ఏసీబీ కోర్టుకు సండ్ర.... ఓటుకు నోటు కేసులో కొత్త మలుపులు
posted on Mar 31, 2017 @ 3:48PM
తెలుగు రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన ఓటుకు నోటు కేసు మళ్లీ ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక వచ్చింది. అనుబంధ ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు.... ఎమ్మెల్యే సండ్రకు నోటీసులు జారీ చేయడంతో విచారణ విచారణకు హాజరయ్యారు. తొలి ఛార్జిషీట్‌కు అనుబంధంగా 60 పేజీల్లో మరిన్ని వివరాలు అందజేసిన అధికారులు.... సండ్ర, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాతోపాటు రేవంత్‌రెడ్డి ఫోన్ సంభాషణల వివరాలను ప్రధానంగా ప్రస్తావించారు. తొలి ఛార్జిషీట్లో సమర్పించిన ఆడియోల్లోని గొంతులు ఒరిజనల్‌వేనంటూ ఫోరెన్సిక్ ఇచ్చిన రిపోర్ట్‌నూ, ఆధారాలను కోర్టుకు సమర్పిస్తూనే, ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకటవీరయ్య పోషించిన పాత్రపై వివరాలు అందజేశారు.
2015 టీడీపీ మహానాడు కేంద్రంగా ఓటుకు నోటు వ్యవహారం సాగిందని, ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగించినట్లు ఏసీబీ అధికారులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు నోవాటెల్‌లో క్యాంపు ఏర్పాటు చేశారని, హోటల్స్‌లో రూమ్స్ బుకింగ్ బాధ్యతను ఎర్రబెల్లి దయాకర్‌రావు చూశారని తెలిపారు. రేవంత్‌రెడ్డి, సండ్ర, సెబాస్టియన్లు ఇక్కడే సమావేశమై మాట్లాడుకున్నట్లు...నోవాటెల్ హోటల్ ఫైనాన్షియల్ మేనేజర్ వాంగ్మూలాన్ని కూడా ఏసీబీ నమోదు చేసింది. ప్రధానంగా 99కి పైగా ఫోన్ కాల్స్ వివరాలను అనుబంధ ఛార్జిషీట్లో పొందుపర్చింది.
ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ 50లక్షల రూపాయలు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయో మాత్రం స్పష్టంగా ఛార్జిషీట్లో అధికారులు పేర్కొనలేదు. అయితే టీడీపీ లీడర్ వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్.... సెబాస్టియన్‌కు డబ్బు సమకూర్చినట్లు అనుబంధ ఛార్జిషీట్లో తెలిపారు. అయితే ఎంత డబ్బు ఇచ్చాడు... ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దాంతో పట్టుబడ్డ నగదు ఎవరు సమకూర్చారనే సంగతి ప్రస్తుతానికి పెండింగ్‌లోనే ఉంది. ఇక సండ్ర వెంకటవీరయ్య, సండ్ర గన్‌మెన్లు, డ్రైవర్‌తోపాటు వేం నరేందర్‌రెడ్డి, ఆయన అనుచరుడు, అలాగే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, గన్‌మెన్లు, వేం నరేందర్‌రెడ్డి కొడుకు కృష్ణకీర్తన్ వాంగ్మూలాలు నమోదు చేసినట్లు ఏసీబీ.... కోర్టుకు తెలిపింది. అయితే అనుబంధ ఛార్జిషీట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై ఎక్కడా ప్రస్తావించని ఏసీబీ బృందం.... అందరి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని తెలియజేసింది.
మరోవైపు ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరపాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంకోర్టును ఆశ్రయించడం, వివరణ ఇవ్వాలంటూ బాబుకి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులివ్వడం... ఇటు ఏసీబీ కోర్టులో విచారణ వేగవంతం కావడంతో ఓటుకు నోటు కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని ఉత్కంఠంగా మారింది.