SPEED NEWS 3
posted on Jun 27, 2023 @ 5:55PM
1. డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టైన సినీ నిర్మాత కేపీ చౌదరి కాల్ లిస్ట్ లో తన పేరు ఉందంటూ వస్తున్న వార్తలను నటి అషురెడ్డి ఖండించారు. అయితే మీడియాలో వస్తున్న వార్తలతో రెండు రోజుల నుంచి తాను మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నానని, తప్పుడు ప్రచారం చేయవద్దని అషురెడ్డి అన్నారు.
2.క్రికెట్ వరల్డ్ కప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న తొలి మ్యాచ్ జరగనుండగా.. నవంబర్ 15న ఇదే వేదికపై ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈమేరకు వరల్డ్ కప్ షెడ్యూల్ ను మంగళవారం మధ్యాహ్నం ఐసీసీ విడుదల చేసింది.
3. వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉపవాస దీక్షలో ఉన్న పవన్ అస్వస్థతకు గురి కావడంతో పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో విశ్రాంతి తీసుకుంటున్నారు.
4. మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ ప్రభావం ఏ మాత్రం ఉండబోదని శివసేన ఉద్ధవ్ థాక్రే నేత, ఎంపీ సంజయ్‌రౌత్అన్నారు. కేసీఆర్ మహారాష్ట్రలోకి వచ్చి డ్రామా చేస్తున్నారు. ఇలానే నాటకాలాడితే తెలంగాణలోనూ అధికారం కోల్పోవడం ఖాయమని రౌత్ అన్నారు.
5. ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత, బీఎస్పీ మాజీ నేత ముత్యాల సునీల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికకు రెడీ అయ్యారు. ఆయనకు రూట్ క్లియర్ అయ్యింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఆయన ఢిల్లీకి పయనమయ్యారు.
6. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం భోపాల్‌లోని రాణి కమలపాటి స్టేషన్ నుండి ఐదు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో రెండు రైళ్లను ప్రత్యక్షంగా ప్రారంభించగా.. మరో మూడు రైళ్లను వర్చువల్ ద్వారా ప్రారంభించారు.
7. తీను వైసీపీకి దూరమయ్యాకే తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం అందిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పారు. ఈ రోజు నెల్లూరులో తెలుగుదేశం సమావేశంలో మాట్లాడిన ఆయన లోకేష్ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోందన్నారు.
8. వైసీపీ ప్రభుత్వం పై ప్రజలు విసుగ్గా ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధిస్తుందని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో జరిగిన తెలుగుదేశం సమావేశంలో ఆయన మాట్లాడారు.
9.తెలంగాణలో వచ్చే ఎన్నికలలో ఎంఐఎం పోటీపై ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎంఐఎంకు బలం ఉన్న అన్ని స్థానాలలోనూ అభ్యర్థులను పోటీలో నిలుపుతామన్నారు. వచ్చే ఎన్నికలలో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని అసద్ చెప్పారు.
10. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల 4న రాష్ట్రపర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటుచేశారు.