మాకు హెల్త్ టీచరే కావాలి: చిక్ మగళూరు ప్రజలు
posted on May 16, 2023 @ 1:20PM
పేరు ప్రదీప్ ఈశ్వర్..
కర్ణాటకలో చిక్ మగళూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున విజయం సాధించారు..
అతనికి తల్లి లేదు.తండ్రి లేదు.కుటుంబం లేదు.. ఫైనాన్షియల్ గా జీరో..వృత్తి రీత్యా హెల్త్ టీచర్..
బీజేపీ ఒకానొక సమయాన అతన్ని బాగా ఇబ్బంది పెట్టింది..దాదాపు 20 కేసులు పెట్టి జైల్లో పెట్టింది.అప్పుడు కాంగ్రెస్ నాయకులు సిద్ధరామయ్య గారు సపోర్ట్ చేసి బయటకి తీసుకురావడంలో ప్రత్యేక పాత్ర పోషించాడు..
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని, తనకు సీటు కావాలని అడిగాడు..
రాహుల్ గాంధీ ఒక్క క్షణం అతని వైపు చూస్తూ, పార్టీ నాయకత్వంతో మాట్లాడాడు అతనికి సీటు వచ్చింది..
అటు సైడ్ బీజేపీ తరుపు నిలబడింది కర్ణాటక హెల్త్ మినిస్టర్.. పేరు డాక్టర్ సుధాకర్ రెడ్డి..ఇద్దరిది కూడ ఒక్కటే గ్రామం.ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి..ఎంతోమందిని సిని నటులను ప్రచారాన్ని కూడా పిలిపించుకున్నాడు.. అందులో మన బ్రహ్మానందం గారు కూడా ఒకరు..ఒక ఓటుకి 2000 రూపాయలు పంచారు అయినప్పటికీ చిక్ మగళూరు ప్రజలకు సుధాకర్ ని ఓడించి ఉపాద్యాయుడు అయిన ప్రదీప్ ఈశ్వరుని గెలిపించుకున్నారు కారణం ప్రదీప్ ను అక్రమంగా జైలుకు పంపించడమే బిజెపి చేసిన అతిపెద్ద తప్పు..
ప్రదీప్ ఈశ్వర్ ఒక రూపాయి కూడా పంచలేదు..
చిక్ మగళూరు ప్రజలు హెల్త్ మినిస్టర్ కావాలా,హెల్త్ టీచర్ కావాలా అంటే హెల్త్ టీచరే కావాలి అన్నారు చిక్ మగళూరు ప్రజలు..
కర్ణాటకలో సామాన్య వ్యక్తులను సైతం ఎమ్మెల్యే చేయాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని నిరూపించారు..