటికీ, ఎందుకైనా మంచిదనే ధోరణితో తాడేపల్లి ప్యాలెస్‌ని మెల్లగా వదిలించుకుంటే మంచిదనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ జగనన్నకి పనేమీ లేదు.. అలాంటప్పుడు ఇక్కడ ఈ ఆస్తి ఎందుకనే ఆలోచనలో కూడా వున్నట్టు సమాచారం.

అమెరికా పర్యటన.. షర్మిల కారణమేంటి?

ఆంధ్రప్రదేశ్ లో హై ఓల్టేజ్ ప్రచారం ముగిసి పోలింగ్ పూర్తయిన తరువాత కూడా హింసాకాండ కొనసాగుతోంది. అయితే ప్రధాన పార్టీల నేతలు మాత్రం పొలింగ్ పూర్తయిన తరువాత ఒక విధమైన విశ్రాంతి మూడ్ లోకి వెళ్లిపోయారు. పోలింగ్ ముగిసిన రోజు, ఆ తరువాత ఒకటి రెండు ప్రెస్ మీట్లు మినహా పెద్దగా మీడియా ముందుకు కానీ, ప్రజల ముందుకు కానీ రాలేదు. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ అయితే పోలింగ్ ముగిసిన తరువాత కనీసం మీడియా ముందుకు రాలేదు. ఎక్స్ వేదికగా ప్రజలకు కృతజ్ణతలు తెలిపి, గెలపుపై ధీమా వ్యక్తం చేసి చేతులు దులిపేసుకున్నారు. ఐప్యాక్ కు వీడ్కోలు లాంటి సమావేశంలో ఒక సారి కనిపించారు అంతే. ఒక పక్క రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింస రావణకాష్టంలా రగులుతుంటే.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా హింసాకాండకు స్వస్తి చెప్పాలన్న పిలుపు కానీ, హింసను ఖండిస్తూ ప్రకటన కానీ చేయలేదు. కోర్టు అనుమతి తీసుకుని కుటుంబంతో విదేశాలకు చెక్కేశారు.  మరో వైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోలంగ్ ముగిసిన తరువాత ఎన్నికల సరళిని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్షించారు. ల్యాండ్ స్లైడ్ విక్టరీపై విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా, ఆ తరువాత జరిగిన జరుగుతున్న హింసాకాండను ఖండించారు. హింసను అదుపు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ కార్యక్రమాన్ని నిలిపివేసింది. చంద్రబాబు కూడా హైదరాబాద్ చేరుకున్నప్పటికీ ఆయన పార్టీ శ్రేణులతో, నేతలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిస్థితిని గమనిస్తూ అవసరమైన దిశా నిర్దేశం చేస్తున్నారు.  ఇక కాంగ్రెస్ ఏపీ అధినేత్రి షర్మిల మాత్రం పోలింగ్ ముగిసిన తరువాత బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఎక్స్ వేదికగా తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ణతలు తెలిపారు. అంతే ఆమె హుటాహుటిన అమెరికాకు వెళ్లిపోయారు. దీంతో షర్మిల అమెరికా యానానికి కారణాలపై సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే  అపుపెరుగకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె పోలింగ్ పూర్తియిన తరువాత తన కుమారుడు, తల్లితో గడిపేందుకు అమెరికా వెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో  మాత్రం ఆమె ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారనీ, ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి అంగీకరించారనీ పెద్ద ఎత్తున వదంతులు ప్రచారమౌతున్నాయి. అయితే కాంగ్రెస్ వాటిని ఖండించింది. అలాగే షర్మిల  సన్నిహితులు కూడా ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీతో కానీ, జగన్ రెడ్డితో కానీ రాజీపడరనీ, ప్రచారంలో ఉన్న వదంతులన్నీ అవాస్తవాలనీ కరాఖండీగా చెబుతున్నారు.  

  టీఎస్-ఎప్సెట్ ఫలితాలు విడుదల ...బాలికలదే పై చేయి

టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం, ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి క‌లిసి ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. అగ్రికల్చ‌ర్, ఫార్మ‌సీ స్ట్రీమ్‌లో 89.66 శాతం ఉత్తీర్ణ‌త న‌మోద‌యింది. ఇందులో అమ్మాయిలు 90.18 శాతం, అబ్బాయిలు 88.25 శాతం ఉత్తీర్ణ‌త సాధించడం జ‌రిగింది. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 74.98 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదయింది. ఇందులో అమ్మాయిలు 75.85 శాతం, అబ్బాయిలు 74.98 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మసీ కోర్సుల ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు 91,633 మంది విద్యార్థులు హాజ‌రు కాగా, 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. అదే ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు ప‌రీక్ష‌కు హాజ‌రు కాగా, 1,80,424 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగం వారికి మే 7, 8వ తేదీల్లో ప‌రీక్ష‌లు జ‌రిగాయి. అలాగే  9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ వారికి పరీక్షలను నిర్వహించ‌డం జ‌రిగింది.

