హృతిక్ రోషన్ అనుకున్నాడు..ప్రాణం తీసుకున్నాడు!
posted on Oct 13, 2022 @ 4:13PM
రోడ్డంతా పరిగెట్టుకెళ్లి పాత బిల్డింగ్ పైకి వెళ్లి తీరిగ్గా చచ్చేట్టు కొట్టుకుని రక్తం కనిపించగానే అమాంతం విలన్ ని హీరో కిందకి తోసేస్తాడు. గాయాలతో అతనూ మెల్లగా దిగుతాడు. మరో సినిమాలో ఏకంగా రైలు తలుపు కి ఊగులాడుతూ నలుగురి కొట్టిపడేస్తాడు మహేష్‌బాబు..! ఇవన్నీ పెద్ద తెరమీద చూసి గోల చేయడానికి వీరాభిమానులకు మంచి ఫుడ్. కానీ అలా ఎన్నటికీ వాస్తవంలో జరగవు. అలా ఎవ్వరూ ధైర్యం చేయద్దని సదరు హీరోలే ప్రచారమూచేస్తుంటారు. కానీ వినేదెవరు? తన హీరో ఫలానా సినిమాలో చేశాడు గనుక మనం ఓ ట్ర యల్ వేద్దామనుకునే ప్రబుద్ధులు తయారయ్యారు. డ్రస్, హెయిర్‌స్టయిల్, నడక, మాట కాదు ఏకంగా స్టంట్ సీన్లు ప్రాక్టీస్ చాలా ప్రమాదం. ఒక కుర్రాడు ఇలానే స్టంట్ సీన్ చేయబోయే ప్రాణాలు తీసుకున్నాడు.
సరదాలు ప్రాణంతీసేవిలా ఉండకూడదు. సెల్ఫీల పిచ్చిలో ఇప్పటికీ చాలామంది ప్రాణాలమీదకు తెచ్చు కుంటున్నారు. అనేక సంఘటనలు తెలిసీ కుర్రాళ్లు రెచ్చిపోతున్నారేగాని తగ్గటం లేదు. గతంలో టూవీలర్ రేసులు, కార్ల రేసులు, తర్వాత సెల్ఫీల పిచ్చి, ఇపుడు వెలుగులోకి వస్తున్ స్టంట్ల పిచ్చి. ఇంట్లో సరదాకి పిల్లలు స్టంట్ సీన్లు చేస్తుంటారు.. దిండ్లతో. అక్కడ ఇంటిల్లపాదికీ సరదా కాలక్షేపం. పిల్లాడిని ఆడించ డంలో మురిపెంగా చూసుకోవడంలో భాగం. కానీ ఊహించని ప్రమాదాల వెంటాడుతుండే ఫీట్స్ కుటుంబా నికి తేరుకోలేని అవాంతరం.
పంజాబ్ చావా రైల్వేస్టేషన్ పరిధిలో ఒక రైలు వేగంగా వెళుతోంది. హఠాత్తుగా ఓ కుర్రాడికి ఏ హృతిక్ రోషన్ గుర్తొచ్చాడో ఏమోగాని అమాంతం స్టంట్ సీన్ లాంటిది చేయడం మొదలెట్టాడు. కొంతసేపయ్యాక ఏకంగా బయట ఫుట్‌బోర్డ్ మీద నుంచుని వీర విన్యాసాలు చేశాడు. ఏదో కుర్రాడు ఉత్సాహపడుతూ, ఓవ రాక్షన్ చేస్తున్నాడని మరో కుర్రాడు వీడియో తీశాడు. మనోడు మరింత రెచ్చిపోయాడు. ఈ ఆవేశంలో తాను ఉన్నది వేగంగా పరిగెడుతున్న రైలు బోగీ ఫుట్‌బోర్డు మీద అన్న ధ్యాసే మర్చిపోయాడు.. పది నిమిషాల తర్వాత ట్రాక్ పక్కనే ఉన్న కరెంటు స్తంభానికి కొట్టుకున్నాడు.. అంతే! వీడియో అయింది, అతను జీవితాన్ని చాలించాడు.