కోతే... కానీ అమ్మ!
posted on Sep 15, 2022 @ 3:45PM
కాస్తంత స్వయంగా ఆడుకోవడం వచ్చినా పిల్లలు తమ పరిసరాల్లోనే తల్లి ఉండాలని కోరుకుంటారు. మధ్య మధ్యలో ఆమె దగ్గరికి పరుగులు పెడతారు. తల్లి ఓ ధైర్యం, తల్లి ఓ నమ్మకం, తల్లి దైవం! పిల్లలు తల్లులతో ఆడతారు, తల్లుల్లిన ఆటపట్టిస్తుంటారు.. వారికి అదో ఆనందం. పడి దెబ్బతగిలినా, వేగంగా పరుగులు తీసినా అమ్మే సమాచారకేంద్రం.. అదేవిట్ర పిచ్చివెధవా.. అలా పరిగెడితే పడవూ! అంటే పిల్ల డికి వేయి ఏనుగుల బలం.. తల్లి తనను పట్టించుకుంటోందని, గమనిస్తోందని. కానీ అది మనుషులకి మాత్రమే సంబంధించినది కాదు.. ఆ ప్రేమ కోతుల్లోనూ ఉంటుంది.
పిల్లల్ని ఒంటికి అంటిపెట్టుకుని ఏకంగా చెట్లు, గోడలూ దూకేస్తుంటాయి. చూసినవారికి ఒక్కింత భయమేస్తుంది.. ఈ పిచ్చిముండ ఆ పిల్లముండని కింద పడేస్తుందేమోనని లోలోపల తిట్టుకుం టుంటాం! కానీ అలా జరగనే జరగదు.. మనకి భయం.. తల్లిని అంటిపెట్టుకున్న పిల్లకోతికి సరదా!
చెట్టూ చేమా బాగా ఉన్నప్రాంతాల్లో, కాలనీల్లో మాత్రం కాస్తంత కోతుల హడావుడి ఉంటుంది. రోడ్డు దాటే ప్పు డు ఎంతో జాగ్రత్తగానే చూసుకుని మరీవెళుతూంటాయి. కానీ ఎప్పుడో గాని ప్రమాదానికి గురికావు. అలా ప్రమాదానికి గురయింది ఓ తల్లి కోతి మొన్నీమధ్యనే. రోడ్డు దాటుతుండగా ఒక వాహనం గుద్దేసి వెళిపో యింది. ఆ బండివాడు మనిషిని గుద్ది ఉంటే.. బహుశా ఆగేవాడేమో.. కానీ కోతి, దాని పిల్ల కదా.. లైట్ తీసు కున్నాడు. కానీ తల్లి కోతి మాత్రం పిల్లని రక్షించుకోవడంలో దాదాపు ప్రాణం పోయినంత స్థితిని అనుభ వించింది.
ఈమధ్యనే కరీంనగర్ జిల్లా చిగురుమామిడిమండలం, చిన్నముల్కనూర్‌లో ఒక కోతి తన పిల్లకు పాలిస్తూ నే రోడ్డు దాటబోయింది. ఒక వాహనం వేగంగా వచ్చి గుద్దేసింది. పిల్లతో సహా తల్లి కోతి దూరంగా వెళ్లి పడిం ది. తల్లి కోతికి వెన్నెముక దెబ్బతిని లేవలేకుండా పడిపోయింది. చిత్రమేమంటే తల్లి పాలు తాగుతోన్న పిల్ల కోతికి మాత్రం చిన్న దెబ్బా తగల్లేదు.
ఆ దృశ్యం చూసి మనసు చలించి వెంకట్ అనే వ్యక్తి ఆ తల్లి పిల్లని దగ్గరలోని పొలంలోకి తీసికెళ్లి అక్కడ ఉంచాడు. తల్లి ప్రాణంతోనే ఉంది. పిల్లని చూస్తూనే ఉంది. పిల్ల మాత్రం పాలకి ఇంకా ఎగబడుతోంది.