రైతుల యాత్ర ఆపడానికి బ్రిడ్జి మరమ్మతు వంక
posted on Oct 14, 2022 @ 2:47PM
తండ్రికి చికిత్స చేయించాలని హీరో తన స్నేహితులతో పాటు ఆయన్ను పక్క ఊర్లో ఆస్పత్రికి తీసికెళు తూంటాడు. కనుచూపు మేరలో చిన్న కాలవవంతెన దాటాలి. కానీ అక్కడ విలన్ గ్యాంగ్ వెయిట్ చేస్తుం టుంది. కారు, రెండు ఆటోలూ ఆపేసి ఏటి కనుక్కోరా అని హీరో అసిస్టెంట్‌ని పురమాయిస్తాడు. వాడు తన్నులు తిని వస్తాడు. కార్లు, జీపులు, ఆటోలు ఇయాల ఎల్లేందుకు పర్మిసన్ ఇవ్వరంట విలన్ మాటగా చెప్పాడు. హీరోగారు తండ్రి పరిస్థితి చూసి కాస్తంత తగ్గి ఒక మైలు వెనక్కి వెళ్లి మరో మార్గంలో ఆస్పత్రికి తీసికెళతాడు. కానీ జగన్ మాత్రం రైతుల పాదయాత్రను సరిగ్గా ధవిళేశ్వరాన్ని దాటనీయకుండా చేయడా నికే కంకణం కట్టుకున్నారు.
గోదావరి నది మీద రాజమండ్రి కొవ్వూరు మధ్య రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి వారం రోజుల పాటు మూసివేశారు. రోడ్డు మరమ్మత్తులు ఉన్నాయని మూసేస్టున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. కొన్ని మరమ్మతులను ఆర్ అండ్‌బి, రైల్వేశాఖ చేపట్టనున్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర శనివారం కొవ్వూరు చేరాలి. అదీ ఈ బ్రిడ్జ్ మీదుగానే యాత్ర కొనసాగాలి. కానీ మరమ్మత్తు పనులు జరుగుతున్నపుడు రైతుల పాదయాత్ర ఎలా వెళుతుంది.
పాదయాత్రతో ప్రభుత్వానికి జరిగే మేలు లేదు. అందుకే వంతెన మరమ్మతు సంగతి హఠాత్తుగా గుర్తొ చ్చింది. ఇటీవలి భారీ వర్షాలు, వరదల్లో జనం ఇబ్బందులు పడినపుడు మాత్రం దాన్ని గురించి ఆలోచనే లేదు. ఇపుడు రైల్వేవారితో కలిసి మరమతు కుట్రకి పాల్పడ్డారన్నది పరిశీలకుల మాట. రైతుల పాదయాత్రలో వెయ్యిమందే పాల్గొంటున్నారు. వెయ్యిమంది నడిచి వెళతారు. అంతేగాని టూవీ లర్లకి పార్టీ జెండాలు కట్టుకుని గోల చేస్తూ, చెవులు చిల్లులు పడేలా నినాదాలు చేస్తూ వెళ్లరు. పాద యాత్రకి వంతెన మరీ దెబ్బతింటుందనే ఆలోచనే అయితే సర్కారు వారి ప్రచారహోరుకి వెళ్లిన దారులన్నీ నాశనమయ్యాయి గదా వాటి సంగతేమిటని జనం ప్రశ్నిస్తున్నారు.
రిపేరు అయితే వాహనాలు రివ్వున వెళతాయిగదా! వాహనాలు వెళ్లడం కంటే పాదయాత్రలో వెళ్లై రైతు లకు పెద్దగా ప్రాధాన్యతనీయనవసరం లేదను కున్నారనే అనుకోవాలి. రైతు ఉద్యమం, పాద యాత్రలు తమ ప్రతిష్ట ను మరింత దెబ్బతీస్తున్నా యన్న అక్కసుతోనే జగన్ సర్కార్ ఊహించని చర్యలకు దిగు తోంద న్నది పరిశీలకుల మాట. అమరావతి రైతుల పాదయాత్రను ఈ విధంగా అడ్డుకోవడం నీచమని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ ఈ చర్యలు రైతుల నిర్ణయాన్ని వేగాన్ని ఆపలేవ న్నది, తగ్గించ లేవని జగన్ సర్కార్ తెలుసుకోవాలి.