పసుపు వల్ల ఇన్ని అద్భుతమైన లాభాలా!
posted on Feb 4, 2021 @ 9:30AM
పసుపు చేసే మేలు మరేది చెయ్యదు ఇది నిజం అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అయితే గాల్ బ్లాడర్‌లో రాళ్ళు ఉంటె పసుపు వాడద్దని సూచించారు. ముఖ్యంగా స్త్రీలు గర్భం దాల్చినప్పుడు వాడకూడ దని వైద్యులు తెలిపారు. చాలా రకాల మూలికలను కూరలో వాడతామని, అదీ ముఖ్యంగా తాజాగా పచ్చిగా ఉన్నవి మాత్రమే వాడడానికి ఇష్టపడతామని శరీరానికి ఆయుర్వేదం చాలా శక్తి వంతమైన వైద్యాన్ని అందిస్తుందని వాటిని ప్రతిరోజూ వాడితే మరిన్నిలాబాలు ఉంటాయని... ముఖ్యంగా మనజీవన శైలిని మారుస్తుందని అందులో భాగమే తాజా పసుపు కొమ్ములు వేళ్ళు వాడతారని ముఖ్యంగా పోడిరూపంలో వాడడం అన్ని విధాలా శ్రేయస్కరమని ఆయుర్వేద వైద్యులు విశ్లేషించారు. ఇది చూడడానికి అల్లంలా కనిపిస్తుందని అయితే అది అల్లం కాదని వైద్యులు వివరించారు. తాజా పసుపు కొమ్ములు బంగారంతో సమానమని చెప్పాలి. బాగా జలుబు చేసినప్పుడు వేడి వేడి పాలలో పసుపు వేసుకుని తాగితే దెబ్బకి జలుబు పోతుందని ప్రజల విశ్వాసం. పసుపు భారతీయ జీవితంలో ముడిపడి ఉన్నదని ఇంట్లో శుభకార్యానికి పూజా పునస్కారానికి శుక్రవారం గడపకు పసుపు పూయడంలో ఇటికి లక్ష్మి దేవి వస్తుందని, ఇది క్రిములు ఇతర గాలులు రాకుండా అడ్డుకుంటుందని నమ్మకం. అయితే 5 ౦ ౦ ౦ సంవత్సరాలుగా ఆయుర్వేదంలో పసుపు ఔషదంగా వాడుతున్నారంటే మనం ఆశ్చర్య పోవల్సిన అవసరం లేదని సాంప్రదాయ వైద్యులు స్పష్టం చేసారు.
ముఖ్యంగా శరీరానికి గాయం అయినప్పుడు గాయాన్ని రక్త స్రావాన్ని తగ్గించడం గాయం ఇంన్ఫెక్ట్ కాకుండా పసుపు వాడడాన్ని మనం చూస్తాం. స్య్హ్రీలు ముఖ్యంగా ముఖానికి వాడే సౌందర్య సాధనాలలో ఒకటి పసుపే అని అంటున్నారు వైద్యులు. సాంప్రదాయ పెళ్ళిలలో బ్యూటీ పార్లర్లు లేనపుడు పెళ్లి కూతురు పెళ్లి కోడును చేయడానికి ముఖవచ్చస్సు పెంచే సౌందర్య సాధనం పసుపే అని అంటున్నారు సంప్రాదాయవైద్యులు. స్త్రీల కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే పసుపు శరీరాన్ని మృదువుగా ఉంచేది పసుపు మాత్రమే అని పరిసోదనలు చెపుతున్నాయి. ప్రతి రోజూ ఆహారంలో తప్పకుండా పసుపు వాడడం అవసరం. కూరల్లో రుచికోసం మాత్రమే కాదు పసుపు శరీరంలోపల ఉండే ఇతర ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. థెరఫీలో క్యాప్సుల్ సప్లిమెంట్‌గా స్పైస్‌గా పని చేస్తుంది. అంతే కాకుండా మనలను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచేది పసుపు మాత్రమే. ముఖ్యంగా శరీరంలో వచ్చే ఎక్షిమా, సోరియాసిస్, ఆస్తమా, ఆర్తరైటిస్, ఆస్టియో అర్త రైటీస్, కోలైటిస్, నివారణకు పసుపు వాడతారు. ముఖ్యంగా మనకు తెలియని మరో రహాస్యం రక్త శుద్ధికి పసుపు నూటికీ నూరు శాతం దోహదం చేస్తుంది. మూసుకు పోయిన రక్తనాళాలను తిరిగి ప్రభావవంతంగా పనిచేసేది పసుపు మాత్రమే అని ఆయుర్వేద వైద్యులు పేర్కొన్నారు. యాంటి ఎలర్జీగ పనిచేస్తుందని,లివర్ గాల్,బ్లాడర్, పని తీరును మెరుగు పరుస్తుందని అంటున్నారు. పొట్ట క్రింది భాగంలో ఏర్పడే మ్యుకస్ ను తగ్గించే గుణం పసుపుకు ఉందని అంటున్నారు వైద్యులు. స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలకు పరిష్కారం పసుపే అని అంటున్నారు వైద్యులు. పసుపుకు మరో పేరు హరిద్రా. గాయానికి చక్కని మందు హరిద్రా అయితే గాయాన్ని పూర్తిగా శుబ్రం చేసిన తరువాత మాత్రమే పసుపు వాడాలని సూచించారు. అయితే గాల్ బ్లాడర్‌లో వచ్చే స్టోన్స్ కు పసుపు వాడరాదని ఆయుర్వేద వైద్యులు హెచ్చరించారు. పసుపు చక్కని హీలింగ్ హెర్బ్ అని చెప్పుకోక తప్పదు.