ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా బాబాయ్ కు ఇక కడలి ఈతే!
posted on Aug 10, 2023 @ 2:16PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ బాబాయి, టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి త్వరలో బ్యాడ్ టైం స్టార్ట్ కానుందనే ఓ చర్చ అయితే ఉత్తరాంధ్రలోని పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోన్నట్లు తెలుస్తోంది.
తిరుమలలో శ్రీవారి సేవ నుంచి ఉత్తరాంధ్రలో వైసీపీ సేవకు వెళ్లేందుకు వై వీ సుబ్బారెడ్డి ముహుర్తం ఖరారు చేసుకొన్నట్లు తెలుస్తోంది. టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా ఆయన పదవి కాలం ఆగస్టు 12తో ముగియనుందని.. దీంతో ఆ వెంటనే... లేదా అమావస్య వెళ్లిన తర్వాత అంటే.. ఆగస్ట్ 17వ తేదీన ఆయన.. తన మకాంను ఉత్తరాంధ్రకు మార్చేయనున్నారనే చర్చ అయితే ఆ సర్కిల్‌లో కొనసాగుతోంది.
ఆ క్రమంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా ఆయన రాజకీయాలపై ఆయన పూర్తిగా ఫోకస్ చేయనున్నారని చర్చ సైతం హల్‌చల్ చేస్తోంది.
అయితే ఉత్తరాంధ్ర రాజకీయం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని.. ఇప్పటి వరకు తిరుపతిలో లడ్డు, వడ, చక్ర పొంగలి తరహా ప్రసాదాల కోసమో, శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు కోసమో, వీఐపీలకు శ్రీవారి దర్శనం కోసమో, ప్రోటోకాల్ తదితర అంశాల సిఫార్సు లేఖలు శ్రీవారి ఆనంద నిలయం చుట్టూ... లేదా.. తిరుమల కొండల చుట్టూతా మాత్రమే ఉంటాయని.. కానీ ఉత్తరాంధ్ర రాజకీయం అంటే మాత్రం లెక్కపక్కా గా ఉంటుందని.. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే సదరు ప్రాంతంలో రాజకీయం అంటే పైకి అంతా ఠండా ఠండా కూల్ కూల్ అన్నట్లుగా ఉన్నా.. సదరు జిల్లాల రాజకీయంతో వైవీ సుబ్బారెడ్డి తల బొప్పి కట్టడం మాత్రం ఖాయమ పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది.
ఎందుకంటే 2014 ఎన్నికల్లో విశాఖ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ తల్లి వైయస్ విజయమ్మను ఎన్నికల బరిలో దింపగా... ఆమె ఓటమి పాలైయ్యారని.. ఇక 2019 ఎన్నికల్లో అదీ కూడా ఈ జగన్ వేవ్‌లో విశాఖ ఎంపీ స్థానం ఫ్యాన్ పార్టీ ఖాతాలో పడినా.. విశాఖపట్నం నగరంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు మాత్రం సైకిల్ పార్టీ ఖాతాలోకి ఎగిరి పడ్డాయని... మరి వచ్చే ఎన్నికల్లో ఈ మొత్తం స్థానాలు.. హోల్ సేల్‌గా జగన్ పార్టీ ఖాతాలో పడతాయా? అనే ప్రశ్న సైతం ఉత్పన్నమవుతోన్నట్లు తెలుస్తోంది.
అదీకాక ఇటీవల విశాఖ ఎంపీ, ఫ్యాన్ పార్టీ నాయకుడు ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైందని... ఈ నేపథ్యంలో సదరు ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇక్కడ మాత్రం వ్యాపారం చేయలేనని.. పక్కా రాష్ట్రం తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేసుకొంటానంటూ ప్రకటించేశారని... అదికార పార్టీ ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యడి పరిస్థితి ఏమిటనే ఓ ప్రశ్న అయితే ఉత్పన్నమైందని ...ద తో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఈ సందర్బంగా తీవ్ర చర్చకు వచ్చినట్లు సదరు సర్కిల్‌లో ఓ చర్చ వైరల్ అవుతోంది.
