రష్యా అధ్యక్షుడు పుతిన్ పై హత్యాయత్నం
posted on Sep 15, 2022 @ 5:08PM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌పుతిన్ పై మరోసారి హత్యాయత్నం జరిగినట్టు సమాచారం. అయితే ఆయన ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై దాడులతో రష్యా మిలటరీకి భారీ నష్టం వాటి ల్లింది. ఈ నేపథ్యంలో కొందరు రష్యా రాజకీయవేత్తలు పుతిన్ రాజీనామాను డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే మరోసారి హత్యాయత్నం జరిగి ఉంటుందని భావిస్తుననారు. ఉక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలి జెన్స్ చీఫ్ మేజర్ జనరల్ కిరిలో బుదనోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. నల్ల సముద్రం, క్యాస్పియన్ సముద్రం మధ్య ఉన్న కౌకసస్ ప్రాంతంలో పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్లు సమాచారం.
యూరో వీక్లీ న్యూస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ విషయం వెల్లడైంది. జనరల్ జీవీఆర్ టెలిగ్రామ్ ఛానల్ లో దీన్ని రిలీజ్ చేశారు. అయితే ఎప్పుడు ఈ అటాక్ జరిగిందన్న విషయాన్ని దాంట్లో తెలుపలేదు. ఫిబ్రవరి లో ఉక్రెయిన్‌పై దాడి జరిపిన తర్వాత పుతిన్ ఆరోగ్యం, జీవితానికి సంబంధించి అనేక కథ నాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో అయిదు సార్లు తనపై హత్యాయత్నం జరిగింద ని, వాటి నుంచి తప్పించుకున్నట్లు 2017లో ఓసారి పుతిన్ వెల్లడించారు.
పుతిన్ ప్రయాణించే లిమౌసైన్ వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఆ వాహనానికి చెందిన లెఫ్ట్ ఫ్రంట్ వీల్ ధ్వంసమైంది. ఢీకొట్టిన సమయంలో భారీ శబ్ధం కూడా వచ్చినట్లు టెలిగ్రామ్ ఛానల్ రిపోర్ట్‌లో తెలి పారు. లిమౌసైన్ కారును ఢీకొన్న సమయంలో భారీగా పొగలు కూడా వచ్చాయని, కానీ సురక్షితంగా ఆ కారును చేర్చినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఎటువంటి గాయం కాలేదు. కానీ ఈ ఘటనలో అనేక మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పుతిన్ ప్రయాణించే వాహనాన్ని ఢీ కొట్టి నట్లు మరో సైట్‌లోనూ న్యూస్ రాశారు.
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని రాజకీయవేత్తలు పుతిన్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని భావిస్తున్నారు. పుతిన్ ను అధికారం నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు యూరో వీక్లీ తన కథనంలో తెలిపింది. పీటర్స్‌బర్గ్‌లోని 65 మంది మున్సిపల్ ప్రతినిధులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు పుతిన్ రాజీనామా కోరుతూ పిటిషన్‌పై సంతకం చేశారు.
ఉక్రెయిన్ మీడియాతో బుదనోవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందని, కౌక సస్‌కు చెందిన ప్రతినిధులు పుతిన్‌పై దాడి చేశారని బుదనోవ్ తెలిపారు. అయితే హత్యాయత్నం విఫల మైందన్నారు. కాగా, మరోవైపు పుతిన్ సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం.
దీంతో పుతిన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, అలాగే తనకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు ఓ రష్యా సంప న్నుడు వెల్లడించారు. కాగా, గతంలోనే తనపై అయిదుసార్లు హత్యాయత్న ప్రయత్నం జరిగినట్లు పుతిన్ ప్రకటిం చారు.