మరోసారి తెగబడిన ఉగ్రవాదులు.. 14 మంది మృతి
posted on Mar 22, 2016 @ 3:18PM
ఉగ్రవాదుల చర్యలు రోజురోజుకి పేట్రేగి పోతున్నాయి. ఈ మధ్య కాలంలోనే చాలా చోట్ల బాంబు దాడులు చేసి ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నారు. ఇప్పుడు తాజాగా మరోదాడి చేశారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జావెంటమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు దాడుల వలన ప్రయాణికులు భయాందోళనలకు గురవ్వగా.. వారిని అత్యవసర ద్వారం ద్వారా విమానాశ్రయం నుంచి భయటకు పంపి అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. బాంబు పేలుళ్లవల్ల విమానాశ్రయంలో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో విమానాశ్రయాన్ని మూసివేశారు. అంతేకాదు జంట పేలుళ్ల అనంతరం దుండగులు కాల్పులకు పాల్పడినట్లుగా కూడా తెలుస్తోంది.