రియల్ ఎస్టేట్‌కు దిక్సూచి "విజయవాడ రియల్ ఎస్టేట్.నెట్"
posted on Sep 29, 2016 @ 7:44PM
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని నిర్ణయించడంతో విజయవాడ,గుంటూరు ప్రాంతాల్లో భూముల క్రయ, విక్రయాలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఎంతోమంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో భూములపై పెట్టుబడి పెడుతున్నారు. అయితే ఎక్కడి నుంచో వచ్చే వారితో పాటు స్థానికులకు సమస్త సమాచారాన్ని అందించేందుకు ఎలాంటి సౌకర్యం లేదు. దీనిని గుర్తించిన "ప్రోపర్టీ సెంట్రల్" సంస్థ "విజయవాడ రియల్ ఎస్టేట్.నెట్" పేరిట వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు వీరభద్రమ్ వెబ్‌సైట్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ పోర్టల్‌లో రిజస్టరైన వారందరి ప్రాపర్టీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అందువల్ల మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆ వివరాల ఆధారంగా నేరుగా ఖాతాదారులను సంప్రదించి కొనుగోలు/అమ్మకాలు చేయడం జరుగుతుంది. అనుభవజ్ఞులైన ప్రత్యేక బృందం 24 గంటలు అమ్మకం దారులకు. కొనుగోలుదారులకు తమ సహాయ, సహకారాలు అందిస్తుంది. అంతేకాదు ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయిన వారందరి ప్రాపర్టీని ఒక వారం రోజుల పాటు ఉచితంగా డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. ఇంకేందుకు ఆలస్యం బెజవాడ పరిసర ప్రాంతాల్లో భూమలు అమ్మాలన్నా, కొనాలన్నా వెంటనే విజయవాడ రియల్ ఎస్టేట్.నెట్‌లో లాగిన్ అయిపోండి.