భారత్ దాడికి ఫ్యూజులు పోయిన పాక్.. తప్పుడు వార్తలతో కుట్ర..
posted on Sep 30, 2016 @ 10:20AM
భారత్ సైన్యం పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అయితే భారత్ చేసిన ఈ చర్యకు ఏం చేయాలో తెలియని పాకిస్థాన్ ఇప్పుడు తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టింది. ఈ దాడిపైన స్పందించిన పాకిస్థాన్ అసలు భారత సైన్యం ఎలాంటి దాడి చేయాలేదని చెప్పుకొచ్చింది.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పనిలో పడింది. నియంత్రణ రేఖ వద్ద తాము 14 మంది భారత సైనికులను మట్టుబెట్టినట్టు పాక్ మీడియా గురువారం తప్పుడు వార్తలు ప్రచురించింది. అంతేకాదు చందుబాబులాల్ చౌహాన్(22) అనే భారతీయ సైనికుడిని దళాలు అదుపులోకి తీసుకున్నాయని రాశాయి. ఇక పాక్ తప్పుడు వార్తలపై స్పందించిన భారత్ వాటిని తీవ్రంగా ఖండించింది. అవి నిరాధార, అవాస్తవ కథనాలని పేర్కొంది. అయితే చందుబాబులాల్ నిర్బంధంపై పాక్ చేసిన ప్రకటనపై భారత ఆర్మీ స్పందించింది. బాబులాల్ పొరపాటున ఎల్‌వోసీ దాటి పాక్ భూభాగంలో ప్రవేశించారని, ఈ విషయాన్ని డీజీఎంవో పాకిస్థాన్‌కు తెలియజేశారని.. సంప్రదింపుల ద్వారా తిరిగి ఆయనను భారత్ రప్పిస్తామని తెలిపింది. మరి భారత్ దాడికి ప్యూజులు ఎగిరిపోయిన పాక్ ఇంకెన్ని తప్పుడు వార్తలు సృష్టిస్తుందో చూడాలి.