రాహుల్ గాంధీ అప్పుడెందుకు రాలేదో.. వెంకయ్య నాయుడు
posted on Jan 30, 2016 @ 11:55AM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ జన్మదినం సందర్భంగా చేపట్టిన దీక్షలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విమర్శల బాణాలు వదిలారు. కెనడా ప్రతినిధుల బృందం ఈరోజు వెంకయ్య నాయుడిని కలిశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూనివర్శిటీ వాతావరణాన్ని రాహుల్ కలుషితం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీపైన కూడా ఆయన మండిపడ్డారు. రోహిత్ ఆత్మహత్యపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాద్దాంతం చేస్తుంది.. అప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఇదే యూనివర్శిటీ నుండి 9 మంది చనిపోయారు.. మరి ఇప్పుడు మాట్లాడుతున్న నేతలంతా అప్పుడు ఏమయ్యారంట అని ప్రశ్నించారు. అప్పుడు చేసుకున్న ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకొని.. రాహుల్ గాంధీ ముందుగానే స్పందించి ఉంటే ఇప్పుడు రోహిత్ ఆత్మహత్య చేసుకునే వాడు కాదని అన్నారు. అంతేకాదు వరంగల్‌లో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ వచ్చి ఎందుకు పరామర్శించలేదని ఆయన ప్రశ్నించారు.