వరల్డ్ లివర్ డే 2022...
posted on Apr 20, 2022 @ 9:30AM
ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ లివర్ డే ను ప్రతియేటా నిర్వహిస్తారు.వరల్డ్ లివర్ డే లక్ష్యం ఒక్కటే మనలివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని పద్దతులు పాటించడం అవసరం అంటున్నారు నిపుణులు.మనశరీర అవయవాలలో లివర్ అత్యంత కీలక మైన అవయవం.మన శరీరం తీసుకునే ఆహారం అరగాలాంటే లివర్ కీలకం. శరీరంలో పిత్తశాతం పెంచడం లో శరీరంలోని విష పదార్దాలను తొలగించి శరీరాన్ని డీ టాక్స్ చేసే పనిని చేస్తుంది. లివర్ చేసేపనిలో ముఖ్యమైనది బ్లడ్ షుగర్ ను నియంత్రించడం. ప్రోటీన్ ను తయారు చేస్తుంది. ఈ సమయం లో లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవడం అత్యవసరం.ప్రతిఏ టా వరల్డ్ లివర్ డే ను 19 ఏప్రిల్ న నిర్వహిస్తారు.వరల్డ్ లివర్ డే సందర్భంగా లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవాలో తెలుసుకుందాం.
లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకునే పద్దతులు...
1)మనం ఇంతకు ముందే చెప్పినట్లు శరీరాన్ని డీ టాక్స్ చేయడం. మీరు ఈ మధ్య కాలంలో అనారోగ్యం కలిగించే పదార్ధాలను తీసుకుంటే లివర్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. లివర్ పాడై పోయే ప్రమాదం ఉంది అని నిపుణులు అంటున్నారు. అనారోగ్యం కల్పించే ఆహార పదార్ధాలు లివర్ భాగాలకు నష్టం కలిగిస్తాయి.ఇదే సమయం లో మీకు పొగత్రాగడం లేదా మద్యపానం,జంగ్ ఫుడ్స్,ప్రాసెస్ చేసిన ఆహారం లేదా ఫాస్ట్ ఫుడ్స్ వాటినుండి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
2)వ్యక్తి నియమిత పద్దతిలో శరీర వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాదు లివర్ లో వాపులు కూడా తగ్గుతాయి. వ్యాయామం చేయడం వల్ల లివర్ సరిగాపనిచేయడం లో ప్రభావం చూపుతుంది.
౩) లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం బరువు నియంత్రించడం అత్యవసరం. ఎవరైతే స్తూల కాయం తో ఇబ్బంది పడుతున్నారో వారి శరీరంలో ఫ్యాటీ లివర్ సమస్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడే బరువు నియంత్రించడం వల్ల లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
4) మనం మన మిత్రులకు కుటుంబ సభ్యులకు కొన్ని విషయాలు పంచుకుంటాం కాని ఇలా చేయడం వల్ల లివర్ లో పలు సమస్యలు రావచ్చని మీరు వాడే టూత్ బ్రష్, చేతి గోళ్ళు కొరుక్కోవడం వంటి వాటిగురించి పంచుకోవడం కన్నా వ్యక్తిగత శుభ్రత స్వీయ ఆరోగ్యం పై దృష్టి పెట్టాలని నిపుణులు సూచించారు.పైన పేర్కొన్న అంశాలద్వారా తెలిసింది ఏమిటి?అంటే లివర్ ను ఆరోగ్యంగా ఉంచడం వల్ల శరీరం కూడా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.