కోనసీమలో బెట్టింగుల జోరు.. గెలుపు ఓటములపై కాదు.. మెజారిటీలపైనే!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. ఓటరు తీర్పు ఈవీఎమ్ లలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూంలలో భద్రంగా ఉంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జూన్ 4. ఈ లోగా జాన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. అంత వరకూ రాష్ట్రంలో ప్రజల తీర్పు ఏమిటన్నది ఎవరు చెప్పినా అది ఊహాగానమే కానీ వాస్తవం అని చెప్పజాలం. అయితే పోలింగ్ సరళి, పార్టీల మూడ్ ను బట్టి ఫలితం ఊహించేయవచ్చు. అన్నిటికీ మించి ఎన్నికల ఫలితంపై జరుగుతున్న బెట్టింగ్ లు కూడా ఫలితంపై ఒక అంచనాకు రావడానికి దోహదపడతాయి.  ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు నడుస్తున్నాయి. ఇక కోనసీమలో అయితే ఈ బెట్టింగుల జోరు మరో లెవెల్ కు చేరింది. సాధారణంగా బెట్టింగులు అంటే ఫలానా పార్టీ విజయం సాధిస్తుంది. ఫలానా అభ్యర్థి గెలుపొందుతాడు అంటూ సాగుతాయి. కానీ కోనసీమలో మాత్రం బెట్టింగులు గెలపు ఓటములపై జరగడం లేదు. తెలుగుదేశం కూటమి అభ్యర్థుల మెజారిటీలపై సాగుతున్నాయి. ఈ బెట్టింగులు లక్షల రూపాయలు దాటి కోట్లలోకి చేరుతున్నాయి. కోనసీమ మూడ్ చూస్తుంటే కూటమి అభ్యర్థుల విజయాన్ని ఖరారు చేసేసినట్లు కనిపిస్తోంది. ఇక కూటమి అభ్యర్థులు సాధించబోయే మెజారిటీలపైనే భారీగా బెట్టింగులు నడుస్తున్నాయి. అమలాపురం లోక్ సభ నియోజకవర్గ తెలుగుదేశం కూటమి అభ్యర్థి, లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధుర్ లక్ష ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధిస్తారంటూ లక్షలలో బెట్టింగులు నడుస్తున్నాయి. అలాగే  ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో  తెలుగుదేశం కూటమి అభ్యర్థి పది వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధిస్తారనీ పెద్ద ఎత్తున బెట్టింగులు నడుస్తున్నాయి. అదే విధంగా తూర్పుగోదావరి వ్యాప్తంగా కూడా కూటమి అభ్యర్థుల మెజారిటీలపై ఐపీఎల్ బెట్టింగులను మించి బెట్టింగులు జరుగుతున్నాయి. ఈ బెట్టింగుల తీరు చూస్తుంటే ఫలితానికి ముందే కూటమి అభ్యర్థుల విజయం ఖారరైపోయినట్లు కనిపిస్తోంది. బెట్టింగులన్నీ మెజారిటీలపైనే జరగడాన్ని చూస్తుంటే తూర్పుగోదావరిలో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందా అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

ప్రపంచ వింత: మల్లారెడ్డి భూమి కబ్జా!

మాజీ ఎంపీ, మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ‘కష్టపడ్డా.. పాలమ్మినా.. పూలమ్మినా..’ మల్లారెడ్డి కబ్జాల పర్వం మీద ఒక పెద్ద గ్రంథమే రాయవచ్చని గిట్టనివారు అంటూ వుంటారు. మల్లారెడ్డికి వున్న వందలాది ఎకరాల ఆస్తుల్లో చాలాశాతం కబ్జాల పుణ్యమేనని కూడా అంటూ వుంటారు. అలా కబ్జాలకే ఆది గురువైన మల్లారెడ్డి స్థలాన్నే ఎవరో కబ్జా పెట్టారు. ఇది వింతల్లోకెల్లా వింత.. సరికొత్త ప్రపంచ వింత.  కుత్బుల్లాపూర్ - పేట్ బషీరాబాద్ పరిధిలోని మల్లారెడ్డికి, అతని అల్లుడు రాజశేఖరరెడ్డికి చెందిన స్థలంలో కొంతమంది బారికేడ్లు పెట్టి కబ్జా చేశారట. దాంతో మల్లారెడ్డి, ఆయన అల్లుడు, వాళ్ళ అనుచరులు  సదరు స్థలం దగ్గరకి వచ్చి హడావిడి చేశారు. అక్కడకి పోలీసులు కూడా రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, మల్లారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. మల్లారెడ్డి స్థలాన్ని వేరేవాళ్ళు కబ్జా చేశారా.. వేరేవాళ్ళ స్థలాన్ని కబ్జా చేయడానికి మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారా అనేది నిలకడ మీద తెలుస్తుంది.