షమీని కాదనడం పట్ల మాజీల ఆగ్రహం
posted on Sep 15, 2022 @ 4:31PM
టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన టీమిండియా జట్టులో పేసర్ మహ్మద్ షమి పేరు లేకపోవడాన్ని మాజీ ఆటగాళ్లు తప్పుపడుతున్నారు. అనుభవం కలిగిన అతడిని స్టాండ్‌బైగా ఎంపిక చేయడం సరికా దని మదన్‌లాల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత షమిని ఈ ఫార్మాట్ లో పరిగణనలోకి తీసుకోవడం లేదు. అయితే ఆసియాక్‌పలో జట్టు పేలవ ప్రదర్శన తర్వాత అతడిని దక్షిణా ఫ్రికా, ఆసీస్‌లతో సిరీస్‌లకు ఎంపిక చేశారు.
‘షమి మ్యాచ్ విన్నర్. అందులోనూ ఆసీస్ గడ్డపై అతడు చాలా ఉపయోగపడతాడు. తొలి మూడు ఓవర్ల లోనే వికెట్ తీయగల సత్తా ఉన్నవాడు. అందుకే 15 మందితో కూడిన వరల్డ్‌కప్ జట్టులో షమి ఎందుకు లేడనే విషయం అర్థం కావడం లేదు. కప్ గెలవాలంటే బౌలింగ్ కూర్పు అద్భుతంగా ఉండాలి. బ్యాటిం గ్‌లో 180 పరుగులు చేయడం గొప్ప కాదు. ప్రత్యర్థిని నిలువరించడం అంతకన్నా ముఖ్యం.
టీ-20 ప్రపంచకప్‌కి పేసర్ బుమ్రాను తీసుకున్న భారత్ సెలక్టర్లు షమీని వదిలేయడం పట్ల అభిమా నులు మండిపడుతున్నారు. గత టీ-20 ప్రపంచకప్‌లో ఆడిన షమీని 2022 కప్‌కి వెళ్లే జట్టుకు రిజర్వుగా తీసుకోవడం అతన్ని అవమానించడమే అంటున్నారు. ఆసియాకప్‌కి దూరంగా పెట్టినప్పటికీ ఆస్ట్రేలి యాలో జరిగే పెద్దటోర్నీకి రిజర్వుల్లోకి తీసుకోవడమేమిటని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే షమీ ఇటీవలి కాలంలో అంతర్జాతీయక్రికెట్‌లో అంత చురుగ్గా పాల్గొనలేదన్న కారణం కూడా సెలక్టర్లు చూపుతున్నారు. అతని చివరగా ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో తలపడిన సిరీస్‌లో ఒక వన్డే, ఒక టెస్టు మాత్రమే ఆడాడు. ఇతనికి బదులుగా కుర్రాడు అర్షదీప్‌సింగ్, సీనియర్ పేసర్ భువనేశ్వర్‌ను బుమ్రాకు మద్దతుగా జట్టులోకి తీసుకున్నారు.
కేవలం ఇటీవల షమీ అంత గొప్పగా చురుగ్గా ఏ టోర్నీలోనూ ఆడకపోవడమే అతన్ని వెనక్కి పెట్టినట్టు సెలక్టర్లు చెబుతున్నారు. కానీ వరల్డ్‌కప్‌కి షమీ వంటి సీనియర్లను తీసుకోవడం జట్టుకు మేలు జరుగుతుందని చాలామంది అభిప్రాయం. టోర్నీకి వెళ్లే ముందు ఎలాగూ ఆసీస్, దక్షిణా ఫ్రికాలతో టీ20 సిరీస్‌లు ఆడతారు. అది షమీకి మంచి ప్రాక్టీస్ కూడా అవుతుంది. కానీ సెలెక్టర్లు ఆ పరంగా ఆలోచించక, అతన్ని రిజర్వులోనే పెట్టారు.