పచ్చి కూరగాయలు, పండ్లు తింటే సంపూర్ణ ఆరోగ్యం
posted on Jan 29, 2021 @ 9:30AM
పచ్చి కూరగాయలు, పండ్లు తింటే సంపూర్ణ ఆరోగ్యంతోపాటు శరీరం దృఢంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు పరిశోధించారు. ఈమేరకు 1930 నాటి నుంచి అంటే దాదాపు 55 సంవత్సరాలు పచ్చి కూరగాయలు, పండ్లు భుజిస్తున్న మానవులపై అనేక పరిశోధనలు నిర్వహించినట్లు డాక్టర్ ఎడ్వర్డ్ హొవెల్ తెలిపారు. పచ్చికూరగాయలు, పండ్లు తీసుకునే వారు, వండిన కూరాగాయలు తీసుకున్న వారిలో వ్యత్యాసం గమనించినట్లు తెలిపారు. పచ్చి కూరగాయలు, పచ్చి పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నట్లు వివరించారు. పచ్చి కూరాగాయలు, పండ్లు తినడం వల్ల ఆక్సీజనేషన్, హైడ్రేషన్ వంటి లాభాలు ఉన్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తి లభిస్తుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. శక్తి పెరిగి అనారోగ్యం, వ్యాధులు ఉండవని స్పష్టం చేసారు. పచ్చి కూరగాయలు తినడం వల్ల శరీరంలో వచ్చే అల్కలైన్ ను సమానంగా ఉంచుతుందని. పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా మనదేశంలో మునులు, తపుస్సు చేసే ఋషులు సుదీర్ఘకాలం పాటు ఎలా జీవించి ఉండగలిగారన్న ప్రశ్నకు సమాధానం దొరికినట్టే అని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. పూర్వకాలంలో ఋషులు మునులు ఆద్యాత్మిక సాధన తపస్సు తోపాటు వ్యతిరేక భిన్నమైన వాతావరణంలో సైతం ఎలా జీవించారన్నది ప్రశ్నార్థకమే అని అన్నారు. వారి సంపూర్ణ ఆరోగ్యానికి, శారీరక బలానికి, దృఢత్వానికి గల ఆ రహస్యం ఏమిటి? అన్నది సందేహం ఇదేనా అని అంటున్నారు నిపుణులు. ఎన్నోరకాల సవాళ్ళను అధిగమించి జీవించడం సాధ్యమేనా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి. ఆధునిక సమాజంలో మనం బ్లూ జోన్స్ లో నివసిస్తున్న వారు ఎంతో ఆరోగ్యంగా ఉండడంతో పాటు, 100 సంవత్సరాలు జీవించడం అంత సులభం కాదని శాస్త్రజ్ఞులు ఆభిప్రాయపడ్డారు. అయితే వారు నిత్యం ప్రతిరోజూ పచ్చికూరగాయలు,పండ్లు తమ ఆహారంలో భాగంగా మారిపోయిందని నిపుణులు విశ్లేషించారు. ఇందుకు ఉదాహరణగా ఇండోనేషియా అడవుల్లో జీవించే మానవులకు అత్యంత సన్నిహితమైన సంతతికి చెందిన ఒరాంగుటాన్ రోబుస్ట్ లో 99 % డిఎన్ఎ సహజంగా ఉంటుందని, శాస్త్రజ్ఞులు పరీక్షించినట్లు తెలుస్తోంది. ఒరాంగుటాన్ ను ముందు నుంచి పరిశీలించినప్పుడు అవి ఇతర అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు ఎదుర్కోలేదని అన్నారు. అయితే మానవులు మాత్రం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని నిపుణులు వ్యాఖ్యానించడం విశేషం. అద్భుతం ఏమిటి అంటే ఒరాంగ్ టాన్ తో సమానంగా పచ్చి కూరలు, పచ్చి పండ్లు తింటున్నారని పేర్కొన్నారు. దీనివల్ల తెలిసిన నిజం ఏమిటి అంటే మానవులు పచ్చి కూరగాయలు పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని తెలిసింది. పచ్చికూరగాయలు, పచ్చిఫలాలలో 10,000 రకాల న్యూట్రిషియన్లు లభిస్తాయని, దీనివల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని వివరించారు.