2030 నాటికి కుష్టు వ్యాధిని నిర్మూలించడమే లక్ష్యం
posted on Jan 30, 2021 @ 9:30AM
2030 నాటికి కుష్టు వ్యాధిని నిర్మూలించడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యం అని కుష్టు వ్యాధి నివారణ గుడ్విల్ అంబాసిడర్ యోహీ ససకావా
అన్నారు. ప్రతియేటా జనవరి 30 న జరుపుకునే కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ససకావా మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా కోవిడ్ 19 ప్రధాన అంశంగా మారిందని, ప్రపంచం ఇతర సమస్యలను నిర్లక్ష్యం చేసిందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా కుష్టు వ్యాది పట్ల నిర్లక్ష్యం వహించామన్నారు.
ఈ వ్యాధిపై శ్రద్ధ అవసరమని ఇప్పటికే 2,00,000 కేసులు గుర్తించామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ప్రజలు అంగవైకల్యానికి గురి అవుతున్నారని కుష్టు వ్యాధి వల్ల ముప్పులేదని కాని సామాజికంగా బహిష్కరణకు గురికావడం వెలివేయడం దురద్రుష్టకరమని అన్నారు. ఇంకా వివక్ష కోనసాగడాన్ని ససకావా తప్పు పట్టారు. ఇంకా చాలా దేశాలలో చట్టాలు అమలు కాకపోవడం బాధాకరమని అన్నారు. కుష్టు వ్యాధి గ్రస్తులు విడాకులు తీసుకుంటున్నారని.. ఈ వ్యాధి నుంచి నివారణ అవసరమని సామాన్య జన జీవన స్రవంతిలో కలకపోవడం, వీరిపై ఇంకా నియంత్రణ కొనసాగడం బాధాకరమని యోహీ వ్యాఖ్యానించారు. కుష్టు వ్యాధిని ప్రపంచం నుండి శాశ్వతంగా నిర్మూలించడానికి వ్యక్తుల మధ్య హద్దులు చెరిపెయ్యాలని దీని వల్ల కుష్టు వ్యాధి బారినపడ్డ స్త్రీలు, పురుషులు, పిల్లలు సామాజికంగా ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని యోహీ ఆవేదన వ్యక్తం చేసారు . కుష్టు నివారణకు తక్షణం గుర్తించడం సరైన చికిత్స మాత్రమే కాదని సామజిక మార్పు అవసరమని అన్నారు. కుష్టువ్యాది గ్రస్తుల పట్ల ఈవిధంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. కుష్టు వ్యాధి బారిన పడ్డ వారి పట్ల వారి కుటుంబం పట్ల వివక్ష చూపరాదని, వారూ గౌరవ ప్రదంగా జీవించే హక్కు ఉందని అన్నారు. ఇతర వ్యాధులతో పోలిస్తే కుష్టు వ్యాధి బాధితులు తక్కువే అన్నారు. 2030 నాటికి కుష్టు వ్యాధిని ప్రపంచం నుండి తరిమెయ్యాలన్నదే డబ్లు హెచ్ ఓ లక్ష్యమని యోహీ ససకావా పిలుపునిచ్చారు.