Read more!

మరో ప్యాండమిక్ వస్తే??

ప్రపంచ దేశాలు మరో ప్యాండమిక్ కు  సిద్ధం గా ఉన్నట్ల లేనట్ల? ప్యాండమిక్ అంటే నే భయం ఎక్కడనుంచి ఎలా వస్తుందో దాని ప్రభావం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. అసలు మొదటి సారి వచ్చిన  ప్యాండమిక్ విషయంలో పూర్ర్హిగా అవగాహనా లేమి కనపడింది. కాగా రెండవ విడత  ప్యాండమిక్ లో నూ అదే పనితీరు.అటు ప్రజా ఆరోగ్యం, చికిత్స పద్దతులు. ప్రజా ఆరోగ్యానికి అవసరమైన  మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యం తో మరిన్ని ప్రాణాలు కోల్పోయారు. మేము అంతా తర్వాత వచ్చే  ప్యాండమిక్ వస్తుందన్న నేపధ్యం లో  ఒకరకమైన ప్రకటనల నేపధ్యం లో  కోవిడ్ ను నియంత్రించేందుకు తయారు చేసిన వ్యాక్సిన్ల ప్రభావం తక్కువే,తామర తుంపరగా పెరిగి పోతున్న కోవిడ్ వేరియంట్లను ఎదుర్కునే  శక్తి  వ్యాక్సిన్లకు ఉందా? అన్నది.

సందేహంగా మారింది. వైరస్  అనేది ల్యాబ్ లలో దాని ద్వారా ముఖ్యంగా  పిల్లలకు మీజిల్స్ తట్టు వంటి సమస్యలు, పోలియో వంటి వ్యా దుల బారిన పడకుండా  వ్యాక్సిన్ లు కనిపెట్టారు. ముఖ్యంగా కుక్కకాటుకు కూడా వ్యాక్సిన్ కనిపెట్టినా వాటి ప్రభావం ఏమాత్రం ఉంది అన్నది  మరోప్రశ్న?. ప్రపంచం కోరోనాను  ఎదుర్కునేందుకు సన్నద్ధంగాలేకపోవడం వల్లే తీవ్రత ప్రభావం ఎక్కువ గా ఉందని దాని ప్రభావం  సమర్ధంగా ఎదుర్కోవడం లో విఫలమయ్యా మా?  లేదా  మరో ప్యాండమిక్ ను ఎదుర్కోడానికి సిద్ధ మౌతున్నమా ? అన్నది ప్రశ్న ? చాలా దేశాలు కోరోనా నిర్మూలనకు సరైన చర్యలు  చ్గేపట్టడం లేదన్నది వాస్తవం? అసలు  

ముందు ముందు భవిష్యత్తు ఎలాఉంటుంది అన్న అంశం పై  ఒక రిపోర్ట్...

జి హెచ్ ఎస్ గ్లోబల్ హెల్త్ సేక్ర్యు రీటి  ఇండెక్స్ చేసిన  సంనద్దత ఆయా సందర్భాలలో ఆరోగ్యం అత్యవసర సమయం లో ఎలాంటి సమస్యలు వస్తాయి. న్యూక్లియర్ ద్వారా వచ్చే  సమస్యలు ఆర్ధిక పరిస్థితుల ప్రభావం అంశం పై జాన్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ బ్లూమింగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కొన్ని అంశాలను వెల్లడించింది. 

2౦21  జి హెచ్ ఎస్ ఇండెక్స్ సంస్థ వెల్లడించిన అంశాల ప్రకారం...

