వైసీపీ పుణ్యమే విశాఖలో భూదందాలు..టీడీపీ
posted on Oct 13, 2022 @ 5:39PM
విశాల సముద్రతీరంతో ఆంధ్రా ముంబైగా పేరుబడిన విశాఖపట్నం దారుణంగా భూదందాలకు, హత్యా రాజకీయాలకు నిలయమైందని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల అంశం తెరమీదకి తీసుకురావడంతోపాటు విశాఖను అభివృద్ధిచేయడానికి అనే నెపంతో పాలనా వికేంద్రీకరణ మాటను పదే పదే లేవనెత్తుతూ విశాఖను భూదందాలకు కీలక ప్రాంతంగా వైసీపీ నేతలు మార్చేశారని విపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం చాలారోజులుగా ఆరోపిస్తూ న్నది. ఇటీవలి కాలంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ తదితర వైసీపీ నేతలు విశాఖను సెటిల్మెంట్ అడ్డాగా చేసుకున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా మహేశ్వ రరావు ఆరోపిం చారు.
గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, విజయ సాయిరెడ్డి దసపల్లా భూములుసహా, ఇతరవిలువైన భూముల్ని కొట్టేసినా, కూర్మన్నపాలెంలోని స్థలాన్ని వైసీపీ ఎంపీ ఎంవీవీ, రూ.500కోట్ల విలువైన మధురవాడ ఎన్సీసీ భూముల్ని, డిప్యూటీ సీఎం కొట్టు సత్య నారాయణ తమ్ముడు కాజేశారని అన్నారు. డేటా సెంటర్ కు గతప్రభుత్వం కేటాయించిన రూ.600కోట్ల భూమిని, హయగ్రీవా వృద్ధాశ్రమానికి చెందిన రూ.400కోట్ల భూమిని దిగమింగారన్నారు. బేపార్క్, రాడిసన్ హోటల్, భీమిలి బీచ్రోడ్ లోని నేరెళ్లవలసలోని రూ.100కోట్ల భూమికబ్జాకు గురైంరని, వృద్ధా శ్రమాలు, అనాథాశ్రమాలుసహా, బడులు, గుడులు సహా వేటినీ వైసీపీ భూమాఫియా వదలడం లేదని ఆరోపించారు. భూకబ్జాలపై ఇంతవరకూ జగన్ రెడ్డి ఎందుకు నోరువిప్పడంలేరని ప్రశ్నించా రు. జగన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, విశాఖనగరాన్ని కాపాడాలని, అక్కడిప్రజలకు అండగా నిలవా లనుకుం టే, తక్షణమే తన పార్టీనేతల భూదందాలపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తమ నాయకుని హయాంలో ఆర్థిక రాజధానిగా విశాఖనగరం విరాజిల్లితే, వైసీపీప్రభుత్వం వచ్చిన మూడు న్నరేళ్లలోనే రూ.40వేలకోట్లపైచిలుకు భూములు కొట్టేశారని. ఇంత జరుగుతున్నా విశాఖ నగరంలోని ప్రజా సంఘాలు ఎందుకు స్పందించడంలేదని బొండా అన్నారు. లోపాయికారీగా రూ.40 వేల కోట్ల విలువైన భూములుకొట్టేసిన సంఘటనల గురించి ఆ ప్రాంత ప్రజలు, మేథావులు ఆలోచిం చాలన్నారు. ముఖ్యమంత్రి తన అనుకూల మీడియా ముందు కట్టు కథలు చెప్పి, ప్రజల్ని నమ్మిం చడం కాకుండా, తక్షణమే విశాఖ కేంద్రంగా సాగుతున్న భూదందాలపై హైకోర్ట్ సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణకు ఆదే శించాలని బొండా ఉమా డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, విశాఖను రాజధానిచేయాలన్న ఆలోచన జగన్ రెడ్డికి, ఆయనప్రభుత్వానికి రావడానికి ప్రధానకారణం తనపార్టీనేతల భూకబ్జాలబాగోతం బయటిప్రపంచానికి తెలియకుండా చేయడానికేనని తెలుగుమహిళవిభాగం రాష్ట్రఅధ్యక్షురాలు, టీడీపీపొలిట్ బ్యూరోసభ్యురాలు శ్రీమతి వంగలపూడి అనిత తేల్చిచెప్పారు.
గురువారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, మూడు న్నరేళ్ల నుంచి విచ్చలవిడిగా సాగిన వైసీపీనేతలభూదందా తనను కబళించకూడద నే జగన్ రెడ్డి కొత్తగా వికేంద్రీ కరణనినాదం తెరపైకి తెచ్చి, ఉత్తరాంధ్రవాసుల్ని అమరావతి రైతులపైకి ఉసిగొల్పు తున్నాడ న్నారు. వైసీపీ నిర్వహిస్తున్నది ప్రజాగర్జనా... భూకబ్జాదారుల గర్జనా అని ప్రశ్నించారు. జేఏసీ అంటే జగన్ యాక్షన్ కమిటీ. దానిలో సూత్రధారులు, పాత్రధారులు వైసీపీనేతలేనన్నారు. రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష పార్టీలన్నీ అమరావతికి జై కొడుతుంటే, జగన్ రెడ్డి ఆయన ప్రభుత్వం మాత్రమే మూడు ముక్కలాట ఆడుతు న్నారని అన్నారు. ఇప్పుడు ఉత్తుత్తి గర్జనలుచేస్తున్న విజయసాయిరెడ్డికి, ఆ పార్టీ నేతలకు విశాఖస్టీల్ ప్లాంట్ను ప్రైవేటీక రిస్తున్నప్పుడు గర్జన చేయాలనిపించలేదా? రైల్వేజోన్ సాధి స్తామంటూ రైలుబొమ్మని కారు వెనకాల తగిలించుకున్న మాజీమంత్రి జోన్ సాధనకోసం ఏనాడు ఎందుకు గర్జనలు పెట్టలేదని ప్రశ్నించారు.
కాగా, బీసీలు అధికంగా ఉన్న ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి పెత్తనం ఏంటని, పేనుకు పెత్తనం ఇస్తే తల గొరికినట్టు విజయసాయిరెడ్డికి పెత్తనమిస్తే ఉత్తరాంధ్రను దోచేశాడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి పంచుమర్తి అనురాధ ద్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహిం చిన విలే కరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గుణంలేని వాడే కులం గొడుగు పడతారని, విజయ సాయి రెడ్డి వైయస్ కుటుంబం పంచన చేరి దొంగ లెక్కలు రాసి జగన్ రెడ్డితో సహా 16 నెలలు చిప్ప కూడుతిన్నారని అన్నారు. రాజ్యసభ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉత్తరాంధ్రలోని ప్రజల ఆస్తు లు, భూములు దోచే స్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నాయకుడు అచ్చెన్నాయుడుని టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తే బీసీలు అధికంగా ఉన్న ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జిలుగా విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను జగన్ రెడ్డి నియమించారు. బీసీలు అధికంగా ఉన్న ఉత్తరాంధ్రలో నెల్లూరుకి చెందిన విజయసాయిరెడ్డి పెత్తన మేంటని ప్రశ్నించారు. సాయిరెడ్డి తన కూతురు, అల్లుడిని అడ్డం పెట్టుకుని ఉత్తరాంధ్రను దోచేస్తు న్నారన్నారు. భూ కబ్జాలు చేస్తూ నాకేం సంబందం లేదంటూ అమాయకుడిలా మాట్లాడటం సిగ్గుచేటు. విజయసాయిరెడ్డి మాటలు సొంత పార్టీ నేతలు కూడా నమ్మే పరిస్థితి లేదనిఎద్దేవా చేశారు. తన కుమార్తె ఆస్తులతో తనకేం సంబంధమన్న విజయసాయి రాష్ట్రంలో ఎవరు భూములుకొన్నా చంద్రబాబుగారి బంధువులవని విజయసాయిరెడ్డి ఎలా మాట్లాడతా డని ప్రశ్నించారు.
కాపులు, దళితులు, బీసీలు అన్ని కులాల్ని ఆర్దికంగా, రాజకీయంగా అణగ ద్రోక్కుతున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ ప్రెసిడెంట్ గా చంద్రశేఖర్ రెడ్డిని నియమించేందుకు గంగరాజును వెల్లగొట్టారని, ఎంపీ రఘురామరాజుపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె అన్నారు. కాపు నేత మాజీ మంత్రి నారాయణపై అక్రమ కేసులు పెట్టారు, బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారన్నారు. రిజర్వేషన్లు తగ్గించి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో 1600 మంది బీసీలకు పదవులు లేకుండా చేశారు. ప్రకా శం జిల్లాలో బీసీ మహిళ ఆత్మహత్యకు పాల్పడిందన్నారు.