ఈటలకు వై క్యాటగిరి భద్రత
posted on Jun 28, 2023 7:55AM
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ కు కేంద్ర బలగాల భద్రత ఏర్పాటైంది. ఆయనకు వై కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు కూడా జారీ కానున్నాయి. మంగళవారం (జూన్ 27)న ఈటల రాజేందర్, ఆయన భార్య జమున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్నాటు చేసిన సంగతి తెలిసిందే.
ఆ మీడియా సమావేశంలో ఈటల సతీమణి జమున తన భర్తకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యెక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత మెప్పు పొందేందుకు పాడి కౌశిక్ రెడ్డి తన భర్తను హత్య చేసేందుకు ప్రణాళిక రచించారని పాడి కౌశిక్ రెడ్డి నుండి తన భర్తకు ఈటల రాజేందర్ కు ప్రాణ హాని ఉందని జమున ఆరోపించిన గంటల వ్యవధిలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వై కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడో రేపో విడుదల కానున్నాయి.