2030 క్యాన్సర్ లేకుండా చేద్దాం...
posted on Feb 3, 2021 @ 9:30AM
ప్రపచంలో సంవత్సరానికి 1 ౦ , ౦ ౦ ౦ మంది క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. హెచ్ ఐ వి, ఎయిడ్స్, మలేరియా, ఉబ్బసం కన్న 6 ౦ % ఎక్కువేఅని ఇవన్నీ కలిపినా మరణాల శాతం ఎక్కువేఅని ప్రపంచ ఆరోగ్యసంస్థ అభిప్రాయపడింది. 2 ౦ 3 ౦ నాటికీ క్యాన్సర్ మరణాలు 1 3 మిలియన్లు చేరవచ్చని అంచనావేసింది. వైద్య రంగంలో క్యాన్సర్ పై ఎన్నో పరిసోదనలు, కొత్త మందులు మరెన్నో పరిసోదనలు, క్యాన్సర్ను నిర్ధారించే పరీక్షలు శాస్త్రీయ అవగాహన కలిగిఉన్నమని అన్నారు. అసలు క్యాన్సర్ కు ఉన్న ప్రమాదం లేదారిస్క్ కొన్నికారణాలు యదార్ధాలు, గుర్తించడం చికిత్స సంరక్షణ విజయం సాధించినప్పటికీ ఇప్పుడిప్పుడే ప్రపంచదేశాలు యునైటెడ్ నేషన్స్ , డబ్ల్యు హెచ్ ఓ యు ఎన్ సంస్థలు క్యాన్సర్ గురించి మాట్లాడం హార్శనీయమని అన్నారు. నాయకులూ మాట్లాడుతున్నారని క్యాన్సర్ నివారణలో సమస్యలు ఎదుర్కుంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ప్రపంచాన్ని క్యాన్సర్ రహితంగా తాయారు చేయాలన్న సంకల్పాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలని డబ్ల్యు హెచ్ ఓ పిలుపునిచ్చింది. 6 5%క్యాన్సర్ మరణాలు అభివృద్ధి చెందిన దేశాలలోనే జరుగు తున్నాయని అధిక ఆదాయం వున్న దేశాలలో ఇంకా పరిశీలిస్తున్నట్లు సమాచారం. తక్కువా ఆదాయం ఉన్నవారు, వలస వచ్చినవారు, నిరాశ్రయులు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రూరల్ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డబ్ల్యు హెచ్ ఓ సూచించింది. క్యాన్సర్ నివారణ , క్యాన్సర్కు గల కారణాలు గుర్తించడం చికిత్స, సంరక్షణ, క్యాన్సర్ బారిన పడకుండా రక్షించాల్సిన అవసరం ఉందని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది.
ప్రజలు, రాజకీయనాయకులు, విద్యావంతులు క్యాసర్ పై అవగాహన పెంచుకున్నారని, క్యాన్సర్ పట్ల భయం, తగ్గించాలని కొన్ని రకాల మూడ నమ్మకాలు, విశ్వాసాలు ఇంకా ఉన్నాయని వాటిని తొలగించాల్సిన బాధ్యత కూడా మనదేఅని డబ్ల్యు హెచ్ ఓ తమవిధానాలను వెల్లడించింది. ప్రజల ప్రవర్తన వైఖరిలో మార్పు తీసుకు రావాల్సిన అవసరాన్ని డబ్ల్యు హెచ్ ఓ స్పష్టం చేసింది. ఇందు కోసం కొన్ని సంవత్సరాలుగా యు ఐ సి సి యూనియన్ ఫర్ ఇంటర్ నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ సంస్థ ప్రపచంలో క్యాసర్ అత్యంత భారంగా మారకముందే ప్రపంచ ఆరోగ్యం పై అభివృద్ధి తమ లక్ష్యంగా డబ్ల్యు హెచ్ ఓ నిర్దేశించుకుంది. ప్రభుత్వాలు ఈ విషయంలో తమ బాధ్యతగా గుర్తించాలని తమ విధానాలను జాతీయ విధానాలుగా రూపొందించుకోవాలని పరిసోదనలకోసం నిధుల విదుల చేయడం,అవసరమైనచట్టం రూపొందించాలని డబ్ల్యు హెచ్ ఓ నిర్దేశించింది. ఫిబ్రవరి 4 న నిర్వహించే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం రోజున సదస్సులు, రోగులసేవలలో మరింత వృద్ధి, అవగాహనా కోసం ప్రజలసమీకరణ అందరినీ భాగస్వాములను చేయడం అత్యవసరమని సంస్థ భావించింది.