అన్నిదేశాలలో అత్యవసర సమయంలో  వారి వద్ద ఉన్న  శక్తి సామర్ధ్యాలు స్పందించినప్పుడు వారిలో ఉండే సత్త కోవిడ్19 పై ప్రభావ వంతం గా తీవ్రంగా స్పందించడం లో వారిలో ఉండే సత్త కోవిడ్ 19 పై ప్రభావ వంతంగా తీవ్రంగా స్పందించడం ఎలా ఉండాలి అన్న అంశం పై పూర్తిగా అవగాహన లేకపోవడం పరిస్థితికి అనుగుణంగా సిద్ధంగా లేకపోవడం చూస్తే  ఆర్ధికంగా,ప్యాండమిక్ వల్ల ప్రమాదం దేశాలలో 1౦౦ కి ౩8.9% మాత్రం మార్కులు సాధించాయి. 2౦19 నాటి కన్నా  ఏ మాత్రం  మార్పులేదని నిపుణుల అంచనా మొత్తం మీద యు.ఎస్ లో 76% లోపే ఉందని పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్యానికి సంబందించిన ఉత్పత్తుల తయారీ,నివారణ, అత్యవసర సమయంలో వచ్చే పెతజన్స్ వంటి అంశం లో ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువ  ఇక అత్యవసర సమయంలో  పెతోజన్స్  నివారణలో  1౦౦ కి 28. 4%గా ఉన్నట్లు గుర్తించారు. 11౩ దేశాలలో పెద్దగా అప్రమత్తంగా  లేరని. వ్యాధి వ్యాప్తి  జంతువులనుంచి  మనుషులకు  సంక్రమించింది. ౩ సంవత్సరాల కాలం లో  195 దేశాలలో 155 దేశాలు సర్వేలో ప్యాం డమిక్ కు సన్నద్ధం లేదని.ఎపిడమిక్ లో 7౦ % క్లినిక్లు ఆసుపత్రులు కమ్యూనిటి హెల్త్ సెంటర్స్ లో ను సన్నద్ధం గా ఉన్నట్లు కనబడడం లేదు. 

నేడు నాయకులకి ఒక అవకాశం ఉంది. డాక్టర్ జేన్నిఫార్ నుజ్జో సీనియర్ స్కాల్లర్ జాన్స్ హాప్కిన్స్ సెంటర్ సెక్యురిటీ బాల్టి మోర్ మాట్లాడుతూ దేదికేటెడ్ గా పెట్టుబడులు కొనసాగించాలని ఎవరి శక్తి కొలది వారు కోవిడ్ 19 పై స్పందించాల్సిన అవసరం ఉదని అన్నారు. దీర్ఘకాలిక అంశంగా పరిగణించి దశాబ్దాలు సాగించవచ్చు ఒకవేళ మనం ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రపంచం స్మసనంగా మారుతుంది. భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదుర్కోక తప్పదు.ఆత్మ విశ్వాసం కోల్పోవడం అంటే ప్రజా ఆరోగ్యం పట్ల వ్యాధినిర్ధారణ నిరోధం విషయంలో  అంతా మాస్క్ ఇంటి వద్దే ఉండడం,వ్యాక్సినేషన్, నియంత్రణ,ప్రోటో కాల్స్ వంటివి మన ముందున్న సవాళ్ళు. రెండు సంవత్సరాల పాటు యు ఎస్ రాజాకీయ నాయకులు ఆరోగ్య అధికారుల లక్ష్యాలు,ఉద్దేశాలను ప్రశ్నించారు.

ఈ  ఆంశాల పైన  చర్చలు జరిపారు. ప్రజా ఆరోగ్యం సంరక్షించేందుకు చేపట్టిన చర్యలు ప్రజలు అంగీకరించారా లేదా? తక్కువధరకే వైద్య సేవలు  అందించడం సాధ్యమా? వైద్యసేవల పై పరిమితులు నియంత్రణ,ముఖ్యంగా రోగులకు మెరుగైన సేవలు అందించడానికి వీలైన  బెడ్లు,మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టు బడులు ప్రోత్సాహం వైద్యానికి ప్రభుత్వాలు,ఆసుపత్రులు కొను గోలు చేసే పరికరాల దిగుమతుల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉందాలేదా అన్నది మరో ప్రశ్న.  ఇలా అసలు కోవిడ్ కు వేరియంట్లకు ఎలాంటి చికిత్స చేయాలి అందుకు సంబందించిన దిశా నిర్దేశం చేయడం లో ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో చాలా దేశాలాలో ఒక వైద్య విధాన మంటూ ఉందా అన్నది మరోసందేహం. ఇప్పటికీ చాలా దేశాలు తమ దేశాలాలో సమగ్ర ఆరోగ్య విధానం రూపొందించు కోక పోవడం దురదృష్ట కరం. దీనినిబట్టి మరో ప్యాండమిక్ వస్తే తప్ప ప్రజా ఆరోగ్యానికి మోక్షం లేదన్నది వాస్తవం.