గంగుల భానుమతికి సొంతసైన్యం
posted on Apr 17, 2012 @ 5:31PM
మద్దెల చెరువు సూరి భార్య గంగుల భానుమతి రాపాడు ప్రాంతంలో తన కార్యకలాపాల నిర్వహణకు సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మద్దెల చెరువు సూరి హత్య తరువాత ఆయన అనుచరులంతా చెల్లాచెదురయ్యారు. గంగుల భానుమతికి కూడా చాలాకాలం అజ్ఞాతావాసంలోనే గడిపారు. అనంతరం కాంగ్రెస్ టిక్కెట్టు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే కుటుంబసభ్యులు, సన్నిహితుల సలహాల మేరకు ఆమె సూరి మాజీ అనుచరుల౦దరిని మళ్లీ కుడగట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఎటువంటి సెటిల్ మెంట్లు చేయడం లేదు. ఫ్యాక్షనిజానికి కూడా దూరంగానే ఉంటున్నారు. కాని ఆమె ఎక్కడికి వెళ్ళిన 30,40 మంది సూరి మనుషులు ఏడు, ఎనిమిది కార్లలో ఆమెను అనుచరిస్తున్నారు. ఇటివల భద్రాచలం వచ్చిన ఆమె వెంట ముప్పయ్ మంది అనుచరులు ఉన్నారు. వీరందరూ ఆమె చుట్టూ వలయంల ఏర్పడి ఆమెకి రక్షణ కల్పించారు. వచ్చే ఎన్నికల్లో తను రాప్తాడు నుంచి పోటి చేయడం ఖాయమని గంగుల భానుమతి అంటున్నారు. భాను అనుచరులు నుంచి ముప్పు వస్తుందనే భయంతో ఆమె సొంత సైన్యాన్ని పోషిస్తున్నట్లు తెలిసింది.