కరోనా నాల్గవ వేవ్ భారత్ ను తాకనుందా ?...
posted on Apr 19, 2022 @ 9:30AM
ఎక్స్ ఇ వేరియంట్ త్వరగా విస్తరిస్తుందని డబ్ల్యు హెచ్ ఓ ప్రపంచాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే.ఇతర వైరస్ లతో పోలిస్తే త్వరగా విస్తరించే వేరియంట్ ఎక్స్ ఇ ఎందుకంటే ఒమైక్రాన్ లోని బి ఏ2 బి ఏ1 కలిసి ఉందన్న విషయాన్ని డబ్ల్యు హెచ్ ఓ తెలిపింది.కాగా చైనాలో ఇప్పటికే కరోనా ఉగ్రరూపనికి షాంఘై నగరంలో కరోనా లాక్ డౌన్ ఖటి నంగా అమలు చేస్తున్నా కరోనా కోరలు చా స్తోందని కరోనా బాధితులు లక్షలుగా పెరగడం తో మరోసారి భారత్ ను చుట్టివేస్తుందేమో అన్న అనుమానం ప్రజలను వేదిస్తోంది. గత కొన్ని రోజులుగా భారత్ లోని మహారాష్ట్రాలోని ముంబైలో ఎక్స్ ఇ వేరియంట్ తొలి కేసు నమోదు అయిననేపధ్యం లో క్రమంగా కోరోనా కేసులు , డిల్లి,యు పి రాష్ట్రాలలో 1౦౦౦ కి పైగా కేసులు నమోదు అవుతూ ఉండడం తో కరోనా వస్తుందన్న భయం ప్రజలను వెంటాడుతోంది.ఈ నేపధ్యం లో కాన్పూర్ కు చెందిన ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ ఈ విషయం పై తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా వెల్లడించారు. దేశంలో ని పలురాష్ట్రాలలో గత కొంతకాలంగా కరోనా కేసులు పెరుగుతూ ఉండడం తో ఈ కారణం గా చాలా మంది మనసులో ఉన్న అనుమానం ఒకటే ఇది 4 వ వేవ్ కాదు కదా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పూనాకాన్పూర్ కు చెందిన ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ ఉపశమనం కలిగించే వార్తను అందించారు.కేసులు గణనీయంగా పెరగడానికి మూలకారణం కరోనా నిబంధన లు సడలించడం వల్లే కేసులు పెరుగుతున్నాయని అన్నారు. దేశంలో నాలుగో విడత కు అవకాశం లేదని ఎందుకంటే ప్రజలలో వైరస్ కు వ్యతిరేకంగా9౦ %సహజంగానే ఇమ్యునిటి రోగనిరోదక శక్తి పెరిగిందని అన్నారు మనీంద్ర అగర్వాల్.వాస్తవానికి ఐ ఐ టి ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ రెండు సంవత్సరాలుగా తమవద్ద ఉన్న గణితశాస్త్ర లెక్కల ప్రకారం కోరోనా పై భవిష్యత్తును అంచనా వేస్తూ వచ్చారు. అవి నిజమయ్యాయి కూడా ఉత్తరప్రదేశ్ లో గత మూడు రోజులుగాకోరోనా కేసులు వ్యవహారం లో 1౦౦౦ కి పైగానే నమోదు అవుతున్నాయి, ఆదివారం దాకా యు పి లో 1౩5 కొత్త కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఈ నేపధ్యం లో 61౦ కి పైగా కేసులు నమోదు అవుతునాయి. ప్రజలలో ఈ వైరస్ పట్ల 9౦% రోగనిరోదక శక్తి ని కలిగి ఉన్నారని కొత్త వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశం లేదని
అన్నారు.
కరోనా 4 వ వేవ్ రాదు...
ప్రొఫెసర్ అగర్వాల్ మాట్లాడుతూ కరోనా రెండవ వేవ్ సమయం లో చాలా పెద్ద ఎత్తున వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని దానికి వ్యతిరేకంగా టీకా కార్యక్రమం చేపట్టడం తో ప్రజలలో ఇమ్యునిటి పెరిగేందుకు దోహదం చేసిందని అన్నారు.కేంద్రప్రభుత్వ ఆరోగ్య శాఖ విడుదల చేసిన దాటా సమాచారం ప్రకారం దేశ వ్యాప్తంగా ఆదివారం నాటికి 186.51 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు చెప్పారు.ఇక యు పి విషయానికి వస్తే ఇక్కడ 86% ప్రజలకు వ్యాక్సిన్ రెండు రెండు డోసులు అందించడం జరిగింది. వ్యాక్సిన్ విషయం లో యు పి మొదటి స్థానం లో ఉండని ఈ కారణం గానే ప్రజలు ఆసుపత్రులలో వెళ్ళే అవకాశం లేకుండా పోయిన విషయాన్ని అంతకు ముందే ప్రొఫెసర్ అగర్వాల్ కోరోనా రెండవ,మూడవ వేవ్ స్పష్టం చేసారు.ఇప్పటివరకూ కోరోనా పై విజయం సాధించిన విషయాన్ని స్పష్టం చేసారు. యుపిలో గత 24 ఘంటలలో 1౩5 కొత్త కేసులు వస్తూ ఉండడం తో డిల్లి ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.