జిన్‌పింగ్, షెహబాజ్ లతో మోదీ సమావేశమవుతారా?
posted on Sep 16, 2022 @ 10:44AM
ఎస్‌సిఓ సమ్మిట్ సందర్భంగా ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడితో పాటు మరికొందరు నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉందన్న వార్తలపై విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఇఏ) షెడ్యూల్ ముగుసేలోగా తెలియజేస్తామని తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు, మరికొందరు నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. ఎస్‌సిఓ సమ్మిట్ సందర్భంగా చైనా, పాకిస్తాన్ రష్యా అధినేతలతో మోదీ సమావేశాల సమాచారాన్ని తెలియజేస్తామని విదేశాంగ శాఖ కార్యదర్శి క్వాత్రా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కొంతకాలంపాటు ఎస్‌సిఓ సదస్సు కోసం ఉజ్బెకిస్తాన్‌లో ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ శుక్ర వారం ద్వైపాక్షిక సమావేశాల సెట్‌తో పాటు పరిమితం చేయబడిన మరియు పొడిగించబడిన సెషన్ లకు హాజర వుతారని క్వాత్రా చెప్పారు. ఎస్‌సీఓ సమ్మిట్ 2022లో ప్రధాని మోదీ పాల్గొనడం ఎస్‌సీఓ, దాని కారణానికి భారతదేశం ఇస్తున్న ప్రాము ఖ్యతకు ప్రతిబింబిస్తుందని విదేశాంగ కార్యదర్శి అన్నారు.
ఈ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఉజ్బెక్ రాజధాని సమర్‌కండ్‌లో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ 22వ సదస్సు సంద ర్భంగా ప్రధాని మోదీతో వ్లాదిమిర్ పుతిన్ ద్వైపాక్షిక సమావేశం కావచ్చు. రష్యా అధ్యక్షుడు పుతిన్ రాబోయే షాంఘై సహకార సంస్థ సమ్మిట్‌లో పాల్గొనబోతున్నారు. ప్రధాని మోదీ కూడా వెళ్తున్నారు.
ఎస్‌సీఓ లో ప్రస్తుతం చైనా, భారతదేశం, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, రష్యా, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. కాగా పూర్తి సభ్యత్వాన్ని పొందేందుకు ఆసక్తిని కలిగి ఉన్న ఆఫ్ఘనిస్తాన్, బెలా రస్, ఇరాన్ మంగోలియా. దీనికి ఆరు డైలాగ్ పార్ట్‌నర్‌లుగా అర్మేనియా, అజర్‌బైజాన్, కంబోడియా, నేపాల్, శ్రీలంక మరియు టర్కీ కూడా ఉన్నాయి.