జగన్‌రెడ్డి.. వెయిటింగ్ ఇక్కడ..
posted on Apr 14, 2021 @ 12:06PM
‘కత్తితో బతికేవాడు కత్తితోనే చస్తాడు.. జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.
అలిపిరి మే సవాల్. జగన్‌రెడ్డికి నారా లోకేశ్ ఛాలెంజ్. వైఎస్ వివేక హత్య కేసుపై అలిపిరిలో ప్రమాణం చేద్దాం రమ్మంటూ సీఎం జగన్‌కు ఇటీవల సవాల్ విసిరారు లోకేశ్. అందుకు, ఇవాళ ముహూర్తం ఫిక్స్ చేశారు. అలిపిరి సర్కిల్‌కు చేరుకొని బైఠాయించారు. ప్రమాణానికి సిద్ధమయ్యారు.
‘‘నారాసుర రక్తచరిత్ర అంటూ దొంగవార్తలు రాశారు. మా కుటుంబానికి రక్తచరిత్ర లేదు. నాకు, నా కుటుంబ సభ్యులకుగానీ ఎలాంటి పాత్ర లేదని ఆ వేంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేస్తామని ఏప్రిల్ 7న సూళ్లూరుపేటలో సవాల్ చేశా. నేను అలిపిరిలో ఉన్నా.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి సీఎం జగన్ రాగలరా.. వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే జగన్‌ను అలిపిరి తీసుకురావాలి. మా కుటుంబానికి వివేకా హత్య కేసుకు సంబందం లేదని ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. 24 నెలలు గడిచినా సీబీఐ విచారణ ఎందుకు వద్దంటున్నారు. బాబాయిని హత్య చేసిన వారిని పట్టుకోవాలని జగన్‌కు లేదా?’’ అని ప్రశ్నించారు నారా లోకేశ్.
జగన్ పెద్ద దొంగ.. ఏ2 విజయ్ సాయిరెడ్డి చిన్న దొంగ. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని విజయసాయిరెడ్డి అన్నారు. మూడు గంటల తర్వాత పోలీసుల విచారణలో ఆయనను గడ్డపారతో చంపారని తేలింది. పోస్టుమార్టం జరగకముందే సాక్షాలు లేకుండా ఆరోజే చెరిపేశారు. ఆ సమయంలో గంగిరెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి తదితరులందరూ సీన్‌లో ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత మాట మార్చారు. లోకేశ్‌కు, చంద్రబాబుకు హస్తం ఉందని ఆరోపించారు. తాతను, వివేకాను చంపింది మేమేనన్నారు. సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. గవర్నర్‌ను కలిసి కూడా ఇదే చెప్పారు. మరి సీఎం అయ్యాక సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదంటూ మండిపడ్డారు నారా లోకేశ్.