యువతి బంపర్ ఆఫర్..
posted on Apr 10, 2021 @ 10:19AM
ఈ రోజుల్లో స్కూల్ పుస్తకానికి, ముఖ పుస్తకానికి. పోటీ పెడితే ముఖ పుస్తకమే గెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో మనిషి జీవితంలో నిత్యావసర సాధనంగా మారింది సోషల్ మీడియా. మనం ఎవరినైనా టార్గెట్ చేయాలంటే జస్ట్ వాళ్ళ ఫేస్ బుక్, ఇన్ స్టా చూస్తే చాలు వాళ్ళ వీక్నెస్లు ఇట్టే పసిగతీయొచ్చు. అందుకే కొందరు సోషల్ మీడియాని మోసాల మీడియా గా వాడుతున్నారు. నేరాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో అమ్మాయిలు హాట్‌గా మాట్లాడితే చాలు.. వాళ్లకు హచ్చు కుక్కలా లొంగిపోయి చెప్పిందల్లా చేసి నష్టాల పాలవుతున్నారు యువకులు. నేరాలపై పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ప్రజల్లో మార్పు మాత్రం రావడం లేదు.
ఓపెన్ చేస్తే.. అది హైదరాబాద్. కుత్బుల్లాపూర్‌లో నివసించే ఓ యువకుడు. పది పాస్ అయి ఇంటర్లో అడుగు పెట్టినట్లు. అప్పుడే కొత్త ఫోన్ తీసుకుని పేస్ బుక్ అనే ప్రపంచంలోకి అడుగు పెట్టాడు ఓ యువకుడు. తన మొబైల్ లో ఫేస్ బుక్ ఓపెన్ చేశాడు. అదే సమయంలో తనకు ప్రియా అనే ఓ యువతి రిక్వెస్ట్ పెట్టింది. అమ్మాయి రిక్వెస్ట్ చూసిన యువకుడు జాతిరత్నాలు సినిమాలో చిట్టి సాంగ్ వేసుకున్నాడు. మొదట కరోనాకు ఇచ్చే ఫస్ట్ డోస్ లా రొమాంటిక్ చాటింగ్ జరిగింది. తర్వాత అమ్మాయి చాలా హాట్ గా వీడియో కాల్ కోరింది. ఇక అంతే మనోడి తీగలు తేలిపోయి. ఆవేశం కట్టలు తెచ్చుకుంది. మసక మసక చీకటిలో సాంగ్ పడుకున్నాడు. సొల్లు కారుస్తూ హచ్చు కుక్క లా వీడియో కాల్ కి గ్రీన్ సింగల్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఆ అమ్మాయి బట్టలు లేకుండా వీడియో కాల్ కోరింది. ఇక అంతే నెక్స్ట్ సాంగ్ జోరుమీద ఉన్నవాడిని జోడి కడతావా.. డైరెక్ట్ న్యూడ్ వీడియో కాల్ చేశాడు. అల కొద్దీ సేపు మైకం లో మాట్లాడుకున్నారు. అంతలో అర్జెంట్ వర్క్ లో ఉన్నపుడు కరెంట్ పోయినట్లు. యువకుడు బాగా పీక్స్ లోకి వెళ్ళాక సడెన్ గా వీడియో కాల్ కట్ అయింది.. మనోడు డేటా ప్రాబ్లెమ్ అనుకున్నాడు.
కట్ చేస్తే.. అదే అమ్మాయి నుంచి కాల్ వచ్చింది. యువకుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ ఫోన్ కాల్ తో పిడుగుపడింది. ఆ యువకుడు తెల్ల మొహం వేసుకున్నాడు. ఇంతకీ ఆ ఫోన్ కాల్ లో ఏమైందో మీరే చూడండి.
ఫోన్ కాల్ లో అమ్మాయి.. నువ్వు మాట్లాడిన వీడియో కాల్ రికార్డింగ్ చేశాను. నాకు రూ.11,999 లు పంపాలని బంఫర్ ఆఫర్ ఇచ్చింది. లేదంటే నీ వీడియోను ఫేస్ బుక్ లో ఉన్న స్నేహితులందరికీ పంపిస్తానని బెదిరించింది. అంత డబ్బులు నా దగ్గర లేవని యువకుడు చెప్పడంతో ఆ వీడియోను ఫేస్ బుక్ చేసింది. వీడియోలను చూసిన నా స్నేహితులు ఏమైందని ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తెలిపాడు. తదనంతరం ఆ యువకుడు పేటీఎమ్ ద్వారా రూ.1000 లు పంపించాడు. అయినప్పటికీ వీడియోను ఫేస్ బుక్ లో డిలేట్ చేయకపోవడంతో దుండిగల్ పోలీసులను ఆశ్రయించాడు. యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమణా రెడ్డి తెలిపారు.