శాంతిని కూతుర్లా భావించావా... మా నాయనే!

‘ఏరా’ విజయసాయిరెడ్డి కళింగిరి శాంతిని కూతుర్లా భావించాట్ట. ఈ గొప్ప విషయాన్ని తెలియజేస్తూ శనివారం నాడు ‘ఏరా’ విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశాడు. సాధారణంగా ‘ఏరా’ ఎప్పుడైనా ట్వీట్ చేశాడంటే, దాని నిండా కడుపులో తిప్పే స్థాయిలో బూతులు, ఆరోపణలు వుంటాయి. ఇప్పుడు కళింగిరి శాంతి వ్యవహారంలో పీకల దాకా కూరుకుపోయి వున్న ‘ఏరా’ విజయసాయిరెడ్డి ట్వీట్లు డిఫెన్స్ మోడ్‌లోకి మారిపోయాయి. పరనిందతో నిండి వుండే ఆయన ట్వీట్లు ఇప్పుడు ఆత్మస్తుతిలోకి షిఫ్ట్ అయిపోయాయి. శనివారం నాడు ‘ఏరా’ విజయసాయిరెడ్డి హృదయాలను కదిలించే విధంగా ట్వీట్ చేశాడు. అందులో మేటర్ ఏంటంటే, ‘‘అవాస్తవాలు ప్రచారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్ళు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజా ప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం వుంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరంలో ఎండోమెంట్స్ ఆఫీసర్‌గా వైజాగ్ సీతమ్మధార ఆఫీసులో మొట్టమొదటగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్ళి పరామర్శించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతోను, అనైతిక / అక్రమ సంబంధాలు లేవు. నేను నమ్మిన దేవదేవులు శ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెప్తాను’’ ఇదీ మేటర్...

ఈ ట్వీట్ మీద అసలు మేటర్లోకి వెళ్ళేముందు, ‘ఏరా’ విజయసాయి రెడ్డికి ఒక హెచ్చరిక... నీ తొక్కలో ఇష్యూలన్నిట్లోకి వెంకటేశ్వరస్వామిని లాగకు. ఆయనతో పెట్టుకుని నీ ఏ1, ఆయన ఫాదర్ కూడా మటాష్ అయిపోయారు. శాంతిని కూతుర్లా భావించావో, నాయనమ్మలా భావించావో... నీ ఏడుపేదో నువ్వు ఏడువు.. నీ తంటాలు నువ్వు పడు.. ఓవర్ బిల్డప్ ఇవ్వడానికి స్వామివారి పేరు ఉపయోగించావంటే నీకు మామూలుగా ఇత్తడైపోదు.. బీ కేర్‌ఫుల్!

ఇక అసలు మేటర్లోకి వస్తే, ‘ఏరా’ విజయసాయిరెడ్డికి, శాంతి అక్రమ సంబంధం వుందనిగానీ, ఆమెకి పుట్టిన కొడుకుకు తండ్రి విజయ సాయిరెడ్డి అని గానీ, మీడియావాళ్ళు ఎవరూ అనడం లేదు. సదరు శాంతి భర్త నెత్తీనోరూ బాదుకుంటూ మీడియా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చెప్పుకుంటున్నారు. మొన్న నువ్వు వైజాగ్‌లో ఒక దిక్కుమాలిన ప్రెస్‌మీట్ పెట్టి చెత్త వాగుడంతా వాగితే మీడియా కవరేజ్ ఇచ్చింది కదా.. అదే విధంగా శాంతి భర్త మదన్ మొత్తుకుంటున్నదానికి కూడా కవరేజ్ ఇస్తోంది అంతే. ఆమాత్రం దానికి నువ్వు మీడియా వాళ్ళని ఆడిపోసుకుంటూ, ‘ఏరా’, ‘ఒరేయ్’ అని నోరు పారేసుకుంటూ టాపిక్‌ని డైవర్ట్ చేస్తున్నావు. ‘‘నేను డిఎన్ఎ టెస్టుకి ఒప్పుకుంటున్నాను’’ అనే ఒక్కమాటతో అయిపోయే విషయాన్ని సాగదీస్తున్నావు. లేనిపోని అనుమానాలు కలిగేలా చేస్తున్నావు. ఈ సోది ట్వీట్లు చేసేబదులు, ఆ టెస్టుకు ఒప్పుకోవచ్చు కదా.. అందరి నోళ్ళూ మూయించొచ్చు కదా?

ఇంకో ఇంపార్టెంట్ పాయింట్.... అసలు నువ్వు శాంతిని కూతుర్లాగా ఎందుకు భావించాలి? నువ్వొక ఎంపీవి, ఆమె ఒక గవర్నమెంట్ ఆఫీసర్. మీ ఇద్దరి మధ్య రిలేషన్ అంతవరకే వుండాలి తప్ప.. ఆమెని నువ్వు ఎందుకు కూతుర్లా భావించాలి? ఆమె ఇంటికి నువ్వెందుకు వెళ్ళాలి? నీ ఇంటికి ఆమె ఎందుకు రావాలి? ప్రభుత్వ వ్యవహారాల్లో మీ పర్సనల్ మేటర్స్ ఏంటి? ఎందుకు నువ్వు తండ్రిలా ఆమెకి సహాయం చేయాలి? ఎంపీ హోదాలో వున్న నువ్వు నీ దగ్గరకి వచ్చిన వాళ్ళందరిలో కూతుర్నో, పిన్నినో, బాబాయ్‌నో చూసుకోవడమేంటి? అసలు ఏంటి ఇదంతా?