ఇక ఇదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ప్యాన్ పార్టీ కీలక నేత పంచకర్ల రమేష్ బాబు ఇప్పటికే అధికార పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాం రాం చెప్పేసి.. మరో పార్టీలోకి వెళ్లీపోయారని.. దీంతో ఉత్తరాంధ్రలోని పలువురు ఫ్యాన్ పార్టీ నేతలు.. పంచకర్ల దారిలో నడిచే అవకాశాలు ఉన్నాయని ఓ చర్చ సైతం వాడి వేడిగా కొన... సాగుతోంది.
అలాగే సిక్కోలు జిల్లాలోని ఫ్యాన్ పార్టీలో రేగిన అసమ్మతి సెగ.. నివ్వురుగప్పిన నిప్పులా ఉందని.. సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలస నియోజకవర్గంలో వర్గ పోరు తారస్థాయికి చేరిందని.. అలాగే టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా తొలుత దువ్వాడ శ్రీను పేరును గతంలో సీఎం జగన్ స్వయంగా ప్రకటించారని.. ఆ తర్వాత అతడి భార్య దువ్వాడ వాణి పేరు తెరపైకి వచ్చిందని.. అయితే ఇటీవల దువ్వాడ వాణి బూతు పురాణం తాలుక ఆడియో టేపులు.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినాయని.. అలాగే పలాస ఎమ్మెల్యే ప్లస్ మంత్రి సిదిరి అప్పలరాజు వ్యవహారశైలిపై నియోజకవర్గ ప్రజలే కాదు.. జిల్లా ప్రజలు సైతం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని తెలుస్తోంది. ఇక పాతపట్నంలోని అధికార పార్టీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కారణంగా.... నియోజకవర్గంలో రేగిన ఆశాంతి అంతా ఇంతా కాదని సదరు వర్గంలో ఓ చర్చ అయితే నడుస్తోంది. ఇక విజయనగరం జిల్లాలో కూడా దాదాపుగా ఇటువంటి రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయనే ఓ ప్రచారం సైతం ఫ్యాన్ పార్టీలో రంజు రంజుగా నడుస్తోంది.
మరోవైపు టీటీడీ చైర్మన్‌గా సోమవారం అంటే ఆగస్టు 7వ తేదీన పాలక మండలి అధ్యక్షుడి హోదాలో వైవీ సుబ్బారెడ్డి చిట్ట చివరి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ హోదాలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డిని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న భూమన కరుణాకర్ రెడ్డి చేతులు మీదగా ఘనంగా సత్కారించారు.
అయితే ఇప్పటి వరకు టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా ఉంటూ.. మరోవైపు ఉత్తరాంధ్ర ఇన్ చార్జ్‌గా వైవీ సుబ్బారెడ్డి వ్యవహరించిన తీరు వేరని.. కానీ ఆయన ప్రస్తుతం టోటల్‌గా ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జ్‌గా వ్యవహరించి.. ఈ ప్రాంతంలో సీట్లన్నీ ఫ్యాన్ పార్టీ ఖాతాలో పడేలా కసరత్తు చేయాలని.. అయితే సదరు జిల్లాల్లో ఎన్నికల ఫలితాలు ఏ మాత్రం తేడా కొట్టినా.. సదరు బాబాయి గారి వీపు విమానం మోత మోగడం ఖాయమనే ఓ చర్చ సైతం ఉత్తరాంధ్ర పోలిటికల్ సర్కిల్‌లో కొనసాగుతోంది. ఏది ఏమైనా.. ఇప్పటి వరకు టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా బాబాయి వై వీ సుబ్బారెడ్డి చాలా ఆరామ్‌గా గడిపేశారనీ, కానీ తాజాగా ఆయనకు బ్యాడ్ టైం స్టార్ అయిందనే ఓ చర్చ సైతం ఉత్తరాంధ్ర పోలిటికల్ సర్కిల్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.