మరో మహిళతో భార్య పెళ్లి చేసిన భర్త..
posted on Apr 14, 2021 @ 10:38AM
ఒక వైపు ప్రపంచం సైన్స్ తో ముందుకు పరుగెడుతుంటే.. మరో వైపు మూఢ విశ్వాసంతో వెనక్కి వెళ్తుంది మన భారత దేశం. మూఢనమ్మకాలను ప్రాణం పొసే సంఘటనలు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఖమ్మం జిల్లా లో నిధుల కోసం పసి పిల్లవాడిని ఉత్తర ప్రదేశ్ కి తీసుకెళ్లి నరబలి ఇవ్వాలనుకున్నారు. అది కనుమరుగు కాకముందుకే మదన పల్లిలో లో మరో ఘటన జరిగింది. చదువుకుని, సమాజంలో ఉన్నత హోదా ఉన్నవాళ్లే మూఢ నమ్మకాలతో తమ పిల్లలను వారే చంపుకున్నారు. తాజాగా మరో ఘటన జరిగింది. కన్నా బిడ్డలనే కడతేర్చే యత్నం చోటు చేసుకుంది. అతీతశక్తులు వస్తాయని కుమారులకు చిత్రహింసలు. భర్తతో భార్య, మరో వివాహిత కలిసి బలి ఇచ్చేందుకు సన్నాహాలు చేశారు.
అతని పేరు రామలింగం. ఆమె పేరు రంజిత. ఇద్దరికీ పెళ్లి అయింది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. రామలింగం చీరల వ్యాపారం చేసేవాడు. ఆ తరుణం లోనే ఇందుమతి అనే మరో మహిళను రెండవ వివాహం చేసుకున్నాడు. చాటుగా సంసారం సంసారం పెట్టకుండా.. అదే ప్రాంతంలో వేరే ఇంట్లో ఉంచాడు. ఈ సమయంలో ఇందుమతి స్నేహితురాలు ధనలక్మి అప్పుడపుడు ఇంటికి వాస్తు ఉండేది. ఈ నేపధ్యం లో రామలింగం మొదటి భార్య రంకితతో ధనలక్ష్మి కి పరిచయం అయింది.
కట్ చేస్తే.. రంజిత, ధనలక్ష్మి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి పెద్ద ఎవరో కాదు.. రంజిత భర్త రామలింగం. అదేంటి మొగుడు.. పెళ్ళానికి మరో పెళ్లి చేయడం ఏంటి..? అది మహిళతో పెళ్లి చేయడం ఏంటి..? అని అనుకుంటున్నారా.. ఈ దరిద్య్రానికి కారణం ఏంటో మీరే చూడండి..
రంజిత ఇంటికి వచ్చిపోతున్న ధనలక్ష్మి ని గమనించిన రామలింగం తన మనసులో ఏం అనుకున్నాడో గానీ.. మీరిద్దరూ శివుడు పార్వతుల ఉన్నారని చెప్పేవాడు. కొన్నాళ్లకు ఆ మాట వాళ్ళ కూడా నిజం అనుకున్నారు.. అందుకే పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకున్నారు. ఇక అంటే ముహూర్తం ఫిక్స్ చేశాడు. వారి వివాహానికి రామలింగం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక అంతే పిల్లల ముందే పెళ్లి చేసుకున్నారు. అక్కడితో ఆగలేదు.. అతీతశక్తులు వస్తాయని నమ్మకం తో ధనలక్ష్మి ని నాన్న అని, రామలింగాన్ని మామ అని పిలవాలని కుమారులను చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు. స్కూల్ కి కూడా పంపకుండా ఇంట్లో పనులన్నీ పిల్లలతో చేయించారు. శానిటైజర్ తాగించడం. ఒంటికి కారం పూసి మండుటెండలో పడుకోబెట్టడం వంటి దారుణాలకు పూనుకున్నారు.. చివరికి ఆ పిల్లలని నరబలి ఇవ్వడానికి తెగించారు. ఈ విషయం వారి మాటల ద్వారా గ్రహించిన పిల్లలు ఇద్దరు, వెంటనే తమ తాత ఇంటికి పారిపోయి జరిగిన విషయాన్ని చెప్పారు. తర్వాత ఈరోడ్ ఎస్పీ తంగదురైకు ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు... రంజిత, ధనలక్ష్మి, రామలింగంలను ప్రశ్నిస్తున్నారు. పిల్లల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే... చిత్తూరు జిల్లా మదనపల్లెలో సొంత తల్లిదండ్రులే తమ కన్న కూతుళ్లను హత్య చేసినలాంటి ఘటననే పునరావృతం అయ్యేది. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లా రంగంపాళ్యం రైల్‌నగర్ చోటుచేసుకుంది.