మాస్కులపై పోలీస్ యాక్షన్..
posted on Mar 31, 2021 @ 5:30PM
కరోనా.. ఆ పేరు వింటే ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. కానీ కొంత మంది భయం లేకుండా బలాదూర్ గా తిరుగుతున్నారు. ఇక పై కరోనా నిబంధనలు పాటించకుంటే భారీమూల్యం చెల్లించాలిందేనంటున్నారు పోలీసులు. ఈ నిర్లక్ష్య ధోరణికి తప్పదు చరమగీతం అంటున్నారు. మాస్కులు లేకుంటే కేసులు. ఆపై జరిమాణాలతో అదరగొడుతున్నారు.
కరోనా స్టార్టింగ్ లో ప్రజలను వణికించింది. కానీ ఇప్పుడు ప్రజల్లో కరోనా భయం కొంతైన కనిపించడం లేదు. కనీసం జాగ్రత్తలు పాటించడంలేదు. మాస్కులు లేకుండానే విచ్చలవిడిగా బజారున తిరుగుతున్నారు. దీంతో పోలీస్ శాఖ మరోసారి రంగంలోకి దిగింది. మాస్కులు పెట్టుకోకుండా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తున్నారు. రామగుండం కమినషరేట్ పరిధిలో మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్న 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో 30 మందికి జరిమానాలు విధించారు. రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.