మోడీ దేవుడిచ్చిన వరమట....
posted on Mar 22, 2016 @ 3:26PM
ప్రధాని నరేంద్ర మోడీ భారత్‌కు దేవుడిచ్చిన వరమట.. ఈ మాట ఎవరన్నారనుకుంటున్నారా.. ఇంకెవరూ ఆపార్టీ నేత కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ భారత్ కు దేవుడిచ్చిన వరం అని పొగిడారు. అంతేకాదు.. మోడీ దేశంలోనే అత్యంత పాపులర్ అయిన నేతని, పేద ప్రజలకు అండగా నిలిచే వ్యక్తని కొనియాడారు. ప్రతి రంగంలో సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయని, వాటిని ఎదుర్కొనడంలో మోడీ ముందుండి దేశ ప్రజలను నడిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. సామాజిక మాధ్యమాల్లో సైతం మోడీ తన సత్తా చాటుతున్నారని, ట్విట్టర్ ఖాతాలో 1.8 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 3.2 కోట్ల మంది ఆయనను అభిమానించేవారు ఉన్నారని తెలిపారు.