ప్రకృతి ఆశ్రమంలో చేరిన వైఎస్ వివేకానంద
posted on Apr 17, 2012 @ 5:56PM
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయంగా తీవ్రంగా శ్రమించి అలసిపోయినట్లు కనిపిస్తోంది. వైఎస్ మరణాంతరం వివేకానందరెడ్డి తీవ్ర ఒత్తిడులకు గురయ్యారు. జగన్ ను వేభేదించి తన వదినగారిపై పోటి చేసి దారుణంగా పరాజయం పాలయ్యారు. అనంతరం అసెంబ్లీలో వైఎస్ రాజశేఖరరెడ్డి విమర్శించిన తెలుగుదేశం శాసనసభ్యులపై దాడికి పాల్పడ్డారు. విమర్సలు వెల్లువేత్తడంతో పదవికి రాజీనామా చేసి కాంగ్రేసులోనే కొనసాగారు. అయినా ఆయనకు రాజకీయ ఒత్తిడులు వస్తూనే ఉన్నాయి. దీంతో అయన కొంతకాలం ప్రశాంత జీవితం గడపాలని నిజామాబాద్ సమీపంలోని ఒక ప్రకృతి వైద్యశాలలో చేరారు. నిజామాబాద్ కు సుమారు 15కిలోమీటర్ల దూరంలోనే అక్బర్ నగర్ లో ఉన్న ప్రకృతి వైద్యశాలలో వివేకానందరెడ్డి మానసిక ప్రశాంతత కోసమే తనిక్కడికి వచ్చినట్లు చెబుతున్నారు. ఆయన ఇక్కడ నెల రోజులపాటు ఉంటారని తెలుస్తోంది. కడప జిల్లాకే చెడిన మరో కాంగ్రెస్ నాయకుడు డి.ఎల్ రవీంద్రారెడ్డి ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పి ప్రశాంతత జీవనం సాగి౦చాలనుకుంటున్నారు.