Read more!

జైలుపక్షి జగన్... నువ్వు ఇందుకే ఓడిపోయావ్!

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు ఇంత డబ్బు ఇచ్చాను.. ఇన్నిసార్లు బటన్లు నొక్కాను. అయినా ఎందుకు ఓడామో అర్థం కావడం లేదు అని అయోమయంగా ప్రశ్నిస్తున్నాడు. జగన్ అయోమయాన్ని వదిలి వాస్తవలోకి రావాలంటే ఈ క్రింది వాళ్ళని అడగాలని నెటిజన్లుగా వున్న సిటిజన్లు సూచిస్తున్నారు. 


1. రామతీర్థంలో తెగిన శ్రీరాముని తలను అడుగు ఎందుకు ఓడావో.

2. అంతర్వేదిలో కాలిపోయిన రథాన్ని అడుగు ఎందుకు ఓడావో.

3. కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడావో.

4. నువ్వు హింసిస్తే చనిపోయిన  నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడావో.

5. మద్యం రేట్ల మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్‌ని అడుగు ఎందుకు ఓడావో.

6. మీ పార్టీ వాళ్ళు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడావో.

7. చనిపోయిన అబ్దుల్ సలాంని, మిస్బానీ, పాముల మునయ్యనీ అడుగు ఎందుకు ఓడావో.

8. ఇసుక దందా గురించి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్‌ని అడుగు ఎందుకు ఓడావో.

9. మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగలపెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడావో.

10. అమరావతిలోఆడవాళ్ళని, ఉద్యమం కోసం చనిపోయిన వృద్దుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడావో.

11. మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ చేసిన కిరణ్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడావో.

12. బీళ్ళుగా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడావో.

13. పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడావో.

14. ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్టులను అడుగు ఎందుకు ఓడావో.

15. నెల జీతం వస్తుందో రాదో అని  ఎదురు చూసే ఉద్యోగస్తులను 
అడుగు ఎందుకు ఓడావో.

16. కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడావో.

17. ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువతని అడుగు ఎందుకు ఓడావో.

18. గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడావో.

19. నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడావో.

20. అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడావో.

21. వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడావో.

22. ఐదేళ్ళు భయపడుతూ బతికిన ప్రజలను అడుగు ఎందుకు ఓడావో.

23. నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడావో.

24. గొడ్డలిపోటుతో చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడావో.

25. నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడావో.

26. నువ్వు కలవని నీ ఎమ్మెల్యేలు, ఎంపీలని అడుగు ఎందుకు ఓడావో.

27. నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడావో.

28. నువ్వు ద్వేషించే కమ్మవాళ్ళను అడుగు ఎందుకు ఓడావో.

29. చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు దేశవిదేశాల్లో రోడ్ల పైకొచ్చిన జనాలని అడుగు ఎందుకు ఓడావో.

30. శాసనసభలో భువనేశ్వరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడావో.

31. చంద్రబాబుని అంతటి పెద్దమనిషిని అనునిత్యం అవమానించిన నానీ గాడిని, రోజాని, పోసానిని, అడుగు ఎందుకు ఓడావో.

32. నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్  టెర్రరిజాన్ని అడుగు ఎందుకు ఓడావో.

33. రఘురామకృష్ణంరాజుని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడావో.

34. నువ్వు, నీ మనుషులు మింగేసిన గనులను, ఇసుకను అడుగు ఎందుకు ఓడావో.

35. ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడావో.

నువ్వు ఎందుకు ఓడావో పూర్తిగా రాస్తే 100 పేజీల పుస్తకం అవుతుంది. నిన్ను భరించలేక బతికుండగా నీ తండ్రే నిన్ను దూరం పెట్టాడు.  నీ తండ్రి మిత్రులకు నీ సంగతి తెలిసి నిన్ను కలవరు.  నీ చెల్లిని ఇంటికి రానివ్వవు. నీ తల్లి నీ చెల్లితో వెళ్ళి పోయింది.  నీ బాబాయిని చేజేతులా చంపుకున్నావ్. కడపలో నీమనుషులెవరూ లేరు. నీకు కుటుంబం లేదు భార్య తప్ప, 
నీకు  మిత్రులు లేరు, 
నీకు ఆప్తులు లేరు, 
ఓటేసే జనం లేరు. 
ఇక ముందు ఉండరు. 
నీకు నువొక్కడివే మిగిలావ్. 
ఏకాకివి. జైలుపక్షివి.