ముఖ్య సలహాదారు పాత్ర ముగిసినట్టేనా? జగన్ మనసు ఎందుకు మారింది?
posted on Aug 29, 2019 @ 2:07PM
అజయ్ కల్లం రెడ్డి... జగన్ కోటరీలో అత్యంత కీలకమైన వ్యక్తి... మూడేళ్ల పదవీకాలంతో ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా అపాయింటైన అజేయ కల్లం రెడ్డికి తెలియకుండా జగన్ ప్రభుత్వంలో ఏమీ జరగదనే చెప్పాలి... ఆయా శాఖాధిపతులైనా... చివరికి సీఎస్ అయినా... డీజీపీ అయినా... అజేయ కల్లం రెడ్డికి చెప్పకుండా... ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోలేరని అంటారు.... అంతటి పవర్స్ ను ఆయనకు కట్టబెట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి. సీఎంవోలో అధికారగణం, ప్రభుత్వ సలహాదారులు... ఇలా ఎవరైనాసరే అజేయకల్లంరెడ్డికే రిపోర్ట్ చేయాల్సిందే. అజేయకల్లంరెడ్డిపై జగన్మోహన్ రెడ్డి అంత నమ్మకం పెట్టుకున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ప్రభుత్వ పాలనను, విధానాలను జగన్ ఆయన చేతిలో పెట్టారు. అయితే, అజేయ కల్లంరెడ్డిపై జగన్ పెట్టుకున్న నమ్మకం సన్నగిల్లిందనే మాట అమరావతిలో వినిపిస్తోంది. మూడేళ్ల పదవీకాలంతో అపాయింటైన అజయ్ కల్లం రెడ్డి... మూడు నెలలు కూడా కాకుండానే ముగిసిపోనుందనే ప్రచారం జరుగుతోంది. సీఎంవోలో అన్నీ తానై పాలనా వ్యవహారాలు చక్కబెడుతున్న అజేయకల్లంరెడ్డిని సాగనంపడానికి డెసిషన్ జరిగిపోయిందనే మాట వినిపిస్తోంది.
జగన్ అమెరికా పర్యటనలో ఉండగా.... ప్రభుత్వానికి జరిగిన నష్టంపై సీఎం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలవరం, అమరావతి, పీపీఏలు, రివర్స్ టెండరింగ్ లాంటి అంశాలను సరిగ్గా డీల్ చేయలేకపోయారని జగన్ మండిపడ్డారట. అమరావతిపై ప్రభుత్వం ఎందుకు ముందుకు వెళ్లలేకపోతుందో... పోలవరంలో రివర్స్ టెండరింగ్ ఎందుకో... పీపీఏల పునసమీక్షకు కారణాలేంటో... ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పడంలో... కేంద్రాన్ని ఒప్పించడంలో మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందనే భావనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి... దీనంతటికి అజేయకల్లంరెడ్డిని బాధ్యులుగా చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా రాజకీయ వైఫలమైనప్పటికీ... మొత్తం అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థనే అజేయకల్లం చేతిలో పెట్టినందున.... పాలనాపరమైన వైఫల్యంగా లెక్కగట్టి.... అజేయకల్లంరెడ్డిని సాగనంపడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అయితే, అజయ్ కల్లంరెడ్డి వైపు నుంచి కూడా మిస్టేక్స్ ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అసలు అమరావతి పాలసీ ఏమిటో, ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుందో... అర్ధమయ్యేలా చెబుతూ మంత్రులకు అజేయకల్లం సరైన గైడెన్స్ ఇవ్వలేకపోయారని అంటున్నారు. అందుకే సున్నితమైన రాజధాని అంశాన్ని మంత్రులు పెద్ద వివాదంగా మార్చేశారని జగన్ అంచనాకి వచ్చారట. అందుకే, ముఖ్య సలహాదారును సాగనంపి... ఇకపై పాలనావ్యవహారాలన్నీ పూర్తిగా తానే చూసుకోవాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి వచ్చారట.