కేసీఆర్ ఇంట్లో పంజరంలో పాలపిట్ల
posted on Oct 8, 2022 @ 11:18AM
ముహూర్తం చూసుకుని గృహప్రవేశం చేస్తారు, తారాబలం చూసి పెళ్లిచేస్తారు, మంచి సమయంలో పను లు ఆరంభించడానికి అనేక నమ్మకాలమీద ఆధారపడటం పరిపాటి. అది చాలా సహజంగా జరిగితే మరీ బాగుంటుంది. అంతేకాని ఫలానా కార్యక్రమం చేపడుతున్నాను, పిల్లిని ఎదురురాకుండా చూడండి అనో, ఆవును ఎదురుగా తీసుకురండి అనో, పాలపిట్టను పట్టి తెమ్మనో చెబితే అది మనసుకు ఆనందా న్నిస్తుందా. అది గొప్ప ప్రయోజనం చేకూరుస్తుందా అంటే కష్టమే. కానీ ఇటువంటి సరికొత్త బలవంతపు నమ్మకాన్నే తెలం గాణా సీఎం కేసీఆర్ అనుసరించారు. దసరా రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభం కలుగుతుందని తెలం గాణా అంతటా గొప్ప నమ్మకం. కేసీఆర్ మాత్రం నిరాశపడటం ఇష్టంలేకనే తన నివాసానికి పాలపిట్ట నే రప్పించుకున్నారు.. పంజరం లో.
చిలుక జోస్యం చెప్పేవారు చిలుకను పంజరం పట్టి తిరుగుతూంటారు. అలా పాలపిట్ట దొరకదు పంజరం లో ఠపీమని పట్టి బంధించడానికి. దేశరాజకీయాల్లో చక్రం తిప్పాలన్న రెండింతల ఉత్సహంతో ఉరకలు వేస్తు న్న కేసీఆర్‌కు పాలపిట్ట జోస్యం చెప్పదు. దర్శనంతోనే అన్ని శుభాలు కలుగుతాయన్నది నమ్మకం. ఆ నమ్మకంతోనే పాలపిట్ట దర్శనాన్ని కోరుకున్నారు. అలాగని దాని కోసం తోటలోనో, మేడమీదనో వేచి ఉండడం కష్టం.. అందుకే తెమ్మని పురమాయించారనే అనుకోవాలి. ఎందుకంటే దాన్ని పట్టి పంజరంలో తెప్పించడం,కేసీఆర్ కుటుంబసభ్యులే దాన్ని ప్రత్యేకంగా దర్శించుకోవడం, ఆనందించడం అయింది.
శుభదర్శనం ప్రభావం అదృష్టాన్ని మారుస్తుందా? అనేది కోటి మంది వేస్తున్న ప్రశ్న. ఎందుకంటే, కేసీ ఆర్ దేశరాజకీయాల్లోకి వెళ్లడానికి టీఆర్ ఎస్‌ను బీఆర్ ఎస్‌గా మార్చి అందరినీ కలుపుకుంటూ దూసుకు పోవాలనుకుంటున్నారు. కానీ పార్టీ కి కొత్తపేరు పెట్టడానికి ఏర్పాటయిన నామకరణోత్సవానికి పార్టీ వారు తప్ప ఆయన ఆశించినట్టు ఇతర రాష్ట్రాలవారు ఎవ్వరూ పరుగున వచ్చి అభిమానం ప్రదర్శిం చలేదు. ఒక్క కర్ణాటక మాజీముఖ్యమంత్రి తప్ప. చిత్రమేమంటే కనీసం హలో అని పలక రించ లేదు. అంతేకాదు ఆదిలోనే హంసపాదులా ఇపుడు కేసీఆర్ ఎత్తుగడకు అడ్డంకి వచ్చిపడింది. బీఆర్ఎస్ నామకరణోత్సవానికి వచ్చి ఫోటోలు దిగి శుభాకాంక్షలు చెప్పిన కన్నడిగులు ఇపుడు కరచా లనానికి కాదు పొమ్మన్నారు. ఈ పరిస్థితుల్లో కేటీఆర్ కర్ణాటకకు పూలగుచ్ఛంతో పాటు పాలపిట్టనీ చూసి వెళ్లా ల్సిందేమో.