Read more!

వివేకా హత్య కేసు దర్యాప్తు జాప్యం ఎవరికి లాభం? జనంలో చర్చ!

వివేకా హత్య కేసు దర్యాప్తు జగుతున్న తీరు..చేరుకుంటున్న ముగింపు దిశ చూస్తే.. ఈ కేసులో సూత్ర ధారులు, పాత్రధారుల పాత్ర అతి తొందరలోనే వెల్లడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఎవరైనా భావిస్తారు. ఈ పరిస్థితుల్లో కేసు దర్యాప్తును అడ్డుకోవడానికి ఎవరు ఏ విధంగా ప్రయత్నించినా.. వారిపై అనుమానాలు వెల్లువెత్తడం ఖాయం.

సరిగ్గా అదే జరుగుతోంది ఇప్పుడు వివేకా హత్య కేసు విషయంలో.. ఈ కేసు దర్యాప్తు సజావుగా సాగకుండా  సాధ్యమైనంత వరకూ జాప్యం జరిగేలా చూడటమే లక్ష్యంగా జరుగుతున్న ప్రయత్నాలు అటువంటి అనుమానాలకే ఆస్కారం కలిగిస్తున్నాయి. అలా ప్రయత్నిస్తున్నవారే ఈ కేసులో దోషులు అన్న నిర్ధారణకు జనం వచ్చేందుకు ఆ ప్రయత్నాలే ఆస్కారం కలిగిస్తున్నాయి.

టెక్నికల్ గా కేసులు, పిటిషన్లతో దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకుంటూ.. జనం దృష్టిలో పలుచన అవ్వడమే కాకుండా..  నేరం చేసినట్లుగా ప్రజలు నమ్మడానికి వారి ప్రయత్నాలు ఆస్కారం కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా ప్రస్తుతం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్లు చాలవా అన్నట్లు.. హతుడు వైఎస్ వివేకా వద్ద పిఏగా పని చేసిన కృష్ణారెడ్డి కూడా హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆయన తన పిటిషన్ లో వైఎస్ వివేకా హత్య ఆస్తుల కోసమే జరిగి ఉంటుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యూహమే జగన్ అక్రమాస్తుల కేసు విషయంలోనూ అసుసరించిన విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా పెద్ద సంఖ్యలో కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ కేసు దర్యాప్తు, విచారణ ముందుకు సాగకుండా అడ్డుకోవడమే లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.