నవ జాతిరత్నాలు!
posted on Jul 13, 2023 @ 3:30PM
2019 ఎన్నికల్లో వైయస్ జగన్ పార్టీ అధికారాన్ని అందుకొందంటే... అంతకు ముందు ప్రతిపక్ష నేతగా ఆయన తన పాదయాత్రలో నవరత్నాల పేరిట పథకాలను ప్రకటించడంతోనే సాధ్యమైందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి నవరత్నా పథకాలు ప్రకటించి జగన్ అధికారంలోకి వచ్చారు. ఆయన ఈ నాలుగేళ్ల పాలన.. ఎలా ఉందో.. ప్రజలందరికీ బాగానే అర్థమైంది. ఈ జగన్ ప్రభుత్వంలో సీఎంతో సహా తొమ్మిది మంది కీలక నేతలు ఉన్నారని.. వారి వ్యవహారశైలిని, మానసిక స్థితిని బట్టి.. నవరత్నాల్లోని ఏ ఏ రత్నం పెట్టుకుంటే వారికి మంచిదంటూ సెటైరికల్‌గా చెబుతున్న..ఓ చిత్ర రాజం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
ఆ చిత్ర రాజంలో తొలుత వైఢూర్యం స్థానంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఫొటో ఉంది. జనాలకు పంగనామం పెట్టువాళ్లు ధరించుట మంచిదంటూ క్యాప్షన్ పెట్టారు. ఇక ఆ తర్వాత స్థానంలో అంటే రెండో స్థానంలో ముత్యం ఉంది. ఆ స్థానంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. అన్ని విషయాల్లో వేలు పెట్టే వారికి శ్రేయస్కరమంటూ రాసి ఉంది. ఇక ముచ్చటగా మూడో స్థానం... అంటే పగడం.. ఈ స్థానంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఇసుక, మట్టి, మద్యం వ్యాపారులు ఈ పగడం ధరించడం ఉత్తమమని స్పష్టం చేసి ఉంది. ఆ తర్వాత నాలుగోస్థానం.. గోమేథకం స్థానంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. ఇది మానసిక రోగులు ధరించుట అన్ని విధాల శ్రేయస్కరమని వివరించి ఉంది.
ఆ తర్వాత స్థానం... అంటే పంచమస్థానం... కనక పుష్యరాగం స్థానంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ ఉన్నారు. నటనలో ప్రతిభ ఉన్నవారు ఈ రత్నాన్ని ధరిస్తే.. మంచిందని స్పష్టం చేసి ఉంది. అలాగే షష్టమ స్థానం అంటే ఆరు...నీలం రాయి. ఆ స్థానంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ లాంటి వారు ఈ రాయిని ధరిస్తే.. ఉత్తమొత్తమమని రాసి పెట్టి ఉంది.
ఇక సప్తమ స్థానంలో వజ్రం ఉంది. ఆర్బాటం, అవివేకం ఉన్నవాళ్లు ఇష్టపడతారంటూ.. ఆ స్థానంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజు చిత్రం ఉంది. అదే విధంగా అష్టమ స్థానం.. ఇందులో కెంపు ఉంది. తంబాకు నమిలే వారికి ఇది అన్ని విధాలా మంచిదని రాసి ఉంది. ఈ స్థానంలో కొడాలి నాని చిత్రం ఉంది. ఇక చిట్టచివరి స్థానం అంటే నవమ స్థానంలో పచ్చ ఉంది. పగటి నిద్రలో కలల విహారం చేసే వారు ధరిస్తే.. మంచిదంటూ.. ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ధరిస్తే శ్రేయస్కరమని రాసి ఉంది.
2014 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ వైయస్ జగన్ ప్రతిపక్షానికి పరిమితమైయ్యారు. ఆ తర్వాత అంటే.. 2017 చివరిలో ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టి.. 4 వేల కిలోమీటర్లకు పైగా ఆయన పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో తాను అధికారంలోకి వస్తే.. నవరత్న పతకాలు, సంక్షేమ పథకాలతో రాజన్న రాజ్యం వస్తుందంటూ ఆయన పేర్కొన్నారు.
దీంతో 2019 ఎన్నికల్లో ప్రజలంతా ఓట్లన్నీ జగన్ పార్టీకి గంపగుత్తగా గుద్దారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఎంత, ఎక్కడ, ఏమిటీ అంటే చెప్పే నాథుడే లేకుండా పోయాడు. అలాగే జగన్ పార్టీలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని తానే అయి వ్యవహరిస్తున్నారు.
దీంతో ఆయనకు సకల శాఖల మంత్రి అనే ట్యాగ్ లైన్‌ని సైతం ప్రతిపక్ష టీడీపీ తగిలించేసింది. అలాగే ఇక చిత్తూరు జిల్లాకు చెందిన ఫ్యాన్ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం అందరికీ తెలిసిందే. అదే విధంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమర్నాథ్ విషయం కూడా విదితమే. ఇక ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న విడదల రజినీ.. ఏపీ పాలిటిక్స్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది... ఆ తర్వాత.. ఆమె పోలిటికల్ గ్రాఫ్ ఎలా పెంచుకొంటూ వెళ్లిందనేది ప్రతీ ఒక్కరికి తెలిసిందే.
ఇక హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. అయితే సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. జగన్ పార్టీలో చేరి.. ఎంపీగా గెలుపొందారు. గతేడాది ఆయన నగ్న వీడియో అంటూ ఓ వీడియో వెలుగులోకి వచ్చి.. అటు మీడియాలో..ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ఆర్కే రోజా.. ప్రస్తుతం మంత్రిగా ఉండి.. ప్రతిపక్ష పార్టీలపై ప్రెస్ మీట్ పెట్టి కారాలు మిరియాలు నూరుతారన్న సంగతి తెలిసిందే. అలాగే గుడివాడ ఎమ్మెల్యే కోడాలి నాని.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం... శాసనసభ స్పీకర్ పదవి అంటే.. రాజ్యాంగ బద్దంగా ఉంటూ.. అన్ని పార్టీల వారిని సమ దృష్టితో చూడాలి. కానీ సదరు స్పీకర్ తమ్మినేని మాత్రం పక్కా అధికార పార్టీ నేతగా వ్యవహరించడం కొసమెరుపు. అంతేకాదు అసెంబ్లీలో సభ సాక్షిగా అప్పుడప్పుడు స్పీకర్ కూర్చిలో ఆసీనులై ఆయన కునికి పాట్లు పడుతోన్న పలు వీడియోలు, ఫోటోలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాన్ని సైతం నెటిజన్లు తమదైన శైలిలో వివరిస్తున్నారు.