పచ్చి మామిడి తింటే లాభమా?
posted on Apr 21, 2022 @ 9:30AM
వేసవి వచ్చిందంటే పచ్చిమామిడి కాయాలు తెచ్చింది. పచ్చి మామిడి కాయ తింటే ఆరోగ్యలాభాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? పచ్చిమామిడి కాయ వల్ల పొట్టలో వచ్చే సమస్యలకు ఉపసమనం లభిస్తుందని నిపుణులు అంటునారు.వేసవి కాలం ఆపైన పచ్చిమామిడి కాయ తింటూ ఉంటె ఉంటుంది దీనికి మించిన బెస్ట్ కామినేషన్ లేదనే చెప్పాలి.పచ్చి మామిడి కాయ ఒక్కోముక్క తింటూ ఉంటె పుల్లగా కాస్త ఉప్పు కారం అడ్డుకుని తిన్న ఆటేస్ట్ వేరనే చెప్పాలి.సహజంగా వేసవికాలం లో పచ్చిమామిడి తో చేసిన ఏ వంటకమైన టేస్టీ గానేఉంటాయి.అసలు ఇంట్లో ఉండే పిల్ల పెద్ద అందరూ పచ్చిమామిడిని తినడానికి ఇష్టపడతారు.వేసవికాలంలో పిల్లలు సైతం మామిడి కాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అనేక లాభాలు ఉన్నాయి.
లు నుంచి రక్షణ...
వేడిమి నుంచి ఉపసమనం తో పాటు ఆరోగ్యంగా ఉండటానికి కొంత మేలుచేస్తుంది. మామిడిలో మంచి ఇంఫ్లామేటరీ యాంటి ఆక్సిడెంట్ గా పనిచేసే లక్షణం మామిడి కాయకు ఉంది. అది మీ శరీర తత్వాన్ని చల్ల బరిచేందుకు దోహదం
చేస్తుంది. పచ్చి మామిడి కాయ వేసవి వేడిమి వల్ల వచ్చే లూ ప్రభావాన్ని తగ్గిస్తుంది.శరీరంలో నీటి శాతం పెంచేందుకు పచ్చి మామిడి తింటారు. వర్క్ అవుట్ తరువాత మంచి వేసవి రిఫ్రెష్మెంట్ డ్రింక్ గా చెప్పవచ్చు.
ఇమ్యునిటీ ని పెంచే మామిడి కాయ...
ఇటీవలి కాలంలో సుదీర్ఘంగా మనం ఎదుర్కుంటున్న దీర్ఘకాలిక సమస్యలలో కోరోనా వల్ల ఇమ్యునిటీ కోల్పోయారు.ఇమ్యునిటీ ని తిరిగి పొందాలంటే పచ్చి మామిడి దోహదం చేస్తుంది. పచ్చిమామిడిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇమ్యునిటీ ని పెంచేందుకు సహకరిస్తుంది. పచ్చి మామిడి కాయ ను తినడం ద్వారా వేసవిలో వచ్చే సమస్యల నుంచి రక్షించుకోవచ్చు.
ఆరోగ్యమైన గుండెకు మామిడి...
మామిడిలో మేగాఫెరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. మేగిఫెరిన్ కొలస్ట్రాల్,ట్రై గ్లిజరాయిడ్స్,ఫేటి యాసిడ్ స్థాయిని నియంత్రించడం లో దోహదం చేస్తుంది. ఎవరికైతే గుండె సమస్యలు వస్తాయో,తీవ్రత నుండి తట్టుకునే పచ్చిమామిడిలో మెగ్నీషియం, పొటాషియం,సంపూర్ణం గా లభిస్తాయి.గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది పచ్చిమామిడి.
క్యాన్సర్ ప్రమాదం తగ్గిస్తుంది...
పచ్చి మామిడి కాయ నుండి లభించే ఫెనోల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి. అది క్యాన్సర్ వల్ల వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.మామిడి కాయ శరీరంలో వచ్చే వాపులను తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
చర్మం కాంతి వంతం...
పచ్చి మామిడి కాయ తినడం వల్ల చర్మం సంరక్షిస్తుంది. పచ్చిమామిడి తినడం వల్ల పిం పుల్స్,మచ్చలు,కంటికింద చారలు,కళ్ళుగుంటలు పడడం,రకరకాల సమస్యలకు తగ్గిస్తుంది.
శరీరంలో నీరు...
వేసవిలో ఎండవేడిమికి శరీరంలో నీటి శాతం తగ్గడం సహజం.పిల్లలు పచ్చి మామిడిని తినడం వల్ల శరీరం లో నీరు తగ్గుతుంది.దీనివల్ల మనశరీరం హైద్రేడ్ అవుతుంది.