యుమున తీరంలో యముడ్ని శాంతింపజేసే యజ్ఞం! మూడో ప్రపంచ రణమే కారణం!
posted on May 12, 2017 @ 11:15AM
మూడో ప్రపంచ యుద్ధం… ఈ మాట ఇప్పటికి చాలా సార్లు వినిపించింది. ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది. నిజానికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత కొంత కాలం అందరూ మౌనంగా వున్నారనుకుంటా! ఆ తరువాత నుంచీ ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో మూడో ప్రపంచ యుద్దం అంటూ కామెంట్లు చేస్తూనే వున్నారు. కాని, 1945 తరవాత గత డెబ్బై ఏళ్లలో ఎప్పుడూ థర్డ్ వాల్డ్ వార్ రాలేదు. కాని, ఇక ఆగేది కాదంటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు!
అమెరికా, ఉత్తర కొరియా మధ్య టెన్షన్ గురించి మీకు కొంచెమైనా తెలిసి వుంటే మూడో ప్రపంచ యుద్ధం డిస్కషన్ ఇప్పుడెందుకు వచ్చిందో అర్థమైపోతుంది. అమెరికా ఈ మధ్య కాలంలో అఫ్గనిస్తాన్, ఇరాక్, సిరియా లాంటి దేశాలపై దాడులు చేసింది. కాని, అవేవీ న్యూక్లియర్ కంట్రీస్ కావు. ఇప్పుడు నార్ కొరియా కొట్లాటకు సర్వం సిద్ధం చేసుకుంది. ఆ దేశ నియంత అణు క్షిపణులు చూసుకుని ఎగిరెగిరిపడుతున్నాడు. ఇక ట్రంప్ కూడా రోజు రోజుకు యుద్ధం తప్ప వేరే మార్గం లేదన్నట్టు స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఒకవేళ అమెరికా, ఉత్తర కొరియాలు అణు దాడులకు దిగితే మాత్రం … అది మూడో ప్రపంచ యుద్ధమే అవ్వబోతోంది!
అమెరికా, కొరియాల మధ్య యుద్ధ వాతావరణం పసిగట్టి థర్డ్ వాల్డ్ వార్ రాబోతోందని చెప్పటం విశ్లేషణ మాత్రమే. కాని, జ్యోతిష్యులు ఆకాశంలోని గ్రహాలు ఆగ్రహంగా వున్నాయంటున్నారు. అనుగ్రహం కోసం యజ్ఞాలు కూడా చేస్తున్నారు. అంతే కాదు, థర్డ్ వాల్డ్ వార్ అనివార్యమని చెబుతోంది మన భారతీయ జ్యోతిష్యులు మాత్రమే కాదు… అమెరికన్ అస్ట్రాలజర్ ఒకరు ఈ బాంబు తొలిసారి పేల్చారు! జూన్ 14న మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అంటూ డేట్ కూడా చెప్పేశాడు! ఆ ప్రముఖ అమెరికన్ అస్ట్రాలజరే గతంలో ట్రంప్ ఖచ్చితంగా యూఎస్ ప్రెసిడెంట్ అవుతాడని కూడా చప్పాడట!
అమెరికన్ అస్ట్రాలజర్ అమెరికా,కొరియా దేశాల మధ్య యుద్ధం గురించి మాట్లాడితే మన దేశ జ్యోతిష్య పండితులు ఇండియా, పాకిస్తాన్ గొడవల గురించి చెప్పుకొస్తున్నారు. మొన్నటికి మొన్న ఇద్దరు జవాన్ల తలలు నరికిన పాక్ అన్ని విధాల వినాశనానికి సంసిద్ధంగా వుంది. ఏ క్షణమైనా భారత్ పూర్తి స్థాయి సర్జికల్ స్ట్రైక్స్ మొదలు పెట్టవచ్చు అంటున్నారు అస్ట్రాలజర్స్! ఇండియా, పాక్ సంబంధాల సంగతి కాస్తో కూస్తో తెలిసిన విశ్లేషకులు కూడా ఈ వాదనని కొట్టిపారేయటం లేదు. భారత ఆర్మీ పగతో రగిలిపోతోంది. కాబట్టి పాకిస్తాన్ ముక్కలు చెక్కలు కావటం సమీప భవిష్యత్ లో దాదాపుగా జరిగే పనే! కాకపోతే, పాక్ వద్ద కూడా ఉత్తర కొరియాలాగే న్యూక్స్ వుండటం అతిపెద్ద ఆందోళన కలిగించే విషయం!
అమెరికా, ఉత్తర కొరియా, ఇండియా, పాక్ దేశాల మధ్య యుద్ధాలు మూడో ప్రపంచ సంగ్రామానికి నాంది పలుకుతాయో లేదో ఇప్పుడే చెప్పలేం . కాని, అనలిస్టులు,అస్ట్రాలజర్లు ఇద్దరూ వార్ ని కొట్టిపారేయటం లేదు! అందుకే, మన వాళ్లు కొంత మంది యముడి సోదరి అని భావించే యమున నది తీరంలో విశ్వ శాంతి యజ్ఞం చేస్తున్నారు. యుద్ధం తప్పాలని దైవాన్ని ప్రార్థిస్తున్నారు! మరి హింస తప్పుతుందా? రణమూ, మరణమూ శాంతిస్తాయా? కాలమే తేల్చాలి…