చంద్రబాబును ఆకాశానికెత్తిన రోజా
posted on Apr 20, 2021 @ 5:08PM
ఆర్కే రోజా.. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఆమె టీడీపీ కీలక పదవులు నిర్వహించారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉండటంతో సమయం దొరికినప్పుడల్లా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తుంటారు. తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటారు. ఫైర్ బ్రాండ్ లీడరుగా పిలుచుకునే రోజా... టీడీపీ అధినేత చంద్రబాబును ఆకాశానికెత్తారు. వీరుడు.. ధీరుడు అంటూ పొగిడారు.
చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కొన్నేళ్ల క్రితం నాటి టీడీపీ నాయకురాలు.. నేటి వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. టీడీపీ నాయకురాలిగా చంద్రబాబును ఆకాశానికెత్తుతూ ఆమె మాట్లాడారు. శూరుడు.. ధీరుడు అంటూ చంద్రబాబును ఉద్దేశించి రోజా వ్యాఖ్యానించారు.
‘‘తెలుగుతల్లి అన్నపూర్ణ వరాలపట్టి.. అమ్మణ్ణమ్మ కలల పంట.. నందమూరి సింహ రాజకీయ వారసుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, తెలుగు ఆడపడుచుల ఆత్మీయ సోదరుడు, తెలుగు సింహం, అపర రాజకీయ మేధాదురంధురుడు, పేదల పాలిట పెన్నిధి, తెలుగువారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన కీర్తి వెలుగుల చంద్రుడు.. జగమంతా మెచ్చిన ఆంధ్రుడు, తెలుగు సామ్రాజ్య వీర.. ధీర.. శూర రాజకీయ చక్రవర్తి.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన ప్రియతమ నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు’’ అంటూ రోజా కీర్తించారు. ఈ వీడియోను నెటిజన్లు షేరింగ్ చేసుకుంటున్నారు.