మరో రెచ్చగొట్టే కార్యక్రమానికి ఉత్తర కొరియా..
posted on Mar 22, 2016 @ 4:00PM
ఏదైనా పని చేసినప్పుడు పక్కన వాళ్లకు హాని కలుగకుండా చేయడంలోతప్పులేదు.. కానీ హాని కలుగుతుంది అని తెలిసినా కూడా కావాలని చేసే వాళ్లని ఏం చేయలేం. ప్రస్తుతం ఉత్తర కొరియా పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఇప్పటికే ఉత్తర కొరియా అణ్వాయుధ ప్రయోగాలు చేసింది. దీనిపై ఐరాస ఆగ్రహం వక్తం చేసింది కూడా.. కానీ ఇప్పుడు మరో రెచ్చగొట్టే కార్యక్రమం చేయడానికి పూనుకుంది. బహుళ అణు రాకెట్లను ప్రయోగించగల మల్టీ రాకెట్ లాంచర్ ను తయారు చేశారు శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలోనే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గ్రీన్ దానికి పరీక్షించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. ఈ విషయాన్ని ఆదేశ అధికారిక న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ ప్రకటించింది. దీంతో ఈ విషయంపై దక్షిణ కొరియాతో పాటు అమెరికా మండిపడుతున్నాయి.