వాలంటీర్ సూసైడ్..
posted on Apr 14, 2021 @ 2:50PM
ఆమె ఒక విద్యా వాలంటీర్. పేరు పాలకూరి శైలజ. ఆమె భర్త సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్‌లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. కరోనా వచ్చింది. అందరి కడుపు కొట్టింది. అలాగే ఈ దంపతుల కడుపు మాడ్చింది. 15 నెలలుగా పాఠశాలలు మూయడంతో జీతాలు లేదు. పోనీ భర్త జీతం అయినా వస్తుందంటే అది రెన్యూవల్ కాకపోవడంతో జీతాలు లేక వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనితో పూటగడవడం కష్టమైంయింది. బతకడానికి దారులు కనిపించలేదు. దాంతో మనస్తాపానికి గురైన శైలజ.. చనిపోదామని నిర్ణయించుకుంది. నల్లగొండ రైల్వే స్టేషన్ పరిధిలోకి వెళ్లి రైల్ కిందపడి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శైలజ మృతదేహాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
నోటిఫికెషన్స్ ఇవ్వడం లేదని ఈ మధ్య కాలం లోనే ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. దాన్నీ కూడా ప్రభుత్వం ఐఏఎస్ నోటిఫికేషన్ ఎవరు ఇస్తారో తెలియదా..? అంటూ ప్రతి విమర్శ చేయడమే తప్ప.. తప్పుని ఒప్పుకునే పరిస్థితి లేదు ప్రభుత్వానికి. ఇది ఇలా ఉంటే ఎప్పుడు వస్తుందే తెలియని ఆ నోటిఫికేషన్ కోసం విద్యార్థులు కోచింగ్ సెంటర్స్ గేట్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆహ నా పెళ్ళంటా సినిమాలో కోడిని గుమ్మానికి కట్టేసి చికెన్ కూర తిన్నట్లు ఉంది నిరుద్యోగుల పరిస్థితి. ఆ విద్యార్థులు ఆవేదన మాత్రం దొర ఫామ్ హౌస్ కి వినిపించడం లేదు. విన్న పట్టించుకునే తీరు లేదు. తెలంగాణ వస్తే సామాన్యుడి బతుకు భరోసా ఉంటది అనుకుంటే.. తెలంగాణ వచ్చాక అదే సామాన్యుడి బతుకుకు మెతుకు కరువైయింది. తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసినవాళ్లు ఒక్కడైతే. ఆ తెలంగాణ ఫలాలు అందుకుని మింగుతుంది మరొకడు. ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు కోట్ల గొంతులు ఒక్కటై.. దిక్కులన్నీ చుట్టి.. చేయి ఎత్తి జై కొట్టి, ఎందరో ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న బంగారు తెలంగాణ నిరంకుశత్వంలో ఉండిపోయింది. ఉద్యోగాలు లేవు.. ఉపాధి లేదు... తప్పును ప్రశ్నించే గళాలు లేవు. అని గతి తప్పిన జీవితాలే తప్ప .. గమనం ఉన్న జీవితాలు లేవు.. తెగించి తెచ్చుకున్న తెలంగాణాలో సామాన్యుడి బతుకు కత్తిమీద సాము గా మారింది. సామాన్యుల ప్రాణాలకు విలువలేదు. తెలంగాణ కోటి రతనాల వీణ.. ఆ మాటకు సమాధి కట్టింది నేటి ప్రభుత్వం.