వర్క్ ఫ్రమ్ పబ్!
posted on Oct 14, 2022 @ 3:14PM
హాల్లో సోఫాలో తండ్రి, ఓ బెడ్‌రూమ్‌లో తల్లి.. మరో గదిలో పెద్ద కూతురు, హాల్లో ఓ మూల కొడుకూ ఇది ఇప్పటి కుటుంబాల్లో రాత్రి ఒంటిగంటవరకూ కనిపించే సీన్. కారణం కోవిడ్ తో సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉద్యో గులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశం. ఈ వర్క్‌కి సమయంతో పనిలేదు..ఆఫీసు సమయం కంటే ఎక్కువ సమయమే చేయక తప్పడం లేదు. కరెంటు బిల్లు పెరిగిపోతోందని పెద్దావిడ గోల, పిల్లది తెగ కష్టపడి పోతోందని తల్లి బాధ, వీడికి తిండి ధ్యాసే ఉండటం లేదని తండ్రి మనసులో ప్రశ్నలు. వీటన్నింటికీ విరుద్ధంగా ఏమీ జరగడం లేదు. క్రమేపీ కుటుంబం అంతా సరదాగా మాట్లాడుకోవడం, కలిసి ఎటన్నా వెళ్లడం అనేవి కేవలం ఆదివారాలే... అదీ పిల్లలు ఓకే అంటేనే జరుగుతోంది! సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీవితా లన్నీ ఇలా మారిపోతున్నాయి.
అయితే ఈ విధంగా పనిచేయడంలోనూ ఉద్యోగుల అవస్థలు ఎక్కువే. ఇంట్లోనే ఉండి నన్ను పట్టించుకో వడం లేదని తల్లిమీద పిల్లలు అలగవచ్చు, వంటపనిలో సాయం చేయ డం లేదని అత్తగారికి కోపం రావ చ్చు.. ఇంటికంటే ఆఫీసే నయమని ఇంట్లో గోల భరించలేని సదరు ఉద్యోగీ అనుకోవచ్చు. అయితే ఇటీ వల ఇలా వర్క్ చేయడానికి కొందరు స్నేహితులు కలిసి ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకుని దాన్నే వారి ఆఫీసుగా మార్చుకుని ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఇదో కొత్త ట్రండ్ మొదలయింది. ఇదో రకం వర్క్ ఫ్రమ్ హోమ్! టిఫిన్ బాక్స్‌తో రావడమో ఇల్లు దగ్గరయితే ఇంటికి వెళ్లి తిని వస్తూండడమో కూడా చేస్తు న్నారు. ఇపుడు చిత్రంగా బ్రిటన్‌లో మరో మార్గం ఆలోచించారు.
బ్రిటన్‌లో పబ్‌లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు చిన్నపాటి కార్యాలయాలుగా మారుతున్నాయి. అంటే ఆఫీసు సమయంలో పనిచేసుకున్నట్టు ఇక్కడ చేసుకోవచ్చు. అందుకు ఒక టేబుల్ డ్రింక్స్ ఏర్పాటు చేస్తార న్నమాట. వీలయితే అక్కడే ఫుడ్ తినవచ్చు.. మధ్య మధ్యలో పానీయాలు స్వీకరించుకోవచ్చు.. అలవా టు ఉంటే. అంటే వర్క్‌ప్లేస్ పెద్ద సమస్యగా ఉండడంతో ఉద్యోగులు ఈతరహా ఆఫర్‌ని కాదనడం లేదు. పైగా తినడానికి, తాగడానికి కూడా వెతుక్కోనవసరం లేదు. అయితే అక్కడికి వచ్చేవారి గోల లేకుండా చూసుకోవాలి. ఆ ఇబ్బందులేమీ ఉండవని బ్రిటన్‌లో పబ్ యజమానులు హామీ ఇస్తున్నారట. అంటే మామూలుగా మందుసేవించే మందుబాబులు వచ్చిపోతున్నా ఉద్యోగుల పనికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారట. అంటే వీళ్ల పని వీరిదే వాళ్ల పని వారిది. ఇటుకేసి వాళ్లు రాకుం డా చూసుకుంటున్నారు.
పోతే, ఇన్ని గంటలకు ఇంత అని వసూలు చేస్తారు. అంటే రోజంతా అయితే మన లెక్కప్రకారం రూ.13వందలు ఇచ్చుకోవాలి. అదొక్కటే చూసుకోవాలి. అయితే మంచి జీతంలో ఉన్నవారికి ఇదేమంత ఖర్చు అనిపించుకోదు. ఎందుకంటే అక్కడే తిండి, పని, మధ్యలో మందు కూడా అందుబాటులో ఉంటుది గనుక అదేమంత భారమైన ఖర్చుగా భావించడం లేదు. సాండ్‌విచ్, లంచ్, కోరినపుడల్లా కాఫీ లేదా టీ .. ఇదంతా ఆ పేమెంట్‌లోనే అయిపోతుంది! మరి ఉద్యోగులకు ప్రశాంతంగా పనిచేసుకోవడానికి ఇంకేం కావాలి!
ఇదే పద్ధతి మన దేశంలో పెద్ద పెద్ద నగరాల్లో అమలు చేస్తేనో!..మందుబాబులను కట్టడి చేయడమే యజమానులకు పెద్ద సమస్యే అవుతుంది! ఇక్కడ ప్రశాంతంగా పనిచేయనిస్తారా.. గోల, పాటలు, వీల యితే కొట్టుకోవడాలూ జరుగుతూంటాయి మరి! కానీ ఎవరో ఒకరు ఈ కొత్త ట్రెండ్‌నీ ఫాలో అవుతారేమో చూడాలి.